'సుధా. నీవరకూ నీ ఔదార్యాన్నీ మహోన్నతమైన నీ అభిమానాన్నీ నిలబెట్టుకుందుకు నువ్వే సలహా నాకిస్తున్నందుకు సంతోషమే?, అయితే నేనూ నాకూ--' ఆ తరవాత ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు శీఘ్రంగా . అద్దం వంటి హృదయం కల సుధ తన అభిప్రాయాన్ని స్వచ్చంగా తెలియ చెప్పెసినంత త్వరగా మధ్యలో చంచలపు సుడిగాలితో కొంత దుమ్ము పడిన తన హృదయాన్ని స్వచ్చత లోపం కారణంగా దబ్బున బయటపెట్టలేకపోయాడు తను.
'నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటూ మనసు పాడు చేసు కుంటున్నావ్ బావా?' జాలిగా అంది సుధ 'కాదు సుధా. నీడలా ఎప్పుడూ నన్నంటి పెట్టుకు నుంటూన్నట్టుగా బావించు కుంటుంటే నిన్ను గురించి తప్ప నేనింక దేన్నీ గురించీ ఎప్పుడూ బాధపడను సుధా, అన్నాడు దీనంగా తను.
'నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించు కుంటూ మనసు పాడు చేసుకుంటున్నావ్ బావా?' జాలిగా అంది సుధ 'కాదు సుధా. నీడలా ఎప్పుడూ నన్నంటి పెట్టుకు నుంటూన్నట్టు గా బావించు కుంటుంటే నిన్ను గురించి తప్ప నేనింక దేన్నీ గురించి ఎప్పుడూ బాధపడను సుధా, అన్నాడు దీనంగా తను.
నీడలా నీతోనే వుంటున్నాననుకుంటూ మళ్లీ నా గురించి బాధ దేనికి బావా?' అని తనవేపే పరితాపంగా కాస్సేపు చూసిన సుధ.
నీ బాధ నాకర్ధ మయింది బావా? రాధను ప్రతిష్టించుకున్న నీ హృదయం లో నాకింక తావివ్వ లేనందుకు చింతిస్తున్నట్టున్నావు పిచ్చి బావా నేను కోరింది నీ పాదాల వద్ద నాకు స్థల మిమ్మని గాని నీ హృదయం లో కాదుగా' నిశ్చలంగా వొచ్చాయి సుధ నోటి వెంట ఈ మాటలు.
'ఇవేం మాటలు సుధా, మొదట్నుంచీ నా హృదయాన్ని ఆక్రమించుకున్నదాన్ని --
'ఒద్దు బావా వొద్దు నేను నీకే విధంగానూ తగను--'
'అది నిర్నయించు కోవలసిన వాణ్ణి నేను సుధా. ఇక మీద నువ్వలా అనేందు కూ అవకాశం లేదన్నది మర్చిపోకు' ముద్దుగా మందలించాడుతను.
'ఒక్క ఈ అవిటి తనం తేలిపోతే సరా బావా. నీ చదువు కి , నీ ప్రయత్నాలకి --
'చెప్పగా అవన్నీ ఆలోచించుకోవలసినది నేననీ, అలా చూసినా అందులో మాత్రం నీకేం లోపం సుధా బయట పెద్ద పెద్ద డిగ్రీల్లో ఏం వుంది సుధా. నా హృదయంలో ఏం వుందో తెల్సుకో. నా అభిప్రాయం ఏమిటో నా కళ్ళలోనే చదువుకో! ఇంకా చెప్పాలంటే నాకు ఏ సమయం లో ఏం కావాలో అన్నది నాకన్నా నీకే తెలుసు. ఇక ఇంతకన్నా నాకాబోయే భార్య లో నేనేదురుచూడవలసింది ఇంకేం వుంటాయి సుధా. అసలు నిజం చెప్పాలంటే ఎన్ని డిగ్రీలు ఎన్నెన్ని పరిశోధనలూ చేసిన వాడైనా, ఇంత మనసు తెలిసి మసులు కోగల్రా చెప్పు సుధా!' చెయ్యి తన చేతులోకి తీసుకున్నాడతను.
'ఇదంతా నామీద నీకున్న జాలి కొద్దీ నువ్వు పడుతున్న భ్రమ బావా, నా మాట విను.'
'సుధా నామీద నీకింత అయిష్టతనీ, నిర్దయ అనీ--'
'బావా, బావా? నాయందున్న జాలి కొద్దీ తొందరపడి తరవాత విచారిస్తా వేమో . నీకటువంటి లోపాలే మునుముందు కల్గకూడదన్న భావంతో ఇంతదూరం ఈ లోటు పాట్లను నీకు బోధపర్చాలనుకుంటున్నానే గాని. నీ యందు నాకు అయిష్టమా బావా పొరపాట్న కూడా ఇంకెప్పుడూ అలా అనకు బావా. ప్రాధేయపడింది సుధ.'
సుధని ఆనంద పెట్టాలని ప్రారంభించిన ఈ ప్రశక్తి ఈ విధంగా మారుతుండడం గుర్తించిన రఘు, ఇదుగో ఇలా చూడు సుధా. నా పేరేమిటో నీకు తెలుసా... అన్నాడు అధికార ధోరణి లో నవ్వుతూ తను.
'తెలియకేం రఘురామ చంద్రమూర్తి' ఒత్తి చెప్పింది తనూ నవ్వుతూ. సుధ బుగ్గల మీది కన్నీటిని మణి కట్టుతో తుడిచేసుకుంటూ.
'రాముడు ఏకపత్నీ వ్రతుడన్నది నీకు తెలుసా.'
'వో అందుకే నేనీ పద్దతి చెపుతా' హెచ్చరింపు గా అంది సుధ
'ఆ అదీ! అయితే రాదని చేసుకోమని నన్ను బలవంతం చెయ్యడం లో అర్ధం లేదు మరి.'
'అయితే నీకిది వరకే పెళ్లై పోయిందన్న మాట. చెప్పవేం?" గడ్డం కింద చెయ్యి పెట్టుకుని ఆశ్చర్యం నటిస్తూ అడిగింది సుధ.
'ఆ? అరెరే? అయితే పెళ్ళి కూతురి వైన నిన్నే ఆ పెళ్ళికి పిలవడం మర్చిపోయాను చూశావా సుధా?' తనూ ఆశ్చర్యంగా అన్నాడు.
'హె,ఏవిటి బావా?' రెండు చేతుల్తోటీ కళ్ళు మూసేసుకుంది సుధ.
'అంతేగదా.' అంటూ చెవి దగ్గర నోరు పెట్టి 'నా హృదయమంతా నువ్వే ఆక్రమించేసుకుని, పాపం అక్కడ చేరాలనుకుని వచ్చిన వారందర్నీ నువ్వే తన్ని తరిమేస్తూ--' పైగా వాళ్లకి, వీళ్లకి చోటియ్యిబావా?' అంటూ ఈ పురమాయింపులు కూడా దేనికీ నన్ను చెడ్డ వాణ్ణి చెయ్యడానిగ్గానీ' అన్నాడు తాను. కళ్ళు మూసుకున్న పళాన్నే కుదిలీ కుదిలీ నవ్వింది సుధ.
'సరి అదుగో అత్తయ్య వాళ్ళూ వచ్చే స్తున్నారు గానీ, నీకు తగిన దాన్ని కాదూ, నీకు తగిన దాన్ని కాదూ' అంటూ వాదించే బదులు ఈపైన తగిన దాని వయ్యేటందుకు శ్రద్ధ చూపి పరీక్షల్లో త్వరగా ప్యాసవాలి. తెలిసిందా?' అంటూ సుధ వీప్మీద లాలనగా చరిచి ఎప్పట్లా కుర్చీ ఎడం గా లాక్కుని కూర్చున్నాడు రఘు.
అత్తయ్య వచ్చేక సుధ చేతులు తీసేసి మాములుగా పడుకుంది. అయితే ఆ మొహం లో ఆ కొన్ని నిముషాల్లో నూ ఒక ప్రత్యెక కళ మెరియడం తను స్పష్టంగా కనిపెట్టేశాడు. పిచ్చి సుధ తనకేక్కడ లోపం వస్తుందోనని నాకు సలహాలిచ్చి తన ఈ ఆశలిలా తన్లోనే జీర్ణింప జేసేసుకునేదిగావల్ను. పాపం ఆ మబ్బు తొలగి పోవడం తో ముఖం లో అంత ప్రకాశం వచ్చింది అని అనుకుని అప్పటి సంఘటనల్నీ తల్చుకుని ఇప్పుడు నవ్వుకోసాగాడు రఘు .
ఇలా ఆ ఆలోచనల లో మునిగి పోయున్న రఘు వాకిట్లో రాధా చంద్రమౌళి లు 'టాటా' చెప్పుకోవడం లోపలి గడియారం వరసగా పది గంటలు కొట్టడం ఒకేసారి వినిపించాయి. అబ్బా ఇంత టయిం అయిపోయిందా అప్పుడే?' అనుకుంటూ లేచి వెళ్లి పడుక్కున్నాడు రఘు.
మర్నాడు మామూలుగా పొద్దున్నటి ఉపాహారాలూ హాస్పిటల్లో ఒంటి గంట వరకూ పనీ మళ్ళీ మధ్యాహ్నభోజనం వరసగా జరిగి పోయాయి. నాలుగయిదు రోజులాయి మధ్యాహ్నానికి తరువాత ఇంటి పట్టునే వుంటూన్న రఘు ఆరోజు నుండీ మళ్ళీ పన్లో కి వెళ్ళి పోతుండడమే గాక, సాయంత్రం తను బాగా ఆలస్యంగా వస్తున్నాడు. అందువల్ల ఇంట్లో ఏం జరుగుతున్నది ఎవరెక్కడి కి వెళ్తున్నదీ మొదలైన వివరాలేవీ అతనికి తెలియడం లేదు. తను వచ్చేసరికి రాదా, మౌళీ , హల్లో పెకాడుకుంటూ కూర్చునుండడమో లేక రాధ మాత్రం చదువుకుంటూ కూర్చునుండడమో జరుగుతుండేది.
అలాంటిది ఈ మధ్య కొద్ది రోజుల బట్టీ చంద్రమౌళి కనిపించడం లేదు సరి కదా. రాధ కూడా ఏవో బెంగాపడ్డదాన్లా కనిపిస్తుంది. మునుపట్లా ఎప్పుడెప్పుడూ అయిందని పించుకుని ఇంటికి పోదామా అనుకుంటూ నడకా, పరుగుగా , బంగ్లా కొచ్చేస్తుండే రాధ ఇప్పుడు కాళ్ళీడ్చుకుంటూ నిస్సారంగా నడుస్తుండడం కనిపెట్టేశాడు రఘు. పోనీ తను ఒచ్చేలోగా చంద్ర మౌళి వొచ్చి వెళ్లి పోతున్నాడెమో . అనుకుంటూ ఎప్పుడో అప్పుడప్పుడూ , తప్ప యాష్ ట్రే లో సిగరెట్ పీకలు గానీ, ఇల్లంతా సిగరెట్ కంపు వుండడం లేదు. ఉన్నా అతను ఏ కొద్ది సేపో వుండి వెళ్ళిపోయాడను కుందుకు నిదర్శనంగా ఒకటి రెండు సిగరెట్ పీకలే అందులో కనిపించేవి.
