"గుడ్ మాణింగ్ సార్ అంది ప్రనూష.
"వెరీ గుడ్ గుడ్మాణింగ్...ప్లీజ్ బీసీటెడ్ అన్నాడు.
"కూచోబెట్టి మరీ తిడతాడేమోననుకుంది."
"కాఫీ....టీ..." అడిగాడు ప్రభాత్.
"ఛ.....వద్దుసార్..." అంది.
"ఇదేంటి కాఫీ, టీ ఇచ్చి మరీ క్లాస్ పీకుతాడా?"
"ఏంటీ..... మీలో మీరే ఏదో గొణుక్కుంటున్నారు. కొంపదీసి నన్నేం తిట్టుకోవట్లేదుగా..." అన్నాడు ప్రభాత్.
నో సర్..." అంది కంగారుగా.
"నిజంగా అదే అయితే...మీరు కాఫీ తీసుకోవాల్సిందే..." అంటూ ఫ్లాస్కులోని కాఫీని రెండు కప్పుల్లోకి నింపి, ఓ కప్పు ప్రనూషకు ఇచ్చి మరో కప్పు తను తీసుకున్నాడు.
"థాంక్యూసర్" అంది కాఫీ కప్పు అందుకుంటూ...
"దేనికి థాంక్స్....కాఫీని కప్పులోకి ఒంపి ఇచ్చినందుకా? కాఫీ ఆఫర్ చేసినందుకా?"
"రెంటికీ..." అంది.
"వెల్ కమ్...అన్నట్టు లేటుగా రావడం ఆనవాయితీగా పెట్టుకున్నారా?
ఒక్కసారిగా పొలమారింది. దరిద్రుడు కాఫీ ఇచ్చి క్లాసు పీకుతున్నాడా?" అనుకుంది.
"అయ్యయ్యో...కాఫీని తాపీగా తాగాలి..." అన్నాడు.
"వీడి క్యారెక్టరేమిటో నా కర్ధం కాదు" అనుకుంది ప్రనూష.
"ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆఫీసుకు ఆలస్యంగా వస్తానని శపధం చేశారా?
"అలాంటిదేమీ లేద్సార్...." అంది ప్రనూష.
"సరదాకు జోక్ చేసాన్లెండి. మీరెంత 'లేట్ గా వచ్చినా నోప్రాబ్లెం....బట్...వర్క్ మాత్రం ఫాస్ట్ గా, ఎర్లీగా జరగాలి....వర్క్ ఈజ్ వర్షిప్...అని నమ్ముతాన్నేను."
"నిజమే సార్..." అంది ప్రనూష.
"జనరల్ గా నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను....అది నా నేచర్....దాన్ని కొందరు అహం అని, మరి కొందరు పొగరని. యింకొందరు శాడిజం....అని అంటారు మరి మీరేమంటారు?"
ఆలోచనలో పడింది ప్రనూష. లేవు అనుకుంటారు. అయితే తమని పొగిడినా, తమని(?) వర్షిప్ తో చూసినా వెంటనే అవతలి వ్యక్తివైపు 'కన్సర్న్ ఫీలింగ్ పెంచుకుంటారు.
పొగడ్తలకు పొంగిపోవటం చాలా సాధారణమైన విషయం. ప్రనూష అందుకు మినహాయింపేమీ కాదు.
ప్రభాత్ "మీ కంపెనీ నాకు అనందాన్నిచ్చింది" అన్నమాటలు ఆమె చెవిలో గింగురుమంటున్నాయి. ఎదుటి వ్యక్తి తన లోని ఏదో ఓ ప్రత్యేకతను గుర్తించాడని అనుకుంటోంది. అదే సమయంలో తన భర్త తననెప్పుడూ అలా ప్రత్యేకించి చూడ్డం లేదని కూడా భావిస్తోంది.
ప్రభాత్ పట్ల ఆమెలో కన్ సర్న్ ఫీలింగ్ పె.....రు....గు....తోం....ద....ని....అనడానికి ఇది ప్రారంభ వాక్యం మాత్రమే.
* * *
ఆ రోజు అంతా హడావిడిగా వుంది. తండ్రి మరుసటి రోజు ఉదయమే వస్తాడు. రెండు బెడ్రూంలను సింగిల్ బెడ్రూంగా మార్చాలి. కిచెన్స్ ఒక్కటవ్వాలి...
తన గదిలో ఉన్న సింగిల్ కాట్ ని శ్రీచరణ్ సాయంతో అతని రూమ్ లోకి షిఫ్ట్ చేసింది. కిచెన్ లో వున్న సామాను అంతా ఓసైడ్ అల్మారాలో సర్దింది. తన గదిలో గోడకు వున్న చార్ట్ తీసి బీరువాలో దాచేసింది.
తండ్రి అక్కడికి వచ్చాక అతనికి తమ కాపురం మీద ఏమాత్రం అనుమానం రాదని డిసైడయ్యాక తృప్తిగా నిట్టూర్చింది. ఆ రాత్రి హాలులో వున్న సోఫాలోనే నిద్రపోవాలనుకుంది.
* * *
అలా హాలులో పడుకోవాల్సిన అవసరం లేదు. మీ గదిలో పడుకోవచ్చు" అన్నాడు శ్రీచరణ్.
"థాంక్స్ ఫర్ ది బోడి సలహా." అంది ప్రనూష.
"వెల్ కమ్..." అని భుజాలు ప్రేగ్ చేసి ఓసారి ప్రనూషవైపు చూసి "నీఖర్మ అన్నాడు.
"ఎందుకు?" ఉక్రోషంగా అడిగింది ప్రనూష.
"ఏ అర్ధరాత్రో నువ్వే భయపడి నా గది తలుపు తడతావు" అన్నాడు. "అక్కర్లేదు"
"ఓ...కె....నీ యిష్టం. ఎందుకైనా మంచిది.... నా గది తలుపు బోల్టు తీసేసిపెడతా....భయమేస్తే వచ్చి పడుకో నా శీలాన్ని మాత్రం.
"ఏంటి..... నాకు పొగరా? అహమా? శాడిజమా, అన్న ఆలోచనలో పడ్డారా?" అడిగాడు ప్రభాత్.
"అయ్యయ్యో....అలాంటిదేమీ లేదుసార్" అంది.
"మరి నాకుంది ఏమిటి?" అడిగాడు ప్రభాత్.
"ఓర్నాయనోయ్....ఇవ్వాళ ఇలా బుక్కయ్యానేంట్రా..." అని అనుకుంది మనసులో.
"ఏంటి.... వీడి క్యారెక్టర్ ఏమిటా..." అని అనుకుంటున్నారా?"
"లేదు... లేదు..." అంది. మనసులో మాత్రం "వీడికి టెలీపతి లాంటిదేమీ లేదుకదా!" అనుకుంది.
"ఏవండోయ్....నాకు టెలీపతి లాంటివేమీ లేవు" అన్నాడు ప్రభాత్.
"హమ్మో....వీడు గుండెలు తీసిన బంటు..." అనుకుంటూనే...." కొంపదీసి ఇది కూడా కనిపెట్టాడా? అనుకుంది ప్రనూష.
"ఎందుకో ప్రనూష గారూ...కొందర్ని చూస్తే కొన్ని ఒపీనియన్స్ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తాయి...వాటికి కారణాలు, లాజిక్కులు, రీజనింగులూ వుండవు...ఏమంటారు?" అడిగాడు ప్రభాత్.
నిజమే సార్."
"థాంక్యూ యు కెన్ గో..." అన్నాడు.
అసలు తనని ఎందుకు పిలిచాడో ... ఎందుకు వెళ్ళమంటున్నాడో అర్ధంగాకపోయినా ...బ్రతుకు జీవుడా....అనుకుంటూ లేచింది.
"వన్ సెకన్...." అని "థాంక్యూ" మంచి కంపెనీ ఇచ్చినందుకు...ఎందుకో నాకు ఒంటరిగా కూచొని తాగడం అలవాటు లేదు. ఒంటరి వాడ్ని కదా.... మీ కంపెనీ.....వెరీ వెరీ నైస్.... లాంగ్ లైఫ్ గుర్తుంచుకుంటాను.... "యస్..." అంటూ కోటు జేబులోని కర్చీఫ్ తీసుకొనికళ్ళు తుడుచుకుని (తుడుచుకున్నట్టు నటించి) ఫైలులో తలపెట్ట ఏదో చూస్తున్నట్టు వుండిపోయాడు.
ప్రనూష తన సీట్లో కూచొని ప్రభాత్ మాటలనే గుర్తుచేసుకుంటోంది.
తన కంపెనీ అతనికి అంతగా నచ్చిందా? మరి ఆ మాట తన భర్త అయిన శ్రీచరణ్ ఒక్కసారి కూడా అన్లేదేమిటి?" ఆమెలోని ఆమెచ్యూరిటీ బయటకొచ్చి ఆలోచిస్తోంది.
పొగడ్త...
పొగడ్త అనేది ఒక వ్యసనం లాంటిదే. కొందరు తమకే బలహీనతలూ ఏం చేయకే..." అన్నాడు.
"యూ..." కోపంగా దగ్గరలో ఏఏదైనా దొరుకుతుందేమో...అతని తలవైపు గురిచూసి విసురుదామనుకొంది.
శ్రీచరణ్ లోపలికి వెళ్ళిపోయాడు.
