Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 31

    ప్రాచ్యలిఖిత పుస్తశాలకు పదే పదే సందు దొరకినప్పు డెల్ల వెళ్ళుచు అక్కడి గ్రంధములు, అముద్రితములు పరిశీలించుచు, లోకల్ రికార్డు నెల్ల చదువుచు, అపూర్వాంశముల గుర్తించుచు, గుర్తించిన వానిని మిత్రుల కుత్తరముల ద్వారా తెలుపుచు తన్మయుఁ డనై విద్యావ్యా సంగము చేయుచుంటిని. ప్రాచ్యలిఖిత పుస్తక శాలాధ్యక్షు లొకతూరి లైబ్రేరియ౯ ద్వారా నా విషయములు తెలిసికొనిరి. తెలుఁ గుపుస్తకములకు కేటలాగు వ్రాయుచున్న నియోగించిరి. అది టెంపరరీ పోస్టు. అందుచే ఆ గుమాస్తా తొలఁ గెను. అతని పై ఆఫీసు వారి కతృప్తి ఆతడు తొలఁ గినపిదప ఆ పోస్టును స్థిరముగావించి యందు నన్ను నియోగించిరి.

    ఆనాళ్ళలో పావులూరు మల్లనకవిని గూర్చి నా మూలమున చర్చ రేగెను. శ్రీ వీరేశ లింగముపంతులుగారు కవుల చరిత్రలో వ్రాసిన తీరు సరిగాదని, పావులూరి మల్లన నన్నయ నాఁటి మల్లన మనుమఁ డని నేను లైబ్రరీలోని వ్రాఁ తపుస్తకములఁ బారిశీలించి పత్రికల ద్వారా నిరూపింప యత్నించితిని. అప్పటి మద్రాసు తెలుఁ గు పత్రిక శశి లేఖ వీరేశలింగముపంతులుగారి తరపున నిలిచి అనేకులు నా పై చెలరేగిరి. వీరావేశముతో చులుకూరి వీరభద్ర రావుగారు లైబ్రరీ పుస్తకములను నేను పసికుంకను జేరి దుర్బుద్ధితో మార్చివేయుచుంటినని, నేను వ్రాసినట్లు వ్రాఁ త ప్రత్రులలో లేడని, గవర్న మెంటువారు నన్నక్కడ నుంచరా దని బాహాటముగా వ్యాసములు వ్రాయసాగిరి. ఇంకెంద రెందఱో అటు తిరిగి నన్ను కటువుగా మందలింప సాగిరి. శ్రీ వీరేశలింగము పంతులుగారి పేరుప్రతిష్ట లట్టవి గనుక, వారి యా ధ్రసాహిత్యసేవ యంత మహనీయమయినది గనుక వా రెల్లరు నట్లు ద్రిక్తులయిరి. ఏవో కొన్ని పొరపాట్లుండిన నుండ వచ్చును గాక అని సరిదిద్ద నొల్లకపోయిరి.వారందఱు సత్య మేది యని పరిశీలింపక వ్రాసినవారే. ఒక్క వీరభద్ర రావుగారే సత్యము స్పష్టముగా గుర్తింపఁ దగియుకున్నను స్పర్దా బుద్ధితో సత్యదూరముగా వ్రాఁత సాగించిరి.

    ఆనాళ్ళలో ప్రాచ్యలిఖిత పుస్తక శాలలో మహావీరాచార్యుని గణిత సారసంగ్రహమును ప్రొఫెసరు రంగాచార్యులు గారు ముద్రించుచుండిరి. మల్లన గణితము దానికిఁ దెలుఁ గగుట నేను గుర్తించి రంగాచార్యులుగారి కెఱిఁగించితిని. అప్పుడు వీరభద్రరావుగారి వ్రాఁ తలను గూడ వారికి దెలిపితిని. అప్పుడు మా వివాదము నెల్ల హైకోర్టు కేసురికార్డులను పరిశీలించునట్టు పరిశీలించుచు శ్రీ వేపా రామేశము గారునావాదముసత్యమయినాదని, ప్రతివాదముశ్రుతిమించియసంబద్ధముగా, సత్య దూరముగా నున్నదని గుర్తించి, నా నౌకరికి కీడు దేఁజూచుచున్న వారి దురుద్రేకమునకు రోసి శ్రీ బయ్యా నరసింహేశ్వ  శర్మగారితో నొకనాఁ డు ముచ్చటించిరి. రంగాచార్యులుగారు నా కభయము చెప్పిరి. ట్రన్ల్సేటరు ఆఫిసువారు నా మిఁ ది నిందును దొరతనము వారికీ తెలుపునంతటి స్థితికి వచ్చెను.

    ఇంత జరగిన తర్వాత డొక్క చెదరి యందాఁ క నాకు ప్రతికూలముగా నున్నవా రొకరు లైబ్రరీ వ్రాఁత ప్రతుల పాఠముల నెల్ల శశిలేఖ పత్రికలో ప్రకటించిరి. అవి నా ప్రకటించిన తీరునే నిరూపించెను. మఱియు కాకినాడలో కార్చెర్ల శ్రీనివాసరావు గా రానువారు పావులూరి గణితపు తాలూకు ప్రతుల సంపాదించి యందలి పాఠములను శ్రీ పోలవరం జమిం దారుగారు, దురిసేటి శేషగిరి రావుగారు వగైరాల సంతకములతో ప్రకటించిరి. అవి యెల్ల నేఁ జెప్పినట్లే యుండెను. అంతతో నా వివాద మడఁ గారెను.

    ఒకనాఁడు-" నార్తరన్ సర్కార్సు అసోసియేష౯" మిటింగు (యునివర్సిటీ కాన్వ కేష ౯  తర్వాత )జరుగుచుండఁ గా నే నక్కడి కేగితిని. అచ్చటికి వచ్చియుండిన వీరభద్రరావుగారు నాయెడ వర్తించిన తీరునకు పశ్చాత్తాపము వెల్లడించిరి. మిత్రుల మయితిమి. ఆనాఁ టి సభలో మా పద్యములు పదింటిదాఁ క జదువుటయ్యెను. ఆ యేడే శ్రీ శొంఠి రామమూర్తిగారు గొప్పగా పరీక్షలో కడతేరి యింగ్లండుకు వెళ్ళు యత్నములో నుండిరి. నా  పద్య మొకటి-

        ఆంధ్రు లత్యంత దేహబలాడ్యు ల నెడు
        కీర్తి హెచ్చెను మన రామమూర్తి వలన
        ఆంధ్రు లత్యంత బుద్ధిబలాడ్యు ల నెడు
        కీర్తి హెచ్చెను మన రామమూర్తి వలన.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS