Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 32


    
    అవతల గోకుల్ సైలెంట్ అయిపోయాడు.
    
    ఇక లాభం లేదు. మొత్తం నన్ను నేనే బయట పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసినట్లని పించింది. ఆమె వున్న విషయం కూడా స్ఫురణకు రాలేదు.
    
    "గోకుల్! నువ్వు రేపు వచ్చీ. నేను మళ్ళీ మీ ఇంట్లో చేరిపోయాను" అని ఠక్కున ఫోను పెట్టేశాను.
    
    రెడ్డిసాని నావైపు అయోమయంగా చూడడం కూడా పట్టించుకోకుండా చకచకా నడుస్తూ అక్కడి నుంచి వచ్చేశాను. ఇక ఆ రాత్రి నిద్ర పట్టుంటే ఒట్టు.
    
    తెల్లవారిందనిపించగానే రెడ్డింటికి బయల్దేరాను. ఊర్లోని స్త్రీలు అప్పుడే లేచి వీధి ముంగిళ్ళను ఊడుస్తున్నారు. లోకానికి తెల్లరంగు పూస్తున్న చిత్ర కళాకారిణుల్లా వాళ్ళు అనిపించారంటే నేనెంత రంగుల ప్రపంచంలో నడుస్తున్నానో ఊహించండి.
    
    రెడ్డిసాని నవ్వుతూ నన్ను చూసి ఆహ్వానించింది. ఫోన్ సంభాషణ గురించి ఆమె పూర్తిగా మరిచిపోయింది. కొడుకొస్తున్నాడన్న ఆనందం అనుమానాలన్నిటినీ దూరంగా తరిమేసింది.
    
    అది నాకు మరింత సంతోషాన్నిచ్చింది.
    
    ఎనిమిది గంటల నుంచి చీమ చిటుక్కుమన్నా ఇద్దరం ద్వారంవైపు చూస్తున్నాం.
    
    సాయంకాలమైందిగానీ గోకుల్ రాలేదు.
    
    మా ఇద్దరికీ మనసు మనసులో లేదు.
    
    రాత్రి భోజనాలయ్యాయి.
    
    వీధి చివరలోనున్న వెంకురెడ్డి తండ్రి పదిహేనురోజుల క్రితం చనిపోయాడు. ఆ రోజు కర్మకాండ ఆ సందర్భంగా హరికథ ఏర్పాటు చేశాడు. వీధిలోనే నాలుగు టేబుళ్ళు వేసి స్టేజీ కట్టారు.
    
    మైక్ టెస్టింగ్ తరువాత హరికథ మొదలైంది.
    
    "చాముండీ! నేను అలా వెళ్ళి హరికథ వింటాను. ఇక్కడుంటే వాడు రాలేదన్న బాధ గుండెల్ని మెలిపెడుతుంటుంది వంటింట్లో అన్నీ సర్ది ముందు వరండాలో కూర్చో ఈరోజు మీ ఆయన ఊర్లో లేడన్నావుగా, నేను వచ్చాక నువ్వు వెళుదువు" అని రెడ్డిసాని వెంకురెడ్డి ఇంటికి బయల్దేరింది.
    
    పెదరెడ్డి అంతకుముందే వెళ్ళి వుండడంవల్ల ఒంటరిగా మిగిలిపోయాను. వంటిల్లంతా సర్ది ముందున్న వరండా మెట్లమీద కూర్చున్నాను.
    
    వెంకురెడ్డి తండ్రి మరణంతో మొత్తం ఊరికంతా వైరాగ్యం వచ్చి సన్యాసత్వం స్వీకరించి కాషాయం వేసుకోన్నట్లు ఎర్రటి సీరియల్ బల్బుసెట్లు గాలికి వూగుతున్నాయి. నుదుతున వున్న వీబూధి బొట్టులాగా పాల వెలుగులో మెరిసిపోతోంది.
        
    హరిదాసు దైవస్తుతి తర్వాత పద్మవ్యూహం కథ ప్రారంభించాడు. గొంతు బావుంది. ఊరు ఊరంతా చెవి అయిపోయినట్లు నిశ్శబ్దంగా వింటోంది.
    
    మొత్తానికి ఆ హరికథాగానం చాలా హాయిగా వుంది.
    
    ఇక మిగిలింది డాబామీద పరుపులెయ్యడమే.
    
    ఆ పని అయిపోతే ఇక ఆరోజుకి రెస్టే.
    
    అందువల్ల పరుపులు తీసుకెళ్ళి డాబా మీద వేశాను. దుప్పట్లు పరుస్తున్నప్పుడు మెట్ల దగ్గర అలికిడైంది.
    
    ఎప్పుడొచ్చావో తెలియదుగానీ గోకుల్ నన్ను చూసి నవ్వుతున్నాడు. నేను అలా నిలబడిపోయాను.
    
    మొదటిసారి జీవితంలో ఏదో తెలియని సంచలనం శరీరాన్ని బరువెక్కిస్తోంది కళ్ళు నా ప్రమేయం లేకుండానే టపటపా కొట్టుకొంటున్నాయి. ఎద పొంగి జాకెట్ ని అదుముతున్నాయి.
    
    నాలో ఆనంద ప్రవాహం మొదలైనట్లు ఒంటిలో పులకింత త్రుళ్ళింత లవుతోంది.
    
    మరి నా కళ్ళల్లో అలాంటి ఆహ్వానం చూపులతో రాశానో, ఎద పొంగులతో స్వాగతం చెప్పానో, పళ్ళెంలా వుండే బొడ్డులో కోరికను అగిలించి రమ్మన్నానో నాకైతే తెలియదుగానీ అతను సరాసరి నాదగ్గరికి వచ్చి, ఠక్కున కౌగిలించుకున్నాడు.
    
    అంతకుముందు పుట్టిగా, అదేదో మనకు సంబంధంలేని వస్తువులాగా కనిపించే చందమామ ఆకాశం గొప్ప మెజీషియన్ లా కడుపులోంచి తీసిన కుందేలు పిల్లలా అనిపించింది. వెధవగాలి అని మనం ఎప్పుడూ విసుక్కునే గాలి శరీరం పొరల్ని విప్పుతున్నట్లే తోచింది. కాంక్రీటు తప్ప మరో భావనను కలిగించని ఆ డాబా వికసించిన మల్లెపూల చెట్టుపొదలా భ్రమ కల్పించింది. మామూలు దూదితో కుట్టినట్లనిపించే పరువు సరాసరి స్వర్గానికి ఎగరడానికి తయారుగా వున్న పుష్పక విమానంలా అనిపించింది.
    
    అతని స్పర్శకు కళ్ళు చారడయ్యాయి. గుండెలు రెండింతలయ్యాయి. నడుము పిడికిడంత తగ్గింది. బొడ్డు అరచేతి మందాన విప్పారింది. ఇంకెక్కడో జరుగుతున్న మార్పు మనసును ద్రవిస్తోంది.
    
    అప్పుడు అతని వీపుచుట్టూ చేతులు వేసి గట్టిగా అదుముకున్నాను. ఆ ఒత్తిడికి సుఖం చిట్టినట్లు అతను మధురంగా మూలిగాడు.
    
    తనలోకి నన్ను కలిపేసుకోవాలని కాబోలు ముందుకు జరిగి మరింతగా పట్టు బిగించాడు. ఆ పట్టులోనే తెలుస్తోంది. అతని ఆవేశమంతా, కొంచెం తల పైకెత్తి నాలుకతో నా ముఖాన్నంతా తడుపుతున్నాడు. ఆ నాలుక కదలికలోనే అతని మొహం అంతా తెలుస్తోంది.
    
    మోకాళ్ళు వంచి ముఖాన్ని నా ఎదలో గుచ్చి, అటూ ఇటూ రాస్తున్నాడు. అలా రాయడం
లోనే అతని కోరికంతా తెలుస్తోంది. మరింత వంగి సముద్రపు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన పిడికిడంత గవ్వను మ్యూజియమ్ లో పెట్టి, డానికి ప్రైజ్ టాగ్ వేలాడదీసినట్లుండే బొడ్డును అతడి వేడిశ్వాస మరింత లోతు చేస్తుంది.
    
    అలా లోతు చేయడంలో అతని ఆరాటం అంతా తెలుస్తోంది.
    
    నిజానికి అద్భుతంగా అనుభవించాల్సింది మోహాన్నే కొన్నిరోజులుగా కోరికతో కాలిపోతున్న శరీరము తీరా ఆ సమయం వచ్చాక మాధుర్యంతో గడ్డ కట్టిపోవడం ఫీల్ అవ్వాల్సిందే జీవితం ఏమైపోయినా ఫరవాలేదు.
    
    ఆ క్షణాలు చాలు అనిపించే ఆ అనుభవం ముందు ఏదైనా తక్కువే.
    
    అవార్డులు, బహుమతులు, పదవులు, ఆస్తులు కలిసిరావడము, మన ప్రతిభకు గుర్తింపు రావడము-వీటన్నిటి కన్నా మోహంతో మరొకర్ని పెనవేసుకు పోవడం అద్భుతంగా వుంటుంది.
    
    అదిగో అలాంటి మొహంతో అతను పట్టుకున్నప్పుడు నేనేమై పోయానో నాకిప్పటికీ గుర్తే. శరీరానికి సుఖపడడము తప్ప మరోటి చేతకాదనిపించింది.
    
    నిలుచుంటే ఆ సుఖం కిందికి ఒలికిపోతుందేమోనన్న భయంతో కాబోలు అలానే అతన్ని పట్టుకుని పరువు మీదకి ఒరిగాను. నా కళ్ళల్లో చందమామ చేమంతి పువ్వులా తేలుతోంది.
    
    బొడ్డు దగ్గర ముఖం పెట్టి, "మైక్ టెస్టింగ్ ప్లీజ్" అన్నాడు.
    
    అంతకుముందెప్పుడూ అలా మనసంతా కదిలినట్లు నవ్వలేదు.
    
    బొడ్డు దగ్గర ముఖాన్ని గుచ్చి మైక్ టెస్టింగ్ ప్లీజ్ అంటే నవ్వు రాదూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS