Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 34


    
    "మీరు వేరే టిఫిన్ చేసుకుంటున్నానని నాన్నతో ఎందుకు చెప్పారు?" కోపంగా అడిగింది ప్రనూష.
    "మరి...ఏం చెప్పను...."ఏమీ చెప్పొద్దు.....నేను చేసిన టిఫినే మెక్కండి..."
    "అదిగో....తిడుతున్నావు."
    సరే....తినండి....
    "దానికి ఛార్జీ వేయకూడదు మరి"
    చేయను
    "టిఫిన్ చేయగానే కాఫీ కూడా ఇవ్వాలి..."
    అలాగే
    "అలాగే అని ఏడుస్తూ మొహంతో కాదు, నవ్వుతూ..."
    హిహిహి...అలాగే....సరేనా.....!
    "దట్స్ గుడ్...." అని, మనసులో "హమ్మయ్య నో టిఫిన్ ప్రాబ్లెం....నో ఫుడ్డు ప్రోబ్లెం...వోన్లీ బెడ్డు ప్రొబ్లెం..." అనుకున్నాడు శ్రీచరణ్.
    శ్రీచరణ్ కు ఆరోజు ఉదయం బాగా గుర్తుండిపోయింది మదిలో తనూ, ప్రనూష ప్రియ అత్త, మామలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఎందుకో మరచిపోలేకపోతున్నాడు.
    ఇన్ని రోజులుగా ఎవరి టిఫిన్ వాళ్ళే చేసుకోవడం, ఎవరి మానాన వాళ్ళు తిని వెళ్ళిపోవడమే జరిగేది. కానీ, ఈ రోజు... మాటల ప్రస్తావనలో ప్రనూష జాబ్ చేస్తోన్న విషయం చెప్పాడు....ముందుగా కోపంగా, ఆ తర్వాత ఆశ్చర్యంగా చూసినా, టైంపాస్ కోసం ఉద్యోగం చేస్తోందని, అదిగాక, ఈ సిటీలో ఉద్యోగం చేయడం తనకు కాస్త చేయూతగా ఉంటుందని కన్విన్స్ చేయడంతో మిన్నకుండిపోయారు.
    ఒక్క క్షణం అతనికి బాధేసింది.
    అసలు విషయం మామగారికి తెలిస్తే?
    తన కూతురు మరోపెళ్ళి చేసుకోవాలనుకుంటుందని....
    తన అల్లుడు మరో అమ్మాయిని వెతుక్కుంటున్నాడని... తెలిస్తే? ఆ ఆలోచనే భయంకరంగా అనిపించింది.
    తనూ, ప్రనూష పొరపాటు చేస్తున్నామేమో అనిపించింది.
    తప్పదు.... ఇంత దూరం వచ్చాక....తల విదిల్చాడు. కొన్రోజులపాటు తనూ, ప్రనూష ఎర్లీగా ఇంటికి వెళ్ళాలి.
    అత్తా, మామలకు, ప్రియ కు సిటీ మొత్తం తిప్పి చూపించాలి. పైకి బెట్టు చేసినా, అత్తమామలన్నా ప్రియ అన్న శ్రీచరణ్ కు అభిమానమేమి.
    
                                                                    * * *

    "హలో బాసూ....ఏంటి...కలలు కంటున్నావా?"
    శశికళ వచ్చి తన భుజం తట్టి కుదిపేసరికి ఆలోచనల్లో నుంచి బయటపడి "అదేం లేదు" అన్నాడు.
    "మరేం ఉందో...?" అంది టేబుల్ మీద వున్న అతని గాగుల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తూ.
    "ఏం వుందో, లేదో కానీ... నా గాగుల్స్ మీద మాత్రం నీ చూపు వుందని అర్ధమైంది." కళ్ళజోడుని ముందు జాగ్రత్తగా తన జేబులోకి తోసేసి అన్నాడు శ్రీచరణ్.
    "అబ్బ....నీకెంత ముందు చూపు బాసూ... టేబుల్ మీద ఒక్కటైనా వుంచవు." అంది శశికళ.
    "అవునవును నాకు ముందు చూపు ఎక్కువే..." అన్నాడు. నైట్ టీషర్టులో నుంచి కనిపించే ఆమె ఎద ఎత్తందాలు చూస్తూ.
    "ఏంటీ లుక్కు ఎక్కడికో వెళ్ళింది" అంది అతని చూపు గమనించి.
    "ఎక్కడికో వెళ్ళలేదు కానీ....ఏంటి పొద్దున్నే ఎక్సప్రెస్ పత్రికలు ముందేసుకున్నావు...క్లాసిఫైడ్స్ చూస్తున్నావా?"
    "అదేం కాదు...ఎవరైనా స్టేట్స్ కు వెళ్తూ అత్యవసరంగా అమ్మాయికోసం వెతుకుతున్నారేమోనని...." అంది.
    "వెతికితే..."
    "ఏముంది సింపుల్ గా నేన్రెడి..." అంటూ ఓలెటర్ వాళ్ళమొహాన కొడతా.
    "అంటే వాళ్ళు సరేనంటే ఎగేసుకువెళ్ళడమే...?"
    "డౌటా?" అడిగింది శశికళ.
    "అమ్మో...నువ్వు చాలా అడ్వాన్స్..." అన్నాడు శ్రీచరణ్.
    "నువ్వు అడ్వాన్సయి. తొందరగా స్టేట్స్ కు వెళ్ళరాదూ....నేనూ వచ్చేస్తా నీతో..." అంది శశికళ.
    "నువ్వేంటో శశీ....ఓసారి అర్ధమైనట్టు కనిపిస్తావు. కానీ అర్ధం కావు. మరోసారి అర్ధం కానట్టు అనిపిస్తావు. కానీ, అర్ధమవుతావు, నీ క్యారెక్టరే అర్ధం కాదు నాకు..." అన్నాడు శ్రీచరణ్.
    నిజానికి శశికళ ఎప్పుడూ అతనికి ఫజిలే. మోడ్రన్ గా వుంటుంది. ప్రతీ విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటుంది. సోషల్ గా మూవ్ అవుతుంది. కొనీ స్టేట్స్ పిచ్చి....స్టేటస్ పిచ్చి...
    "నేనేమిటో నాకే అర్ధం కాదు నీకేం అర్ధమవుతుంది బాసూ....అద్సరేగానీ, సంగీత్ లో మాట్రిక్స్ పిక్చరొకటి ఆడుతోంది. వెళ్దామా?" అడిగింది శ్రీచరణ్ ని శశికళ.
    "ఈవెనింగ్ త్వరగా ఇంటికెళ్ళాలి. అయినా నీకా పిక్చర్స్ బాగా అర్ధమవుతాయా?" అడిగాడు శ్రీచరణ్. భళ్ళున నవ్వింది శశికళ.
    "బాసూ....ఇంగ్లీష్ సినిమా చూసేవాళ్ళందరికీ ఆ సినిమా అర్ధమవు తుందనుకుంటున్నావా? ఆ సినిమా ఆ సినిమాకు వెళ్తారనుకుంటున్నావా? సంగీత్ లో వెళ్ళడమంటే అదో సరదా....స్టేటస్ టికెట్ కాస్ట్ లీ...సినిమా ఇంగ్లీష్.....అంటే యూత్ గానీ, డబ్బున్న వాళ్ళు వెళ్తారు ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు.... అదో సైకాలజీ....అంతే."
    "మొత్తానికి నీ దగ్గర బోల్డు టాలెంట్లున్నాయి." అన్నాడు శ్రీచరణ్.
    "రోజుకో టాలెంట్ చూపిస్తా...నన్ను పెళ్ళిచేసుకొని స్టేట్స్ కు తీస్కెళ్ళు..." అంది శశికళ.
    ఒక్కసారి షాకయి చూస్తుండిపోయాడు శ్రీచరణ్. జోగ్గాగానీ అనలేదుకదా....కానీ శశికళ మొహంలో సీరియస్ నెస్ స్పష్టంగా కనిపిస్తోంది.
    "స్టేట్స్ కు వెళ్ళడమంటే నీకంత క్రేజా?" అడిగాడు శ్రీచరణ్ వుండబట్టలేక.
    "కేవలం స్టేట్స్ కు వెళ్ళాలనే కాదు....లగ్జరీ....జీవితంలో ఎవో అనుభవించాలి...కారుల్లో తిరగాలి. ఫ్లయిట్స్ ఎక్కాలి....ఏ.సి. గదుల్లో పడుకోవాలి. షవర్ కింద స్నానాలు చేయాలి. వూహల్లోకి వెళుతూ అంది శశికళ.
    "ఆ లగ్జరీస్ లేకపోయినా బాగానే బ్రతకొచ్చు." అన్నాడు శ్రీచరణ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS