Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 34

 

    "వారు స్వర్గలోకమున అప్సరసల మాదిరి ఉందురా?" హుషారుగా అడిగాడు యమధర్మరాజు.


    "వాళ్ళమ్మ మాదిరి వుందురు."


    "వాళ్ళమ్మ మాదిరి అనిన వృద్దులా? వాళ్ళోద్దు"


    "అయ్యో! అతిశయోక్తి కోసం వాడిన పదమది. అప్సరాంగులను మించి వుందురక్కడ. ఒక్కసారి దర్శించిన మీకే తెలియును."


    "అటులైన అలస్యమేల.....పద"


    "ఈ వేషమున వెళ్ళిన పగటి వేషగాళ్ళు అని గేలిచేయుదురు.....మానవుల మాదిరిగా వెళ్దాం....మనకును సుఖంగా వుండును" నారదుడు సలహా ఇచ్చాడు.


    యమధర్మరాజు 'సరే' నని కళ్ళు మూసుకుని "యమాయమః" అన్నాడు వెంటనే యమధర్మరాజు గెటప్ ప్యాంట్, షర్ట్ లోకి మారింది. నారదుడు కూడా ప్యాంటు, షర్టులోకి మారిపోయాడు.


    "మన వేషములు కడు విచిత్రంగా, బహుసుందరంగా వున్నవి" అన్నాడు యమధర్మరాజు.


    "అవునవును....." అంటూ ముందుకు కదిలాడు నారదుడు. సెవన్ హెవెన్ మసాజ్ సెంటర్ వైపు అతని అడుగులు పడ్డాయి.


    
                                                                 * * *


    "వెల్ కామ్.....వెల్ కమ్......వెల్ కమ్......"


    మసాజ్ సెంటర్ గుమ్మంలోకి అడుగుపెట్టగానే శాల్తి పళ్లన్నీ బయటకు కనిపించేలా యికిలించి ఆహ్వానించాడు.


    "ఇన్నిసార్లు చెప్పాలా వెల్ కమ్?" యమధర్మరాజుకి మండుకొచ్చింది.


    హాలులోకి వెళ్లారు. కుడివైపు ఓ కౌంటర్ వుంది. దాని వెనుక ఓ యాభైయేళ్ళ లేడి వుంది. ఓవర్ మేకప్ తో తన అందాన్ని మినిమమ్ ఓ ముప్పయ్యేళ్ళయినా తగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉంది.


    రెండు జడలు వేసుకుని వుంది.


    యమధర్మరాజును, నారదుడ్ని చూడగానే లేచి, మొహమంతా నవ్వు పులుముకుని.....

 

    "రండి సార్....రండి....మా మసాజ్ సెంటర్ మీ రాకతో పావనమైంది. అయియే సాబ్. అయియే...ప్లీజ్.....అయియే సార్....." అన్నీ భాషల్లోనూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ఆహ్వానించింది.


    గత వారం రోజులుగా వచ్చిన మొట్టమొదటి గిరాకి అది. అందుకే అంత అనందం!


    "యముండ" అంటూ మీసాల మీద చేయెసి దర్పంగా అనబోయాడు.


    "యముండ ప్రభూ! మీరా పదం పదేపదే వల్లె వేసిన మానవులకు అనుమానం వచ్చి, మన పని బెడిసికొట్టును. ఆ దర్పమును, యముండ అన్న పదమును పక్కన పెట్టి, సుందరాంగులతో సరస సల్లాపములకి సిద్దం కండు" అన్నాడు నారదుడు.


    యమధర్మరాజు నారదుడి వంక గుర్రుగా చూసి.....


    "అటులనే" అన్నాడు కినుకుగా!

 

                                                                 * * *


    "చెప్పండి సార్లూ.....మీకే టైపు మసాజ్ కావాలి.....ఆఫ్ మసాజా, పుల్ మసాజా? పతివ్రతా టైపా? వాంప్ టైపా? క్యాబరే గడగడా తన దగ్గరున్న మసాజ్ ల లిస్టు చెబుతూ అడుగుతోంది ఆ లేడి.


    
    "ఇన్ని రకములా?" యముడు ఆశ్చర్యపోయాడు.


    "అవునవును. ఆఫ్ మసాజ్ అంటే తల, వీపు, చేతులు, పుల్ మసాజ్ అంటే టోటల్ బాడీ.... పతివ్రతా టైప్ అంటే నిండుగా చీర కట్టుకుని చేసే మసాజ్, వాంప్ టైపంటే ప్యాంటి, బ్రాతో చేసే మసాజ్, క్యాబరే అంటే......." అని కిసుక్కున నవ్వింది ఆ లేడి.

 

    "ఎందుకలా నవ్వుతావు? నా గదతో ఒక్కటిమ్మంటావా?" కోపంగా అడిగాడు తన గదిని చూపుతూ.


    
    అప్పుడు గమనించిందామే.....అతని చేతిలోని గదను, కానీ అది అతని దగ్గరెందుకు వుందో? అర్ధమవ్వలేదు.


    భయంగా ఎదురుగా వున్న క్యాలెండర్ వైపు చూపించింది. ఓ చిన్న పాప.....నేకేడ్ గా వుంది.


    "అంత చిన్న పాప చేత చేయిస్తారా?" ఆశ్చర్యంగా అడిగాడు యమధర్మరాజు.


    తల పట్టుకుని అన్నాడు నారదుడు లో గొంతుకతో......"ఆవిడ వుద్దేశ్యం అలా అమ్మాయిలు దిగంబమర్చి చెప్పాడు.


    "ఔరా! మానవుల దగ్గర ఎన్ని విద్యలు కలవు?" అంటూ ముక్కు మీద వేలేసుకున్నాడు.


    "ఏంటి ముక్కు మీద వేలేసుకున్నారు. నన్ను గోకమంటారా?" మర్యాద కోసం అడిగిందా పార్లర్ ఓనర్ యముడి ముక్కు గోకడానికి సిద్దపడుతూ.


    ఆవిడకు అతి వినయము ఎక్కువ.


    "మేము ఆశ్చ్యమునకు లోనైనప్పుడు ముక్కుపై వేలేసుకుంటాము. దురద వేసి కాదు....." ఉక్రోషంగా అన్నాడు యమధర్మరాజు.


    "సమవర్తి.....వచ్చిన పని మరిచి, వృధా వాదన లేల.....పని కానిండు"


    "అటులనే....." అంటూ అడుగు ముందుకేశాడు.


    "రంభా......ఊర్వశి....మేనకా....తిలోత్తమా....." అంటూ కేకేసింది ఆ పార్లర్ ఓనర్.


    'అదేమీ....స్వర్గం నుంచి ఆ నర్తకీమణులు ఇక్కడికి వచ్చి యున్నారా?" యమధర్మరాజు అడిగాడు.


    "అవును....పార్ట్ టైం జాబ్ చేసుకుందామని" నారదుడు కోపంగా అన్నాడు.


    నలుగురమ్మాయిలు వచ్చి వరుసగా నిలబడ్డారు. షార్ట్స్ లో ఉన్నారంతా.


    "ముద్దుగుమ్మలు భలే వున్నారు" యముడు అన్నాడు ఆనందంతో.


    "థాయిలాండ్ లో మసాజ్ చేసే అమ్మాయిలు మరింత అందంగా వుంటారు తెల్సా?" హుషారుగాఅన్నాడు నారదుడు.


    "అవునా నారదా? మరి ఇంకేం? రేపు వెళ్దాం అక్కడికి కూడా" అన్నాడు.


    "అక్కడికి చాలా కష్టం ప్రభూ! వీసా , పాస్ పోర్టు వగైరాలన్నీ వుండాలి. అవన్నీ కావాలంటే డేటాఫ్ బర్త్ సర్టిఫికేట్ , రేషన్ కార్డు, అవన్నీ కావాలి. పాస్ పోర్టు కోసం రెండు నెలలు ఆగాలి. థాయిలాండ్ కి తర్వాత వెళ్దాం కానీ....యిప్పుడు అలస్యమేల....ముందు పని కానివ్వండి సమవర్తి....." అన్నాడు నారదుడు.


    ఇద్దర్ని చెరో గదిలోకి తీసుకెళ్ళారు.

 

                                                              * * *


    
    రంగు రంగుల డిస్కో లైట్స్ వెలిగి అరిపోతున్నాయి. మత్తెక్కించేలా ఇంగ్లీషు మ్యూజిక్ స్టిరియోలో నుంచి లో వాయిస్ లో వస్తోంది. ఓ గదిలోకి నారదుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు ఆ ఇద్దరమ్మాయిలు.


    "విప్పండి సార్....." అన్నారు ఇద్దరమ్మాయిలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS