రోడ్డుకి అవతల వ్తెపు పొలిసు జీపు ఆగి ఉంది.
దాంట్లోంచి దిగిన ఒక ఇన్ స్పెక్టర్ బంగార్రాజు, కానిస్టేబుల్ ఏడుకొండలూనూ.
చిట్టబ్బాయ్, కన్నారావుల కాళ్ళలో వణుకు మొదలయింది.
"ఒరేయ్ కన్నా...మనం ఓ పని చేద్దామా?" తడి ఆరిపోయిన గొంతుతో అన్నాడు చిట్టబ్బాయి.
"ఏంటది?..." అడిగాడు కన్నారావు.
"ఇక్కడినుండి పరుగుతిడ్డామా?"
"ని బొంద...వాళ్ళని చూసి అలా పరుగెత్తితే అనవసరంగా వాళ్ళకి మన మీద అనుమానం వచ్చి వేంబడిస్తారు... అయినా వాళ్ళు ఇటువ్తెపు ఎందుకు వస్తున్నారో ఏమిటో? మనకోసమే అని ఎందుకు అనుకోవాలి! ఇటువ్తెపు ఏమ్తెనా పని ఉందేమో!" అన్నాడు అక్కరావు ఇన్ స్పెక్టర్ బంగార్రాజు, కానిస్టేబులు ఏడుకొండలు వ్తెపు చూడకుండా ఎటోచూస్తూ. "నువ్వు కూడా వాళ్ళవ్తెపు చూడకు. అనవసరంగా వాళ్ళకి అనుమానం వస్తుంది."
చిట్టబ్బాయ్ వెంటనే తల అటు పక్కకి తిప్పేసి ఏటో చూడసాగాడు.
"నీ బొంద....నిన్ను వాళ్ళవంక చూడొద్దని అన్నానుగాని నా వంక కూడా చూడొద్దని అనలేదు... ఇటు తిరుగు..." విసుక్కుంటూ అన్నాడు కన్నారావు.
చిట్టబాయ్ కన్నారావు వ్తెపు తిరిగాడు.
"నాకు భయంగా ఉందిరా కన్నా..."
"మరి అలా బిక్కుమొహం పెట్టకు కొంపలు మునిగిపోయినట్టు! అస్సలు ఏమి జరగనట్టు చిరునవ్వు నావ్వుతూ ఉండు...." చిరునవ్వు నావ్వుతూ అని చూపుల్తో విస్కున్నాడు కన్నారావు.
చిట్టబ్బాయ్ చిరునవ్వు నవ్వాడు.
"వద్దులే... నువ్వలా భయపడ్తూ నవ్వుతుంటే ని మొహాన్ని చూడలేక చస్తున్నా.. ఇంక నవ్వకు... ఆపు!!..." విసుక్కుంటూనే పెదాల మీది చిరునవ్వు పోకుండా జాగ్రత్తపడుతూ అన్నాడు కన్నారావు. చిట్టబాయి మళ్ళి బిక్కమొహం వేశాడు.
వాళ్ళకి దగ్గర్లో బూట్ల అయ్యింది. చిట్టబ్బాయ్ కన్నారావులు టెన్షన్ గా ఫిలవసాగారు. కాని వాళ్ళు తలలు తిప్పి మాత్రం చూడలేదు. ట్రాఫిక్ తప్పించుకుంటూ ఇన్ స్పెక్టరూ , కానిస్టేబులూ రోడ్డూ దాటే సమయంలో ప్తె సంభాషణ జరిగింది చిట్టబ్బాయ్, కన్నరావుల మధ్య.
"ఏయ్.. మిమ్మల్నే!!..."
ఇన్ స్పెక్టర్ బంగార్రాజు గొంతు ఖంగుమంది. అతని గొంతు విన్నా విననట్టే ఏటో చూడసాగారు చిట్టబ్బాయి కన్నారావులు,
"మిమ్మల్నే అంటే పలకరేం?" వెనక నుండి చిట్టబ్బాయి భుజం మీద తాడ్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్ బంగార్రాజు. చిట్టబ్బాయ్ చాలా కంగారుపద్తూ వెనక్కి తిరిగాడు.
"హలో... ఎంతిసార్? హిహి .. మమ్మల్నేనా?" అన్నాడు కంగారుని కనబడనియకుండా ఉండడానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తూ.
"మిమ్మల్నే..." అన్నాడు బంగార్రాజు.
"పిలిస్తే వినబడలేదా?"
"వినబడిందిగాని మాతో మికేం పని ఉంటుంది. అని... మీకు దోంగల్తో కదా పని? హిహి.. మరేమో మేమేమో దొంగలం కూడా కాము. అంతే కదరా కన్నా?" గబగబా అన్నాడు చిట్టబ్బాయ్.
"అంతే కదా మరి?" అన్నాడు కన్నారావు చిరునవ్వు నవ్వుతూ.
"దోంగాతానాలు చేసేవాళ్ళు కాకపోవచ్చుగాని ... పిల్లల్ని ఎత్తుకు పోయేవాళ్ళు కావొచ్చుగా?...." చటుక్కున అన్నాడు బంగార్రాజు.
అతని మాటలకి ఇద్దరూ గతుక్కుమన్నారు. మొదట కన్నారావు తేరు కున్నాడు.
"పిల్లాల్నా? ఎత్తుకుపోవడమా? మేమెందుకు ఎత్తుకుపోతాం సార్? మాకు ఇంకా పెళ్లే కాలేదు. పెళ్ళి అయి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే అప్పుడు పిల్లలమిద మోజుచేత ఎవర్నేనా ఎత్తుకుపోయి పెంచుకుంటారు ఎవర్తెనా. అంతేగాని పెళ్ళికాని మాలాంటి బ్రహ్మచార్లు పిల్లల్ని ఎత్తుకెళ్తారా సార్ ఎక్కడ్తేనా? మీరు భలే అమాయకులు సార్" అన్నాడు కన్నారావు చనువుగా ఇన్ స్పెక్టర్ బంగార్రాజు భుజం మీద తాడ్తూ.
"ఊ...ఊ... అతి చనువు ప్రదర్శించకు మర్డరు చేసేస్తా...." అన్నాడు బంగార్రాజు కన్నారావు భుజం మీద చేత్తో దులుపుకుంటూ.
ఏడుకొండలు కిసుక్కున నవ్వాడు.
బంగార్రాజు ఏడుకొండలు వంక సీరియస్ గా చూశాడు.
"ఎందుకా వెకిలి నవ్వు? మర్డరు చేసేవాడు లేకా!?"
"వీళ్ళు చాలా అమాయకులు సార్" అన్నాడు ఏడుకొండలు నవ్వాపుకుంటూ.
"అవునుసార్. మేం చాలా అమాయకులం" కోరస్ గా అన్నారు చిట్టబ్బాయ్ అక్కరావులు.
"విళ్ళకి పిల్లల్ని ఎందుకు ఎత్తుకుపోతారో కూడా తెలిదు.." మళ్ళి అన్నాడు ఏడుకొండలు.
"అవున్సార్ మాకు నిజంగానే తెలిదు." మళ్ళి అన్నాడు ఇద్దరు.
"మీరు నోర్ముయ్యండి! లేకపోతే మర్డరు చేస్తా. అసలు మీ పేర్లేంటి?" అదికారాన్ని కంఠంలో పలికిస్తూ అన్నాడు బంగార్రాజు.
"నా పేరు కన్నారావు. విడి పేరేమో చిట్టబ్బాయి చెప్పాడు కన్నారావు.
"మిరుండేది ఎక్కడా?"
"విజయనగర్ కాలనీలో" మళ్ళి కన్నరావే జావాబు చెప్పాడు.
"మరి మీ పేరేంటి సార్" అన్నాడు చిట్టబ్బాయ్.
"నాపేరు గోల్డెన్ కింగ్ అంటే బంగార్రాజు. ఇతను సెవెన్ హిల్స్ అంటే ఏడుకొండలు!" అన్నాడు బంగార్రాజు.
"గ్లాట్టూ మిట్యూ సార్..." బంగార్రాజు చెయ్యి పట్టుకొని ఊపేశాడు చిట్టబ్బాయ్. కన్నారావు ఏడుకొండలు చెయ్యిపట్టుకుని షేక్ హండిస్తూ ఊపేశాడు.
"ఏయ్...ఏయ్...ఇద్దరూ చేతులు వదలండి. ఊ వదలండి... హమ్మ!" అన్నాడు బంగార్రాజు తన చేతిని చిట్టబ్బాయి చేతి నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ.
ఇద్దరూ గబుక్కున చేతులు వదిలేశారు.
"సార్! ఇక మేము వెళ్ళిపోమా?" అన్నాడు చిట్టబ్బాయి చేతులు నలుపు కుంటూ.
"ఎక్కడికి? ముందు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పండి. నిరుండేది విజయనగర్ కాలని అయితే మరి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? ఆ" గుడ్లురిమి చూస్తూ ప్రశ్నించాడు బంగార్ర్రాజు.
"పిల్లగాలికి నిల్చున్నాం" అన్నాడు కన్నారావు.
"పిల్లగాలికా ఆడపిల్లగాలికా? అబద్ధాలు చెప్తే మర్డరు చేస్తా. పిల్లగాలికి ఇంత బిజీ సెంటర్లో నిలబడ్తారా ఎవర్తెనా? ఏ ట్యాంక్ బండ్ కో వెళ్తారుగాని"
"ఇక్కడ నిలబడి అమ్మాయిలకి స్తేటు కొడ్తున్నారేమో సార్...!" అన్నాడు ఏడుకొండలు.
"రామ రామ. మేమలాంటివాళ్ళం కాదు సార్..." అన్నాడు చిట్టబ్బాయి కంగారుగా.
"మేము అలాంటి అల్లరి చిల్లరి వేషాలేసేవాళ్ళం కాదు సార్. మేము ఉద్యగం కూడా చేస్తున్నాం" అన్నాడు కన్నరావ్.
"మా ఇంటికి వస్తే మా కాలేజి ప్రిన్సిపాల్ మాకిచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్స్ కూడా మీకు చూపిస్తాం సార్ కావాలంటే" అన్నాడు చిట్టబ్బాయి.
"పాపం. వీళ్ళు అమామకుల్లాగానే ఉన్నారు సార్. మారేమో ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసింది ఇద్దరు అని తెలిసిందగ్గర్నుండి ఎవర్తెనా ఇద్దరు కనిపిస్తే చాలు జీపు ఆపేసి వాళ్ళని ప్రశ్నించి బెదరగోట్టేస్తున్నారు." అన్నాడు చిట్టబ్బాయి కన్నరావుల వంక జాలిగా చూస్తూ.
"కిడ్నాపా?... అదేంటి?" కన్నారావు ఆశ్చర్యంపోతున్నాట్టు మొహం పెట్టి అడిగాడు. అలా అడిగాడుగాని లోలోపల నిజంగానే ఆశ్చర్యపోయాడు.
"అయితే పోలీసులు రంగంలికి దూకారన్నమాట!" అనుకున్నాడు. చిట్టబ్బాయి గుండెలు పిచుపిచుమన్నాయ్.
"ఓ చిన్న కుర్రాడిని ఇద్దరు కిడ్నాప్ చేస్కుని వెళ్ళారులెండి. తరువాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి డబ్బులిస్తారా మీ అబ్బాయిని చంపెయ్యమా అని బెదిరించారు" చెప్పాడు ఏడుకొండలు.
