Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 36

   
    "ఏమయ్యా.. అప్ప తిస్కున్నాక తిర్చోద్దూ? ఎగ్గోటి తప్పించుకు తిరుగుతే ఎలా?ఆ? అతను మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే నాలాంటి వాడ్తేతే మర్డర్ చేసేవాడ్ని" చిట్టబ్బయిని  మందలిస్తూ అన్నాడు బంగార్రాజు.

    ఇకముందు  ఎవరి దగ్గర్తెనా అప్ప తిస్కుంటే కచ్చితంగా  తిరుస్తాలేండి" అన్నాడు చిట్టబ్బాయి.

    నిజమే చెప్తున్నావ్ కదూ?"

              "నిజంగా .. మీ మీదొట్టు సార్! కావాలంటే  ఓ వెయ్యి రూపాయలు నాకు అప్పివ్వండి."

    "ఏంది నా దగ్గర పరాచికాలు...మర్డరు చేసేస్త జాగ్రత్త!!"

    "సార్... మనం ఇక పోదామా?" అన్నాడు ఏడుకొండలు బంగార్రాజుతో.

    "పద పోదాం"

    బంగార్రాజూ, ఏడుకొండలూ  రెండడుగులు ముందుకి వేశారు.

    అదే సమయంలో ఆ అమ్మాయిని కన్నారావు అడిగాడు.

    "ఏవండి! ఇప్పటిక్తేనా  మీ పేరు చెప్పరా?"

    ఆ అమ్మాయి కిలకిలా నవ్వింది.

    "ఉహూ...నేనో పొడుపు కథ చెప్తాను. విప్పితేనే నా పేరు చెప్తాను."

    బంగార్రాజూ చటుక్కున వెనక్కి పరుగెత్తుకు వచ్చాడు. అతని వెనకే ఏడుకొండలు కూడా  వచ్చాడు.

    "ఏమిటి... ఎదో పొడుపు కథ అంటున్నారు! నాకూడా చెప్పండి" అన్నాడు బంగార్రాజు కుతూహలంగా.

    "మీరేమో కష్టమ్తెన పొడుపు కథలూ, చిక్కు ప్రశ్నలూ వేసి పేరు చెప్పకుండా తప్పించుకుంటున్నారు" బుంగమూతి పెట్టాడు కన్నారావు.

    "పోనిలే. ఈసారి చాల సులభమ్తెన  పొడుపుకథ చెప్తాను. చూద్దాం మీ  అదృష్టం ఎలా ఉందో?" నావ్వుతూ అంది ఆ అమ్మాయి.

    "మీ పొడుపు కథని కన్నరావేనా లేకపోతే మాలో ఎవర్తెనా కూడా విపోచ్చా" అడిగాడు చిట్టబ్బాయి.

    "ఎవర్తెనా చెప్పొచ్చు!" అంది ఆ అమ్మాయి.

     "అయితే  త్వరగా చెప్పండి...లేకపోతే మర్డర్ చేస్తాన్" అన్నాడు బంగార్ర్రాజు.

    "ఏం చేస్తారూ?" సీరియస్ గా బంగార్రాజు వంక చూస్తూ అడిగింది  ఆ అమ్మాయి.
    బంగార్రాజు నాలుక కొరుక్కున్నాడు.

    "సారి అండి!... ఆ మాట ఆలవాటైపోయి అలా అన్నాను... ఇక చెప్పండి..."
    ఆమె గొంతు సవరించుకుని చెప్పింది.

    "కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఎంతో చెప్పండి చూద్దాం.

    "ఆ...ఆ నేనోప్పకోను... తలుపులు తీసినప్పుడు చప్పుడు కాకపోతే దొంగతనాలు ఎక్కువ్తేపోతాయి" అన్నాడు బంగార్రాజు.

    "హహహ... ఏముంది, వేరి సింపుల్ చప్పుడు చేయని తలుపులు అంటే ఏ రబ్బరు తలుపులో  అయివుంటాయి" అన్నాడు కన్నారావు.

    "ని మొహం... ఎక్కడయినా రబ్బరు తలుపులు ఉంటాయా?"  చిట్టబ్బాయి కన్నారావు బుగ్గమీద  ఓ పోతూ పొడిచాడు.

     ఏడుకొండలు నెత్తిమిది క్యాప్ తిసి బుర్ర  గోక్కుంటూ ఆలోచించసాగాడు.

    "అయితే మీ రెవ్వరూ చెప్పలేరా?" నావ్వుతూ అంది ఆ అమ్మాయి.

    "చిన్నప్పడేప్పడో మా అమ్మమ్మ నాకు పొడుపు కథలు చెప్పేది.  ఇప్పడు  నాకసలు ఏమి గుర్తులేవు" ఏడుపు మొహం పెట్టి  అన్నాడు కన్నారావు. 

    "అయితే చెప్పనా?" అంది ఆమె.

    "చెప్పండి" అన్నాడు బంగార్రాజు.

    "కంటి రెప్పలూ!"

    "ఆ!" అంటూ నోళ్ళు తెరిచారు నలుగురూ.

    "ఆ.. అవునవును.. కంతిరేప్పలె! మా అమ్మమ్మ చెప్పేది ఈ పొడుపు కథని" అన్నాడు కన్న్రావు కంగారుగా.

    "లాభంలేదు మిస్టర్ కన్న్రారావ్... నేను చెప్పేసిన తర్వాత మా నాయనమ్మ చెప్పేది, అమ్మమ్మ చెప్పేది అంటే  లాభం ఏమిలేదు... నేనిక వస్తా" అంటూ  సరసర ముందుకు  కదిలి అక్కడో ఆటో వుంటే ఎక్కేసింది ఆ అమ్మాయి, ఆ ఆటో ముందుకు కదిలింది.

    "అసలు కిటకిట తలుపులంటే కంటి రెప్పలు ఎలాగావుతాయ్?" ఆలోచిస్తూ అన్నాడు బంగార్రాజు.

    "ఎలా అవుతుందో మనం పోలిస్ స్టేషన్లో ఆలోచిద్దాం... పదండి సార్... ఇప్పటికే చాలా ఆలస్యం అయింది" అన్నాడు ఏడుకొండలు.

    "పద"

    ఇన్ స్పెక్టర్  బంగార్ర్ర్రాజు, ఏడుకొండలూ రోడ్డు క్రాస్ చేసి జీపు ఎక్కారు. జీపు ముందుకు కదిలింది.

    "ఇప్పడేం చెయ్యాలి!" కొన్ని క్షణాల నిశ్శబ్దం అనంతరం నిర్సంగా  అడిగాడు చిట్టబ్బాయి.

    "ఏం చెయ్యాలని  అడుగుతావేం?  మనం పండుగాడిని మొత్తం తెరిచాడు.

    "పండుని రక్షించాలి అంటే అలా నోరెళ్ళబెడ్తావేం?" చికాకుగా అన్నాడు కన్నారావు.

    "ఓసారి అటు చూడు!" కంగారుగా అన్నాడు చిట్టబ్బాయి.

    చిట్టబ్బాయ్ చూపించిన దిక్కుకి చూశాడు కన్నారావు.

    "ఆ!...."

    కన్నారావు కూడా కళ్ళు ఇంతింత చేసి నోరు తెరిచాడు.

    "వాళ్ళే!!...వాళ్ళే కదూ?!" కంగారుగా అన్నాడు చిట్టబ్బాయి.

    "అవును వాళ్ళే!!" కన్నారావు కూడా కంగారుపడ్తూ అన్నాడు.

    "వాళ్ళిద్దరే ఉన్నారే!  వాళ్ళకూడా పండుగాడు లేడేం?" కన్నారావు భుజాలుపత్తి కుదిపేస్తూ అన్నాడు చిట్టబ్బాయి.

    "నన్నడుగుతావే? నీకెంత తెల్సో నాకూ అంతే తెల్సు" విసుక్కుంటూ అన్నాడు కన్నారావు తన భుజాల మీద నుండి చిట్టబ్బాయ్ చేతులు తిసేస్తూ.

     "కొంపతీసి వీళ్ళు పండుని సఫా చేయలేదు కదా?" అందోళనగా అన్నాడు చిట్టబ్బాయి.

    "ఏమోమరి. అదే నిజమ్తేతే,  వాళ్ళతో బాటు మనకి జ్తేలు శిక్ష పడుతుంది" దిగులుగా అన్నాడు కన్నారావు.

    "అమ్మో!... ఇంకేమ్తెనా ఉందా?" గుండెల మీద చేతులు వేస్కుని భయం భయంగా అన్నాడు చిట్టబ్బాయ్. "అయినా వాళ్లు చాలా నింపాదిగా ఉన్నారు... ప్రాణాలు తీసేవాళ్ళు అయితే నింపాది ఉంటారా?"  అన్నాడు తనకి తాను ద్తేర్యం చెప్పకుంటూ చిట్టబ్బాయి.

    కన్నారావు రోడ్డు అవతలవున్న వాళ్ళిద్దర్నీ చూశాడు. వాళ్ళిద్దరూ కిళ్ళిషాపు  దగ్గర నిలబడి సిగరెట్టు కొనుక్కుంటున్నారు. వాళ్ళు వచ్చిన అంబాసిడర్  కారు ఓ పక్కగా పార్క్ చేసి ఉంది.

    "మనం ఇలా వృధాగా తర్జన భర్జనలు చేస్తూ నిలబడ్తె లాభం లేదు. వాళ్ళని ఫాలో అయితే పండు ఆచూకి తెలుస్తుంది" అన్నాడు కన్నారావు.

    "అమ్మో! మళ్ళి వాళ్ళు మనల్ని తంతే!!!" భయంగా అన్నాడు.

    "వాళ్ళకి తెలిసేలా, వాళ్ళకి పట్టుబడేలా ఫాలో అవుతామా  యేంటి? ఇలా ఆలోచిస్తూ కూర్చుని వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే చాలా నష్టం. త్వరగా పద"  అన్నాడు కన్నారావు అడుగులు ముందుకు వేస్తూ.

    చిట్టబ్బాయి కన్నరావుని ఫాలో అయ్యాడు.

    అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటల్తేంది.   

     ట్రాఫిక్ ని తప్పించుకుంటూ మెల్లగా రోడ్డు దాటారు ఇద్దరూ.

    ఆ రౌడీలు  ఇద్దరూ కిళ్ళి షాపువాడికి డబ్బులిచ్చి సిగరెట్లు ముట్టించి ముందుకు కదిలారు.

    "వాళ్ళకి కాస్త దూరంలో  నడుద్దాం... అనుమానం రాకుండా" అన్నాడు కన్నారావు.

    పదడుగులు నడిచాక అక్కడో బార్ ఉంటే అందులోకి దూరారు రౌడిలిద్దరు. 'ఇప్పడేం చేద్దాం' అన్నట్ట చూశాడు చిట్టబ్బాయి కన్నర్రావు మొహంలోకి "

    మనం కూడా లోపలికి పోదాం పద" అన్నాడు కన్నారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS