తా: చతురహస్తము పై చతుర హస్తమునుంచి చూపుడువ్రేళ్ళను క్రిందకు, బొటనవ్రేళ్ళను పైకి చాచిపట్టిన ఘట్వాహస్తము వచ్చును.
వినియోగములు :-
ఇది మంచము మొదలగు వానియందు చెల్లును.
-: భేరుండహస్త లక్షణము :-
శ్లో!! మణిబంధ కపిద్దాఖ్యాం భేరుండకరయిష్యతే !
భేరుండపక్షి దమ్ప త్యోర్భేరుండకరఈరితః !!
తా: కపిద్ద హస్తములు రెండును, మణికట్ల వద్ద చేర్చిపట్టిన భేరుండ హస్తమగును.
వినియోగములు :-
ఇది ఖేరుండపక్షి, భేరుండ పక్షి దంపతులకు వినియోగించును.
-: అవహిత్త హస్త లక్షణము :-
శ్లో!! సోలవద్మౌవక్షస్థావవహిత్ధకరోమతః !!
రెండు సోలపద్మ హస్తములు రొమ్మున కెదురుగా బట్టిన అవహిత్త హస్తము వచ్చును.
వినియోగములు :-
తా: శృంగార నటనము, పుట్టచెండును పట్టుట, న్తనములు వీనియందు ఈ హస్తము వినియోగించును.
సంయుత హస్త లక్షణ, వినియోగములు సమాప్తము.
___ * ___
