29 .శక్తి పుష్టి కావాలంటే.... ఏం తీసుకోవాలి?
కారు మెకానిక్ కమ్య చూడటానికి సన్నగా కనబడతారు. ఎప్పుడూ కాళ్ళు గుంజుతూవుంటాయి నీరసంగా అనిపిస్తూ వుంటుంది. ఏదైనా వ్యాధి ఉంది మనిషి అలా వుమ్తున్నాడా అంటే అది కాదు. ఓ రోజున డాక్టరు దగ్గరికి వెళ్ళి "డాక్టర్, నాకు పనిచేయడానికి శక్తి ఉండటంలేదు. బలం రావడానికి మంచి టానిక్ రాసి ఇవ్వండి" అని అడిగాడు. టానిక్ రాసి ఇవ్వడానికి బదులు కమయ్యకి డాక్టర్ సలహా ఇస్తూ, కాఫీ, టీలు మాని కడుపునిండా భైజనం చేయమని చెప్పాడు. అవును మరి, మెకానిక్ కామయ్యకి మాటిమాటికి తాగే, కాఫీ, తీలతో కడుపు నిండిపోతూ ఉంటే సరిగ్గా భోజనం చేయడానికి వీలేక్కడ, మనిషికి కండపుష్టి కలిగేదీ, శక్తిని ఇచ్చేదీ అతను తీసుకునే ఆహారమే. సరైన ఆహారం తీసుకోకుండా ఎన్ని టానిక్కులు వదినా ఏమీ ఫలితం ఉండదు.
మనం ఆహారంలో తీసుకునే పప్పులు, ధాన్యాలు పళ్ళు, ఆకూకూరలు కయకూరలు పాలు, మాసం వివిధ రకాలుగా శరీరానికి పుష్టిని, శక్తిని కలిగిస్తాయి. ఈ ఆహార పదార్ధాలలో ఉండే మాసకృతులు, శరీరం ఎదుగుదలకి, కండ పుష్టికి ఉపయోగ పడితే, పిండి పదార్ధాలు, కొవ్వు పదార్ధాలు మనిషి ఉషారుగా పని చేయడానికి శక్తిని ఇస్తాయి. రైలుఇంజనులో బొగ్గువేటే మండి అందులో నుండి వేడిపుట్టి రైలు ముందుకు సాగడానికి వీలుపడినట్లే_ కొవ్వు పదార్ధాలు పిండి పదార్ధలు శరీరంలోకి ఎంజైమ్స్ వల్ల రకరకల రూపాంతరాలు చెంది చివరికి అవి భస్మం అయి శరీరానికి శక్తిని కలిగిస్తాయి. శరీరానికి ఇంత శక్తిని ఇచ్చేవి_ పళ్ళు, పరిధాన్యాలు దుంపలు, చెరుకు, ఇతర కొవ్వు పదార్ధాలు. మాంసకృతులు కూడా కొంతవరకు శక్తిని కలగాజేయడానికి ఉపయోగపడతాయి. శరీరానికి శక్తిని, స్పూర్తీని ఇచ్చే ఈ పిండి పదార్ధాల్లోనే విటమిన్లు, ఖనిజ లవణాలు ఇతర పోషక పదార్ధాలు కూడా ఉంటాయి.
పిండి పదార్ధాలు శక్తిని ప్రసాదించగా మాంసకృతులు ఆహారంలో లధ్యం కాకపోతే వ్యక్తి ఎదుగుదల సరిగ్గా ఉండదు. కండపుష్టి లోపిస్తుంది. రక్తహీనత కలుగుతుంది. రాగానిరాధకశక్తి తగ్గిపోతుంది. వేమ్త్రుకులు సహజ సౌందర్యాన్ని కోల్పోతాయి.
సరైన శరీర ఎదుగుదలకి, శరీర అందచందాలకి కావలసిన మాంసకృతులు, పాలు, పప్పులు,చేపలు, మాసం, గుడ్లనుండి పుష్కలంగా లభ్యం అవుతాయి.ఫరి ధాన్యాల నుంచికూడా కొంత మాంసకృతులు లభ్యం అవుతాయి.
శరీరానికి శక్తిని, పుష్టిని కలిగించడానికి పిండిపదార్ధాలు, కొవ్వు పదార్ధాలు, మాంసకృతులు అవసరం అయినట్లే విటమిన్లు, ఖనిజలవణాలు మనం తీసుకునే రకరకాల ఆహారపర్దాలు ద్వారా అందుతాయి. ఎముకులు గట్టిగా బలంగా ఉండటానికి కాల్షియం కావాలి. ఈ కాల్షియం పాల ద్వారా పుష్కలంగా లభ్యం అవుతుంది. అంతే కాకుండా ఆకూకూరలు, రాగి వల్లకూడా శరీరానికి కాల్షియం అందుతుంది.
రక్తం వృద్దికి కావలసిన ఐరన్, పాలిష్ పట్టని బియ్యం, గోధుమ, రాగి దాన్యల్లోనూ ఆకుకూరలు, గుడ్లు, మాసం, పప్పులోను లభ్యం అవుతుంది. శరీరానికి ఐరన్ తోపాటు ఐరన్ కూడా అవసరం. ఐడిన్ త్రాగేనీటిద్వారా, ఆకూకూరలు , పళ్ళు, కయకూరల ద్వారా లభ్యం అవుతుంది. కొన్ని భూముల్లో ఐడిన్ శాతం తక్కువ ఉంటుంది. అందువల్ల అక్కడి త్రాగే నీటికి, పెరిగే వృక్షజాతిలో కూడా ఐడిన్ శతం తక్కువ ఉంది లోపం ఏర్పడుతుంది.
పైన తెలుసుకున్న విధంగా ఆహారంలో కావలసిన గుర్తిమ్చ్, జాగ్రత్తగా ఆహారం తీసుకున్నట్లయితే మంచి విఘ్రహా పుష్టి, శక్తి పెంపోందుతాయి.
****
