"పాట కూడా పాడాలిగా?"
"పక్క గదిలోకి వినిపిస్తుంది. "టక్కున అన్నాడు.
"పాటే కాదు. ఇప్పుడు మీ మాటలు వినిపిస్తాయి."
కంగారు పడ్డాడు "అదేం?"
"మీ బామ్మ కిటికీ దగ్గరే నిలబడి అంతా వింటుంది కాబట్టి."
టక్కున నోరు ముసేశాడు. సో!" గుసగుసగా అన్నాడు. "ఇప్పుడు నేను చెప్పిన దృశ్యం మొదటినుంచి మళ్ళీ ప్రారంభిద్దాం.'
మాటలతో అతడ్నలా మభ్యపెడ్తూ జోకొట్టాలనుకుంటే మళ్ళీ మొదటికే వచ్చాడు.
"వద్దంది."
"ఏం?"
"మొదటి రాత్రిగా. సరదాగా కబుర్లు చెప్పుకుందాం"
"మొత్తం రాత్రంతానా?" రాఘవ మోహంలో టెన్షన్.
"కాదు , నిద్రొచ్చేదాకా"
"అంటే......వట్టిగా నిద్రపోవడమేనా?"
"ఏం.....ఇదేం ఆఖరి రాత్రి కాదుగా?"
"నీకు దణ్ణం పెడతాను కిన్నెరా! మూడు రాత్రులుగా నేను నిద్రపోలేదు."
ఈ తొలి రాత్రి కోసం ఎంత తపించిపోయింది చెబుతుంటే లాలనగా అతడి తల నిమిరింది కిన్నెర___"నిజమా?" అంటూ.
"మరేం."
"అయితే ఈ రాత్రి మీరు నిద్రపోవాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం పాడవదూ"
"ఏం ఫర్వాలేదు" ఆమెను మళ్ళీ పైకెత్తుకుని పక్క మీదకి లంఘించాడు.
"నా మాట వినండి"
ఇక మాట్లాడలేదు రాఘవ. అప్పటికే చాలా కాలయాపన జరిగి పోయినట్లు బిజీ అయిపోయాడు.
అతన్ని వారించలేకపోతుంది కిన్నెర. ఒడాలని ఉంది. కాని భవ్య పందెంలో ఓడిపోకూడదనిపిస్తుంది.
నూరేళ్ళ దాంపత్య జీవితంలో నూరు రోజులు వృధా చేసుకుంటేనేం? ఇంతకాలం తనను గారాబంగా పెంచిన తండ్రికి న్యాయం చేసినట్టవుతుంది.
ఆమెపై చివరి గెలుపు ప్రకటించుకోవటానికి సిద్దపడుతున్న రాఘవను చూస్తూ విసుగ్గా అంది--"మిరేమితో నాకు అర్ధమైంది"
ఆమె మాటలు వినే స్థితిలో లేనట్టు "మరింకేం?" అన్నాడు ఆమెని చుట్టేస్తూ.
ఉక్రోషంగా పక్కకు జరిగింది మరోమారు అతడి ప్రవర్తనతో, అసలు ఇదేలాంటి పందానికి సిద్దపడినందుకో ఆమె కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి.
అవాక్కైపోయాడు రాఘవ. పక్కదిగి కల్లోత్తుకుంటున్న కిన్నేరని చూస్తూ "ఏమైంది? ఎందుకేడుస్తున్నావ్?" అన్నాడు బింకం సడలిపోగా.
"నిజం చెప్పండి మీరు.......అది కాదు.....మీకు నేను తొలి ఆడపిల్లని కాదు కదూ?"
ఒక విస్పోటనంలా వినిపించింది.
"ఎందుకలా అనిపించింది?"
"మీ ఆవేశం చూస్తుంటే ఇది తొలి అనుభవంలా లేదు"
నిర్లప్తంగా చూశాడు కొన్ని క్షణాలదాకా. "సారీ కిన్నెరా?" బాధపడిపోయాడు రాఘవ. "నువ్వెందుకు సహకరించ కూడదనుకుంటున్నావో నాకు తెలిలేదు, కాని, నువ్వనుకున్నట్లు నాకు పూర్వం అనుభవం లేదు. పచ్చిగా చెప్పాలి అంటే యిప్పుడు నేను ప్రదర్శించిన ఆవేశం ఆకలి మీద ఉన్నవాడు రుచి కోసం తొందరపడటం లాంటిది మాత్రమే" అన్నాడు రాఘవ.
ఇక ఆమెతో మాట్లాడటం ఇష్టం లేనట్టు కోపంతో వెళ్ళి పక్క మీద ఓ వారగా పడుకున్నాడు.
ఆమెకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది. కోరిస్వర్గాన్ని నరకంగా మార్చుకుంటుందా?
ఇప్పుడన్నది కేవలం అతడ్ని వారించతానికే తప్ప నిజంగా అతని శీలాన్ని అనుమానించి కాదని చెప్పాలనిపించింది.
ఆ మాత్రం చాలు అతడు మళ్ళీ అవకాశం తిసుకోవటానికి. గోడ మీద ఉన్న కేలండర్ ను చూస్తూ ఓ తారీకు రౌండ్ చేసింది.
ఈరోజు ఆగస్ట్ ఎనిమిది అయితే వంద రోజులు పూర్తయ్యేది నవంబర్ పదహారు.
ఇంకెంత? తొంభై తొమ్మిది రోజులు.
తొలి రాత్రి తొంబై నిమిషాలు గడవక ముందే అదేదో చాలా సులభమైన విషయమనుకుంది కిన్నెర.
* * * *
"ఏయ్!"
ఉదయం సూర్యుడి లేత కిరణాలు వాలుగా గదిలోకి ప్రవేశించి రాఘవ మొహాన్ని తాకుతుంటే చెవిలో గుసగుసల్లా వినిపించింది.
ముందు బామ్మనుకున్నాడు.
