రఘు తో పాటు తనూ తిరిగి విశాఖ వెళ్లిపోవాలనే రాధ కూడా ప్రయత్నించింది గాని బదులు డాక్టరు ఇంకా రానందున మరో నెల్లాళ్ళ పాటు తప్పనిసరిగా అక్కడ అగవలసోచ్చింది రాధ. 'సరి నే వెళ్ళగానే మురళి ని కల్సుకుని మాట్లాడుతాను' అన్నాడు బయల్దేరే ముందు పేంటు జేబుల్లో చేతుల్నుంచుకుని కారు వేపు నడుస్తూ రఘు.
'ఊ....బహుశా . స్టేట్స్ కెళ్ళేలోగా మిమ్మల్ని కల్సు కుందుకు వీలవదేమోనాకు.... ఎందువల్లనో. రాధ కంఠం గద్గదికమై కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
'మీరలాగంటే ఎలాగ ఈనెలాఖరు లోనే బహుశా నా మేరేజ్ జరగోచ్చు. దానికి మీరు తప్పకుండా రావాలి మరి ...' అన్నాడు మళ్లీ నాలుగడుగులు వెనక్కోస్తూ రఘు.
'వో. చెప్పరేం మరి--' నాన్చింది రాధ 'మా మామ కూతురు సుధనే చేసుకుంటున్నా, నమస్తే. వస్తా' వాచీ చూసుకుంటూ దబదబా వెళ్లి రఘు కారేక్కితే వెంటనే కారు ష్టార్టు చేసేశాడు తోడి డాక్టరు జోషి ఎక్కడ టైము మించి పోతుందో నన్న భయంతో. వెనక సీట్లో కూర్చునున్న రాధ మనసులో ఏ వేవో ఆలోచన్లు-- తనకి ద్రోహం ఏం చేశాడని ఈ మధ్య రఘు మీద తనంత కక్ష సాధించింది? అసలు తనలా చెయ్యడానికి అతని మీద తనకేం అధికారం వుందని? ఇంతకీ, చెరువు మీద కోపం వచ్చీ, అత్త మీద కోపం వచ్చీ అన్న సామెతల్లో చెప్పినట్టు అందువల్ల తను బావుకున్నది మాత్రం ఏవిటి? రఘు ఎంతో యోగ్యుడూ, నిండు కుండాను. అందుకే తన నీచపు చేతల్ని లక్ష్యం చెయ్యకుండా నిండు మనసుతో తనని ఆదుకున్నాడు. హు సుధ అమిత భాగ్యశాలి' ఇలా పరుగులెత్తుతున్నాయి రాధ ఆలోచన్లు.
రయిలు కదల బోతుండగా , వందలాది నిలబడున్న ఆ స్నేహిత బృందం అందరికీ నమస్కారం చేసేసి మొయ్యలేన్న్ని పూలమాలన్ని చేతి మీద పడేసుకుని మోస్తూ, రయిలేక్కిన రఘు అందరికీ వరసగా కర స్పర్శ చేస్తూ, వారందరి మధ్య కందిన మొహంలో నిలబడున్న రాధ కి ప్రత్యేకంగా నమస్తే చెప్పి--
'మీరు తప్పకుండా వస్తారు కదూ' అని మరోసారి హెచ్చరించి, ఇంతలో రైలు బాగా వేగన్నందుకున్నందున ఆ వాకిట్లో ఇక చేసేది లేక లోపలి కొచ్చి కూర్చున్నాడు.
రఘు కీ రాధని తల్చుకుంటే ఏదో అర్ధం కాని బాధగానే వుంటుంది. ఒకవేళ తను గాని రాధాకేధన్నా అపకారం చెయ్యలేదు గదా?...అని కూడా తనని తనే ప్రశ్నించు కున్నాడు రఘు. అయితే తనకి తెలిసినంత వరకూ అలాంటి పొరపాటు తనెప్పుడూ చెయ్యలేదు. ఇక తన మీద రాధ ఒకవేళ మనసు పడిందేమో అంటే, అందుకు తనెంత మాత్రం బాధ్యుడు కాదు. తానై రాధ అలా అభిప్రాయ పడేందు కవకాశం ఇచ్చేలా ఎప్పుడూ మసులుకోలేదు. సరికదా, రాధ అటువంటి అభిప్రాయాన్ని సూచించి నప్పుడల్లా ఆ భావాన్ని ఖండిస్తుండే విధంగానే తను ప్రవర్తించేవాడు. పోనీ మొదట్లో నే స్పష్టంగా తన నిశ్చయాన్ని చెప్పేద్దామని కూడా తానెన్ని మార్లో ఆలోచించాడు. అయితే, రాధ తనయందటు వంటి భావంతో వుండనేందుకు రుజువుగా ప్రత్యేక్ష నిదర్శనాలెం వున్నాయని? అసలే అదొక మోస్తరు స్వభావం గల రాధ అదొక అవమానపరిచే విషయంగా తీసుకుని తనని నిందించిందంటే?
పోనీ రాధని 'నువ్వూ' అంటూ చూపినట్టు కాకుండా ఈ పెళ్ళి ప్రయత్నం మాత్రం చెప్పేసి హెచ్చరిద్దావా?' అనుకుంటేనూ, సుధ లో వున్న లోపాలకారణం గానూ, తన మనసు ఒక నిశ్చయానికి లొంగకుండా చంచల పడ్డ కారణం గానూ , అన్నమాట తప్పల్సిన పరిస్థితి ఎర్పడుతుందేమోనన్న భయంతో తను అలాగ చెప్పడానికి లేకపోయింది. ఇంతకీ పరిస్థితుల్ననుసరించి తప్పనిసరిగా నడుచుకు పోవాల్సున్న ఈ విధానాలకి ఎవరు మాత్రం ఏం చెయ్య గలరని.
పాపం రాధని గురించి, ఏదో అపార్ధం చేసుకున్నానే గాని ఏదో కొంచెం గర్వ స్వభావం తప్పితే ఈ విషయం లో ఆవిణ్ణి అపార్ధం చేసుకుందుకు లేదు. ఎందుకంటె తనకన్ని విధాలా నచ్చిన వో యువకుణ్ణి , తను పెళ్లి చేసుకోవాలని అనుకోవడమూ తప్పు పని కాదు. వివరం తెలిసిన ఒక యువతి , అందుకోసరం ప్రయత్నించడం అన్నది అంతకన్నా తప్పు కాదు. ఇక ఈ మధ్య రాధ ప్రవర్తనని గురించా! ఒకపని తనకెంతో సుళువు అనుకునీ, అది సాధించలేక పోయినప్పుడు ఇటువంటి ద్వేషం ప్రారంభమవడం సాధారణ మనస్తత్వాలు గలవారందరి లోనూ కల్గే మార్పే ఇది . అందులో ఆశ్చర్య మేమిటంటే , అటువంటి వారికి ఎంత త్వరగా ఆ ద్వేషం పెరుగుకోస్తుందో, అంతే త్వరగానూ ఏదో ఒక చిన్న కారణం గా పశ్చాత్తాపమూ , కలిగి పోతుంది. రాధా ఇప్పుడా ఆఖరి స్థితికే వచ్చినట్టుంది పాపం. అందుకే తను చెప్పాల్సున్న రెండు మాటలూ ఇంటి వద్దే చెప్పేసి మరీ బయల్దేరాడు తను- ఇలాంటి ఆలోచన్ల తో చాలాసేపు అలాగే కూర్చునుండి అర్ధరాత్రి పైన నిద్రపోయాడు రఘు.
రఘు ఉత్తరం చూడగానే ఆనందిస్తూ ఈ విషయాన్ని ఇంట్లో వారందరికీ చెప్పారు శర్మ గారు.
'అంతా ఆ పరాషకి లలితాంబికదయ, అయినా నా రఘు నిజంగా ఆ రఘురామ చంద్రుని అవతారమే?' అన్నారు ఆనందంతో పరవశవులౌతూ పార్వతమ్మ గారు.
'అన్ని విధాలా దురదృష్టవంతు రాల్నే.' అని బాధపడే దాన్ని గాని, ఆ దయామయి నా యందు దయ చూపిందోదినా , ఆ దయే ఇలా రఘు రూపం తో... నాకెంతటి భాగ్యాన్ని చేకూరుస్తా! మరి రఘు వంటి అల్లుడు దొరకడం అంటే సామాన్యమా వదినా' అంది ఆనంద భాష్పాలరాలుస్తూ , జానకి.
'మీరు నమ్మినా సరే మానేసినా సరే కానీ రఘు చివరికిలా చేసే తీరతాడన్నది నాకెప్పుడో తెల్సునర్రా. అయినా, ఆదర్శ నీయుడూ, లక్షల్లో ఒకడిగా ఎంచవలసిన వాడూనూ మన రఘు. భేష్. 'లక్ష్యం ' నిలబెట్టు కోవడం' అంటే అలా వుండాలి' అన్నాడు సంతోషం పట్టలేక పచార్లు చేస్తూ రామం.
ఇక సుధ సంగతి చెప్పనే అవసరం లేదు. బావ నోటివెంటే ఈ మాట విన్నప్పట్నుంచీ లోలోపలే మాత్రమే ఆనందిస్తున్న సుధ, ఇప్పుడందరి తో పాటూ ప్రత్యక్ష్యంగానే అందులో పాలు పంచుకుంది.
అందర్నీ తలోమారు మార్చి , మార్చి చూస్తూ నిల్చున్న వేణు అందరి భావాల్తోనూ తనూ ఏకీభవించి, ఆనందించసాగాడు. అందుకు తోడూ ఎప్పుడూ సుధని ఎందుకో ఒకదానికి అల్లరి పెడుతుండే వేణు ఇక ఇప్పుడు చెప్పాలా! 'ఏమండోయ్? వదినే గారూ , ఏవండోయి?' అంటూ తనొక 'ఎం.ఎ' స్టూడెంట్ నన్న మాట కూడా మరిచి సుధని అల్లరి పెట్టసాగాడు. అందుకు తోడు శాంత కూడా. అతనికి మాట సాయం పడుతూండేది. ఇలా ఇంట్లో వారందరి కీ రఘు నిశ్చయం అమితానందాన్ని కల్గించడం వల్ల, అతను రాసిన పద్దతిలో అమిత వేగంగా పెళ్లి పనులు జరగ నారంభించాయి. ఆ మధ్యలో సుదకి మొదటి సంవత్సరం పరీక్షలు జరిగిపోయాయి. అంటే మధ్యలో ఒకసారి వచ్చి రెండు రోజులు మాత్రమే వుండి వెళ్ళిన రఘు మళ్లీ ఆరు నెలల తరవాత ఇప్పుడోస్తున్నాడన్నమాట.
ఎప్పుడూ అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చే రఘు రాక ఈసారి బ్రహ్మానందానిచ్చింది. అయితే ఎప్పుడూ వచ్చీ రాక ముందే, 'బావా? ' అంటూ అందరి కన్నా ముందుగా తనే వచ్చే సుధ మాత్రం ఈసారి ఎక్కడా కంట పడకుండా తప్పించుకు రిరుగుతుండడం రఘు కి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కల్గించింది. కిందటి సారి తను వచ్చినప్పుడు ఇంకా అందర్లా గా నడవలేక కొంచెం నెట్టు తుండే సుధ ఈసారి లేడి పిల్ల లాగ చెంగు చెంగున పరుగులెత్తడం చూసి అతని మనసు ఉరకలు వేస్తుంది. సంతోషం వల్ల, గావల్ను మొహం లో మంచి కళ వచ్చి ఆరోగ్యంతో శరీరానికి మంచి ఛాయ కూడా వచ్చింది సుదకి.
'పరీక్ష లేలా రాశావ్ సుధా?' తను స్నానానికి వెళ్తూ స్నానాల గదిలో తువ్వాలూ వగైరా లనుంచి వస్తూన్న సుధకి దారి అడ్డగిస్తూ అడిగాడు రఘు.
'బాగానే రాశా' తలొంచుకుని కాలి బొటన వేలితో నేలమీద గీస్తూ అంది సుధ.
'ఇదేక్కడ కొనుక్కోచ్చావ్'
'ఏదీ?' ఎవిటన్నట్టుగా మొహమేత్తి చూసింది.
'ఇదే, ఈ సిగ్గుని' ప్రేమతో సుధ కళ్ళల్లోకి చూశాడు రఘు.
'హు' నవ్వుతూ తప్పించుకు పారిపోబోయింది సుధ.
'ఎవరన్నా మామూలు వాళ్ళు సిగ్గు పడ్డా చదువుకునే వాళ్లు సిగ్గుపడరు, నీ దంతా తల్లకిందులో కంగా వుందే?' అన్నాడు సుధ నడ్డగిస్తూ.
'అవును కాని నా పెద్ద ఉత్తరం అందిందా.'
'ఆ. అన్ని పేజీల ఉత్తరమేమిటి అక్కయ్యా వాళ్ళంతా అక్షేపించెందుగ్గాని' తలోంచుకునే మెల్లిగా అంది.
.మరి ఆ ఉత్తరం ఎన్నెన్ని ముఖ్యమైన సంగతుల్ని మోసుకొచ్చింది నీకోసరం '
'...'
'ఉష్ ఎందుకలా పరుగులెత్తుతావ్, ఈ ఒక్క మాటా విని వెళ్లు .' తప్పించుకుపోతున్న సుధని పిల్చాడు రఘు.
'ఏమిటి?'
'అందులోని షరతు లన్నింట్ల కీ రాణీ గారు సమ్మతించినట్టేనా'
'నిరభ్యంతరంగా , ఇక వెళ్ళొచ్చా' అంటూనే ఒక్క పరుగు తీసింది సుధ. నవ్వుకుంటూ తనూ స్నానానికి వెళ్ళిపోయాడు రఘు. మరొకటి రెండు మార్లు రఘు మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుకే పాటీ అవకాశం ఇవ్వలేదు సుధ.
