Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 32


    తనకళ్ళముందు జరుగుతున్నదంతా నిస్సహాయంగా నిశ్చేష్టురాలైచూస్తూ నిలబడిపోయింది సృజన. ముక్కలు ముక్కలయి పోతోంది ఆమె మనసు.
    తనవల్లే.....తనవల్లే జరిగింది ఇదంతా! మేలు చెయ్యబోయి కీడుచేసింది కామక్షికి తను! కామాక్షి ఆకలి తీర్చడానికి ఎవరూగమనించకుండా చాక్లెట్లు ఇవ్వగలుగుతున్నానుకొంది.
    కానీ ఆ ఇంట్లో తలూపులకి కళ్ళుంటాయి. గోడలకి చెవులుంటాయి చూడకుండానే చూస్తూ ఉంటారు ఇక్కడి మనుషులు.
    తను కామక్షికి చాక్లెట్లు ఇవ్వడం వీళ్ళకి తెలిసిపోయింది. అయినా బయటపడకుండా ఏం ఎరుగనట్లు వాటిలో డ్రగ్స్ కలపడం మొదలెట్టారు. డ్రగ్స్ కి అలవాటుపడింది కామాక్షి. ఆమెకి ఇప్పుడు అన్నిటికంటే తీవ్రమైన బ్రౌన్ షుగర్ అలవాటు చేస్తున్నారు.
    బ్రౌన్ షుగర్ గురించిన ఆర్టికల్ ఒకటి చదివింది తను. తనకు తెలుసు అది ఎంత భయంకరమైన వ్యసనమో!
    మ్ముమీద దమ్ము పీలుస్తోంది కామాక్షి. తర్వాత నెమ్మదిగా గోడకి చేరగిలబడిపోయి కళ్ళు మూసేసుకుంది.
    దుఃఖంతో పెదిమలు వణుకుతున్నాయి సృజనకి. తనని తాను శపించుకుంది. ఒకసారి కాదు. వందసార్లు.....వేలసార్లు.
    తనుచాక్లెట్లు చేరవెయ్యకపోతే ఇలాంటి స్థితిలోకి వచ్చేది కాదు కామాక్షి. తప్పంతా తనదే! అవును! నిజం!
    ఇంతలో రంగేలీ వయ్యారంగా కులుకుతూ వచ్చింది అక్కడికి.
    "సృజన! అహల్యక్క పిలుస్తోంది! దా!" అంది మొగా ఆడాకాని గొంతుతో.
    నీళ్ళునిండిన కళ్ళతో ఒకసారి కామాక్షివైపు చూసింది సృజన. జోగుతోంది కామాక్షి.
    ఇంక చూడలేక చటుక్కున తల తిప్పుకుని గబగబలోపలికి వెళ్ళిపోయింది సృజన.
    గదిలో మంచంమీద అడ్డంగా పడిపోయి రోదించడం మొదలెట్టింది.
    ఆ సాయంత్రం మరో క్వార్టరు బ్రౌన్ షుగర్ ఇచ్చాడు ఉస్మాన్ కామాక్షికి రాత్రికి మరో క్వార్టరు ఇచ్చాడు. మొత్తం మూడుసార్లు!
    అంతే!
    ఆ తర్వాత వాళ్ళంతట వాళ్ళు ఇవ్వనవసరంలేకపోయింది.
    కామక్షే కాళ్ళావేళ్ళా పడికావాలని అడగడం మొదలెట్టింది.
    బ్రౌన్ షుగర్! బ్రౌన్ షుగర్! బ్రౌన్ షుగర్!
    బ్రౌన్ షుగర్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం పట్టడలేదు కామక్షికి. అదే ఆమెకు తల్లి! అదే తండ్రి! అదే దైవం!
    నెక్స్ టోఫిక్స్' ఎప్పుడు?
    మూడురోజులయ్యాక కామాక్షికి బ్రౌన్ షుగర్ ఇవ్వడంబంద్ చేశాడు ఉస్మాన్. గుండెలు అలసిపోయేలాశోకాలు పెడుతూ ఏడ్చింది కామాక్షి. నేలమీదపడి పొర్లింది. బతిమాలింది. శాపనార్ధాలు పెట్టింది. కాళ్ళు పట్టుకుంది. కాళ్ళతో తన్నింది. ఎర్రబడి పోయింది ఆమె మొహం. ఎంతతుడుచుకున్నా ముక్కుతడితడిగా అయిపోతోంది. కళ్ళలో నీళ్ళు నిండుతున్నాయి. జ్వరతీవ్రతతోవళ్ళు వెచ్చబడుతోంది.
    ఒక్క ముక్కలో చెప్పాలంటే డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటుపడ్డ శరీరానికి డ్రగ్స్ ఇవ్వడం మానేస్తే కలిగే "విత్ డ్రావల్ సిస్టమ్స్" అని అనుభవిస్తూ అలమటించిపోతోంది కామాక్షి.
    "ఉస్మాన్! నువ్వేం చేయమంటే అది చేస్తా! నాకు ఇంకొక్కడోసు....ఒక్కసారే....ఇంక అడగను" అంటోంది కలవరిస్తున్నట్లు.
    "ఏం చెబితే అది చేస్తావా!" అన్నాడు ఉస్మాన్ నవ్వుతూ.
    "ఏం చెబితే అది!" అంది కామాక్షి దృఢంగా.
    "కాళ్ళు నాకుతావా? కుక్కలెక్క?"
    వెంటనేవంగిపోయి ఉస్మాన్ పాదాలను నాలుకతో తడిచెయ్యడం మొదలెట్టింది కామాక్షి.
    దుష్టశక్తి కొద్దిగా శాంతించినట్లునవ్వాడు ఉస్మాన్.
    "బ్రౌన్ షుగర్!" అంది కామాక్షి.
    అతికష్టం మీద ఎవరో పీక పిసికేస్తుంటే ప్రయత్నపూర్వకంగా మాట్లాడుతున్నట్లుంది ఆ గొంతు.
    "ఇప్పుడే కాదు! ఇంకోపని చెయ్యాలి నువ్వు. ఆ తర్వాత! సరేనా? ఇప్పుడే వస్తాను ఉండు" అని అహల్య దగ్గరికి వెళ్ళాడు ఉస్మాన్.
    "ఏమంటోంది ఛోకిరీ?" అంది అహల్య జర్దాపాన్ ముడిచిబుగ్గలో పెట్టుకుంటూ.
    విరగబడి నవ్వాడు ఉస్మాన్.
    "కాళ్ళు నాకుతానంటోంది!"
    "మరికెందుకు ఆలస్యం? వచ్చాడాముసలాడు?"
    "రెడీగాకాచుక్కూచున్నాడు"
    "ఇట్రమ్మను"
    ఉస్మాన్ వెళ్ళి ఒక అరవై ఏళ్ళవృద్దుడిని వెంటబెట్టుకొచ్చాడు. సుఖరోగాలతో పుచ్చిపోయి నట్లున్నాడు అతను. పాపపంకిలంలోపుట్టి, పెరిగి, చావడానికి సిద్దంగా వున్న పాపిలా ఉన్నాడు.
    అతనినడక సహజంగాలేదు. కాళ్ళు రెండూ ఒకదానికి ఒకటి తగలకుండా దూరంగా పెట్టి నడుస్తూవచ్చాడు.  కాళ్ళుదగ్గరగా పెడితే ప్రాణాలు జిలార్చుకుపోయేంత బాధకలుగుతుంది అతనికి.
    ఊహ తెలిసినప్పటినుంచి సుఖ లాలసత్వంలో మునిగిపోయి సుఖరోగానికి గురయ్యాడు అతను.
    అలాంటివాళ్ళలో చాలామందికి ఉన్నట్లే అతనికి గట్టి మూఢనమ్మకం ఉంది.
    రజస్వలకాని అమ్మాయితో కలిస్తే సుఖరోగాలు నయమవుతాయని!
    నిర్భాగ్యురాలైన కామాక్షి ఇంకా పెద్దమనిషికాలేదు.
    "ఒకమ్మాయి వుంది మా దగ్గర! ఇవాళో రేపో అన్నట్లు ఉంది! మీరు ఎంత ఇవ్వగలరో చెబితే దాన్నిబట్టి ఆలోచిస్తాను" అంది అహల్య.
    "వెయ్యి ఇస్తాను" అన్నాడా ముసలాడు.
    నవ్వింది అహల్య. "వెయ్యా? చాలా తక్కువ! తాజ్ మాల్ ఇది! కాంపిటిషన్ చాలా ఎక్కువుంది. క్యూలో నిలబడి ఉన్నారు కస్టమర్లు! యాలంపాటే అనుకోండి ఇది. ఓకే మాట ఎంతిస్తారో చెప్పండి. నాన్సుడు బేరాలు నా దగ్గర కుదరన్!"
    "పదిహేనొందలు ఇచ్చుకోగలను" అన్నాడాముసలాయన నిజాయితీ పలికిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS