Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 33


    " మా వారి తప్పు కాదేమో!"

     "మరి..."

    "మీ అందం.... అందరినీ పిచ్చివారిని చేస్తుంది." అన్నాడు.

    " మిమ్మల్ని చేయటం లేదా?"

    "చేసిన నన్ను నేను కంట్రోలు చేసుకుంటున్నాను. అక్కడే  వుంది మంచికి, చెడుకితేడా!"అన్నాడు.
   
      " అయితే మీరు మంచివారని నేను నమ్మాలంటారు."తలెత్తి చూచాడు.

     ఆమె కళ్ళలో కొంటెదనం కనిపిస్తుంది.అందుకే తనూ నవ్వే సాడు.

    "అవునండీ.మంచివాడినని మరోసారి మనవి చేస్తున్నాను."

     "అంగీకరిస్తున్నాం."

    " థాంక్స్!"

     ఆమె లేచింది అతను చేయి అందించాడు ఒక్కక్షణం చూచి అందుకున్నది ఇద్దరూ జంటగా కొన్ని  అడుగులు వేసారు.   

    " మిస్ శ్వేతా!నాకు కొన్ని అనుమానాలున్నాయి."

    " నా గురించేనా! నేను యెవరిని ప్రేమించలేదు. ప్రేమించినవాడిని మోసం చేసే తత్వం. కాదు. కష్ట,సుఖాలలో, ప్రేమిస్తాను." అన్నది అల్లరిగా.

     " బి సీరియస్! నేను సీరియస్ గా చెబుతున్నాను."

    "చెప్పండి"

    " మీపు ఈ ఊరికి టీచర్ గా రాలేదు."

    " నిజమే టీచర్ గా రాలేదు కాని వచ్చి ఇక్కడి పరిస్థితులు చూచాక టీచర్ గా మారాను."అన్నది.

    "కాదు-"

    " మరి- "

    "అది నా రహస్యం...." అన్నాడు.

     "మంచి స్నేహితుల మధ్య రహస్యాలుండరాదు."

     "నేను అదేమాట అంటున్నాను మేడమ్...."  అతని మాట పూర్తికాక ముందే సిద్ధార్ధ వాళ్ళ జీతగాడు సాయిలు పరుగున వచ్చాడు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS