30 .శబ్దం కాలుష్యం_ చెవుడు!
"డాక్టర్. మా అమ్మాయికి సంవత్సరం నిండింది కాని, చప్పట్లు కొట్టినా, ఇంకా పెద్ద శబ్దం చేసినా తల పక్కకి తిప్పడంలేదు. కొంపదీసి చెముడు రాలేదు కదా" అని అడిగింది తల్లి. దకత్రు పరీక్షచేసి, "మీరనుకున్నట్లుగానేమీ చంటిబాబుకి చెముడుఉండమ్మా" అన్నాడు. మీరు ఏమ్మంతున్నారు? కాస్త గట్టిగా చెప్పండి." అంటూ డాక్టరు వైపుకి తన చెవి తిప్పిందామె. మీకూ చెవుడు ఉండా?" అని ఆశ్చర్యంగా అడిగాడు డాక్టరు "ఏమోనండి ఇదివరకు బాగానే వినబడేది. ఇంట్లో రణగోన ద్వని, వీధిలోని బస్సులు, మైకుల రొదతో నాకు కూడా చెవుడు వచ్చేసినట్లుంది" అన్నాదా తల్లి.
నిజమే మరి కొందరికి పుట్టుకుతోనో, కొన్ని వ్యాధుల వల్లనో, వాటికీ వాడిన మందువల్లనో చెముడు వస్తే, మరికొందరికి ఈ యాంత్రిక యుగంలో ఫ్యాక్టరీల శబ్దం, బస్సు హరన్ ళ మోత, ఎదతెరపిలేని లౌడ్స్పీకర్ల గోళ, ఇతరత్రా ఉత్పత్తి అయ్యే శబ్ద కాలుష్యంతో లేని చెవుడు కూడా వస్తోంది. మన చెవిలోని సిన్నితమైన నరాలు కొంతవరకే శబ్దాన్ని భరించగలవు. అంతకు మించి శబ్దం వస్తే ఆ నరాలు శాశ్వితంగా దెబ్బ తింటాయి. సాధారణంగా మనం మాట్లాడే సంభాషణలో 40 నుంచి 60దేసిబెల్స్ శబ్దం ఉత్పత్తి అవుతుంది. మన చెవిలోని సున్నితమైన నరాలు 85దేసిబెల్స్ కి మించి శబ్దాన్ని భరించలేవు.
బస్సులు_ లారీల హారన్లు 120దేసిబెల్స్ శబ్దాన్నీ, వ్విమానం, దీపావళి బాంబులు 200 నుంచి 250దేసిబెల్స్ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రకంగా అనేక యంత్రాలు 200నుంచి 350దేసిబెల్స్స్ వరకు శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి.మన చెవి నరాలు 160 దేసుబెల్స్ కి మించిన శబ్దంవల్ల కొద్దో_ గొప్పో శాశ్వితంగా దెబ్బతినిపోతాయి. అందువల్ల శబ్ద కాలుష్యంలో ఉండేవారికి తెలిసో_తెలియకో కొంత చెముడు వచ్చేసి వుంటుంది.
చేవుడును రెండు విధాలుగా విభజించవచ్చు. శబ్దతరంగాలు ప్రవహించే మార్గంలో లోపం ఏర్పడడంవల్ల కలిగేచెవుడు ఒక రకం శబ్దాన్ని గ్రహించే నరమేదేబతిని పోవడంవల్ల కలిగే చ్చేవుడు రెండవ రకం. కొందరికి అసలు చేవే కాకుండా మూసుకుని పోయి వుంటుంది. చెవిలో గుబిలి బాగా గడ్డకట్టుకుని పోయినా తాత్కాలికంగా నిలబడదు.
తల్లితండ్రులు ఇద్దరూ చెవిటివారు అయితే పుట్టేబిద్దకి చెవుడు రావాడానికి ఆస్కారం వుంది. అలాగే దగ్గర రక్తసంబంధీకుల్లోవివాహాలు జరిగితే పుట్టే బిడ్డలలో కొందరికి చెవుడు ఉమ్దవచ్చు. ఆధునిక వైద్య విజ్ఞాన ప్రగతిలో తల్లి గర్భంలో బిడ్డ వుండగానే, ఆ బిడ్డకి చెవుడు వున్నదీ లేనిదీ తెలుసుకోవడం సాధ్యం అవుతోంది.
తల్లి పొట్ట దగ్గర గట్టిగా చేస్తే, గర్భంలో ఉన్న బిడ్డకి ఆ శబ్దతమ్రంగాలు చేరి పుట్టిస్తాయి. దాంతో బిడ్డ గుండె ఒక్క క్షణకాలం పాటు వేగంగా కొట్టుకుంటుంది. ప్రత్యెక యంత్రాలద్వారా ఆ గుండె వేగాన్ని లెక్క కట్టవచ్చు. ఏ కారణంవల్లనైనాబిడ్డకు పిండనిర్మాణంలో చెవుడు వస్తే పొట్టపైన కలిగించిన శబ్దం వినబడదు. అటువంటప్పుడు గుండె వేగంగా కొట్టుకోడు. ఇటువంటి పరీక్ష ద్వారా పుట్టబోయే బిడ్డకి చెవుడు వున్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. చెవుడు తో పుట్టే బిడ్డ అవసరం లేదనుకుంటే కడుపులో బిడ్డ పెరిగే నాలుగైదు మాసాల్లోనే గర్భస్రావం చేయవచ్చు.
పిండం ఏడుగుదలతోనే చెవుడు రావాడానికి వంశ పరంపర్యలక్షణం ఒక కారణం కాగా తల్లి గర్భవతిగా వుండగా విచక్షణా రహితంగా మందులు వాడటం మరొక కారణం. తల్లి గర్భవతిగా ఉండగా స్తేప్తోమైసిన్, క్వినైన్ లాంటి మందులు వాడితే పుట్టబోయే పిల్లల్లో కొందరికి చెవుడు రావచ్చు.
నెలలు నిండాకుండా బిడ్డపుట్టినా కాన్పు సమయంలో తలకి అధికంగా ఒత్తిడి కలిగినా, బిడ్డ పుట్టిన తరువాత ఎంతో సమయంవరకు నడవకపోయినా, కాన్పు అవడానికి ఎక్కువ సమయం తీసుకున్నా పుట్టిన బిడ్డలలో కొందరికి చెవుడు రావచ్చు.
చంటి పిల్లలకి సంభందించిన వ్యాధులు వచ్చినా,పొంగు, గవాడ బిళ్ళలు, ప్లూజ్వరం, ఇతర వ్యాధులు వచ్చినా కొద్దిశతం పిల్లలకి కొద్దిపాటి చెవుడు సంక్రమించవచ్చు. అలాగే పిల్లలకి క్షయజబ్బు వస్తే, స్తేప్తోమైసిన్ ఇంజక్షన్లు వదినా, నియోమైసిన్ కానీ మైసిన్ లంటి ఇంజక్షన్లు ఎక్కువ వదిన వినికిడిలో లోపం ఏర్పడవచ్చు. చెవులలో తరచూ చీము కారుతున్నా చెవి పావురకి కన్నం పడినా వినబడడం తగ్గిపోవచ్చు.
చాలామంది పూర్తిగా వినబడప్పుడే డాక్టరుని సంప్రదిస్తూ వుంటారు. అలా కాకుండా చెవుడు ఏ మాత్రం వచ్చినట్లు అనిపించినా, వెంటనే డాక్టరుని సంప్రదించాలి. పుట్టుకుతోనే చెవుడు ఉన్నా, తరువాత చెవుడు వచ్చినా, కారణాన్ని బట్టి చికిత్స చేసి వినబడేటట్లు చికిత్స చేయవచ్చు.
****
