Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 34

 

    ఇద్దరూ ముసల్దాని ఇంటికి చేరుకున్నారు.
    
    ఆ ముసల్దాని పేరు నరసమ్మ.
    
    ఆమె వేరుశనక్కాయల్ని స్కూళ్ళ దగ్గర పెట్టుకుని అమ్ముకుంటుంది. ఒక కొడుకు వున్నాడు గానీ వాడెక్కడో దూరంగా బతుకుతున్నాడు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆమె తన పొట్టను తానే పోషించుకుంటుంది.
    
    ఎవరైనా విడి జంటలు ఆ ఇంటికి వచ్చి రాత్రి అక్కడ పడుకుని వెళుతుంటారు పోతూ పోతూ పదో, పదిహేనో రూపాయలు ఆమె చేతుల్లో పెడుతుంటారు.
    
    ఆ ముసల్ది అలా తన ఇల్లు ఓ రాత్రికి అద్దెకిస్తుందని మొదటిసారి చిన్ని తన వూరి వసంతతో వచ్చినప్పుడు తెలుసుకుంది.    

    వసంతది ఊర్లో అవతలి పక్కవీధి.
    
    ఆమెకీ, చిన్నికీ స్నేహం.
    
    ఓరోజు ఇంటికి కావాల్సిన పాత్రలు కొనుక్కోడానికి ఇద్దరూ టౌన్ కి వచ్చారు.    

    పాత్రలు కొనుక్కున్నాక ఇంటికి వెళదామంది చిన్ని.
    
    "ఎప్పుడో రాకరాక టౌన్ కి వస్తాం. ఓ సినిమా చూసి వెళదాం. ఫస్ట్ షో చూశాక నాకు తెలిసిన ఇల్లు ఒకటుంది. అక్కడికెళ్ళి పడుకుని ఉదయాన్నే ఫస్ట్ బస్ కి వెళదాం" అంది వసంత.
    
    ఇబ్బందిగానే ఒప్పుకుంది చిన్ని.
    
    థియేటర్ దగ్గరకు వెళ్ళేటప్పటికి ఓ వ్యక్తి వచ్చి వసంతతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటికే అతను టికెట్లు కొని రెడీగా వున్నాడు.
    
    అతను ముందు పోతుంటే "ఎవరే" అని అడిగింది భయంగా చిన్ని.
    
    "మా పుట్టిల్లు వెంకటాపురంలో పక్కింటి కుర్రాడు మొదట్లో నన్ను అతనికే ఇచ్చి చేయాలనుకున్నారు మావాళ్ళు. కానీ చాలా కారణాల వల్ల కుదరలేదు" అంది వసంత.
    
    సినిమా వదిలాక ముగ్గురూ ముసల్దాని ఇంటికి వచ్చారు.
    
    ఇల్లంటే అది ఇల్లుకాదు. చిన్నగది రేకుల కప్పు.
    
    ఎండాకాలం కాబట్టి ముసిల్ది చిన్ని బయట తిన్నెలమీద పడుకున్నారు. అంత ఉక్కలోనూ వసంత, ఆ కుర్రాడు ఎందుకు లోపల పడుకున్నారో తెలియనంత అమాయకురాలేం కాదు చిన్ని.
    
    ఉదయం అతన్ని వదిలేశాక "ఆ ముసల్ది ఎవరే? మనల్ని పడుకోనిచ్చింది" అని అడిగింది చిన్ని.
    
    "టౌన్ లో పెద్ద పెద్ద లాడ్జీలకు వెళ్ళలేని మనలాంటి వాళ్ళకు ఇలా కొందరు తమ ఇళ్ళల్లో చోటిస్తుంటారు. వచ్చినప్పుడు పది రూపాయలిస్తే చాలు. హోటళ్ళకన్నా ఇలాంటి చోటే బెస్ట్ ఎవరికీ అనుమానం రాదు. నీకు ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకో. ముసిల్ది మహా మంచిది" అని వివరంగా చెప్పింది వసంత.
    
    "నాకేం ఖర్మ - శుభ్రంగా మొగుడుంటే" అని అసహ్యించుకుంది చిన్ని.
    
    "నాకు మాత్రం లేడేమిటి" అని సాగదీసింది వసంత.
    
    అలా ఆ ఇంటి విషయం తెలుసు చిన్నికి. ఇంతకాలానికి ముసిల్దాని అవసరం వచ్చింది.
    
    కానీ- ఇది చలికాలం ముసల్ది ఎక్కడ పడుకుంటుందో తెలియడం లేదు.
    
    నరసమ్మతో అవీ ఇవీ మాట్లాడుతూ రాత్రి తొమ్మిది చేసేసింది చిన్ని.
    
    ఆ తరువాత పద్మనాభం తో "ఇప్పుడు ఎలా వెళతాంలే అల్లుడూ ఉదయాన్నే వెళదాం" అంది.
    
    అతనూ ఒప్పుకున్నాడు. అతనికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మొత్తం మీద ఏదో కొత్తగా, గమ్మత్తుగా వుంది అతనికి.
    
    ఇలాంటి ఊహలు వచ్చినప్పటి నుంచీ చిన్ని మరింత అందంతో కనిపిస్తుంది.
    
    ముసల్దే ఇద్దరికీ వండి పెట్టింది.
    
    వాళ్ళు భోజనం చేస్తుండగా పక్కింటామె కాబోలు వచ్చింది, "ఎవరమ్మా కొత్త గెస్ట్ లు" అని అడిగింది వాళ్ళని చూస్తూనే.
    
    "నా కూతురు అల్లుడూ అమ్మా" అంది ముసల్ది ఏమాత్రం తొణక్కుండా
        
    పొట్టకూటి కోసం ఎన్ని పాట్లో అని క్షణంపాటు జాలేసింది చిన్నికి.
    
    భోజనాలైపోయాక ముసల్ది తన చింకి చాపనూ, దుప్పట్నీ చంక నేసుకుని "నేనలా వెళ్ళి భజన మందిరంలో పడుకుంటాను ఇక్కడ చలి" అని బయల్దేరింది.    

    హమ్మయ్య అనుకుంది చిన్ని.
    
    ఇక అల్లుడ్ని ముగ్గులోకి దింపడమే మిగిలింది అనుకుంటూ ఒళ్ళు విరుచుకుంది.
    
    అలా విరుచుకోవడంతో పైట కిందికి జారి ఆమె ఎత్తయిన ఎద అతని కళ్ళల్లో అటు మెత్తగానూ కాకుండా, ఇటు గట్టిగానూ కాకుండా తగులుతోంది.
    
    తామిద్దర్నే ఇంట్లో వదిలి ముసల్ది దేవాలయానికి వెళ్ళిపోవడంతో ఎందుకనో ఒక్కసారిగా గుండె వేగం హెచ్చింది. అయితే చిన్ని మాత్రం లోపల ఏం వున్నా బయటికి తెలియనివ్వడం లేదు. పైపెచ్చు చాలా క్యాజువల్ గా వుంది. 'రా- భోజనం చేద్దాం' అంది చిన్ని పీటవేస్తూ.
    
    భోజనం ఎప్పుడు ఎవరు ప్రిపేర్ చేశారో తెలియదు. అందుకే ఒక్కక్షణం తటపటాయించి పీట మీద కూర్చున్నాడు.
        
    చిన్న అల్యూమినియం పాత్రలో అన్నం. అంతకంటే చిన్నగా వున్న మరో పాత్రలో పప్పుపులుసు వుంది. ఆకలి బాగా వుందో, కూరలు రుచిగా వున్నాయో తెలియదుగానీ అతను తృప్తిగా తిన్నాడు.
    
    బయటికి వచ్చి సిగరెట్ కాల్చుకున్నాడు.
    
    ఆకాశం నల్లగా బారుకు ఒంటినిండా పూసుకున్నట్టుంది.
    
    'వర్షం వచ్చేటట్టుంది' అని తనకు తనే చెప్పుకుంటూ వుండగా వర్షం చినుకు అతని ముక్కుమీద పడి చిట్లింది.
    
    లోకం మీద కోపం వచ్చినట్లు గాలి రివ్వున వీస్తోంది. తుఫాను సూచనలు కనిపిస్తున్నాయి. దూరంగా వున్న కొబ్బరి చెట్లు తమ మెడలను పట్టుకుని ఎవరో వంచుతున్నట్లు వంగి, మళ్ళీ పైకి లేస్తున్నాయి. రోడ్డుమీది దుమ్ము గాలి చిటికెన వేలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పైకి లేస్తోంది.
    
    చినుకులు ఎక్కువయ్యాయి.
    
    ఇక బయట వుండడం కష్టమనిపించి లోపలికెళ్ళాడు.
    
    చిన్ని అప్పటికి భోజనం చేసి గుంజకు ఆనుకుని రిలాక్స్ అవుతోంది.
    
    "బయట ఏమిటా చప్పుడు?" అని అడిగింది అతను లోపలికి రాగానే.
    
    "వర్షం"
    
    "అమ్మో" అని లేచి బయటికి వెళ్ళింది.    

    "వర్షం బాగానే కురుస్తోంది. తుఫానేమో" అంటూ వెంటనే లోపలికి వచ్చింది.
    
    "ముసలామె ఎక్కడికి వెళ్ళింది? మరికరాదా?" అని అడిగాడు.
    
    "రాదు తుఫాను కాదు గదా, ప్రళయం వచ్చినా ఇక రాదు. బాధ ఎక్కువై చలితో చావనైనా చస్తుంది గానీ లోపలికి తొంగిచూడదు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS