Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 31

 

    ఇది నిజమే.....

 

    నాన్న ప్రతిక్షణం తను ఎలా వుండకుడదో చెబుతూ యిలా వుండటానికి కారణమయ్యాడు.....మంచి చెడుల మధ్య విచక్షణని తెలుసుకోటానికి నిజంగానే దోహదం చేశాడు.

 

    "మిస్టర్ ధన్వి....." రెండో మెంబర్ సాలోచనగా అడిగాడు. "మీలో అనన్య సామాన్యమయిన ఆశావాదం కనిపించటంతో పాటు అస్పష్టంగా నిరాశావాదము ధ్వనిస్తుంది."

 

    ధన్వి భావరహితంగా చూస్తున్నాడు.

 

    "మీరు అశాంతికి మూల కారణం ఏమిటి  అని అడిగిన మొదటి ప్రశ్నకి వాస్తవాన్ని అంగికరించడం అంటూ జవాబు చెప్పాడు. అది నిరాశావాదం కాదా?" ధన్వి జవాబు చెప్పలేకపోయాడు వెంటనే.

 

    ఇప్పటి తన మానసిక పరిస్థితిని బట్టి తనకీ అది నిరాశావాదంగానే అనిపిస్తుంది. కాని విశ్లేషిస్తే జవాబు ఆశావాదమే.

 

    "నా ఉద్దేశంలో వాస్తవాన్ని అంగికరించడము అంటే......" ధన్వి గొంతు జీరబోయింది. "ఏం జరుగుతున్నా చూస్తూ కూర్చోవటం కాదు సర్."

 

    "తను మాట్లాడుతున్నది వేదాంతమో లేక జీవిత సత్యమో ధన్వి ఆలోచించలేదు.

 

    "మనం సరిచేయలేని కొన్ని సమస్యలుంటాయి, వాటి గురించి తర్కించడంలో అర్ధంలేదన్నది నా అభిప్రాయం."

 

     "ఎందుకు? నాన్న శవం గుర్తుకోస్తుంటే గుండె గొంతుక్కి అడ్డం పడుతున్నట్టు ఈ అలజడెందుకని?

 

    శక్తిని కూడగట్టుకున్న ధన్వి "అలాంటి వాటిలో మనిషి మరణం ఒకటి.....అది ఏదోనాటికి ప్రతి మనిషి తన స్థాయితో సంబంధం లేకుండా అంగికరించల్సిందే....సో....."

 

    మెదడు మొద్దుబారిపోతున్నట్టుగా వుంది ధన్వికి.

 

    ప్రపంచంలోని నిస్త్రాణంతా అతడి పైకి దండయాత్ర చేసి ఓడించాలని ప్రయత్నిస్తుంటే తట్టుకోవడం కష్టంగా వుంది.

 

    "సో...." తన భావాన్ని మరింత విశదికరిస్తూ చెప్పాడు ధన్వి. "ఈ ప్రపంచంలో ప్రతి సమస్యనీ ప్రతి వ్యక్తీ నాలుగు ప్రశ్నలతో పరిష్కరించుకోగలడన్నది నా అభిప్రాయం."

 

    శతసహస్త్రప్రాకారాలుగా గుండె పగిలి అప్పటిదాకావున్న శక్తి హరించుకుపోతుంటే తను గెలిచితీరాలన్న కాంక్షతో ఉద్విగ్నంగా చెప్పుకుపోయాడు ధన్వి. "మొదటి ప్రశ్న......సమస్యేమిటి? రెండో ప్రశ్న సమస్యకి కారణం ఏమిటి? మూడో ప్రశ్న- సంస్యకున్న పరిష్కారమార్గమేమిటి? నాలుగో ప్రశ్న- ఈ పరిష్కార మార్గాలలో ఉత్తమమైనదేది? ఆగాడు క్షణం. "ఇది చాలు ఈ నాలుగు ప్రశ్నలకి జవాబులు తెలుసుకుంటే మన విషాదాన్ని చాలావరకూ తొలగించుకోగలం."

 

    అశాంతి అనే పదాన్ని విషాదంగా చెప్పి తప్పు చేశాడా?

 

    "ఇట్స్ ఇంట్రస్టింగ్ మిస్టర్ ధన్వి" సిన్హా అన్నాడు ఉత్సుకతగా. "మీరే ఏదో ఓ అంశాన్ని తీసుకుని 'కేస్ స్టడీలాగా' ఆ నాలుగు ప్రశ్నలకి జవాబు చెప్పగలరా?"

 

    "యస్సర్!"

 

    ధన్వి కళ్ళు మూసుకున్నాడు, నేత్రాంచలాలలో నిలబడ్డ నీటిబొట్టు చెంపల పైకి జారక ముందే గబాల్న కళ్ళు తెరిచాడు ధన్వి. "ఓ యువకుడి తండ్రి చనిపోయాడు. అది సమస్య.....మొదటి ప్రశ్నకి జవాబు తండ్రి మరణం....రెండో ప్రశ్న సమస్యకి కారణం వెదకడం , హార్ట్ అటాక్."

 

    నిద్రా జాగరణం మధ్య లాంటి స్థితిలో ధన్వి చెప్పుకుపోతున్నాడు. "మూడో ప్రశ్న- సమస్య కున్న పరిష్కారం వెదకడం .....ఆ స్థితిలో ఒక కుటుంబ యజమాని మరణం తర్వాత ఆ కుటుంబంలోని వ్యక్తులు చేయగలిగేది రెండే.......చావన్నది ఇనేనిటబుల్ అని తెలుసుకుని దుఃఖాన్ని దిగమింగుకుని ధైర్యంగా బ్రతకడం! లెదూ ఆ భాదని తట్టుకోలేక విషం తాగి చావడం."

 


    అర్దిక్తిగా అన్నాడు సిన్హా- నాలుగో ప్రశ్న.....మనకి తోచిన ఉత్తమ పరిష్కారం వేదకడమైతేఅలాంటి స్థితిలో మీరు వుంటే ఏం చేస్తారు?"

 

    "నేను బ్రతకడము, అమ్మని బ్రతికించుకోవడం."

 

    "యు కెన్ గో నౌ....." సిన్హా ఇంటర్వ్యూ పూర్తయినట్టుగా అనేసరికి అనవసరంగా తన వ్యక్తిగత సమస్య చర్చించానా అనుకున్న ధన్వి చివరి సారిగా అందరి దగ్గరా శలవు తీసుకుని వెళితే.....

 

    మిగతా కమిటీ సభ్యులు విభ్రమంగా సిన్హాని చూశారు.

 

    "ధన్వి చెప్పిన నాలుగు అంచెల విశ్లేషణ ప్రపంచంలో ఏ సమస్యకయినా అన్వయించదగ్గది, యునివర్శల్ గా సైకాలజీస్టులు అంగికరించినది, అయితే ధన్వి ప్రత్యేకించి ఓ తండ్రి మరణానికి సంబంధించిన అంశాన్ని కేస్ స్టడీగా తీసుకోటానికి కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరిచి వుంటుందని నేనుహించగలను. యస్ మైడియర్ కొలీగ్స్......మేధాశక్తికి మాత్రమే కాక అంతకుమించిన గుండె నిబ్బరానికి ఉదాహరణగా నిలబడగలిగే వ్యక్తీ ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కావటానికి అన్ని అర్హతలూ కలవాడని మీరు ఒప్పుకుంటే, ఎక్కడో తన ఇంటి దగ్గర తండ్రి శవం అంత్యక్రియలకి ఓ పక్క సిద్దంగా వున్న, ఇక్కడ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన ధన్వి సృష్టిలో సమర్ధుడైన యువకుడు."

 

    సిన్హాకి ఆ నిజం ఎలా తెలిసినా గానీ మిగతా మెంబర్సిద్దరూ అప్రరిలై చూస్తున్నారు ధన్విని గుర్తుచేసుకుంటూ.

 

    
                                          *    *    *    *

 

    ఉదయం పదిగంటల సమయం.....

 

    రెండు రోజులపాటు మార్చురీలో వుంచిన నీలకంఠం శవాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ధన్వి డ్లిల్లి నుంచి రాగానే.

 

    బ్రతకాతానికి మాత్రమే కాక శవాన్ని శవంగా బ్రతికించుకోవటానికిక్కూడా అద్దె చెల్లించడం అవసరమన్న సత్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాడు ధన్వి.

 

    బడలికగా కదులుతున్న కాలం.....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS