-: సంపుటహస్త లక్షణము :-
శ్లో!! కుఞ్చతాజ్గుళయశ్చక్రే సంపుటఃకరఈరితః !!
తా: చక్రహస్తపు వ్రేళ్ళను ముడిచిపట్టిన సంపుట హస్తము వచ్చును.
వినియోగములు :-
వస్తువులు దాచుటయందును, సంపుటమందును ఈ హస్తము వినియోగించును.
-: పాశహస్త లక్షణము :-
శ్లో!! శూచ్యానీకుఞ్చతేశ్లిష్టేతర్జన్యౌపాళఈరితః !!
తా: నూచిహస్తముల చూపుడు వ్రేళ్ళను వంచి కలిపిపట్టిన (మెలిక వేసిన)పాశహస్తము వచ్చును.
వినియోగములు :-
పరస్పర కలహమందును, త్రాటియందును, సంకెళ్ళు వేయుట యందును వినియోగించును.
-: కీలకహస్త లక్షణము :-
శ్లో!! కనిష్టే కుఞ్చతేశ్లిష్టే మృగశీర్షేతు కీలకః !!
తా: మృగశీర్ష హస్తముల చిటికెన వ్రేళ్ళను వంచిచేర్చి (కలిపి) పట్టినయెడల కీలకహస్తము వచ్చును.
వినియోగములు :-
తా: స్నేహమందును, ప్రియవచనము నందును ఈ హస్తము చెల్లును.
-: మత్స్యహస్త లక్షణము :-
శ్లో!! కరపృష్టో పరిన్యస్తో యత్రహస్తః పతాకికః !
కిఞ్చత్ప్రసారితాజ్గుష్టకనిష్టో మత్స్యనామకః !!
తా: పతాక హస్తములను ఒక చేతిపైన నొకటిచేర్చి చిటికెన వ్రేలిని, బొటనవ్రేలిని చాచిపెట్టి కదిలించుచు పట్టిన మత్స్యహస్త మగును.
వినియోగములు :-
ఇది మత్స్యమునందు వినియోగించబడును.
-: కూర్మహస్త లక్షణము :-
శ్లో!! కుఞ్చతాగ్రాంగుళిశ్చక్రేత్యక్తాంగుష్టకనిష్టితః !
కూర్మహస్తస్సవిజ్ఞేయః కూర్మార్ధేవినియుజ్యతే !!
తా: చక్రహస్తము మొనవ్రేళ్ళను వంచి చిటికెనవ్రేళ్ళు, బొటనవ్రేళ్ళు చాచిపట్టిన కూర్మహస్తము వచ్చును.
వినియోగములు :-
ఇది కూర్మము (తాబేలు), యందు వినియోగించును.
-: వరాహహస్త లక్షణము :-
శ్లో!! మృగశీర్షేత్వన్య కరస్తేసశ్శ్లిష్ట స్థితోయది !
కనీష్టాంగుష్టయోర్యోగాద్వరాహః కరఈరితః !
ఏతస్సవియోగస్తు వరాహర్దేతుయుజ్యతే !!
తా: మృగశీర్ష హస్తమును ఒకటిపై నొకటి చేర్చి కనిష్ట. అంగుష్టములను చాచిపట్టిన వరాహ హస్తము వచ్చును.
వినియోగములు :-
ఆది వరాహము (పంది) యందు వినియోగించును. భరత సూత్రము.
-: గరుడహస్త లక్షణము :-
శ్లో!! తిర్యక్తలస్థితావర్ధచన్ద్రావంగుష్టయోగతః !
గరుడో గరుడార్దేచ యుజ్యతే భరతాగమే !!
తా: అర్ధచంద్రహస్తములు రెండును అడ్డముగా బొటనవ్రేళ్ళు చేర్చిపట్టిన (కలిపి) గరుడహస్తము వచ్చును.
వినియోగములు :-
ఇది గరుత్మంతునియందు చెల్లును.
-: నాగబంధ హస్త లక్షణము :-
శ్లో!! సర్పశీర్షౌ స్వస్తికాచేన్నాగబంధ ఇతీరితః !!
తా: రెండు సర్పశీర్ష హస్తములు స్వస్తికముగా పట్టిన నాగబంధ హస్తమగును. (చేతులు మెలికలు వేయుచు)
వినియోగములు :-
పాము పెనవంటిరీతి బంధమందును. పాముల పెనయందును పొదరిండ్లు చూపుటయందును, అధర్వణ మంత్రమునందును వినియోగించును.
-: ఘట్వాహస్త లక్షణము :-
శ్లో!! చతురే చతురంన్యస్యతర్జన్యంగుష్టమోక్షతః !
ఘట్వాహప్తోచలేదేషః ఘట్వాదిషునియుజ్యతే !!
