చాముండేశ్వార్ ఇంకా తిడ్డామని అనుకుంది గాని అవతలి వాళ్లు ఫోన్ డిస్కనెక్ట్ చేసేశారు.
చాముండేశ్వేరి రిసీవర్ ని పెట్టేసింది.
"అదేంటి ఫోన్ పెట్టేశావ్! వాళ్ళతో మాట్లాడాలి!" కంగారుగా అన్నాడు రంగాయకులు .
"నేనేం పెట్టేయ్యలేదు. వాళ్ళే పెట్టేశారు" అంది చాముండేశ్వరి.
"పెట్టేయ్యారు? ని శాపనర్ధలాన్ని వింటూ కూర్చుంటారా దరిద్రం సంత? అసలే మన పండు ప్రమాదంలో ఉన్నాడు. వాళ్ళనెందుకు అనవసరంగా తిట్టావ్ మాయదారి సంత?" చిందులు వేశాడు రంగనాయకులు.
"మీ సంత సంతకెళ్ళ. పిల్లవాడ్ని తిస్కెళ్ళినవాడిని తిట్టక దీవించ మంటారా?" అంది చాముండేశ్వరి మొహం చిట్లిస్తూ.
"నిజమేగాని పండుగాడు వాళ్ళదగ్గరున్నాడు. ఆ విషయం మర్చి పోతే ఎలా?..." విసుక్కున్నాడు రంగనాయకులు.
"పండుని వాళ్ళు ఏం చేస్తారో ఏమో!" బాధగా అంది చిన్నమ్మాయి. అంతలో ఫోన్ మోగింది.
చాముండేశ్వరి వెంటనే ఫోన్ అందుకోబోయింది. కాని రంగనాయకులు అడ్డు తగిలాడు.
"నువ్వాగు. ఎవరు చేశారో ఎంటో?" అంటూ ఫోన్ అందుకున్నాడు.
"హలో"
"హలో అవతల కంఠం భయం భయంగా అంది.
"ఎవరూ?" అన్నాడు రంగాయకులు.
"మేమే, మీ పండుని ఎత్తుకెళ్ళినవాళ్ళం. మీ ఆవిడ పక్కనే ఉందా?" అడిగింది అవతలి కంఠం.
"ఉంది.. ఏం ఆమెతో మాట్లాడాలా? ఫోన్ ఆమెకి ఇవ్వానా?"
"వద్దుసార్!...ప్లీజ్ మిరే మాట్లాడాలా" భయంగా అంది అవతలి కంఠం.
"మా పండుని ఎప్పుడు అప్పజేప్తారు?" అడిగాడు రంగనాయకులు.
"మీరు మూడు లక్షలు ఇచిన వెంటనే..."
"మూడు లక్షలు అంటే చాలా ఎక్కువ...రెండు లక్షలు ఇస్తాను.."
"కుదర్దు... మూడు లక్షలకి ఒక్కప్తెసా తగ్గినా పండు మీకు దక్కడు..."
రంగనాయకులు ఆలోచనలో పడ్దాడు.
"ఏమంటున్నారు నాన్నా?" చిన్నమ్మాయి అడిగింది.
రంగనాయకులు మౌత్ పిస్ కో చెయ్యి అడ్డం పెట్టి చెప్పాడు. "మూడు లక్షలకి ఒక్కప్తెసా తగ్గినా ఒప్పకోరట!"
"సరే...అలాగే అని చెప్పండి. ఎట్లాగు ఇన్స్ పెక్టర్ బంగార్రాజు వాళ్ళని ఫాలో అయి పట్టుకుని మన డబ్బు మనకి ఇప్పిస్తారుగా?... ఎంత ఇస్తేనేం?"
"అది నిజమే..." అని చెప్పి "హలో.." అన్నాడు ఫోన్లో రంగనాయకులు.
"హలో...ఏం నిర్ణయించుకున్నారు?" అది అవతల కంఠం.
"సరే!...మీరు కోరినంతే ఇస్తాం...కాని ప్రస్తుతం నేను రెండు లక్షలే డ్రా చేశాను...ఈ వేళ బ్యాంకి టైము కూడా అయిపోయిందే ఎలా?"
"రేపు మిగతా లక్ష డ్రా చేయి....మీ వాడిని ఉంచుకుంటే ఎలా బాబూ?....
ఈ వేళే అప్పజేప్పండి.. మీకు రెండు లక్షలు ఇచ్చేస్తా...రేపు మిగతా లక్షా బ్యాకులోంచి డ్రా చేసి ఇస్తాను."
"ఓసారి మీ వాడిని మీకు అప్పజేప్పాక ఇంక మా వంక చూస్తావా..." నమ్మమంటావా?"
"నిజంగానే... మాయదారి సంత... మరి మనుషుల మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా?" అన్నాడు రంగాయకులు.
"ఊహు... కుదర్దూ...రేపు ఇంకో లక్ష డ్రాచేసి ఉంచు...మేము ఫోన్ చేసి డబ్బు ఎక్కడ అందజేయాలో చెప్తాం"
రంగనాయకులు ఎదో చెప్పబోయాడు కాని అంతలోనే ఫోను డిస్కనెక్ట్ చేసేశాడు అవతలి వ్యక్తి.
చిట్టబ్బాయి, కన్నరావులు మధ్యాహ్నం నుండి రొడ్ల వెంట పిచ్చి కుక్కల్లా అలా తరిగి తిరిగి చాలా అలసిపోయారు. ఊహించని విధంగా కథ మలుపు తిరగడంతో వాళ్ళకి పరిస్ధితి పూర్తిగా అయోమయంగా అనిపించింది.
చిట్టబ్బాయికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"అంతా నీవల్లే వచ్చింది... ఎదో ప్లాను చెప్పావని అనుకున్నాను గాని... మరి ఇంత బోడి ప్లాను చెప్తావని అనుకోలేదు..." అన్నాడు బాధగా.
ఆ పరిస్ధితి కన్నారావుని కూడా బాగా బాధ పెడ్తుందిగాని మొత్తం తప్పంతా చిట్టబ్బాయి తనమిదికి తోస్తేస్తుంటే కోపం వచ్చింది.
"నేనేదో చెప్పానే అనుకో ... నీకు నచ్చబట్టేగా దాన్ని ఆచరించావ్... తప్పు నంతా నా మీదికి తోసేస్తావేం?..." అన్నాడు విసుక్కుంటూ.
"ఆ పండుగాడిని ఆ దుర్మార్గుద్దరూ ఏం చేస్తారో ఏమో!.... అన్నాడు చిట్టబ్బాయి.
"అసలు వాళ్లు పండుని మన దగ్గర్నుండి ఎందుకు లాక్కెళ్ళారంటావ్?"
"ఎందుకేమిటి?... మనలాగేనే రంగానాయకులుకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడానికి!... అందుకే అతని ఫోన్ నెంబరూ, ఇంటి అడ్రసూ తిస్కున్నారు వాళ్లు..." అన్నాడు కన్నారావు.
"అంతేగాని పండుకి వాళ్ళేమి అపకారం చేయరుగా?"
కన్నారావు తల అడ్డంగా ఊపాడు.
"అలా చేస్తే వాళ్ళకొచ్చే లాభం ఏమి లేదుగా?"
"వాళ్లు పండుకి అపకారం ఏమ్తెనా చేస్తే వాళ్ళతోబాటు మనమూ జ్తేల్లో పడ్తాం" నీర్సంగా అన్నాడు చిట్టబ్బాయి.
"మనమెందుకు పడ్తాం?" కళ్లు చిట్లించాడు కన్నారావు.
"ఎందుకు పడము... అసలు పండుని మొదటి కిడ్నాప్ చేసింది మనమేకదా?... తరువాత మన దగ్గర్నుండి వాళ్లు లాక్కెళ్ళారు..."
కన్నారావు ఎని అన్లేదు.. మౌనంగా చిట్టబ్బాయి పక్కనే నడవసాగాడు.
కొన్ని క్షణాల నిశ్శబ్దం అనంతరం చిట్టబ్బాయే మళ్ళి అన్నాడు.
"మనం ఇలా పిచ్చిపట్టినట్టు రొడ్ల వెంట తిరిగితే ఏమ్తెనా ప్రయోజనం ఉంటుందంటావా? .. ఇంతపెద్ద నగరంలో వాళ్లు ఎక్కడ ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది... పండుని లోపలి గదుల్లో ఎక్కడో బందించి ఉంటారు....
"తప్పుడు మరి. పండుని ఎలాగ్తెనా ట్రేస్ చేసి మనమే రక్షించుకోవాలి! వాడికి ఏమ్తెనా అపకారం జరిగితే మనమే బాధ్యులం అవుతాంగా మరి?" అన్నాడు కన్నారావు.
"ప్రేమ దక్కకపోయినా పరవాలేదుగాని పండుగాడు మన చేతికి సేఫ్ గా దొరికితే అంతే చాలు... నాకు చాలా దిగులుగా ఉంది, మన సొంత తెలివితేట్లు ప్రదర్శించకుండా ప్రేమానందం సలహాలనే నమ్ముకుని ఉంటే బాగుండేదేమో!" దిగులుగా అన్నాడు చిట్టబ్బాయి.
"ఇంతకి రంగనాయకులు పోలీసులకి కంప్లయింట్ ఇచ్చాడో లేదో?" తనలో తను అనుకుంటున్నట్లుగా అన్నాడు కన్నారావు.
"ఇవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అలా చేస్తే మనం పండుకి అపకారం తలపెద్తామేమోనని భయముంటుంది. అంతేకాకుండా మనకి రెండు లక్షలు ఇవ్వడానికి కూడా ఒప్పకున్నాడుగా?"
"ఏమోమరి! అతని మనసులో ఏం ప్లాను వేస్కున్నాడో మనకి తెలిదుగా? మనకి డబ్బులిస్తానని అన్నాడు.... కాని మనం చెప్పాముగా డబ్బులు ఏ స్ధలంలో అందించాలో మళ్ళి పోన్ చేసి చెప్తామని. అప్పుడు అక్కడికి పోలీసుల్తో సహా వచ్చి మనల్ని బంధించాలని అనుకుని ఉండొచ్చు!!..."
"అయితే పండుని కిడ్నాప్ చేసిన విషయం గురించి పోలీసులకి తెలిపే ఉంటుంది... వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలయి ఉంటుంది... వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో మనం బయటపడ్డామంటే చచ్చామన్నమాటే!?...." అన్నాడు చిట్టబ్బాయ్ భయం భయంగా.
అతని మాట ఇంకా పూర్తి కానేలేదు.. కన్నారావు కెవ్వుమని అరిచాడు.
అతను భయం భయంగా ఆ పక్కకి చూస్తున్నాడు. కన్నారావు చూస్తున్న దిక్కుకి చిట్టబ్బాయ్ తల తిప్పి చూశాడు.
