" ఒక దేవత గుడి ముందు మనం నిలబడి మాట్లాడుకుంటున్నాం భవ్యా! ఒక అపవాదుతో నన్ను అవమానించావు కాబట్టి, కాబోయే ఓ తల్లిగా నీ తప్పు సరిదిద్దుకో!"
"భవ్యకు తగలకుడని చోటనే తగిలింది. "మిస్ కిన్నెరా! నేనన్నది తప్పే అయితే, నా ముందున్న ఆ దేవత సాక్షిగా ఉపసంహరించుకోవటానికి అభ్యంతరం లేదు కాని, ఇష్టమైన వ్యక్తిని కట్టుకోబోతున్న దానివి నెల తప్పితేనేం అని సరిపెట్టుకోక నన్నెందుకిలా నిలదిస్తున్నావ్?"
"ఈ శరీరం నాది కాబట్టి. నేను కట్టుకున్న వాడైనా నా అనుమతి లేనిదే తాకలేడు కాబట్టి."
"పిచ్చి ఆహాకారంతో మాట్లాడకు!"
"ఇది ఆహాకారం కాదు నామీద నాకున్న నమ్మకం"
"మిస్ కిన్నెరా!" భవ్య సవాలుగా అంది--"నేను చేసిన వ్యాఖ్యను నేను ఉపసంహరించుకున్నాను. కాని, అహంకారంతో నువ్వన్నమాట ! నిలబెట్టుకోలేవని నేను సవాలు చేస్తున్నాను."
కిన్నెర భ్రుకుటి ముడిపడింది.
"నీ శరీరం మీద నీకు అధికారం ఉండేది నీకు పెళ్ళయ్యేదాకానే!"
"ఆ తర్వాత అది కట్టుకున్న వాడి సొత్తవుతుందా?"
"కాదు, నువ్వే అతడి సొత్తుగా అర్పిస్తావు!"
"అసంభవం!"
"నీలాంటి అహంకారం గల ఆడపిల్లల్ని చాలామందిని చూశాను."
"కాని, సవాలుగా అంగీకరిస్తే అది చూస్తాను."
"ఏం చేయాలో చెప్పు."
"హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
"కోరిన వాడిని కట్టుకుంటున్నావ్ కాబట్టి, అతడి కోరికని నిరోదించలేక నువ్వు తోలి రాత్రి ఓడిపోతావు."
"ఒక్క రాత్రే కాదు. ఎన్ని రాత్రులైనా అతడికి లొంగకుండా ఉండగలిగితే.....కాదు, ఎన్ని నెలలైనా ఉంటే?"
ఇద్దరు అమ్మాయిల మధ్యా పంతం చిలికి చిలికి గాలి వానగా మారిపోతుంది.
"ఎన్ని నెలలో అక్కర్లేదు కిన్నెరా! ఒక్క వందరోజులు. నీ మనసును నిగ్రహించుకుని, నీ భర్తకు లొంగకుండా జాగ్రత్త పడగలవా?" అంది భవ్య.
"పడితే?" టక్కున అడిగింది కన్నెర.
"నీ ఇష్టమొచ్చిన పందానికి నేను సిద్దపడతాను"
"మాట తప్పకూడదు!"
"కాని, నువ్వు లొంగలేదు అని నాకు తెలిసేదేలా?" అడిగింది భవ్య.
"సరిగ్గా వంద రోజుల తర్వాత అంటే నూట ఒకటో రోజున మనం డాక్టర్ దగ్గరికి వెళదాం. అక్కడ వర్జినిటి టెస్ట్ లో నేను కన్యనో, కాదో తేల్చుకుందాం"
భవ్య విభ్రమంగా చూస్తుంది.
"ఒకవేళ నేను నువ్వనుకున్నట్టు ఇప్పటికే కన్యను కాకపోయినా, నేనూ అప్పటికి నేను కన్యాత్వాన్ని కోల్పోయినా పరీక్షలో తేలిపోతుంది. ఏం? పందానికి సిద్దంగా ఉన్నావా?"
తండ్రుల నుంచి సంక్రమించిన అహం ఇద్దరికి.
"సరే" ధీమాగా అంది భవ్య. "చెప్పు పందెం ఏమిటి?"
క్షణం ఆగి అంది కిన్నెర- "నువ్వోడితే నీ తండ్రి రాజకియాలనుంచి తప్పుకోవాలి"
"ఏమిటి?"
"నువ్వు ఆ తండ్రికి కుతురివే అయితే నువ్వు నీ తండ్రిని ఒప్పించి తప్పించగలిగాలి" భవ్య అహాన్ని గాయపరుస్తూ అంది కిన్నెర.
అక్కడ గాలి గడ్డకట్టినట్టయింది.
"ఏం సిద్దమేనా?" అడిగింది కిన్నెర మళ్ళీ.
"నువ్వు వంద రోజులపాటు నీ భర్తకు లొంగకుండా ఉండటమే నిజమైతే ఈ పందానికి నేను సిద్దమే కిన్నెరా! నీకు నీ తండ్రి దగ్గర ఎంత అధికారముందో, నా తండ్రి మీద నా ప్రభావము అంతే ఉంది. కాని ఒక షరతు"
"చెప్పు"
"నీ ముందు వున్న దేవత నూకాలమ్మ సాక్షిగా మన పందెం భర్తకు తెలియకుండా గోప్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు."
"మాట తప్పనని ప్రమాణం చేస్తున్నాను" దర్పంగా అన్నది కిన్నెర.
"ఒకవేళ నువ్వు ఓడితే మరి నీ తండ్రి కూడా రాజకీయల నుండి సన్యాసం స్వీకరించేట్టు చేయగలవా?"
"తప్పకుండా!"
ఎందుకు ఎదురైనాగాని, ఒకరికొకరు తీసిపోని పంతాలతో చేతులు కలుపుకున్నారు.
"సరిగ్గా నూట ఒకటో రోజున......" భవ్య సాలోచనగా అంది.
"మనం డాక్టర్ దగ్గరికి వెళతాం. సరిగ్గా నీ శోభనం జరిగిన రాత్రి నుంచి నూట ఒకటో రోజున"
