Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 33

  

                   

                  

                       -: సంకర హస్తములు :-

   శ్లో!!    లంగోల్కోదోముఖోయశ్చ గోస్తసేగ్రాక్షకేభవేత్ !
    ఊర్ధ్వాననోసతుఖ్యాత స్తధాశాంతాభిదెరశే !!

    తా: లాంగూల నామక హస్తమును, అధోముఖముగబట్టినచో  ఆవుస్తనములందు, ద్రాక్షపండ్ల యందును, ఊర్ధ్వముఖముగబట్టినచో శాంతరసము నందు వర్తించును.

   శ్లో!!    పద్మకోశశ్చోర్ధ్వ భాగగామి చంద్రార్ధభావనే !!

    తా: పద్మకోశ  హస్తము  ఊర్ధ్వభాగమున  బట్టినచో  చంద్రునికి వినియోగింపబడును.

   శ్లో!!    పశ్చాత్ప్రసారితో సూచీయచ్చబ్ధేపురతోయది !
    వీక్షణేపిచతచ్చబ్దేరవ్యర్ధేచోర్ధ్వచాలితా !
    ఏతే వక్రత్వభావేనయు క్తేచేన్తు నిరోధకే !
    ఏతే మోలసమాశ్లిష్టేయుజ్యదే సంధిభావనే !
    శూచీకరో నిశ్చలశ్చే  దూర్ధ్వముత్ధాపితే భవేత్ !!

    తా: సూచీహస్తము పశ్చాద్భాగమునందు ప్రసరింపచేసినబో "వాడు" యని చూపుటయందును. పురోగభాగమందు  ప్రసరింపచేసినచో "వీడు" యని చూపుటయందును. వీక్షిణమందును. ఊర్ధ్వభాగమున చలింప  చేసినచో సూర్యునియందును  రెండు సూచీ హస్తములు వక్రముగ  కలిపిపట్టినచో. విరోధముసందును. మూలభాగములందు. సంశ్లిష్టములుగా  చేసినచో సంధీని చెప్పుటయందు  వర్తించును. సూచీహస్తము  నిశ్చలముగా  చూపినచో. పైకెత్తబడినవానికి  వర్తించును.

  శ్లో!!    అరాళోళికగామీచేద్ర్బూవల్యాంచనియుజ్యతే !
    అననాభిముఖశ్చై వహ్యధరార్దేనియుజ్యతే !!

    తా: అరాళహస్తము లలాట ప్రదేశమున  ఘంచినచో  కనుబొమ్మలయందును, ముఖమున కభిముఖముగనుంచినచో అధరమునందు వర్తించును.

   శ్లో!!    మధ్యమాకేవలావక్రాశేషాశ్చైవ ప్రసారితః !
    రేఖాభిధానోహస్తస్యాత్తత్స్వరూపమిహోచ్యతే !!

    తా: మధ్యమాంగుళివి పక్రముగబట్టి ఇతరాంగుళులను  చాచిపట్టినచో రేఖాహస్తమనబడును. దీనిని పురోభాగమునందు  బట్టినచో  గజముఖము సందు రెండు రేఖాహస్తములు  భుజములందుబట్టినచో  సూర్యోపస్థానము నందు  వర్తించుచున్నది.

   శ్లో!!    ముష్టిశ్చుబుకగామీచేచ్చుబుకేశ్శళ్రుభావనే !
    యుజ్యతే కవిస్స్కోయంకరకర్మ విశారదైః !!

    తా" ముష్టిహస్తము  చుబుకమునందు బట్టినచో గడ్డమునందు, గడ్డము పెంచుట యందు వర్తించును.
   
   శ్లో!!    పతాకో విశ్చలాకారః సవిధేచేత్తదర్ధకే !
    జ్యోతిశ్శాస్త్రవిచారేపియుజ్యతేహ్యుచితార్ధతె !!

    తా: పతాక హస్తము సమీపమునందు  బట్టినిచో  "అది" యని చూపుటయందు, జ్యోతిషశాస్త్ర విచారమునందు, ఉచితార్ధమునందు వర్తించును.

   శ్లో!!    సర్పశీర్ష కరౌభులేసీమంతార్దే నియుజ్యతే !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS