"అమ్మో! నారాయణ.....నారాయణ.....నేను బ్రహ్మచారిని."
"విప్పే వరకూ అందరూ బ్రహ్మచారులే సార్....ఆ మాటకొస్తే మా అమ్మకు పెళ్ళి కాలేదు. మా నాన్న బ్రహ్మచారి, మా బామ్మకు పెళ్ళి కాలేదు , మా తాత బ్రహ్మచారి.....నాకు పెళ్ళి కాలేదు.....నా మొగుడు బ్రహ్మచారి...." అంది గడుసుగా ఓ అమ్మాయి నారదుడి చొక్కా గుండి విప్పుతూ.
"నారాయణ.....నారాయణ....." అంటూ కళ్ళు మూసుకున్నాడు.
"ఏంటో....అందమైన అమ్మాయిలను పట్టుకుని 'నారాయణ' అంటాడి చాదస్తపు మగాడు....." అనుకున్నారిద్దరూ అమ్మాయిలు.
పది నిమిషాల్లో నారదుడికి మసాజ్ ప్రారంభమైంది.
* * *
"ఆహా....ఓహొ! ఆహాహా.....ఓహొహొ....." యమధర్మరాజు తన్మయత్వంగా కళ్ళు మూసుకున్నాడు.
ఇద్దరమ్మాయిలు అతనికి మసాజ్ చేస్తున్నారు.
"వాహ్! ఇది వీపు కాదు.....ప్యారడైజ్ చౌరస్తా....." అంది ఓ అమ్మాయి.
"కాదు.....గండిపేట చెరవు" అంది మరో అమ్మాయి.
"ఇవి కండలు కావు" అందో అమ్మాయి.
"కావు.....ఐరన్ బాడీ పార్ట్స్" అంది ఇంకో అమ్మాయి.
యమధర్మరాజు మాత్రం ఆనందంగా మసాజ్ చేయించుకుంటున్నాడు.
"ముద్దుగుమ్మలూ....మీరిద్దరూ నాతొ పాటు నరకలోకమునకు రండు.....మీకు కావలసిన భోగభాగ్యములు సమస్తమూ అమర్చుతా....." అన్నాడు యమధర్మరాజు.
"నరకలోకమా.....అదెక్కడ?" ఇద్దరూ కనుబొమ్మలు ముడేసి అడిగారు.
"ఆ మాత్రం తెలియదా? నేను నరకలోకాదిపతిని యమధర్మరాజును" అన్నాడు.
ఇద్దరమ్మయిలకు భయం పట్టుకుంది.
"ఏంటే ....ఇలా మాట్లాడుతున్నాడు....కొంపదీసి స్క్రులుజు కేసు కాదు కదా?" అందో అమ్మాయి.
"ఏమోనే.....తల దగ్గర ఈ గద ఒకటి....." అంటూ కోపంతో కాలితో తన్నింది మరో అమ్మాయి ఆ గదని.
"ఫట్ మని కాలికి దెబ్బ తగిలింది.
"ఇదేంటి ....అంత బలంగా తన్నినా ఒక్క ఇంచు కూడా కదల్లేదు గద....' అంది భయంగా.
'అబ్బ....నికన్ని అనుమానాలే......" అంటూ మరో అమ్మాయి గదని చేతిలోకి తిసుకోబోయింది.
కానీ, అంగుళం కూడా జరగలేదు.
ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.
యమధర్మరాజు లేచి......
"హమ్మయ్య.....సమ్మగా యున్నది. సుఖీభవ....సుఖీభవ...." అన్నాడు.
సరిగ్గా అప్పుడే విజిల్స్ వినిపించాయి.
బూట్ల టకటక శబ్దాలు వినిపించాయి.
"పోలీసులు....పొలిసులోస్తున్నారు....పారిపోండి" ఎవరో కేకేస్తున్నారు.
నారదుడు భయపడిపోయి పక్కగదిలో నుంచి యమధర్మరాజు దగ్గరికి పరుగెత్తుకొచ్చాడు.
అమ్మాయిలు దొడ్డిదారి గుండా పారిపోయారు.
ఈలోగా కానిస్టేబుళ్లు యమధర్మరాజు వున్న గదిలోకి వచ్చారు. అండర్ వేర్ తో వున్న ఆ ఇద్దర్ని చూసి.....ఆ యస్సాయ్....." చెప్పండి...ఆ అమ్మయిలేరి?? మీరే తప్పించారా?" అని అడిగాడు.
"అనగానేమి?" యమధర్మరాజు కోపంగా అడిగాడు.
"ఆహా! అనగానేమి చెప్పాలా? నడు....బే....స్టేషన్ కు. హమ్మ....ఈ ఇన్స్ పెక్టర్ చండశానన్రావ్ దగ్గరా మీ వేషాలు.....అప్పుడే అనుకున్నా....మసాజ్ సెంటర్ పేరుతో బ్రోతల్ హౌస్ నడిపిస్తారా? ఈ సెంటర్ మీ స్వంతమా?"
యమధర్మరాజుకు కోపం రెట్టింపయింది.
గద చేతిలోకి తీసుకున్నాడు.
నారదుడు వారించి, ఇన్స్ పెక్టర్ దగ్గరికి వచ్చి.....
"నారాయణ....నారాయణ .....మీరు అపార్ధం చేసుకొనుచున్నారు. మా ఒళ్లు పులిసి , నొప్పులతో యున్నవని......ఇక్కడికి వచ్చితిమి. ఇద్దరేసి భామల చొప్పున మాకు మసాజ్ చేసి ఉన్నారు" అంటూ చెప్పాడు.
"అలాగా! ఒక్కొక్కరికి ఇద్దరు కావాల్సి వచ్చారా? ఏంటి? వయాగ్రా వేసుకుని వచ్చారా?" అడిగాడు ఇన్స్ పెక్టర్.
"రక్షణాధికారి ! మాటలు మీరుచుంటిరి. నా గదకు పని కల్పించవద్దు" అన్నాడు యమధర్మరాజు.
"వీళ్ళిద్దర్నీ జీపులో పడేసి, లాకప్ లో తోయండి. రాత్రిపూట మన ఆతిధ్యం రుచి చూపిద్దాం" అంటూ కానిస్టేబుళ్ళకు ఆర్డర్ పాస్ చేశాడు. ఇన్స్ పెక్టర్.
నారదుడు అవేశాపడవద్దని యముడ్ని వారించాడు. కానిస్టేబుళ్లు ఆ ఇద్దర్ని జీపులో ఎక్కించారు దౌర్జన్యంగా.
* * *
ఆ రోజు ఆదివారం
సాయంత్రం ఐదు గంటలయింది కానీ, సత్తిపండు విజిల్ ఇంకా వినపడ్డం లేదని హడావుడి పడిపోతున్నాడు శ్రీచంద్ర.
"ఏం రోగమొచ్చింది వీడికి. ఇంకా రాలేదు" పదేపదే అనుకోసాగాడు.
ఆరు గంటలవుతున్నా సత్తిపండు రాలేదు.
ఏం తోచక లుంబిని పార్క్ బయల్దేరాడు శ్రీచంద్ర. సమీర ఇంటికి వెళ్దామంటే తనకి ఈ రోజు షూటింగ్ ఉందని చెప్పింది.
ఒక్కడే లుంబిని పార్క్ బయలుదేరాడు.
సత్తిపండు, తనూ ఎప్పుడూ కూర్చునే ప్లేస్ లో కూర్చున్నాడు. రకరకాల జంటలతో కలర్ పుల్ గా వుంది లుంబిని పార్క్. శ్రీచంద్ర కూర్చున్న ప్లేస్ కొంచెం దూరంలో వున్న పొదల దగ్గరనుండి మాటలు క్లియర్ గా వినపడుతున్నాయి శ్రీచంద్రకు.
"లామెశ్వరి......లామేశ్వరి......ఈరోజు నువ్వెంతో అందంగా వున్నావ్. ఎందుకంటావ్?"
ఆ చివరి మాటతో పొదల మాటున వున్నది సత్తిపండని అర్ధమైపోయింది శ్రీచంద్రకు.
"ఓర్నీ! తన దగ్గరకు రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు? పైగా అందంగా వున్నావంటున్నాడు. ఎవర్నైనా లైనులో పెట్టాడా ఏంటి? వీడికి తనకి తెలియని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? అనుకుంటూ, ఆ పొద దగ్గరగా వెళ్లి నిలబడి....."హలో! కాస్త బయటకొస్తావా సత్తిపండు......" అన్నాడు వెటకారంగా.
"ఇక్కడ ఏ పండు లేడండి....." అన్నాడు పొదల్లో వున్న సత్తిపండు.
శ్రీచంద్రకు పూర్తిగా డౌట్ క్లియర్ అయిపొయింది. ఆ 'టోన్' ఖచ్చితంగా సత్తిపండుదే.
"లోపల నుంచి బయటికి రా సత్తిపండు......" అని అరిచాడు శ్రీచంద్ర.
"లోపలేవరు లేరు గానీ నువ్వేళ్ళవయ్యా....."
