15
ఒకసారి ఒక ట్రెండురోజులు ఒంట్లో బాగుండలేదన్న నెపంతో పని కెళ్ళకుండా బంగ్లా లోనే ఉండిపోయింది రాధ. ఆమధ్యలో ఒకరోజు హాస్పిటల్లో అమెరికాకు తిరిగి వెళ్ళిపోతున్న ఒక పెద్ద డాక్టరు కి వీడ్కోలిచ్చే నిమిత్తం లో వో పెద్ద టీపార్టీ కూడా అయింది. అందు క్కూడా రాధ రాలేదు. ఆ సందడి జరిగిన రోజున అంత మరీ ప్రమాదమైన కేసులు తన చార్జీ లో లేనందున రఘు కూడా కొంచెం త్వరగానే ఇంటి కొచ్చేశాడు. సుధ కాలు విషయం తన పెళ్ళి విషయం ఆ సమస్యలు తీరిపోవడమే కాకుండా సుదకి బాగా ఆరోగ్యం చేకూరి మెడికల్ కాలేజీలో కూడా చేరి పోయినందున రఘు చిరాకు లన్నీ చాలావరకు తీరిపోయి మనసు తేలిక పడి మళ్ళీ ఆటపాటల్లో ఎప్పట్లా పాల్లోనటూండడం తో పాటు అప్పుడప్పుడూ ఏవన్నా పిక్చర్ల కి కూడా వెళ్తున్నాడు . ఆరోజు ఆ ఉద్దేశం తోనే ఇంటి కొచ్చాడు రఘు.
'పార్టీ బాగా జరిగిందా?' చక్కగా అలంకరించుకుని హల్లో కూర్చొనున్న రాధ అడిగింది రఘుని.
'ఆ, మీర్రాలేదెం?' అన్నాడు శాన్నాళ్ళకి మళ్ళీ రాధ తనంతట తనే సహజంగా మాట్లాడినందుకు ఆశ్చర్య పోతూ.
'అయినా అనుకోకుండా ఇలా అధార్తుగా ప్రయాణం కట్టేశాడెం ఈ 'గేసన్.'
'అతను కొన్ని సంవత్సరాల బట్టి పరిశోధనలు జరుపుతుంటే వో వ్యక్తికీ ఇప్పుడదార్తుగా ప్రజ్ఞ వచ్చిందిట. అయితే అది స్థిరంగా వుండడం లేదుట. దీన్ని గురించి ఆ పరిశోధన లింకా ఎన్నెన్నో జరపాల్సుంన్నందున ఇంత త్వరగా ప్రయాణం కావలసోచ్చింది.'
'ఒక వ్యక్తీ పైన కొన్ని ఏళ్ళ పాటు 'ఎక్స్ పెరిమెంట్లా' ఆశ్చర్యంగా వుందే/'
'అందుకే ఆయనా అంత ఉత్సాహం చూపించడం. అసలా మనిషిని మనిషిగా తయారించింది కూడా ఈయనే అనొచ్చు. ఎందుకంటె ప్రాణం తప్ప మిగతా శరీరమంతా చెడి ఎముకలన్నీ పాడై పోయిన మనిషిట అతను.'
'ఆశ్చర్యంగా వుందే?'
'చాలను. అందులోనూ అంతలాటి కేసు చేజిక్కింది' అంటే నిజంగా అది ఈ 'గేసన్' అదృష్ట మని చెప్పాలి' పరిశోదనలు జరపడం లో అపార ఉత్సాహం గల రఘు కీ ఆ మనిషి విషయం లో అంత ఆదుర్దాగా వుంది పాపం.
'డాక్టరు ఈ కేసు నెగ్గించాడంటే ఇకాయాన్ని పూర్తిగా ప్రాణం పోయగల్గేటంతటి వాడూ అవుతాడనే అనుకోవచ్చునెమో.'
'తప్పకుండానూ ఏదో వచ్చిన చాన్సే లాగా వచ్చింది. తనతోటే వచ్చేస్తే తనకీ హెల్పు గా వుంటుందనీనూ, ఎక్స్ పీరియన్స్ వస్తుందనీనూ రమ్మని అంటున్నారాయన.' ఎప్పుడూ అంత ధోరణి గా మాట్లాడి ఎరగని రఘు ఆ కేసులో ఉండే ఆసక్తి కొద్ది అలా చెప్పుకుపోయి ఆఖర్న గుర్తు కొచ్చి నాలిక్కోరుక్కున్నాడు. 'అయితే మీరు ఇప్పుడే వెళ్ళిపోతారా?' కొంచెం ఆందోళన పడుతున్నట్టుగా అంది రాధ.
'ఆయనతో కలిసి వెళ్ళడం లో ఏ శ్రమా , ఏ ముందు ప్రయత్నమూ ఎక్కువ అవసరం లేకుండానే వెళ్ళిపోవచ్చును గానీ , నాకు నా స్వంత విషయాన్ని గురించి కనీసం వో నెలన్నా గడువు కావాలి. ఆయనా సుధ కోసరం వెల్లూరు వెళ్ళినట్టే మరో రెండు మూడు ముఖ్యమైన కేసుల్ని సరిగా చూడవలసున్నందున--'
'సుధ ఆపరేషన్ కి ఈయన వచ్చాడు కదూ అన్నట్టు.'
'అప్పటి మా పని కలుపుతునాన్న బట్టే అమెరికా లో అయన చేతికి పనికొచ్చే డాక్టర్లెంతమందో వున్నా, ప్రత్యేకంగా నన్నే అయన కోరడం కూడా.'
'ఇంతకీ మీ ప్రయాణం మాట?'
'రాత్రి అయన మళ్లీ ఆ మనిషి పరిస్థితుల్ని గురించి తిన్నగా మాట్లాడి తెల్సుకుంటారట. దాన్ని బట్టి అయన ముందుగా వెళ్ళడమో లేక ఇద్దరం కలిసే వెళ్లడమో, తెలుస్తుంది.' అంటూ తన రూములో కెళ్ళిపోయాడు రఘు.
'అయితే రఘు వెళ్లి పోతాడా' నాలుగేళ్ళు పాటు ఈ వైద్య విషయంగా ఒకేచోట వుంటున్న దోషంగా రఘు ఎడబాటు రాధకి ఏదో అర్ధం కాని బాధను తోపించింది, అనాట్నుంచి ఈనాటి వరకూ వీరిద్దరికీ మధ్య జరిగిన మంచి చేడ్డలన్నింటిని వరసగా నెమరు కి తెచ్చుకోసాగిన రాధకి . 'రఘు ఎలాగైనా సాటిలేని రత్నమే! ప్రతి మంచి అలవాట్ల కి అతనికతనే సాటి' అనుకుంది రాధ తన మనసులో.
నీటుగా డ్రస్స్ అయి వచ్చి టీ తాగడాని క్కూర్చున్న రఘు 'పిక్చర్ కి వస్తారా?' అని సభ్యత కోసరం రాధ నడిగాడు.... రానన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది ఏదో ఆలోచిస్తున్న రాధ. అన్నదే తడవుగా గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు రఘు! సినిమా లో విశ్రాంతి వేళ లైట్ల వెలుగు లో ఇటూ అటూ చూసిన రఘు తనకి రెండు వరసలకి ముందు ఒక ఎంగ్లోఇండియన్ యువతి తో అతి కేవలంగా ప్రవర్తిస్తూ కూర్చునున్న చంద్ర మౌళి ని చూసి ఆశ్చర్య పోయాడు.

తనకి తేలిగ్గా రెండు చప్పాతీ లు మాత్రం చాల్నని గోవిందు తో చెప్పినప్పుడు రాధ తను క్కూడా సినిమాకు వెళ్తున్నానని చెప్పిందని ఆవిడకీ రొట్టెలే చేసుంచమందనీ అన్నాడే? అతనూ' అనుకున్నాడు రఘు.
అట పూర్తయి రఘు ఇంటి కొచ్చేసరికి మామూలు బట్టల్తో ముభావంగా కూర్చుని ఏదో చదువు కుంటుంది రాధ. నిమిషం లో తేలిగ్గా ఆహారం తీసేసుకుని తను తెచ్చిన అరిటి పళ్ళలో రెండు 'తీసుకోండి' అంటూ రాధ ముందర బల్ల మీద పెట్టి మిగతా రెండూ తన బల్ల మీద పెట్టుకొని తనూ ఏదో పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు రఘు.
రాధ రఘుని సినిమా విషయంగా ఏమీ అడగనూ లేదు. చంద్రమౌళి సంగతి తనూ రాధతో చెప్పనూ లేదు. రాధ మాత్రం పుస్తకం చేత్తో పట్టుకుందే గాని మనసు దేన్ని గురించో మధన పడుతూందని ఆ మొహం తీరు తెలుపుతూనే వుంది.
'ఇంక అయన రానట్లేనా అమ్మా' తలుపు చాటున నిలబడి వినయంగా అడిగాడు గోవింద్!'
'ఊ' తలెత్తి అతని వేపు చూడకుండానే అంది రాధ. కొంచెం సేపవగానే 'గుడ్ నైట్' అంటూ వెళ్లి పడుకున్నాడు రఘు. మరి కాస్సేపటి కల్లా హల్లో లైటు తీసేయ్యబడడం తో రాధ కూడా వెళ్లి పడుక్కుటుందని అనుకున్నాడు రఘు.
ఒక గంట సేపు నిద్ర పోయుంటా డెమో రింగవటం లో తుళ్లిపడి లేచి గబగబా హల్లో కొచ్చాడు రఘు. లైట్ తీసేసి ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చునున్న రాధ తనూ లేచోచ్చిందేమో, ఆ చీకట్లో ఒకర్నొకరు బలంగా మోదుకున్నారు. అవేగానికి పడిపోబోయిన రాదని రెండు చేతులా పొదివి పట్టి ఆపాడు రఘు. రాధ వళ్ళు పులకరించి మైమరుపు గా అక్కడి కుర్చీ లో చతికిల బడితే లైటు వేసి డబ్బున ఫోన్ రిసీవర్ని అందుకున్న రఘు 'ఎవరూ రాధా దేవిగారూ? ఆ! ఇదుగో?' అంటూ ఆపి 'మీకోసరమండీ' అన్నాడు రిసీవర్ని ఒత్తిగించి పెట్టి ఇవతల కొచ్చేస్తూ రఘు.
'హల్లో' అంటూ ప్రారంభించిన రాధ మరో నాలుగైదు మాటల్ని మాట్లాడగానే మళ్ళీ రిసివర్ని ఒత్తిగించి వుంచి,
'అయ్యో మౌళి. మౌళి వి.టి. వద్ద రోడ్డు మీద పడి పోయిన్నాట్ట' అంది వణికిపోతూ రఘు రూములో కొచ్చి రాధ.
'అంటే దారి ప్రమాదం వల్ల లేక తాగుడు వల్లా' అన్నాడు ఆదుర్దాతో రఘు.
'ఏమో నేనదేమీ అడగలేదు. అటు పోలీస్ ఇన్ స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. ఆ వివరాలేవో కాస్త మీరే కనుక్కుందురూ 'ప్లీజు' అంది తడబడి పోతూ రాధ.
దబ్బున వెళ్లి, ఆ అధికారి అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలిచ్చి నేర్పుగా ఆ బెడద వదిల్చేసుకుని రఘు మళ్లీ తన గదిలో కొచ్చేసరికి, వణికి పోతూ, ఆభయంతో ఏం చేస్తున్నదీ తనకే తెలియని రాధ అతని మంచం మీద బోర్లా పడుకుని గట్టిగా కళ్ళు మూసుకునుంది. ఏమనడానికీ, ఏం చెయ్యడానికీ, ఎటూ పాలుపోనీ రఘు, గుమ్మం ముందు అలాగే కాస్సేపు నిలబడ్డాక, 'మీరిందులో భయపడాల్సిన దింకేమీ లేదు. ఇంక మీ ప్రసక్తే రానవసరం లేకుండా చెప్పేశా' అన్నాడు రఘు.
'ఆ? నిజంగానే? అయినా అతను రోడ్డు మీద పడిపోతే ఆ ఇన్ స్పెక్టర్ నన్ను పిలవడ మేమిటీ నాన్సెన్స్' అంది దిగ్గున లేచి కూర్చుంటూ రాధ.
'అతని జేబులో -- మీ ఎడ్రస్, ఆ కాయితంలో మీపెరున రిజర్వు చెయ్యబడ్డ సినిమా టికేట్టూ దొరికాయిట--'
'అవును సాయంత్రం తనొచ్చి నన్ను తీసుకేల్తానన్నవాడు మళ్లీ, తను రావడానికి వీల్లేదని చెప్పమని నా ఎడ్రసు రాసిచ్చి, ఒక మనిషి చేత ఆ టిక్కెట్టు పంపాడు. నాకది నచ్చక ఆ ఎడ్రసు కాయితం లోనే ఆ టికెట్టు చుట్టబెట్టి మళ్ళీ అతనికే ఇచ్చేయ్యమని పంపించేశా' అంది కాస్త ధైర్యం తెచ్చుకుంటూ.
'వో. అదా సంగతి. ఏమో, నాకీ వివరాలేవీ తెలియవు గాని ఈ గొడవ తప్పించుకుందుకు అలాగే చెప్పా ఊహించుకుని'
'యేమని చెప్పారు?'
'ఆవిడ కోసరం కొన్నాడెమో మాకు తెలియదు గాని ఆవిడ ఇంట్లోనే వున్నారూ. బహుశా ఆ ఆంగ్లో ఇండియన్ యువతితో --
'ఏమిటీ? ఎంగ్లో ఇండియన్ లేడియా? అదెవరూ' అనుకోకుండానే గొంతు హెచ్చించేసింది రాధ కోపంతో.
'అదెవరో నాకు తెలియదు గాని ఇవాళ సినిమా దియేటర్ లో వాళ్ళిద్దర్నీజతగా చూశాను . అందువల్ల ఆ విషయం అయన చెవిని వేశాను ఎందుకన్నా మంచిదనీ' అన్నాడు ముభావంగా రఘు.
'అయితే మీరివాళ అటు వెళ్ళడం వల్లనన్నీ ముప్పు నుంచి కాపాడ్డానికి వీలయింది. చాలా చాలా థాంక్స్ మిస్టర్ రఘు. మీ మేలు ఎన్నటికి మర్చిపోను.' అంది నిశ్చింతగా ఊపిరి వదుల్తూ రాధ. రఘు ఏదో బదుల్చేప్పా బోతుండగా మళ్ళీ ఫోన్ రింగవడం తో రఘు వెళ్ళి మాట్లాడాడు.
'మళ్ళీ అక్కడ్నించేనా?' బెదురుగా అడిగింది రఘు రాగానే రాధ.
'మరే నేనూహించిందే రైటు. ఆ కూడా వచ్చినావిడతో కలిసి ఒక హోటల్లో కెళ్లి తప్పతాగి తందానాల్తోక్కాడట. ఆ కైపు లో ఆతనుండగా అతని పెన్నూ, పర్సూ వగైరాలన్నీ చేజిక్కించు కుని చక్కగా అవిడటు వెళ్తే, స్కూటర్ తో సహా ఇతను నడి వీధి లో పడ్డాడుట. వృధాగా మనల్ని సందేహించినందుకూ , శ్రమ పెట్టినందుకూ క్షమాపణ చెప్పడం కోసరం పిల్చాడు' అన్నాడు క్లుప్తంగా రఘు.
'ఇంకా ఏవో విషయాలడిగినట్టున్నాడు?' అంది అంతసేపూ మాట్లాడింది ఇంతేనా? అనుకుంటూ రాధ.
'అదా, మీరింత యోగ్యత గల డాక్టర్ల అయ్యుండీ అటువంటి తాగుబోతు తో మీకు స్నేహం ఎలా కల్గింది, అన్న ధోరణి లో మాట్లాడారాయన -- 'ఆపైన ఎలా చెప్పాలో తెలియక ఊర్కున్న రఘు, అందుకు మీరు నా గురించి అన్నీ చెప్పెశారా, అన్నట్టుగా అభిమానంతో రాధ చూడ్డం గ్రహించగానే 'అతని చెల్లెలు మా హాస్పిటల్లో ట్రీట్ మెంట్ అవుతున్నప్పుడు ఆ నిమిత్తంగా ఇతన్ని తెల్సునే గాని మాకేమంత పరిచయం లేదే, అన్నా' అన్నాడు.
'తరవాత' హెచ్చరించింది రాధ జంకుతూనే వోమూల్న .
'మీరు అనేకసార్లు అతనితో అతని స్కూటర్లో తిరిగారటగా.' అడిగేశాడు రఘు.
'ఏదో పరిచయంగా ఉంటున్నాడు గదానని--'
'పోనివ్వండి . ఆవిషయాన్నీ అతని తోడి పరిచయాన్ని కూడా ఇక ఇంతటి తో వదిలెయ్యడం మంచిదని నా అభిప్రాయం' అన్నాడు చాలా వేళయి పోయిందన్నట్టుగా చేతి గడియారాన్ని చూసుకుంటూ రఘు.
'అరెరే ఐయామ్ సారీ' అంటూ దిగ్గున లేచి గది బయట కొచ్చేసింది, అప్పటి వరకూ తను ఎక్కడున్నది కూడా ఆలోచించని రాధ సిగ్గుతో నొచ్చుకుంటూ.
'నోనో' అంటూ గుడ్ నైట్' చెప్పేసి వెళ్లి పడుక్కున్నాడు రఘు. తనూ వెళ్లి పడుకున్న రాధ-- ఇందాక రఘు తనని మోదుకున్నదీ, పొదివి పట్టినదీ తల్చుకుని పులకాంకితం అవుచూ మధుర తలంపుల్తో తేలుతుంటే-- అదొక పొరపాటుగా జరిగిన సంగతి గానూ అవసరాన్ని బట్టి తప్పనిసరిగా జరుగుతున్న చర్యల్లో ఇదీ ఒక చర్య గానూ భావించు కున్న రఘు అంతలో ఆ విషయాన్ని మర్చి పోయినందున హాయిగా నిద్రపోయాడు. ఆ మర్నాడే తన ప్రయాణాన్ని గురించి తెలుపుతూ దాంతో పాటు ఆ కొద్ది వ్యవధి లోనూ తను చేయ్యదల్చుకున్న కార్య క్రమాల్ని గురించీ విపులంగా తెలియజేసి, ఈ విషయం లో వారి అభిప్రాయాన్ని సలహా ని కూడా అర్ధిస్తూ శర్మ గారికే వో పెద్ద ఉత్తరం రాశాడు రఘు.
