"అలాగే"
ఈ కధను ఉహించని మలుపు తిప్పిన పందెం అది.
కిన్నెర అనే ఓ అందమైన ఆడపిల్ల కోసం లిప్తల్ని యుగాలుగా గడుపుతున్న రాఘవ అనే ఓ యువకుడిని ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయం తీసుకున్నారు.
అది నిజానికి ఎవర్ని సమస్యల్లోకి నెట్టినాగాని, ఆ మరుసటి రోజే భారీ ఎత్తున పెళ్ళి జరిగిపోయింది కిన్నెర రాఘవలకు.
ఎంతయినా మగాడికి పిచ్చెక్కించే సౌందర్యం కిన్నేరధి!
* * * *
రాత్రి తొమ్మిదిన్నర కావస్తున్నది.
పెళ్ళయిన మరుసటి రోజు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన జనానికి భారీగా భోజనాలు ఏర్పాటు చేస్తున్న వీర్రాజు- రాయుడిని పక్కనుంచుకుని అందర్నీ పరామర్శిస్తున్నాడు.
వీర్రాజులో యింత మార్పేమితో అర్ధం కానీ జనం ఉబ్బి తబ్బిబ్బయి పోతూ ఆయన్ని వేనోళ్ళ ప్రస్తుతిస్తుండగా--
మరో పక్క కిన్నేరకు శోభనం ఏర్పాట్లు జరిగాయి.
ముహూర్తానికి అరగంట ముందే పడక గదిలో సేటిలయిన రాఘవ ఖరీదయిన సినిమా సెట్టులాంటి గదిని, గత మెంత ఘనంగా జరిగిపోయిందో చాటిచెప్పే పందిరి మంచాన్ని, మంచం మీది మల్లెల సౌరభాన్ని పరిశీలిస్తూ పిచ్చెక్కినట్లు పోర్లుతున్నాడు.
ఇప్పటికి ఇంకా కలలా అనిపిస్తుంటే, అది కల కాదు నిజమే అనిపించుకోటానికి తొందరగా కిన్నెర గదిలోకి వస్తే బాగుణ్ను అని హైరానా పడిపోతున్నాడు.
సరిగ్గా అదే సమయంలో......
గదిలోకి పంపే ముందు కిన్నెరతో అప్పగింతల్లా కబుర్లు చెబుతుంది రాఘవ బామ్మ మాణిక్యమ్మ.
"వాడొట్టి గడుగ్గాయమ్మా! అందరి ముందూ ఏదో కొద్దిపాటి గంభిర్యాన్ని ప్రదర్శిస్తుంటాడు గాని ఆకతాయితనం జాస్తి అంతా వాళ్ళ తాతయ్య పోలికే. వేళకు అన్నం తినలనిపించినా అడగడు. ఆకలి జాస్తి అయాక అమాంతం మీదికి విరుచుకు పడతాడు. అంతెందుకు? నీతో పెళ్లి అనగానే భోజనం సైతం వంటపట్టనట్లు అన్నం మాని ఆకాశంలో చందమామని చూస్తూ రెండు రోజులు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు, సహజమే కదా! వయసు అలాంటిది మరి నేనేం చేసేదాన్ని? ఆ చందమామనే చూపిస్తూ వాడి చిన్నతనంలోలా గోరుముద్దలు తినిపించేదాన్ని. చెప్పకపోవడ మేమిటి?" ఓ రహస్యంలా అంది- "నా పెళ్ళయిన కొత్తలో వీళ్ళ తాతగారూ అంతే. వేళకు పడక గదిలోకి వెళ్ళకపొతే అంతెత్తు చిందులు తొక్కి తెల్లవార్లూ నేన్ను నిద్రపోనివ్వకపోవడమే నీకు విధించే శిక్షంటు వేగుచుక్క పొడిచేదాకా వెర్రి మొర్రి చేష్టలతో ఉపిరీ సలపనిచ్చేవారు కాదు. వీడు అలానే చేస్తాడని నేను ఎందుకంటున్నాను అంటే ఆ ఒడ్డు పొడవు, ఆ అల్లరి అంతా వాళ్ళ తాతగారిలాగే కాబట్టి."
బామ్మ గొంతు అస్పష్టంగా వినిపిస్తుంటే వెర్రి ఆవేశంతో ఉగిపోతున్నాడు రాఘవ నిజంగానే.
"ఇంకాపేయవే!" అని అరిచేవాడే కాని, అది తొలిరాత్రి కావడంతో నలుగురూ నవ్విపోతారని ఆగిపోయాను.
"మహానుభావుడు!" మాణిక్యమ్మ వదిలిపెట్టలేదు. అణువంత సిగ్గుతో తలవంచుకు నిలబడ్డ కిన్నెరతో యింకా గతం చెప్పి కంగారు పుట్టిస్తుంది. "అంత ఆల్లరి చేసినా నేనంటే ఎంత ఇష్టమని! తెల్లావారేక నేను నిద్ర మొహంతో బయటికి వెళ్ళలేక నీరసంగా పడుకుంటే, 'మొద్దు నిద్రేమిటే' అని మా అత్త సాధించబోతుంటే , తల్లిమీద తిరగబడి 'ఈ నెల అంతా వంటా వార్పూ నువ్వే చూసుకో అంటూ దబాయించి మరీ నన్ను కాపాడేవారు. నీకు అత్త పోరు లేదు కాబట్టి అలాంటి పడదనుకో!"
"బామ్మగారు!" చేతి గడియారం చూసుకుంది మంగ. "ముహూర్తం దాటిపోతుంది."
పనిమనుషులు సైతం గడియారాలు చూసుకుంటూ పనుల గురించి అలోచిస్తుంటే చాలా మచ్చటపడిన మాణిక్యమ్మ "మిగతాది రేపు చెప్తాను కాని, యింక నువ్వు లోపలికి వెళ్ళమ్మా! ఏమిటో నాది ముసలి ప్రాణం. మహా అయితే నేను బ్రతికేది నెలలే కాబట్టి నువ్వు తొందరగా నాకు మని మనవడ్నిస్తే మావారి పేరు పెట్టుకుంటాను."
మొత్తానికి వదిలిపెట్టింది మాణిక్యమ్మ.
ముత్తయిదువులంతా కిన్నేరని లోపలికి పంపారు.
బిదియపు చూపులు సరళ రేఖల్లా కాక నేల వాలాయి. శ్వాస కోల్పోతున్న మనసు భాషను మరిచినట్టు నేత్రాల్ని అర్ధ నిమిలికాలుగా మార్చి గుండెలో సన్నని అలజడిని నింపింది.
ఏడి.......కనిపించడెం?
గడియపెట్టిన చప్పుడు
ఉలికిపాటుగా వెనక్కి తిరిగింది.
తెల్లని బట్టల్లో వెన్నెల్ని ఒంటికి చుట్టుకున్నంత అందంగా నవ్వటం లేదు.
ఆమె ఏం జరుగుతున్నది ఆలోచించేలోగానే అం,అమాంతం పైకెత్తుకుని పక్క పైకి ఎత్తుకుపోయాడు.
అతని శ్వాస విప్లవ శంఖంలా వినిపిస్తుంటే అందోళనగా చూసింది కిన్నెర.
"ఐ లవ్యూ, కిన్నూ!"
పెదవులతో ఆమె ఆధారాన్ని నొక్కిపట్టి గొణుగుతున్నాడు.
అది ఉద్రేకం కాదు. ఉపిరి సలపనివ్వని ఉప్పెన.
కిన్నెర ఉక్కిరిబిక్కిరైపోతుంది. అది కూడా కాదు. ప్రపంచాన్నంత గెలిచినంత ఉన్మాదం లాంటి స్టితి ఆమెను చుట్టుముడుతుంది.
సరిగ్గా ఆ సమయంలో గుర్తుకొచ్చిందామెకు శత దినోత్సవం.
నూరు రోజుల తర్వాత తప్ప అతడికి తను వశం కాలేదు. రాఘవను గెలిపించి , తను ఓడిపోలేదు!
పట్టు సడలించుకోవాలని ప్రయత్నించింది కాని సాధ్యపడలేదు.
తన శక్తి చాలటం లేదో, లేక తన శరీరమే తనకు సహకరించడం లేదో ముందు అర్ధం కాలేదు.
ఇదేమిటి? స్వరాలు పలికే విపంచిలా తానింతగా స్పందించిపొతుందేం? ఇలా జరుగుతుందని తెలిసే భవ్య తనతో ఛాలెంజ్ చేసిందా?"
ఈ ఆలోచన రాగానే శక్తిని కూడగట్టుకుంది.
సుతిమెత్తగా కాదు, చాలా బలంగా అతన్ని నెట్టి ముందు దూరం జరిగింది. వెనువెంటనే మంచం దిగిపోయింది.
"ఏమైంది?" ప్రత్యర్ధిని గెలిచే వేళ రిఫరి విజిల్ వేసి ఆపిన చూశాడు.
"ఏమైంది, కిన్నెరా?"
"సిగ్గు లేకపోతే సరి!"
"అర్ధం కానట్టు చూశాడు. "అంత సిగ్గుమాలిన పని నేనేం చేశాను?"
"జవాబు చెప్పలేకపోయింది. "మీరు మరీ అంత మోటుగా ప్రవర్తిస్తారేం?"
