31. కాలు బొటన వేలీలో వచ్చే అమితమైన నొప్పె 'గౌటు' జబ్బు
రాజ్య తండ్రి గుర్తుకు రాగానే కళ్ళ నీళ్ళు గిర్రున తిరుగుటాయి. రాజ్య తండ్రికి విచిత్రమైన జబ్బు వుండేది. చివరకి ఆ బాధల తోనే అతను కన్ను మూశాడు. తండ్రి చనిపోయిన దగ్గరనుంచీ రాజయ్య కి తాగుడు అలవాటు అయింది. తాగుడుతో బాధలను మరచిపోదామానుకున్న రాజ్య కి ఆ తాగుడు వల్లనే తండ్రికి వచ్చిన జబ్బే వచ్చి మరింత మనస్సుని కల్లోల పరుస్తోంది. ఈ జబ్బు ముఖ్యంగా రాత్రిపూటే కనబడి అతనిని మరింత పిచ్చివాడిని చేస్తోంది.
రాజయ్యకిగాని, అతని తండ్రికిగాని వచ్చిన జబ్బు "గౌట్స్" అంటారు. ఈ వ్యాధి ఎక్కువ మందిలో వంశపరంపర్యంగా వస్తుంది. "గౌటు" వ్యాధి వచ్చినవారిలో అకస్మాత్తుగా కలి బొటన వేలుతో రాత్రి నిద్రలో మోదలవవుతోంది. ఆ నెప్పి రావడంతో నిద్రాభంగం కూడా కలుగుతుంది. కొద్ది గంటలల్లో నొప్పి అనిపించిన వేలు ఎర్రబడుతుంది. వాచినచోట రక్తనాళాలు కూడా ఉబ్బుతాయి_దాంతో కాలు కదపాలంటేనే భరించలేని బాధ కలుగుతుంది.
పాదానికి సంభందించిన అన్ని వెళ్ళు ఇలా వాయవు. కేవలం కలిబొటనవేలు ఒక్కటే వాస్తుంది. కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోవేలుకు చీము పట్టిందేమోనని భావించి పెన్సిలిన్ బిళ్ళలు మింగే వాళ్ళూ లకపావులేదు. కొద్దిరోజుల్లో ఆ నొప్పి తగ్గినట్లు అనిపించినా మరి కొన్ని రోజుల్లోమళ్ళీ బాధ, వాపు ప్రారంభం అవుతాయి.
కాలి బొటనవేలు వాయడానికి, భరించలేని నొప్పి కలగడానికి చీము పట్టడం కానేకాదు. మాంసకృత్తులలో ముఖ్యమైన ప్యూరిన్ మెటాబలిజమ్ లో లోపమే ఇందుకు కారణం. ఇటువంటి లోపంవల్ల ముఖ్యంగా కాలిబొటన వేలు దగ్గర యూరేత్స్ పేరుకుంతాయి. దాంతో బొటనవ్రేలు దగ్గర టిష్యూలు రాగాగ్రస్తం అవుతాయి. రక్తంలో యూరిక్ యాసిడ్ శతం పెరుగుతుంది. అధికశతం కేసులలో కాలి బొటనవ్రేలు ఒక్కటే వాచినా కొన్ని కేసుల్లో మాత్రం కళ్ళు_ చేతులకి సంభందించిన ఇతర కీళ్ళు కూడా వాస్తాయి. ఆ బాధను కూడా మనం భరించలేము.
కీలువాపు ఒకసారి తగ్గిపోవడం కాక మతి మాటికి రావడం_ పోవడం ఉంటుంది. ఇలాంటి కీళ్ళవ్యాధి స్రీలలో చాలా అరుదు. అంటే కాకా 80శాతం కేసుల్లో తండ్రి నుంచి కొడుకుకి ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
"గౌటు" వ్యాధి వచ్చే అవకాశం వున్నవాళ్ళు ప్యూరిన్ ఎక్కువగా వుందే తియ్యని రొట్టె కార్జం, మూత్రపిండాలు, మెదడు, కాలేయం, కొవ్వు వుండే చేపలు, మాంసం తినకూడదు. ఇవి తిన్నట్లయితే వెంటనే స్కాచ్, వైన్స్ వంటి మాదక ద్రవ్యాలు హుషారు కోసం, ఆనందకరమయిన అనుభూతి కోసం సేవించినా కీలువాపు వచ్చి మనం కొనుకున్నా ఆనుభూతిని కొండెక్కించేస్తుంది. అందువల్ల ఈ వ్యాధి వచ్చేవారు ఆహారంలో అలవాట్లుతో చాలా జాగ్రాత్తగా వుండాలి లేకపోతే కీళ్ళవాపులు తరుచుగా బయటపడతుంటాయి.
ఈ వ్యాధి తరచూ రావడంతో కాలి బొటనవేలు దెబ్బ తినడమే కాకుండా, వెళ్ళు, కాలిమడమ, చేతి మణికట్టు కూడా దెబ్బతింటాయి. అలాగే మోకాలు, మోచేయి, తుంటి, గూడకి సంభందించిన కీళ్ళుకూడా. ఆ కీళ్ళ దగ్గర ఉండే ఎముకులు వ్యాధి గ్రస్తం అవుతాయి. ఎక్కువమందిలో కనబడకపోయినా వ్యాధి ముదిరితే మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితి మరింత ప్రమాదకరం.
ఈ వ్యాధి లక్షణాలు కనబడినప్పుడు వారి రక్తంలో యూరిక్ యాసిడ్ శాతం 9మీల్లీ గ్రాముల కంటె మించి వుంటుంది. అందువల్ల "గౌటు" వ్యాధి ఉన్నవారు ఎప్పుడూ రక్తంలో యూరిక్ యాసిడ్ శతం పెరగకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఆహారం పట్ల జాగ్రత్తగా వుండాలి,. వ్యాధి లక్షణాలు బయట పాడినప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. డాక్టరు చెప్పినట్లు మందులు వాడాలి.
****
