Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 30


    
    బస్టాప్ కు వచ్చి నిలబడింది శశికళ.
    టైం పది కావస్తోంది.
    బస్సులో వెళ్ళాలంటే చికాకు.
    సాధ్యమైనంతవరకూ ఎవరో ఒకర్ని లిఫ్ట్ అడుగుతుంది. కనీసం భవిష్యత్తులోనైనా కారులో వెళ్ళాలని ఆమె కోరిక.
    రష్ గా వుంది బస్టాప్.
    సరిగ్గా అప్పుడే శ్రీచరణ్ స్కూటర్ మీద వస్తూ కనిపించాడు. రిలీఫ్ గా ఫీలై, గట్టిగా కేకేసి పిలిచింది.
    శ్రీచరణ్ ఎవరో తనని పిలిచినట్టు అనిపించి, వెనక్కి తిరిగిచూసాడు.
    బ్లూకలర్ చుడీదార్లో వుంది. అద్దాలు కుట్టిన ఆ చుడీదార్లో ఆమె అందం మరింత ద్విగుణీకృతమయింది.
    స్కూటర్ వెనక్కి తీసుకువచ్చాడు.
    "హాయ్ బాసు.... థాంక్ గాడ్.... ఈ బస్సులో ఎలా వెళ్ళాలా? అనుకున్నాను....సమయానికి వచ్చావు." అంటూనే చనువుగా అతని వెనకే కూచుంది.
    "కలికాలం..." అంది ఆ దృశ్యాన్ని చూసిన ఓ ముసలమ్మ శశికళలోని అంత అడ్వాన్స్ భరించలేక.
    "జయసుధ అందులో నటించింది. సినిమా బావుంది" ఆ ముసలమ్మ పక్కనే కూచొన్న ఓ నలభై ఏళ్ళ శాల్తీ తన సినిమా పరిజ్ఞానాన్ని విప్పి చెప్పాడు.
    బాసూ... ఇలా నీవెనగ్గా కూచొని. వెళ్తుంటే వెరయిటీగా ఉంది."థ్రిల్ గా ఫీలవుతూ అంది శశికళ.
    శ్రీచరణ్ కూడా థ్రిల్ ఫీలవుతున్నాడు.
    శ్రీచరణ్ నడుం చుట్టి చేతులు వేసింది.
    అప్పుడప్పుడు బ్రేక్ వేసినప్పుడు ఆమె మీద ఎత్తులు తగిలి గిలిగింతలుపెడుతున్నాయి.
    ప్రనూష కూడా ఇలా వుంటే ఎంత బావుండును. అనిపించింది.
    అంటీ, అంటనట్టు కూచొని, ఏదో సపోర్ట్ కోసం అన్నట్టు ఆన్చి ఆన్చనట్టు చేయి ఆన్చి...ప్చ్....అనుకున్నాడు.
    "బాసూ....ఏదైనా హోటల్ కు వెళ్ళి.....వేడివేడి పెసరట్టు, ఉప్మా లాగిద్దామా?" అంది.
    శ్రీచరణ్ కు కూడా ఆకలిగా ఉంది.
    ఉదయం టిఫినేమీ చేసుకోలేదు ఓపిక లేక.
    "అలాగే" అంటూ దారిలో ఉన్న "ఔల్సన్స్ తాజ్ హోటల్ ముందు స్కూటర్ ఆపాడు.
    ఉదయమే ఇంట్లో అన్నం మార్లేస్తానని అంది శశికళా తల్లి. దాంతో వళ్ళు మండింది.
    హాయిగా పెసరట్టు....ఉప్మా పిజ్జానో తినకుండా నిన్నటి అన్నాన్ని వేడిచేసి తినడమా? అనుకుంది. అందుకే తినకుండానే బయలుదేరింది. కడుపులో ఆకలి మొదలైంది. కంపెనీగా శ్రీచరణ్ కూడా ఉన్నాడు కనుక అడిగింది. తరచూ బయటతినడం ఎంతో ఇష్టం శశికళకు. ఇంచుమించు ట్విన్ సిటీస్ లో వున్న హోటల్స్ ని ఫుడ్ తిని ఎంజాయ్ చేయాలని ఆమెకోరిక. కానీ అందుకు తగ్గ డబ్బు అవకాశం లేదని బాధపడుతుంది. అందుకే అరుదుగా దొరికే ఇలాంటి అవకాశాలకోసం ఎదురుచూస్తూంటుంది.
    లోపలికి వెళ్ళి ఏ.సి రూమ్ లో కూర్చున్నాక బేరర్ మెనూ తెచ్చి ఇచ్చాడు.
    "ఏంతింటావ్?" అడిగాడు శ్రీచరణ్ మెనూ కార్డ్ చూస్తూ.
    "నాకైతే పెసరట్టు ఉప్మా అంది రిలాక్సింగ్ గా కూర్చుంటూ.
    "అయితే నేను పూరీ చెప్తాను....ఇద్దరం షేర్ చేసుకోవచ్చు." అన్నాడు.
    "అదెం కుదరదు ఎవరిది వాళ్ళే తిందాం....కావాలంటే నువ్వు మరో పెసరట్టు ఆర్డర్ ఇయ్యి..." అంది.
    "సరే తల్లీ నీ ఇష్టం" అన్నాడు.
    ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ కానిచ్చి వేడివేడిగా కాఫీ తాగి బయటపడ్డారు.
    హోటల్ మెట్లు దిగుతూ అంది శశి "శ్రీ...హాయిగా మనమిలా రోజూ హోటల్ కి వచ్చి టిఫిన్ చేసి వెళ్తే బావుంటుంది కదూ!" అంది.
    మరే....బానేవుంటుంది. కాకపోతే వున్న ఎం.డి. నా జీతం రెండింతలు చేస్తే మరీ బావుంటుంది" అన్నాడు అప్పుడే ఎనభై రూపాయలు బిల్లు కట్టి వచ్చిన శ్రీచరణ్.
    "అవును సుమా!" అంది ఒప్పుకుంటున్నట్టు శశి. స్కూటర్ మీద శశి ఎక్కాక కిక్ కొట్టాడు శ్రీచరణ్.
    కాస్త దూరం వెళ్ళాక అడిగాడు "ఏవిటి... వీపుకు గుచ్చుకుంటోంది" అని శశికళని.
    "యూ..నాటీ..." అంది స్కూటర్ కి అటోకాలు, ఇటో కాలు వేసి కూచున్న శశి.
    "నిజంగా శశీ...." అన్నాడు. వెంటనే గుర్తొచ్చినట్టు లోపలికి చేయిపోనిచ్చి... 'సారీ..." అంది. "ఏంటి..." అడిగాడు అయోమయంగా.
    "ఓ ఫోర్క్ నొక్కి లోపల దాచా...!! అంది.
    "దొంగతనమా?" సడన్ బ్రేక్ వేసి అడిగాడు.
    "ఛీ...జస్ట్ హస్తలాఘవం. మెజీషియన్లు మాయం చేస్తారు చూడు. అలా..."
    దానికీ....దీనికీ పొంతన లేదు. దీన్ని దొబ్బుకు రావడమే అంటారు." కోపంగా అన్నాడు శ్రీచరణ్.
    "అబ్బ...ఏదో ఒకటిలే..పెద్ద పెద్ద వాళ్ళకు ఇలాంటి అలవాట్లు వుంటాయిట...." అంది.
    "యింకా నయం....వాడు చూశాడు కాదు....పొరపాటున ఆ వెయిటర్ చూసి వుంటే....నీతోపాటునన్ను నాలుగు తగిలించి పంపేవాడు."
    "చూడ్లేదని ఎందుకనుకుంటున్నావ్?" అడిగింది శశికళ.
    "ఏమిటి...చూసేశాడా?" ఆశ్చర్యపోవడం శ్రీచరణ్ వంతయింది!" "శుభ్రంగా..." "మరే మన్లేదా?"
    "నేను చుడీదార్ లోపల ఫోర్క్ వేసుకుంటూంటే...అయిదు నిమిషాల పాటు చొంగ కార్చుకుంటూ చూసేడు.....అంతసేపు ఫ్రీషో....చూసాక ఇంకేముంటాడు ఆ జీవుడు..."
    "నీతో డేంజరే సుమా....!
    "పోనీ బాసూ ఏమనలేదుకదా వాడు."
    "అవున్లే...." అంటూ "స్లోచేసి తన బ్యాక్ పాకెట్ లోని పర్స్ తీసుకొని, చొక్కా జేబులో పెట్టుకున్నాడు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా!
    
                                                          * * *
    
    ఆఫీసులోకి అడుగుపెడుతూనే టైం చూసింది ప్రనూష. పదిన్నర.....
    "ఛీ.... ఇంత ఎర్లీగా "ఇన్ టైమ్ లో రావాలనుకున్నా కుదరట్లేదు" అనుకుంది ప్రనూష.
    "ప్రనూ....ఏంటి అలా డల్ గా వున్నావు?" అంది ప్రసూనాంబ.
    "కరెక్ట్ టైంకు రావాలని ఎంత ప్రయత్నించినా నాకు కుదరట్లేదు" అంది.
    "పోనీలే నిన్ను యిందాక మేనేజర్ గారు అడిగారు....ఓసారి కనిపించిరా..." అంది ప్రసూనాంబ.
    "బహుసా క్లాసు పీకుతాడేమో..." అనుకుంది మేనేజర్ క్యాబిన్ వైపు వెళ్తూ ప్రనూష.
    
                                                           * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS