Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 32

    "నేనూ అదే అన్నా!  రిజిస్ట్రార్ ఆఫీసులో డౌటోస్తుందే... నేనిప్పుడే డెలివరీ అయ్యి, అలాగే వచ్చేశానేమోనని! నాకీ చీరా వద్దు- ఈ నడుం కట్టూ వద్దూ! అదేదో ఆనంద్ కు కట్టండే... అంటే వీళ్ళు వినలేదే!" కంప్లయింట్ చేసింది... తల్లో పూలు జారిపోతుంటే చూసుకోకుండా!
    అవి సర్దుతూ- "చీరలో చాలా బావున్నావే!" జ్ఞాపిక మెచ్చుకుంది.
    "నిజంగా...నిజంగా! ఆనంద్ చూస్తె డంగ్ డంగ్ అయిపోతాడంటావా?" చిన్నపిల్లలా గెంతుతూ అడిగింది.
    "అంతే...!! చీర జారి కాళ్ళ దగ్గర కుప్పలా పడింది!
    స్ఫూర్తీ, కామినీ తలలు పట్టుకుని గాఢంగా  నిట్టూర్చారు.
    "నీ ఈ కోతి చేష్టలు చూసి డంగ్ డంగ్ అయిపోవడానికే ఆనంద్ జన్మెత్తి, కళ్ళద్దాలు ధరించి జీవితాన్ని త్యాగం  చేస్తున్నాడే వెర్రిమొహమా!" జ్ఞాపిక అసలు విషయం చెప్పేసింది.
    మళ్లీ చిన్నగా ఎగిరి చప్పట్లు కొట్టుకుంది.
    "ఓ...నో!" అనరిచి, "రెండుగంటలు కష్టపడి కట్టాం కదే! ఒక్క కామెంట్ తో ఒక్క గెంతుతో జారకొట్టావ్ కదే! ఇక మా వల్ల కాదు. నువ్వే కట్టు జ్ఞాపికా!" నీరసపడి సోఫాలో కూర్చున్నారిద్దరూ!
    ఇంతలోకి ఆనంద్ ను తీసుకొచ్చారు.
    ఆనంద్ సూట్ లో దర్జాగా, హుందాగా ఉన్నాడు. పెళ్ళికూతురి అలంకరణలో రేవతిని చూస్తూ జారి కింద కుప్పలా  పడిన రేవతి చీరని చూస్తూ ఆనందంగా-
    "రేవూ! చీర చాలా వెరైటీ గా కట్టుకున్నావు! అలా కాళ్ళ దగ్గర పువ్వులా చీర! పువ్వులో నిలబడ్డ నువ్వు   దేవకన్యలా అనిపిస్తున్నావు. డంగ్ అనిపిస్తుంది నాకు!" చెప్పేశాడు గబగబా.
    "నిజంగా..!" దగ్గరగా రాబోయి, చీర అడ్డంపడి ఆగింది.
    "నువ్వలా అమాయకంగా అన్ని  విషయాలకు డంగయిపోకు ఆనంద్! అది చెప్పేవి, చేసేవి నమ్మకు! దాని మొహం నువ్వు కళ్ళద్దాలు పెట్టుకుని చూడు ఆనంద్! దాని చీర పువ్వులా, అది పువ్వులో నిలబడ్డ దేవకన్యలా లేదు. చీర ఊడిపోయిన మీసాల్లేని మగరాయుడిలా ఉంది!" అని స్ఫూర్తి హెచ్చరించింది ఆనంద్ ను!
    ఆనంద్ కళ్ళద్దాలు పెట్టుకునేలోపు, సరిగ్గా చూద్దామనుకునేలోపు జరగబోయే అనర్థం ఊహించుకుని , హడావిడిగా  ఆనంద్ కు అడ్డంగా వచ్చి-
    "నువ్వు పదవే ముందు!" అని రేవతిని, తన వెనకే చీరనూ మోస్తూ రూమ్ లోకి నెట్టుకెళ్లారు జ్ఞాపికా, కామినీ!
    పది నిముషాల్లో అందరూ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి తిరిగొచ్చారు.
    ఒక పెళ్ళి దిగ్వాజయంగా అయింది.
    'మిస్ రేవతి'.... 'మిసెస్ ఆనంద్' అయింది. ఒంటరితనం- ఒంటరితనం కలిసి జంటరితనమయ్యారు. వీడియో కెమెరా వాళ్ళ అల్లరినీ, ఆనందాన్నీ వర్షించాయి. ఇన్నాళ్లూ వాళ్ళు ఒంటరివాళ్ళనుకున్నారు. ఇంతమంది ఆత్మబంధువులు అందించిన అమ్మలా కనిపించింది జ్ఞాపిక ఆమెకు! అనుకోకుండానే చేతులతో నమస్కరించింది.
    వద్దని జ్ఞాపిక తల అడ్డంగా ఊపింది. విజయం సాధించిన గర్వం జ్ఞాపిక కళ్ళల్లో
    హారతిపళ్లెం ఆయన మొహం చుట్టూ తిప్పబోతూ- గుండెలయ తప్పినట్టు ఆగిపోయింది. ఆయన ఆపోద్దన్నట్టు సైగ చేశారు. అన్ కాన్షన్ అవుతూ, అలాగే తిప్పి దాన్ని పక్కనపెట్టి తూలిపడబోతూ...చెమటలు కమ్మిన నుదురు ఎత్తి గుమ్మంవైపు చూసింది.
    'డాడ్! పూలదండలతో, పట్టుపంచె, లాల్చీలో...డాడ్! తన డాడ్! తన ప్రాణం! తన ఊపిరి తనకు అణువణువూ ఇచ్చిన డాడ్!  అణువణువూ నిండిపోయిన తన డాడ్! పెళ్ళికొడుకు రూపంలో..!'
    తూలి పడబోతున్న జ్ఞాపికను వెనుకవైపున్న రేవంత్  పట్టుకోవడానికి ముందుకు వస్తూ- తన తల్లి  ఎంచుకున్న వ్యక్తివైపు  గర్వంగా చూడాలని తల తిప్పాడు.
    తెరిచిన నోరూ, విప్పిన రెప్పా అలాగే.... అలాగే ఉండిపోయాయి! పడబోతున్న జ్ఞాపికను ఫ్రెండ్స్  పట్టుకున్నారు. రేవంత్ ను పక్కకు జరిపి-
    "రండి లోపలికి!" జంటను ఆహ్వానించారు!
    ఆ జంట వచ్చి సోఫాలో కూర్చోగానే అందరూ శిలల్లా  నిలబడిపోయారు. ఎవరిలోనూ కదలిక లేదు. జ్ఞాపికకు స్పృహలో ఉన్న కళ్ళు తెరవలేదు. రేవంత్ లో చలనం లేదు.
    "బిట్టూ...ఎనీథింగ్ రాంగ్?" తల్లి మనసు శంకించింది.
    రేవంత్ తేరుకున్నాడు.
    "నథింగ్ మమ్! యార్... నథింగ్ నథింగ్... ణా?" అన్నాడు  గబగబా ఫ్రెండ్స్ వైపు చూస్తూ.
    అందరూ "నథింగ్స్! జస్ట్.... సర్ ప్రైజ్!" అనేశారు తడబడుతూ!
    శరత్ గారు లేచొచ్చి కూతుర్ని ఒళ్ళోకి తీసుకున్నారు.
    "హనీ! హనీ.... మై డాళింగ్! నువ్వడిగిన  బర్త్ డే  బహుమతి 'అమ్మ'ను తీసుకొచ్చాను.... నీకోసం! చూడు...నచ్చిందా?" మెల్లగా తడుతూ అన్నారు.
    కళ్ళుతెరవలా జ్ఞాపిక! అందరివైపు చూశారు! అందరి మొహాల్లో నిరోమాయం!
    "తను నన్ను పెళ్ళికొడుకుగా చూసి ఆనందంతో షాకయింది! నథింగ్ విల్ హ్యపెన్! ఐదు నిముషాల్లో తేరుకుంటుంది!" అందరికీ అడక్కుండానే సమాధానం చెప్పారాయన.
    సుహాసిని లేచి- "జ్ఞాపికా! చూడు... నీ ఇష్టప్రకారమే నేను పెళ్ళిచేసుకుని వచ్చాను.... లే!" అంది.
    "వ్వాట్! హనీ ఇష్టప్రకారమా? అదెలా?" అన్నారాయన ఆశ్చర్యంగా.
    "నన్ను పెళ్ళిచేసుకొమ్మని కన్నిన్స్ చేసింది తనే!" అంది సుహాసిని తలవంచుకుని.
    "ఈజిట్! నాకు 'అమ్మ'  బర్త్ డే గిప్ట్ గా కావాలని నన్ను కన్విన్స్ చేసింది కూడా తనే!" ఇంకా ఆనందంగా చెప్పారాయన. "వెల్  డన్ మై చైల్డ్! నీకు కావలసిన మమ్మీనే తెచ్చాను...చూడు మరీ! మైడియర్ హనీ!  డాడ్ ను... వచ్చేశాను. నీకిస్తానన్న గిప్టు తెచ్చేశాను!" ఆయన మెల్లగా అనునయించసాగారు.
    సుహాసిని పూలదండల్తోనే కంగారుగా లోపలికెళ్లి  ఫ్రిజ్ లో వాటర్ పట్టుకొచ్చింది.
    అవి సిప్ చేయించసాగారాయన మెల్లగా! కళ్ళు అలాగే గట్టిగా మూసుకుని ఉండిపోయింది! ఫ్రెండ్సందరూ ఎక్కడి వాళ్ళక్కడ గోడకతుక్కుపోయారు మౌనశిలల్లా! జ్ఞాపిక వాళ్ళ  నాన్నను అడిగిన గిఫ్టేవిటో వాళ్ళకు తెలిసింది. 'అమ్మ-కావాలంది! కానీ, ఈ  అమ్మను కాదు!'... అని  వాళ్ళకు అర్థమైపోయింది. జ్ఞాపిక ఎందుకు కళ్ళు విప్పిడంలేదో తెలిసింది. అత్త కావలసిన వ్యక్తి- అమ్మగా మారి వచ్చి నిలబడింది! భర్త కావలసిన ప్రాణం 'అన్న'గా మారి గోడకు అతుక్కుపోయాడు! అన్నీ తెలిసి, ఏదీ మాట్లాడని విశ్వపుశూన్యంలో అందరూ తల తిరురుతున్న గ్రహాలయిపోయారు. విస్ఫోటనానికి ముందు నిశ్శబ్దమయ్యారు! ఇది విజయమా? అపజయమా?
    "ఏవయింది మీకు! జ్ఞాపికకు ఏంకాలేదు.... కంగారుపడకండి! మీ పార్టీ స్టార్ట్ చెయ్యండి.... నేను జ్ఞాపికను తీసుకొస్తాను!" అన్నారాయన మామూలుగా.
    అందరూ అక్కడ్నుంచి కదిలారు మౌనంగా...శామియానాలోకి! రేవంత్ అలాగే నిలబడిపోయాడు శిలలా!
    "ఏవండీ! మీకు తెలుసా? జ్ఞాపిక నన్ను పెళ్ళికి ముందునుండే 'మమ్మా...' అని  పిలిచేది! ఎప్పుడు 'మీలాంటి మమ్మ కావా'లనేది! రేవంత్ తో దెబ్బలాడేది...'మమ్మా ణా పార్టీ' అని ! కదూ బిట్టూ!" అంది సుహసిని. తలూపాడు రేవంత్ అడ్డదిడ్డంగా!
    "ఈ అబ్బాయే మనబ్బాయి!" రేవంత్ ను పిలిచింది సుహాసిని.
    వాళ్ళిద్దరి మధ్యా చోటిస్తూ..., జ్ఞాపికను ఒకచేత్తో గుండెలకదుముకుని, రేవంత్ ను ఇంకోచేత్తో దగ్గరకు తీసుకుని-
    "స్వీట్ చిల్డ్రన్! వియ్ ఆర్ వెరీలక్కీ హాసినీ!" అన్నారాయన-సుహాసిని చుట్టూ కూడా చేతులేస్తూ! వీళ్ళను పిలవడానికొచ్చిన ఫ్రెండ్స్ మళ్లీ మౌనశిలలయ్యారు.
    "రెడీనా....మీరెళ్లండి! నేను జ్ఞాపికను తీసుకొస్తాను" అన్నారాయన- సుహాసిని వైపూ, రేవంత్ తైపూ చూస్తూ!
    పద బిట్టూ! ఆనంద్, రేవతిల మారేజ్ డే సెలబ్రేట్ చెయ్యొద్దూ...!" అని హడావిడి పడింది సుహాసిని. అందరూ పైకెళ్లారు.
    "వావ్ఁ.... వాటె ఆరెంజ్ మెంట్స్! రియల్లీ... మీలో చాలా  ఆర్టిస్టిక్ టెస్ట్ ఉంది! ఇదెవరి కోసం?" అన్నారావిడ- 'హ్యాపీ ఎంగేజ్ మెంట్ డే' అనే టేబుల్ మీద ఆరెంజ్ చేసి వెలుగుతున్న కొవ్వొత్తిని చూసి!
    "అది ఇంకో కపుల్ కోసం! వాళ్ళు రావడం లేదని ఫోన్ చేశారు- అన్నీ ఆరెంజ్ చేశాక! పూర్ ఫెలోస్ కదరా!" అన్నాడు రేవంత్!
    ఎవ్వరూ పలకలా!
    "మమ్మా... వన్ మినిట్!" అని కిందకెళ్లబోతున్న రేవంత్ ను చెయ్యిపట్టుకుని ఆపింది సుహాసిని.
    "బిట్టూ! నా సెలక్షన్ నచ్చలేదా?" అడిగింది సూటిగా.
    "మమ్మా..." ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చేశాడు. "నీ సెలెక్షన్ చాలా బావుందమ్మా!"
    "మరెందుకళా మూడీగా, అదోలా ఉన్నావు..?!"
    "నాకు ఆనందంగా, చాలా ఆనందంగా, ఏదోలా ఉంది మమ్మా!" మళ్లీ కళ్ళల్లో నీళ్లు! అందరి కళ్ళూ చెమర్చాయి! రేవతికి వెక్కిళ్లోస్తే ఆనంద్ పొదివి పట్టుకున్నాడు.
    "ఆర్ యు హ్యాపీ? లేపోతే ఇప్పుడే పెళ్ళి కాన్సిల్ చేసుకుంటాను" లాలనగా అంది.
    "నో! ప్లీజ్... అలా అనొద్దు! నేను చాలా హ్యాపీ! కదరా! ఇవన్నీ మేమే ఆరెంజ్ చేశాం!నీకూ, డాడ్ కూ పూలదండలూ, అందరికీ కూడా పూలదండలూ! జ్ఞాపిక బర్త్ డే కేక్! ఇంకా  బెలూన్స్..., ఇంకా బంతిపూలు! బాలేదా... బావున్నాయి కదా! ఎంత ఆనందంగా ఉందో నాకు!" ఏడుపూ, నవ్వూ కలిపి మాట్లాడేస్తున్నాడు. "చెప్పండిరా... మాకూ ఆనందంగా  ఉందని!" ఒక్కో ఫ్రెండ్ దగ్గరకెళ్లి షోల్డర్స్ మీద కొడుతూ అడిగాడు- "చెప్పండిరా.... ఆనందంగా లేదూ! ఆనందంగా లేదూ!" అని.
    రేవంత్ భాలెన్స్ తప్పుతున్నాడని అర్థమయింది అందరికీ!
    కళ్ళల్లో నీళ్లు కనబడకుండా - 'జస్ట్  మమ్మా... దీపాలు వెలిగించేయండి. నేను డాడ్ ను తీసుకొస్తా!" నని కిందకు వెళ్లాడు.
    జ్ఞాపిక డాడ్ ను వాటేసుకుని వెక్కిళ్లు పెడుతోంది!
     "నో హనీ! ఏవయింది నీకు? నువ్వెంతో సర్ ప్రైజింగ్ గా అమ్మను రిసీవ్ చేసుకుంటావనుకున్నా! ఇంత ఎమోషన్ వస్తుందనుకోలా! నీకిష్టం లేదా చెప్పు- ఇప్పుడే మనింటికి వెళ్లిపోదాం!" అన్నారాయన  కూతురి తల  అదిమిపట్టుకుని.
    "డాడ్...ప్లీజ్ కమ్ అప్! అన్నాడు రేవంత్ వెళ్లి.
    "నో! మా డాడ్ ను 'డాడ్' అనొద్దూ! మా డాడ్ నాకు మాత్రమే డాడ్ నాకు మాత్రమె డాడ్! నీక్కాదు... వెళ్ళు! డాడ్! డాడ్! డాడ్!" మళ్లీ ఏడ్చేసింది.
     "జ్ఞాపికా..."స్థిరంగా పిలిచారు రేవంత్. చివుక్కున తలెత్తింది జ్ఞాపిక.
    "ఎన్నో సంవత్సరాలు మనకోసం ఒంటరిజీవితం గడిపి, ఇప్పుడు ఒకరికి ఒకరు తోడై కల్యాణంగా తిరిగివచ్చిన దంపతులను కన్నీళ్లతో రిసీవ్ చేసుకోవచ్చా! ఆనందబాష్పాలు అందించాలిగానీ! షాక్ లో నుంచి బయటకు రా! వాస్తవంలో నిలబడు! ఈ పెళ్ళి మనిద్దరం పట్టుబట్టి చేశామన్న విషయం గుర్తుతెచ్చుకో! ఆ జంట హృదయాల్లో అలజడి లేవకూ!" ఇన్ డైరెక్టుగా విషయాన్నీ, నిజాన్నీ తెలియజేశాడు.
    వెక్కిళ్ళు ఆపేసింది జ్ఞాపిక. లేచి నిలబడి-
    "సారీ డాడ్! మీరు పైకెళ్లండి....నేను ఫ్రెషయ్యి వస్తాను" అంది!
    ఆయన పైకెళ్తూ "రేవంత్ .... హనీని తీసుకురా!" అన్నారాయన.
    "ఓ.కే. డాడ్!" అన్నాడు.
    విసురుగా నెట్టింది రేవంత్ ను- "డాడ్ అనొద్దు... మా డాడ్ ను! అంది.
    "మరి- మా మమ్మా భర్త నాకేవవుతారు?" సూటిగా అడిగాడు.
    "అప్పుడు నువ్వు నాకేమవుతావో తెలుసా? కాలర్  బిగించి పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
    "అన్నయ్య!" చెప్పాడు స్థిరంగా!
    ఒక్క నెట్టు నెట్టింది!
    వెళ్లి గోడకు కొట్టుకున్నాడు.
    "నేనీ పెళ్ళి ఒప్పుకోను! నాకీ పెళ్ళి ఇష్టం లేదు!  నాకే  అమ్మ వద్దు! నేను నిన్ను వదులుకోలేను" పిచ్చిగా అరిచింది.
    "కూల్ డౌన్ గ్నపీ! తర్వాత ఏం జరుగుతుందో జరుగుతుంది. ఈరోజు ఎలా జరగాలో అలా జరగనీ!" అని దగ్గరకు తీసుకోబోయాడు- అనునయించడానికి!
    "డోంట్ టచ్ మీ!" దూరంగా జరిగి బాత్ రూమ్ లోకెళ్లి తలుపేసుకుంది. బాత్ రూమ్ డోర్ కానుకుని వెక్కివెక్కి ఏడ్వసాగింది! వెక్కిళ్లు బయటకు వినిపిస్తున్నాయి.
    "నాకు మాత్రం తెలుసా... మా మమ్మా మీ డాడ్ ను సెలక్ట్ చేసుకుంటుందని! నేనూ నీలా అనుకున్నవాడ్నేగా ! ఇందులో నా తప్పేం ఉంది.... నన్నెందుకు దూరం చేస్తున్నావ్! నా దోషం ఏవిటీ?" తలుపు ఇవతలినుండి అడిగాడు.
    గుండెబరువు మోయలేని బాధ వినిపించింది జ్ఞాపికకు- రేవంత్ గొంతులో!
    రెండు నిముషాల్లో ఫ్రెష్ అయ్యి తలుపు తీసింది.
    "జ్ఞాపీ.... నాకూ ఏంచెయ్యాలో అర్థంకావడం లేదు! ఈరోజు జరుపుదామా? లేక- ఆ జంటని వివాహం కాన్సిల్  చేసుకొమ్మని అడుగుదామా?" చెయ్యి పట్టుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు.
    అతడి  చెయ్యి మృదువుగా విడిపించుకుని దూరం జరుగుతూ అంది-
    "జరిగేది జరగనిద్దాం!" నిర్లిప్తం నిండుకుందప్పటికే తన కళ్ళలో!
    ఇద్దరూ పైకెళ్లారు! అందరూ విడివిడిగా ఏదో పనిచేస్తున్నట్టు యాక్షన్ లో ఉన్నారు. వీళ్ళు పెదాలు సాగదీసుకుని, లేని నవ్వును తెచ్చుకుని, సంతోషాన్ని పూనుకుని డిన్నర్ కానిచ్చి ఎక్కడివాళ్ళు అక్కడకు బయల్దేరారు!
    జ్ఞాపిక హాస్టల్ కెళ్లిపోయింది గర్ల్స్ తో! రేవంత్ ఫ్రెండ్స్ రూమ్ కెళ్లాడు- ఆ జంటను అంతకుముందే అలంకరించిన గదిలో వదిలేసి!
    ఆ జంట మురిసిపోయింది.  తమ పిల్లలు చిట్టిచిట్టి చేతుల్తో నిర్మించిన తమ వైవాహిక జీవనాన్ని చూసుకుని! 'ఇఆలంతి పిల్లలిద్దరికి తల్లీ, తండ్రీ కావడం మన ధన్యత!' అనుకుంది. ఆ ధన్యతలోనే మమేకమయింది!
    ఆరాత్రే కాళరాత్రయింది మరో జంటకు! జ్ఞాపిక నోరుతెరిచి మాట్లాడకుండా రాత్రంతా అలానే గోడకానుకుని కూర్చుండిపోయింది. తమ ఫ్రెండ్ కు తోడుగా అమ్మాయిలు కూడా అలాగే ఉండిపోయాడు మౌనంగా! జ్ఞాపికను ఓదార్చాలన్నా- ముందనలు వాళ్ళు షాక్ నుండి తేరుకోలా!
    రేవంత్ పరిస్థితీ అంతే! బాయ్స్ కూడా అంతే! కానీ, రాత్రి ఆగలేదు. ఒకవైపు ఓడిపోయామని, అలిసిపోయామని అనుకున్న జంటకు అలసట తీర్చిన రాత్రి! ఇంకోవైపు గెలిచామని విర్రవీగే జంటను నిర్వీర్యం చేసిన రాత్రి! గడిచిపోయింది. తెల్లావారుఝాముగా! నాలుగు కళ్ళు ఆనందంతో మూతపడలేదు...., నాలుగు కళ్ళు ఆవేదనతో మూతపడలేదు! అందుకేనేమో.... జీవితాన్ని ప్రాక్టికల్ గా తీసుకున్నా శ్రీశ్రీ చేత కూడా జీవితం-
    "ఎక్కడో  దూరాన కూర్చున్నావు-
    ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు!
    చిత్రమైన గారడీ చేస్తున్నావు-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS