Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 31


    ప్రస్తుత పరిస్థితులలో గతిలేక గత్యంతరం లేక మన్ను తిన్న పాములాగా పడున్న కిరణ్ హుషారుగా కామినీతో ఉండలేకపోతున్నాడు.
    కామినీకి ఆమె కోరికలు తీర్చడానికి ఒగరూ పొగరూ వున్న పాత కిరణ్ కావాలి. ఆ కిరణ్ ఆకలిగొన్న మృగం లాంటివాడు. ఇప్పటి ఈ కిరణ్ కోరలు పీకిన పాము. కోరలు పీకిన పాము ఎలా కాటు వెయ్యలేదో కిరణ్ పరిస్థితి అలానే వుంది.
    కామినీకి అల్లరిచేస్తూ ఆటలు పట్టిస్తూ, కవ్విస్తూ, నవ్విస్తూ వుంటే కిరణ్ ని చక్కగా చూసుకునేది.
    కిరణ్ అలా వుండలేక పోతున్నాడు.
    ఓ ప్రక్క నేరం చేసిన భయం. రెండవ ప్రక్క కామినీ గుప్పెట్లో ఇరుక్కు పోయానన్న కసి, కసి తీర్చుకుంటేనే కాని కిరణ్ మనిషి కాలేడు. ఆ కసి తీర్చుకునే మార్గమే కనపడలేదు.
    కామినీతో మాట్లాడకుండా కళ్ళు మూసుకుని పడుకున్నాడు కిరణ్.
    కాసేపు తనని దగ్గరకు తీసుకుని కమ్మగా కబుర్లు చెప్పవచ్చు కదా! ఒళ్ళుమంటతో అనుకుంది కామిని.
    వాళ్ళిద్దరూ ఎవరి ఆలోచనలలో వారువుండి ఎప్పటికో నిద్రపోయారు.
    ప్రస్తుతం వారి కాపురం పాము ముంగిన ఒకే గూట్లో కలసి కాపురం పెట్టి జీవిస్తున్నట్లు.
    ఆ దాంపత్యం ఎంత చక్కగా వుంటుందో.
    ఈ దాంపత్యం అంత చక్కగానే వుంది.
    
                                   19
    
    "కిరణ్" చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
    అతను ఆలోచించినంతసేపు మధనపడటమూ, అర్ధం లేని ప్రశ్నలు, ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చిపట్టిపోతున్నది.
    కిరణ్ కి కొన్ని వ్యసనాలు వున్నాయి. అందులో ముఖ్యమైనది రకరకాల అమ్మాయిలతో తిరగడం, కిరణ్ తరచూ తన స్నేహితుడితో ఆడపిల్లలగురించి వెరయిటీసరుకు అంటూ వుండేవాడు. చిల్లర తిండ్లు, చిల్లర తిరుగుళ్ళు, వెరయిటీ అంటూ ఎక్కువమంది ఆడపిల్లలతో తిరగడం చేసే వాడు. అదే ఈనాడు అతని ప్రాణానికి ఉరిత్రాడులాగా చుట్టుకుంది.
    ఏదైతే స్పోర్టివ్ గా తీసుకున్నాడో అదే పెద్ద ఊబిలా మారింది. ఇంతకుమించి జటిలమైన సమస్య మరేదీ వుండదు.
    అతనివలన మోసపోయిన ఎందరో ఆడపిల్లల ఉసురు కొట్టిందేమో.
    అనితని వూరికినే అలా వ్రాసినంతమాత్రాన ఏదో ఆవేశంతో సరీగా కణతకె దెబ్బతగిలి చావాలా! ఇది హత్య ఎలా అవుతుంది.
    అతను కత్తి, రివాల్వర్ కాని వుపయోగించలేదు. పాయిజన్ ఇవ్వలేదు. అసలు కిరణ్ చేసింది హత్యేకాదు. కాని చట్టానికి వేయికళ్ళంటారు. నిజం చెప్పాలంటే చట్టానికి కళ్ళు లేవనాలి. అనితని హత్య చేయాలనీ ఎక్కడనుకున్నాడు. విదిలించికొట్టాడు. అలా విదిలించి కొట్టినప్పుడు ఎక్కడో అక్కడ దెబ్బ తగిలినా బాగుండేది. సరీగా కణతకే తగిలి చావాలా.
    కిరణ్ కి ఇది మొదటి బాధ.
    అది అలా జరిగింది సరే. ఏదో ప్లాన్ వేసి అనిత శవాన్ని వదల్చుకుందామంటే కామినీదేవి కామినీ పిశాచం లాగా పట్టుకుంది. తెలివిగా సహాయం చేసిన మనిషి అంతటితో వూరుకోవచ్చు గదా! తనూ లాభం పొందింది. పెద్దింటి కోడలయింది. ఇంకేం రోగం. నీ ప్రాణం నా గుప్పెట్లో వుంది సుమా! అని బెదిరింపులు. ప్రతి మాటలో చేతలో చూపులో నీవు హంతకుడివి అని గుర్తు చేయటం...
    ఇదంతా చూస్తూంటే?
    కిరణ్ కి పిచ్చిపట్టటంలేదు. ఈ శనిని వదల్చుకోవాలి. కామినీదేవిని అడ్డు తొలగించుకోవాలి. కామినీ నోరు శాశ్వతంగా మూగబోఎలా చేయాలి. అప్పుడుకాని మనశ్శాంతి ఆశించదు.
    కామినీ నోరు శాశ్వతంగా ఎలా మూయాలో తెలియకనే చాలా మదనపడుతున్నాడు కిరణ్.
    గంట క్రితం.
    కామినీ బాబాయి ఇక్కడకు వచ్చాడు.
    కామినీ బాబాయిని చూడంగానే బేవార్సు వెధవలా తెలిసిపోతుంటాడు. కాకీరంగు లూజు పాంటు, మాసిపోయిన పొడుగు చేతుల తెల్ల చొక్కా, చొక్కా పాంటులోకి టక్ చేసి టై ఒకటి కట్టుకొని వుంటాడు. పొట్టిగా లావుగా జేగురు రంగు కళ్ళు, పీచుల్లాగా వున్న తలకట్టు, దవడలు పీక్కుపోయి, మొహమంతా ముక్కే అన్నట్లుగా పెద్ద ముక్కుతో చూపరులకి ఆయన్ని చూడంగానే సద్భావం కలుగదు. బండ గొంతు వేసుకుని మాట్లాడటంగాక ప్రతీమాటకీ ముందు ఒక బూతుమాట చేరుస్తుంటాడు అలవాటుగా. మద్రాసులో ఐదు రోజులబట్టి భారీ వర్షాలు కురుస్తున్నాయి అంటే" "అరి నీయమ్మ అంతవరకు కురుస్తున్నదా! అంటాడు." అలా అమ్మలు, అక్కలు అన్నీ అతని మాటలోనే వుంటాయి. వల్గర్ మాటలు, చీప్ మెంటాలిటీ, సర్వవేళలూ ఆయన్ని అంటిపెట్టుకొని ఒక బీడీకట్ట, అగ్గిపెట్టె వుండవలసినదే. పేరు దామోదరం.
    గంటక్రితం దామోదరం ఇక్కడకు వచ్చాడు. వాడి తాతగాడి ఇల్లుబాగా ఎవరన్నా లెక్కలేదు. ఎవరినీ అడిగే పనిలేదు. సరాసరి కామినీ బెడ్ రూమ్ కన్నా వస్తాడు. లేక పోతే హాల్లో పెద్ద మనుషులు వచ్చేచోట సోఫాలో కాళ్ళు పెట్టుకుని కూచొని రెండు బీడీలు తగలేసి అగ్గిపుల్లల్ని ఆ బీడీ ముక్కల్ని అక్కడేపారేస్తాడు. సోఫా ప్రక్కనే వుమ్మికూడా వేస్తాడు. అదేమని ఎవరైనా అడిగితే బండ గొంతుక వేసుకుని నేనేమన్నా తప్పుడు లంజాకొడుకు పనిచేసేనా, వెధవది ఒక్క బీడీముక్క పారేశాను. కొంప మొత్తం వరదలలో కొట్టుకుపోయినట్లు లబలబలాడతారేమిటి? ముందా బీడీముక్క మొత్తం కలిసి అరంగుళంలేదు. నౌకరు తీసి పారేస్తే పోలా. నౌకర్లను పెట్టుకునేది దేనికి. వెధవది చిన్న బీడీముక్క పారేశానోలేదో, అదేదో పెద్ద నేరమయినట్లు పట్టుకొని అడగాలా? నా మర్యాద మంటగలవా! థూ...అని అక్కడే వుమ్మేస్తాడు.
    ఆయనతో రెండుమూడుసార్లు వాగ్యుద్ధం జరిగింది. ఆయన నోటికి దడచి ఇంట్లోవాళ్ళే నోరుమూసుకోవడం జరిగింది.
    ఇది ఇలా వుంటే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS