Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 29

    వెంటనే మద్రాసు వచ్చి నాకు పరిచితు లయిన డాక్టరు నంజుండ రావుగారికి చూపితిని. వారు ' ఇప్పటికే చేతి సంధిబంములు చాలా శిధిల మయి యున్నవి. డాక్టర్లు కిక చూపవద్దు.ఘ్రుతదధిప్లు తముగా భోజనము చేయుచు జబ్బుకు కొబ్బరి నూనె, వెన్న, నేయి వగైరా స్నేహద్రవ్యములు రాచి, చన్నీటి కొళాయి క్రింది ధారగా నీరు పడునట్లు హెచ్చుసేపు కూర్చుంటి వేని క్రమక్రమముగా చక్కబడగల ' దని చెప్పిరి, అట్లే చేయుచుంటిని, కానీ బోర్డు మిఁద సీమసున్న ముతో నే దేని వ్రాయుటకు రెండవ చేతి తోడ్పాటుతో గాని చేతి నెత్తి పట్టి యుంచ  లేక పోవుచుంటిని . మంచినీటి చెంబును కొన్ని గజముల దూరమేని మోసితేఁ జాలకుంటిని. కామక్రమముగా నంజుండ రావుగారు చెప్పినట్టు చేయుచుండుటచే కొంత సుగుణము కలుగుటో, అసౌకర్య సహనమున కలవాటు పడుటో యయ్యెను, కాని యది యేలో నానాఁటికి మనసు నిరుత్సాహగ్రస్తము కాఁజొచ్చెను.

    స్వజనము నా స్థితికి వగచుచు ' పెండ్లాడిన తర్వాత వీనిస్థితి వికృతి చెందు చున్నది. ఈ వువాహము వీనికి శుభ ప్రదముగా లేదు' అని పరోక్షముగా,సనసన్నగా ప్రత్యక్ష  ముగాను గూడ మాటాడఁ జొచ్చెను. నా కాడి దుస్స వ మయ్యెను.' ఇది దైవనినిర్ణీ తము ఇందు మంచినే గుర్తించవలెను గాని చెడుగులను వెదకి పట్టుచు మనసును చిదుక కొట్టుకొన రా దని నే నెదురాడితిని. అభము శుభము నెఱుఁగాని పదియేండ్లకుబాలికను గూర్చి గర్హణ నాకు చీకాకు గొల్పెను.అమాయిక యయిన యా బాలిక యెడ నా కమితాను రాగ మేర్పడెను. ఆ బాలిక వల్ల నేను మేలే పొందఁ తొణకిసలాడుచుండిన తలఁ పు.

                                          ౧౩

                                                  శకునపరిగణనము

    అజ్ఞాననిహత మై యుండుటచే దేశమంతట నిట్టి యపభ్రంశపు తలఁపులు నిండారి యున్నవి. పెద్దపెద్దలు, కొమ్ములు దిరిగిన విద్వాంసులు, మహొన్నతపదవులం దున్నవారు గూడ నింటనుండి యే దేని పనిమిఁ బయటకి వెడలునపు డెదురుగా నెవ్వరు వచ్చుచున్నారో యని పరిశీలింతురు. కుగ్రామములో నట్టి పరిశీలనము తగు నేమో, అర్ధవంతమగు నేమో కానీ వేలకొలఁది  ప్రజలు గల నగరములలో నట్టి పరిశీలనము చీకాకు గొల్పును. సమకాలమునే విధులలో ' పంచ శుభం పంచాశుభమ్' అన్నట్టు కలసికట్టు గానో, ముందు వెనుకలుగానో సభ ర్తుకలు, ఒంటి బ్రాహ్మణులు,పల్వురు న్రాహ్మనులు తారసిల్లుచునే  యుందురు. ఇందు పౌర్వాపర్యములు పర్యాలోచించుచుందురు. మఱియు ఫలాని  వితంతువు , ఫలాని బ్రాహ్మణుఁ డు ఎదురుగా వచ్చినప్పుడు  కార్యము నిర్వక్రముగా నిర్వహణము చెందు నని వారు విశ్వసించుట కలదు. వా రేట్లు వచ్చినప్పుడు మంచి జరుగుట కేవో కారణములు,యుక్తులు నసందర్భముగా నుపాంశువుగా గణిం చుట కలదు.

                     తాము ప్రయాణ మగువేళకు బ్రాహ్మణుఁడేని, ఆతఁడు, కుమారుఁడో,  బ్రాహ్మణుఁడోని,  అయినను నెదురుగా వచ్చినచో వ్యంగ్యముగా మొగము చిట్లించుకొని  గర్హించుటో, వాచ్యముగానే  తెగడుటో జారగు చుండును. తన యింటిలోని వారే అయినను, పరాయి వారె అయినను వితంతువు వచ్చినచో గర్హించుటయు, ప్రయాణము నిలుపుటయు జరుగుచుండును. మఱీవింత- ప్రయాణమయిన వ్యక్తి వితంతువే అయినను గూడ తనకు వితంతు వెదురుగా వచ్చిన గర్హించును. ఈ శకునపరిక్షల  వల్ల ప్రయాణముల నాపుకొనువారును, నని వార్యముగా పయన మయినను నిరిత్సాహనిహతిచే  ససిగా సాగించుకొనలేక ఎదురు వచ్చిన వారిని గర్హించుటచే  వారితోను, వారి కుటుంబముతోను దీర్ఘ వైరము తెచ్చుకొనువారును నెందఱో ఉన్నారు. రైలు ప్రయాణములకు శకున ముహూర్త పరిగణ నము చేయుచు అనుకూల శకునముహూర్తాదులకై కొంతసే పాగి పోవుటో చాల ముందుగానే పయన మగుటో చేయువారున్నారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS