Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 34

 

    తను ఒక పోలీస్ ఆఫీసరని అతను సర్వసంగ పరిత్యాగి అన్న నగ్న సత్యం మింగుడు పడడం లేదామెకు. పరస్పర విరుద్ద ఆలోచనల సంఘర్షణ ఒడిలో కొట్టుమిట్టాడిపోతున్నది కిరణ్మయి అంతరంగం!
    
                                                           *    *    *    *

    ఆకాశంలో నక్షత్రాలు సయితం కనిపించనట్టు మేఘాలు క్రమ్ముకుపోయాయి. ఊరంతా నిర్మానుష్యంగా వుంది. అమావాశ్య కావడాన అంతటా చిమ్మచీకటి అవరించుకుంది.
    ఆ గదిలో వెలుగుతున్న జీరో వాల్ట్ బల్బు కాంతిలో చేతి వాచీ వైపు చూసుకున్న భారతి ఏదో గుర్తుకు వచ్చినట్టు ఉలిక్కిపడి లేచి కూర్చున్నది.
    తన గది కిటికీ నుంచి ఆశ్రమ వాతావరణాన్నంతా పరిశీలనగా చూసింది. ఆశ్రమంలో ఎక్కడా ఎవ్వరూ తిరుగుతున్న అలికిడి వినిపించలేదు.
    భారతి గదిలో నుంచి బయటకు వచ్చి తలుపు దగ్గరకు వేసి పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ వరండాలోకి వచ్చింది ఆ వరందాకు అటు ఇటు గదులు వున్నాయి.
    ఉన్నట్టుండి భారతి ఒక గది వేపుకు వెళ్ళింది.
    ఒక్కక్షణం పాటు అక్కడే నిలిచి ఆశ్రమం నలువైపులా పరికించి చూసింది.
    గాలికి ఊగుతున్న చెట్ల కొమ్మలు తప్ప నరమానవుడన్న వారెవ్వరూ అక్కడ సంచరిస్తున్న ఉనికి అణు మాత్రం కూడా కనిపించలేదు.
    అప్పుడు కదిలాయి భారతి చేతులు.
    మారు తాళం చెవుల గుత్తి లోని ఒక్కొక్క తాళాన్ని ఉపయోగించి ఆ గది తలుపులను తెరిచే ప్రయత్నం చేస్తున్నది. రెండే రెండు నిమిషాలలో తలుపు తెరచుకోవడం . భారతి లోపలకు వెళ్ళడం జరిగిపోయాయి.
    ఆ గదిలో ఇనుప బీరువాలు వరుసగా పేర్చి వున్నాయి.
    భారతి సరాసరి వెళ్ళి మూడవ బీరువా ముందు నిలిచింది.
    ఆమె ఆ బీరువా తెరవడానికి ఒక నిమిషం పట్టింది.
    కాలం బరువుగా గడిచిపోతున్నది.
    దాదాపు పది నిమిషాల తరువాత ......తన పని ముగించుకుని భారతి ఆ గది నుంచి బయటపడింది.
    భారతి సరిగ్గా తలుపు తెరుచుకుని బయటకు వచ్చిందో లేదో ఎదురుగా నున్న వ్యక్తిని చూసి కంగారు పడిపోయింది.
    అతను..విష్ణు!
    'ఇంతవరకూ చదివింది చాలకనా......ఇంకా వాటిలో ఏమున్నాయని తీసుకు వెళుతున్నావు భారతీ....." విష్ణు ఎంతో సౌమ్యంగా ప్రశ్నించాడు.
    "నేను .....నే....ను"
    "నువ్వు గదిలోకి ప్రవేశించినప్పుడే నేను వచ్చాను. అబద్ధం ఆడడానికి ప్రయత్నించవద్దు. ఆద్యాత్మిక గ్రంధాలను చదివినంత శ్రద్దగా నా డైరీలను పరిశీలించవలసినంత అవసరం నీకేమిటి? పైపెచ్చు ఇంకా ఏదో చదవ వలసినది మిగిలిపోయినట్టు వాటిని తీసుకువెళుతూన్నావు......అసలు నా డైరీలతో నీకేం పని?"
    "విష్ణుజీ....అదేమీ లేదు....అసలు మీ డైరీలు నేనెందుకు చూస్తాను.......ఆధ్యాత్మిక పుస్తకాలు చూస్తుంటే డైరీలు కనిపించి యధాలాపంగా చూశానే తప్ప చదవాలనిపించి చదవలేదు.'
    అప్పటికి తేరుకున్న భారతి సమాధానం చెప్పింది.
    ఓహో, అదే నిజమయితే పుస్తకాలనే చదవడానికి బీరువా తెరచి వుంటే దొంగతనంగా మారు తాళాలతో ఎందుకు తీశావు? నన్నడిగితే నేనే తాళాలు ఇచ్చేవాడిని కదా....."
    "విష్ణు గొంతులో గాంభీర్యం సడలిపోలేదు.
    "విష్ణుజీ ఇంతవరకు వచ్చాక ముసుగులో గుద్దులాట ఎందుకు? అందుకే నిజం చెబుతున్నాను? ఆ రీటా మీ డైరీలను తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చి పెట్టిందని విన్నప్పటి నుంచి నాకు మనసులో సందేహం పీకుతూ వున్నది. అది తీర్చుకోవడానికి మీ డైరీలను చదివాను"
    అయన ముఖంలో చెప్పలేనంత విస్మయం...
    "గతించిపోయిన మీ జీవితం నాకు జ్ఞానోదయం కలిగించింది. అందుకే ఇంతవరకు మీపై వున్న గౌరవం, భక్తీలతో పాటు ఇప్పుడు ప్రేమను కూడా పెంచుకున్నాను....."
    "నాపై ప్రే......మా?"
    "అవును.......ప్రేమే.......'
    "న్నో.......నేను సర్వసంగ పరిత్యాగిని .......సన్యాసం స్వేకరించిన వాడిని"
    "కావచ్చు....మీపై ప్రేమను పెంచుకోవడానికి , తుంచుకోవడానికి నాకు హక్కు వున్నది. నా యిష్టాన్ని కాదనే హక్కు మాత్రం మీకు లేదు. పుడుతూనే ఎవ్వరూ సన్యాసం పుచ్చుకోరు. ఈ లోకంలో ముక్తి మార్గాన్ని అవలంభించే సాధు పురుఘులేందరో సన్యశాశ్రమం స్వేకరిస్తున్నారు. కాని జీవితంలో అన్ని రుచులు ఆస్వాదించాక చివరి దశగా మాత్రమే ఆధ్యాత్మిక చింతన వైపు మనసు మళ్ళిస్తున్నారు. కానీ, మీరలా కాదే.....జీవితపు ఒడిలో మొదటి అంకమైన పూర్తిగాక మునుపే సర్వసుఖాలను త్వజించి నేను సన్యాసిని అనుకున్నంత మాత్రాన సరిపోదు. సృష్టి ధర్మాన్ని ఎవరూ కాదనలేరు......." సిద్దంగా ఆయనవైపు అదోలా చుసిందామే.
    "భారతి....ప్రస్తుతం వాదనలు అనవసరం. నిన్ను శిష్యురాలిగా చేసుకున్నది అముష్మిక చింతన అభిలాషిస్తున్నానని ....ఇలా ప్రవర్తించి ఆశ్రమ వాతావరణాన్ని కలుషితం చేస్తుంటే సహించేది లేదు. నువ్వు నా మందిరం నుంచి వెళ్ళిపోవలసి వుంటుంది" విష్ణు సూటిగా చెప్పాడు.
    "విష్ణుజీ .......మీరు ఆ విధంగా చేయలేరు. ఎందుకంటే మీ జీవితమంతా తెలుసుకున్నా దానిని, ఏ సమయంలో మీ మనోభావాలు ఎలా వుంటాయో ఇప్పుడ మరింత చక్కగా వూహించగలను. ఏ సాకు చూపించి నన్ను ఆశ్రమం నుంచి గెంటి వేస్తారో చెప్పండి. ఎవరి దగ్గరా నేను అసభ్యంగా ప్రవర్తించలేదు. అందరి శిష్యుల దృష్టిలో మీ దగ్గర చనువు సంపాదించిన ముఖ్య శిష్యురాలిగా నేనంటే గౌరవం వున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS