Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 31

                   28. రోజులతరబడి నిద్రపట్టని 'ఇన్ సామినియా' వ్యాధి
    
    అదేమీతోగాని ఆదినారాయణకి అందరూ నిద్రపోయిన తరువాత గాని నిద్రరాదు. ఆలస్యంగా పడుకున్నా సరే మర్నాడు అందరి కంటె ముందే లేచి కూర్చుంటాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే అతను అన్నీ ఉన్నా ఏనాడూ కంటినిండా నిద్ర, కడుపునిండా తిండి లేనివానికిదెం లెక్క. పగలంతా వ్యాపార వ్యవహారాల్లో మనస్సు గందరగోళంగా ఉంటుంది. రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోవాలన్నా ఆలోచనలు ఆందోళనలు అతన్ని వెంటాడుతూనే వుంటాయి.

    అదినారాయణకి మానసిక చికాకువల్ల, ఆలోచనలవల్లనిద్ర పట్టడంలేదనుకుంటే మరికొందరుపైకి ఎ కారణం లేకుండానే రోజుల తరబడి సరైన నిద్రపోకుండా గడిపేస్తారుకొందరు రాత్రిళ్ళు గుడ్లగూబల్లాగా కళ్ళు తెరచి గదియారం వంక చూస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని పరిక్షిస్తూ వుంటారు. ఇలాగె రోజులు, నెలలు, సంవత్సరాలు నిద్ర పట్టక పోవడం కూడా ఒక వ్యాధే దీనినే విద్యాభాషలో "ఇన్ సామ్నియా" అంటారు. అసలు నిద్ర పట్టకపావువదాన్నీ, ఎవరికైనా నిద్ర పట్టినా సరిగ్గా పట్టకపోవడాన్నీ ఇన్ సామ్నియాగా భావించవచ్చు.

    సాధారణంగా పెద్దవాళ్ళు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు, పిల్లలు 10_11గంటలు నిద్రపోతారు. చంటిపిల్లలు రోజుకి 18గంటల వరకూ నిద్రస్తారు. ఎవరికైనా సరే పడుకున్న గంట తరువాత నుంచి మంచి నిద్ర పడుటుంది. తరువాత 4గంటలకు ఆ నిద్ర తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ ఒక గంటలోఆ నిద్ర తీవ్రత పెరుగుతుంది. అంటేఎనిమిది గంటల పటు వరసగా నిద్రపోయే వారికి మధ్యలో కొద్దిసేపు తీవ్రత తక్కువుగా ఉండి త్వరగా మెలుకువ రావాడానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనా వయస్సుకు తగినంత నిద్రపోయేవరు శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంటారు. 

      అరోగ్యవంతుడైన వ్యక్తికీ వరసగా  రెండు_మూడు రోజులు నిద్ర లేకపోయేసరికి కళ్ళు మండడం, తలనొప్పి అనిపించడం, తల తిరగడం, ఒళ్ళు తూలడం, నరాల బలహీనత, అనవసరంగా అందోళన కలగడం లాంటి లక్షణాలు ఉంటాయి. అంటేకాదు, శక్తిలేనట్లు అనిపించడం, ఆలోచనల్లో క్రమంలేక పోవడం, కనురెప్పలు బరువుగా మూసుకునిపోవడం, మాటలు తడబడడం, ఊరికినే కోపం, చికాకు కలగడం కూడా సహజమే కాని నిద్ర వ్యాధితో బాధపడే వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు చ్ఘాలా తక్కువ గోచరిస్తాయి.

    అటువంటి వ్యక్తులు సాధారణంగా న్యూరావుతిక్ వ్యక్తులైనా అయి ఉంటారు. లేదా సైకోతిక వ్యక్తులయినా అయి వుంటారు. న్యూరోటిక్ వ్యక్తులలో మానసిక అందోళన, ఆలోచన గందరగోళం, ఆవేశం ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికీ భయం, ఆదుర్దా ఉంటాయి. ఇటువంటి ఆందోళనలు, అంతులేని ఆలోచనలు ఉండడంతో నిద్రపట్టాడు. మరికొందరు మానసిక రోగులకు సైకోసిస్ వల్ల భ్రమలు_ భ్రాంతులతో మనస్సుకు స్థిమితం లేక నిద్ర పట్టదు.

    అలాగే నిరుత్సాహం (డిప్రెషన్) వల్ల కూడా కొందరు రోజుల తరబడి నిద్రపోకుండా గదిపేస్టూ ఉంటారు. అలాంటివారు అనవసరంగా చికాకు పడడం, దేనిమీదా సారైనా ఆసక్తి లేకపోవడం ఎప్పుడూ ముఖంలో ఏదో ఒక విచారం, నఖశిఖ పర్యంతం ఏదో రుగ్మత, నిరాశ, నిస్ప్రుహా ఉండడం, వ్యక్తులతో దూరంగా మసలడం ప్రతి దానికీ తెలికిగా అలసి పోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు కూడా నిద్రరని వ్యాధితో బాధపడడంసహజం. న్యూరాసిస్ గాని, సైకోసిస్ గాని, నిరుత్సాహం గాని మానసిక వ్యాధులే ఆ మనసిక వ్యాధుల తీవ్రతను బట్టి అసలు నిద్రపట్టకపోవడమో, కొద్దిగా నిద్ర పట్టడమా లాంటివి ఆధారపడి ఉంటాయి. డిప్రెషన్ లో బాధపడే చాలమందితాము ఫలానా కారణం వల్ల బాధపడుటున్నామని తెలుసుకోలేకపోవడంవల్లనే తక్కిన లక్షణాలన్నీఉన్నాయని భావిస్తారు. కాని నిద్రపట్టక పోవడం కూడా డిప్రెషన్ లో ఒక లక్షణమని గుర్తించరు.

    నిద్ర రాకపోవడానికి మానసిక వ్యాధులు కారణమైనా పక్షంలో కాస్తోకూస్తో నిద్రనుకూడా చేదగొట్టే ఇతర పరిస్థితులు సైతం "ఇన్ సామ్నియా" కి దోహదం చేస్తాయి. కొందరికి నిద్ర పట్టీ పట్టగానే కాలో_చెయ్యే అకస్మాత్తుగా ఎవరో పట్టుకుని గట్టిగా ఊపేసినట్లయిమెలుకువ వచ్చేస్తుంది కొందరికి మొత్తం శరీరాన్నే కుదిపేసినట్లు అవుతుంది. ఇలా జరగడానికి నిద్రపోయే వ్యక్తిలో ముఖ్యమైన నాడీకేంద్రాలు కూడా విశ్రమిస్తే చిన్న చిన్న నాడీ కేంద్రాలు స్వేచ్చ వచ్చినట్లయి ఒక్కసరిగా విచ్చలవిడిగా వ్యవహరించడమే కారణం.

    నిద్రపట్టకపోవడానికి తగిన మానసిక వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే ఆ వ్యక్తి కి త్వరగా కోలుకుంటాడు. మానసిక అందోళన, చికాకులు నిద్రపట్టకపోవడానికి కారణాలు అయిన పక్షంలో ట్రానకిలైజర్స్, డిప్రెషన్ అయితే అది పోవడానికి మందులు వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి. సరైన చికిత్స పొందకుండా ఊరుకుంటే ఆ వ్యక్తిలో వృత్తినైపుణ్యం తగ్గిపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా త్వరగా దెబ్బతింటుంది.       

                                    ****
      
                    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS