పెళ్ళయిన పద్మజను తన ఇంటికి తీసుకెళ్ళలేదు పద్మనాభం...అత్తగారింటి దగ్గరే భార్యను పెట్టి వీలున్నప్పుడు వచ్చిపోతుండేవాడు.
అతనిది పెద్ద కుటుంబం. అంతమంది మధ్య తన భార్యను వదిలితే ఎక్కడ ఏ గలాటాలు వచ్చి తన భార్య కష్టపడుతుందోనని అతని బాధ. అందుకే పుట్టింట్లోనే పద్మజను వుంచేశాడు. ఆమె పోషణ కోసం బాగానే డబ్బులు ఇచ్చేవాడు.
నెలకు ఠంచనుగా అల్లుడు ఇచ్చిన డబ్బు వస్తూ వుండడంతో శివయ్య సకాలంలో పైర్లకు ఎరువులు, మందులు వేసేవాడు. పద్మజ ప్రతినెలా మిగిల్చిన డబ్బుతో రెండు పాడి ఆవుల్ని కూడా కొన్నది. దీంతో శివయ్య కుటుంబం ఒక మెట్టు పైకెక్కింది.
అంతవరకు కష్టాలుపడిన కుటుంబం ఇప్పుడే స్థిమిత పడుతూ వస్తోంది. చిన్నికి ఇది మరీ బాధాకరమైన విషయం. ఎలాగయినా పద్మనాభాన్ని, పద్మజను విడగొట్టాలని ఆమె ప్లాన్ లు వేయడం ప్రారంభించింది. అలా ఆలోచించగా ఆలోచించగా ఆమెకు బ్రహ్మాండమైన ఐడియా తట్టింది.
అప్పుడు పద్మజ ఒట్టి మనిషి కూడా కాదు, మూడు నెలల గర్భం.
ఓరోజు పద్మనాభం భార్య దగ్గరకు వచ్చి తిరిగి ఊరెళ్ళడానికి బస్టాండ్ కి వచ్చాడు. ఇది గమనించిన చిన్ని అతని వెనకే బయలుదేరి బస్టాండుకి చేరుకొంది.
అంతగా జనంలేరు అక్కడ.
"ఏం అల్లుడు- రాత్రి వచ్చి అప్పుడే బయల్దేరేశావ్?" అంటూ పలకరించింది చిన్ని.
అతను ఉలిక్కిపడ్డాడు. తనకు పెళ్ళయిన ఈ ఆరునెలల్లో ఎప్పుడూ మాట్లాడని ఆమె అలా వరసబెట్టి పలకరించడం వింతగా వుంది.
అతని నోటివెంట వెంటనే మాట రాకపోవడానికి అదో కారణమైతే రెండో కారణం మరొకటుంది.
చిన్నికి కూడా తఃని వయసే వుంటుంది. మహా వుంటే ముఫ్ఫై అయిదేళ్ళు వుండవచ్చు. అనుభవంతో బాగా విచ్చుకున్న ఒళ్ళు బంగారంలా మెరిసిపోతుంది. యవ్వనమంతా అక్కడే కాపురం పెట్టేసినట్టు ఎద ఎత్తుగా బలంగా కనిపిస్తోంది.
ఆమె భర్త చనిపోయి ఒకటిన్నర సంవత్సరమౌతుంది. అప్పటి నుంచి ఆమె అలంకరణ కొత్తగా, కొత్త అందాలను తెచ్చి పెడుతోంది.
ఇదంతా గమనించే అతనికి ఏం మాట్లాడాలో చప్పున తోచలేదు.
"అవునత్తా! ఊరికే వెళదామని!" అన్నాడు ఆమె అడిగిన అయిదు నిముషాల తర్వాత.
చిన్నత్తా అని సంబోధించి వుంటే బావుండేదని ఆ తరువాత అనిపించింది.
"నేను టౌన్ కి బయలుదేరాను. నువ్వూ వస్తావేమోనని అనుకున్నాను. టౌన్లో మగతోడు వుంటే ధైర్యంగా వుంటుంది" అంది.
"టౌన్ కి రావాల్సిన పనులు కూడా వున్నాయి గానీ చిన్నత్తా ఊరికెళ్ళి తరువాత వస్తాలే" అన్నాడు.
అంతలో బస్సు వచ్చింది.
అది ఎక్కితే పక్కనున్న ఓ చిన్న టౌన్ వరకే వెళుతుంది. అతను అక్కడి నుంచి దక్షిణం వైపు వెళ్ళే బస్సెక్కాలి. ఆమె పడమర వైపు వెళ్ళే బస్సును పట్టుకోవాలి.
ఆ స్టేజిలో బస్సులు ఎప్పుడోగాని ఆపరు. అందుకే అందరూ నిలిపిందే చాలని బస్సెక్కి చిన్న టౌన్ చేరుకొన్నారు.
బస్టాండ్ లో ఇద్దరు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు.
"రా చిన్నత్తా! బస్సు వచ్చేలోపు కాఫీ తాగొద్దాం" అని పిలిచాడు పద్మనాభం.
ఆమెతో మాట్లాడినట్టు తన అత్తవారింట్లో తెలిస్తే ఏమనుకుంటారో అని ఆలోచించడం లేదతను.
మనస్పర్ధలు వాళ్ళకిగానీ మనకి కాదుగా అని మొదటి మాట మాట్లాడినప్పుడే మనసుకు సర్ది చెప్పుకున్నాడు.
ఇద్దరూ హోటల్ కెళ్ళి కాఫీ చెప్పారు.
"టౌన్ కి రా అల్లుడూ- ఎలాగూ ఊరెళ్ళినా తిరిగి రావాలిగా- నాకూ తోడుంటుంది"
ఆమె మళ్ళీ పిలవడంతో అతను మెత్తబడ్డాడు.
ఆమె ఇది గమనించి మరింత బలవంతం చేసింది.
హోటల్ నుంచి బయటపడే సమయానికి అతను ఆమెతో వెళ్ళడానికి కమిట్ అయిపోయాడు.
ఇద్దరు పెద్ద టౌన్ కి బస్సెక్కారు.
టౌన్ లో దిగగానే ఆమె ?"ఇదిగో ఈ బంగారు గాజులకీ, చైన్ కి పాలిష్ వేసుకోవాలి. పెళ్ళప్పుడు చేయించిన నగలు, మెరుపంతా పోయాయి" అంది.
ఇద్దరూ చిన్న బజారుకి వెళ్ళారు. ఆ వీధిలోనే బంగారు పనివాళ్ళు ఎక్కువ.
వాటికి పాలిష్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయింది.
ఇద్దరూ ఓ హోటల్ కెళ్ళి భోజనం చేశారు.
"సినిమా- అదే మాట్నీ ఆట చూసి చాలా రోజులైంది అల్లుడూ వెళదామా" అంది హోటల్ నుంచి బయటకు రాగానే.
అతను సరేనన్నాడు.
థియేటర్ లో ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఆమె భుజాలు అప్పుడప్పుడు అతనికి తగులుతున్నాయి.
కొత్త స్పర్శ అతన్ని ఉద్వేగానికి గురిచేస్తోంది.
తొలుత అతనికి ఎలాంటి ఉద్దేశ్యం లేదుగానీ ఇప్పుడిప్పుడే కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయి. అయినా తనంతట తానుగా ప్రొసీడ్ కావడానికి భయపడుతున్నాడు. ఎంతైనా ఆమె తనకి అత్త వరసవుతుంది.
ఏదో సన్నివేశంలో నవ్వుతూ ఆమె ఆ సంతోషంలో అతని రెండు చేతుల్ని పట్టుకుంది.
ఒక్కసారిగా రక్తం ఎగజిమ్మినట్టు అతను ఉద్రేకంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు.
ఆమె అలవోకగా చేసిందో, ఉద్దేశ్య పూర్వకంగా చేసిందో తెలుసుకోవడానికి ఆమె ముఖంలోకి చూశాడు.
మసక వెలుతురు నిజాన్ని పట్టివ్వలేక పోయింది.
మరోసారయితే తన భుజాన్నంతా అతనికి ఆన్చి సీన్ ని ఎంజాయ్ చేసింది.
అతను కూడా మౌనంగా ఆమె స్పర్శను ఎంజాయ్ చేశాడు. సినిమా వదిలారు.
"అల్లుడూ ఇంకో చిన్న పని మిగిలిపోయింది. మా ఊరు ముసిల్ది ఒకామె పరంజ్యోతి థియేటర్ దగ్గరుంది. ఆమెతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెళదామా?" అని అడిగింది.
అతను తలవూపాడు.
