Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 35


    ఇలా అనుకోగానే ఫిజోకి ముచ్చెమటలు పోసినాయి. భయంభయంగా గుహలో నాలుగు దిక్కులను చూచాడు. కాని అర్ధమానవుడున్న అలికిడి అయినా విన్పించలేదు.
    ఫిజో మంచం దగ్గరగా వెళ్ళి మాలతిని నిద్రలేపాడు. ఆమె ఉలికిపడి కనులు విప్పి చూచింది. ఫిజో కన్పించాడు కాని అర్ధమానవుడు కన్పించలేదు.
    కంగారు పడిపోయి మంచం మీద నుంచి దుమికినట్లుగా క్రిందికి దిగిందామె.
    "ఫిజో నువ్వెందుకొచ్చావు?" అని అడిగింది దిక్కుల వంక భయంగా చూస్తూ! ఫిజో ఒకడుగు వెనుకకు వేశాడు.
    "కెప్టెన్! నీమీద విశ్వాసంతోనే వచ్చాను. అయినా అర్ధ మానవుడు ఏమయినట్లు" అని అడిగాడు. ఇద్దరూ కలిసి అర్ధమానవుడి కోసం అన్వేషణ ప్ర్రారంభించారు. గుహలోపలా వెలుపలా ఎక్కడా అతడు కన్పించలేదు-
    ఎక్కడకు పోయాడో ఊహించేందుకు రవంత ఆధారమయినా దొరకలేదు. ఒకవేళ అతడు ఇది ప్రమాదకరమయిన చోటుగా భావించి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినాడా? అని అనుమానించింది మాలతి.
    ఒకవేళ అదే యదార్ధమయితే ఇన్నినాళ్ళు తాము ప్రదర్శించిన ఓర్పు, పడిన కష్టాలూ అన్నీ వృధా అవుతాయి. చివరకు సాధించగలిగింది సున్నాయే అవుతుంది.
    అర్ధమానవుడి కోసం అన్వేషిస్తూ ఉంటే ఒకమూల తల్లిని కోల్పోయి దీనంగా నిలదీస్తున్న పులిపిల్లలు కన్పించినాయి. వాటిరోదనధ్వనులు విని జాలిపడ్డ మాలతి వాటిని తన చేతుల్లోకి తీసుకుంది.
    అర్ధమానవుడేమయినాడు? అన్నది పెద్ద ప్రశ్నార్ధకంలా అయింది. ఒక వంక పులిపిల్లలు బ్రతుకుతాయో లేదో అర్ధంకాని పరిస్థితి ఎదురు అయింది. వాటికి తల్లిలేని దిగులు ఒకటి! తల్లి పాలు అందక పోవటంనించి ఆకలిబాధ ఒకటి. అందునించి అని తోటకూరకాడలు పీకివేసింతరువాత వ్రేలాడబడిపోయినట్లుగా వ్రేలాడసాగినాయి. వాటిని సముదాయించటం మాలతి ఒక పని అయింది. ఆ పనిలో పడింది మాలతి.
    ఫిజో చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నీ పరిశీలించాడు. ఎక్కడా అర్ధమానవుడి జాడతెలియరాలేదు. అతడు ఆ ప్ర్రాంతాలను ఒదిలి వెళ్ళిపోయినాడేమో అన్న అనుమానం కల్గింది. కాని అతడు పులిపంజా దెబ్బలనించి క్షతగాత్రుడు.
    స్పృహ తప్పి పడిపోయినాడు. స్పృహ రాగానే ఎలా వెళ్ళిపోగలడు? ఎంత దూరం వెళ్ళగలడు? అని అనుమానించిన ఫిజో వెదికిన చోటునే తిరిగి వెదకటం ప్ర్రారంభించాడు.
    చాలసేపు వెదికిన తరువాత అతడు నిరాశతో తిరిగి వచ్చాడు. మాలతి నిర్వీన్నురాలయింది. ఆమె అప్పటికే పులి పిల్లలతో సతమతమవుతోంది.
    అవి ఏ క్షణంలో అయినా పారిపోవచ్చు. ప్రాణాలు కోల్పోవచ్చు అన్నట్టుగా ఉన్నాయి. గాయపడి కదలలేని స్థితిలో ఉన్న అర్ధమానవుడు ఏమయినా డన్నది మరొక సమస్య కావటంలో ఆమె మనసు మొద్దుబారిపోయింది.
    పులిపిల్లలు ఆగడం మరింత అయింది. ఒకటి ఓ వంకకూ మరొకటి మరొకవంకకూ పరుగు తీస్తున్నాయి. వాటిని పట్టలేక సతమతమవుతున్న మాలతి విసుక్కుంది.
    ఓ పులిపిల్లను సముదాయిస్తుఉండగా మరొకటి అలా అలా ఓ మూలకు వెళ్లి అలాగే మాయమయింది పులిపిల్ల కూడా కనిపించక పోవటంతో మాలతికి అనుమానం అధికాధికమయింది. అక్కడే ఏవో రహస్యమయిన దారులున్నాయి అనిపించిందామెకు.
    అర్ధమానవుడు కూడా అదే దారిన అంతర్దానమయి వాడని ఊహించిందామె.
    వెంటనే ఆదారి ఏదో కనుక్కుని రావాలని గుహ లోపలేఅన్వేషణ మొదలుపెట్టింది. అన్ని వంకలా రాతినేల చదునుగానే ఉంది. ఒక వంక మాత్రం ఒక రాతి పలకమీద వర్తులంగా రంధ్రాలున్నాయి.
    బాగా పరిశీలిస్తే అది నలుచదరంగా ఆరడుగులపోదవున రెండడుగులు వెడల్పుగ చిన్నపలక అని తేలిపోయింది. నాలుగు దిక్కులా దాని అంచులు కన్పించినాయి అటువంటి చోటున అటువంటి వస్తువు కన్పించినందుకు అమితాశ్చర్యపడి పోయింది మాలతి.
    తిరిగి వచ్చి ఆలోచనల మధ్య మునిగి మౌనంగా ఉండి పోయిన ఫిజోని సాయం పిలిచింది.
    ఇద్దరూ కలిసి ఆ పలకను తొలగించారు. లోపలకన్పించిన దృశ్యం చూచి యిద్దరూ విభ్రాంతులయినారు.
    అది మూడు అడుగుల లోతున్న రాతితొట్టి, ఒక పెద్ద రాతిలో తొలిచిన తొట్టి అది. మూడు అడుగుల లోతు రెండు అడుగుల వెడల్పు. ఆరు అడుగుల పొడవు వుంది అది మనుషులు తలదాచుకునేందుకు వీలుగా తయారుచేసి ఉంచినదని చూడగానే తెలుస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS