మన మంచిచెడ్డలకు మనమే ప్రవర్తకుల మనీ, మన సత్కార్యసత్సంకల్పబలముచే మన మంచిని మనమే సాధించు కొనఁ గల్గుదుము గా కనీ లోఁతయిన పట్టుదలతో వర్తించు వా రిట్టి చిలిపి చీ కాకులకు పాల్పడరు. మంచి శకునములకేన్నింటి కోదుష్పలితములు గలుగుచుండుట, దుస్స కునముల కేన్నింటికో సత్ఫలితములు గల్గుట గుర్తించుచున్నను గూడ శాస్త్రము ప్రమాణ మని ప్రామాణ్య నిశ్చయము లేకున్నను దానినే విశ్వసించుచుండవలె నని కేవో శ్లోకములుదాహరించుచు సమర్ధించుకొనుచుండుట యజ్ఞానపుఁ బిరికి తన మనవలదా? గర్భవతుల గ్రహణములఁ జూడరాద నుట, ఆదివారము నాఁ డుసిరిక పచ్చడి తినరాదనుట, రాత్రులందు లవణము పేరు- ఉప్పు- అన్న తెలుఁ గు పేరే- పేర్కొన రాదనుట (లవణము - బుట్టలోనిది- చెప్పరానిది ఇత్యాది విధములఁ దెలుప వచ్చును.) మొదలయిన విట్టివే.
మన తలఁపులలో, పలుకులలో, పనులలో మంచి చెడుగులు పెన వేసికొని సాగుచున్నవి. చెడుగు లేని యచ్చ మంచితనము మానవత కింకను నంద లేదు. జన్మము లెత్తఁగా నెత్తఁగా సత్త్వము హెచ్చికిళ్ళను దొలఁగించుకొని మెళ్ళను పడగా బంగారుకు వన్నె హెచ్చినట్టు మానవునిలో హెచ్చఁ జొచ్చెను. సద్భావ ప్రాబల్యము కలిగినప్పుడు ప్రపంచము నాలుగుంచుల ప్రజాసంఘము నెల్ల పాఱజూడఁ గల్గినప్పుడు దేశజాతి కులశ్రయము లయిన నిరర్ధకాచారములు తొలఁ గి పోగలవు.
స్వీయ లందఱు నానాఁడు నా వివాహమును గూర్చి వివాహిత యగుకన్యను గూర్చి యతృప్తి చెందిరి హాని, కొంత నాకు గూడ వెఱపు గల్గుస్థితివలె వేర్పడెను గాని కాలము కొంత గడచిన తరువాత నందఱనిశ్చయములును దల్ల క్రిందు లై పోయినవి. అవి ముందు ముందు తెలియఁ గలవు. అట్టి శుభ పరివ ర్తనము కలుగుటకు వివాహ మయిన తర్వాత సంవత్సరము లెనిమిది గడవవలసెను.
౧౪
సాహిత్యజీవనము-అరకుడుపు
నేను మద్రాసు వచ్చిన తర్వాత మైలాపూరులో మా బావగారితో కలసి యే యుంటిని గాని భోజనాదికము పూట కూటియింటి చేయుచుంటిని. ఆనాళ్ళలో మైలాపూరు కపాలీ శ్వరుని గుడిదగ్గఱ రంగమ్మ యను పుణ్యంగన హొటలు పెట్టుకొని యుండెను. ఆమె కొక్కడే కొడుకు. అతడు వ్యర్దుఁ డు. ఆయమ్మ భోజనముకు వచ్చు వారికి వారియిండ్లలోకంటె హాయిగా ననుకూలముగా నుండునట్లు వంట చేసి మంచి భోజనము పెట్టెడిది. ఆమె శ్రీ రెంటాల వెంకటసుబ్బారావు గారి దూరపు బంధువు. ఆమె భర్త చాలా శ్రోత్రి యుఁడు, పుణ్యాత్ముఁ డు న్నియా సుబ్బారావు గారు చెప్పుచుండెడివారు. ఆమెను శ్రీ సుబ్బారావు గారు కొంతకాల మింత నుంచుకొని పోషించి రఁ ట! కాని వృద్ధురాలు. స్వతంత్ర జీవనార్ధిని యామె యట నుండ నొల్లక వేర్వాసి వచ్చి హొటలు పెట్టినది. ఆమె పున్యస్మరణ మిప్పుడు నాకు ముదము గొల్పు చున్నది. నామిఁద నా మెను మాతృ శ్రీనిగా గారవించుచుండెడివారు.కొందఱు హొటలు పెట్టుట నీచవృత్తి యందురు గాని యే వృత్తి యయినను నిర్వంచనముగా ద్రోహము లేకుండ సాగించుచో నది పుణ్యాపాదకమే కాఁగలదు.
