Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 30

    "ఊ... ని తెలివితేట్లు అంతే కాబట్టి నువ్వు కాని స్టేబుల్ వి అయ్యావ్. నా తెలివితేట్లు ఎక్కువ కాబట్టి ఇన్ స్పెక్టర్  ని అయ్యాను..." అన్నాడు బంగార్రాజు గర్వంగా.


    బంగార్రాజు ఇలా అంటుండగా గోడ మీద నుండి ఇవతలికిఎవరోతుక్కుపారబోశారు. ఆ చేత్త్తంతా ఇద్దరి నెత్తి మీదా పండింది.

    ఏడుకొండలు గోడప్తెకి  కోపంగా చూసి  ఎదో అనబోయాడు/ వెంటనే బంగార్రాజు ఏడుకొండలు నోరు తన చేత్తో గట్టిగా నిక్కేశాడు.

    "కిక్కురుమన్నవంటే మర్డరు చేస్తా. నువ్వు ఇప్పుడు ఏమ్తెనా అన్నావంటే అవతల వాళ్ళకి మనం ఇక్కడున్నామని తెలుస్తుంది, మనం ఇక్కడ ఎందుకు దాక్కున్నాం అని ఆరాతిస్తే మనం ఇన్వెస్టిగేషన్  చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందాకే చెప్పానుగా మనం విషయాలన్నీ రహస్యంగా కూపీ లాగాలని అందరికి తెలియకూడదని....!"

    అతని మాట పూర్తి కాకముందే మళ్ళి బోల్డంత చెత్త గోడమీద నుండి ఇద్దరి తలలమిదా పండింది.

    "అలా గుడ్లప్పజెప్పి  చూస్తావేం?.. ముందరికి పద... ఇక్కడే ఉంటే చెత్తతో కూరుకుపోయేలా ఉన్నాం!" పళ్ళు బిగబట్టి మెల్లగా అన్నాడు బంగార్రాజు.

    " మిమ్మల్ని  ఫాలోకాకుండా నేనే ముందు వెళ్తే  మర్డరు చేస్తా...మర్డరు చేస్తా అని గోలేడ్తారుగా మరి!" అన్నాడు ఏడుకొండలు.

    "సరే పద... నా వెనకాలే తగలడు... " అన్నాడు ఇన స్పెక్టర్ బంగార్రాజు మెల్లగా అడుగులు వేస్తూ.

    కానిస్టేబులు ఏడుకొండలు అతన్ని అనుసరించాడు.  వాళ్లు నాలుగడుగులు  వేశారో లేదో రోడ్డుకి అవతలి ల్తెనుగావున్నా ఇళ్ళలో ఒక ఇంటి కాంపౌండ్  గోడమీద  నుంచి ఒక వ్యక్తి వీళ్ళని చూస్తూ పిలిచాడు...

    "ఓహొహొ ఇలా రండేహే!...."

    బంగార్రాజు ఉలిక్కిపడ్డాడు!

    'వీడు ఇలా పిలుస్తున్నాడు.  విడని మర్డరు చెయ్య. అసలు మమ్మల్నేనా పిలుస్తుంది' అనుకుని సందేహంతో తన చుట్టుప్రక్కల గమనించి చూశాడు.

  
       "అలా దిక్కులు సూత్తవేటి మిమ్మల్నే... ఇలా రండేహే ..." అన్నాడతను చేతిని గాల్లో ఊపుతూ.

       "నువ్వెళ్ళివాడేందుకుపిలుస్తున్నాడోకనుక్కో..."అన్నాడుబంగార్రాజుఏడుకొండలుతో.

    ఏడుకొండలు ఆ దిక్కుగా రెండడుగులు వేశాడు.

    "అక్కడేమ్తెనా అదిక ప్రసంగం చేశావో మర్డరు  చేస్తానంతే..." హెచ్చరించాడు బంగార్రాజు.

    ఏడుకొండలు రోడ్డు దాటి ఆ వ్యక్తి దగ్గరరకి వెళ్ళాడు.

    "ఏంటి పిలుస్తున్నావ్?" అడిగాడు అతన్ని.

    "ఈ ఇంట్లో కాస్త సిమెంట్ పని వుంది. గోడలకి ప్లస్టంగ్  చేయాలి.... నేను పెట్టుకున్న కూలిలు ఎగ్గొట్టారు...మీరిద్దరూ వస్తారేమోనని...." చెప్పాడు ఆ వ్యక్తి.

    "ఊహు... మాకు కుదర్దు..."  అన్నాడు ఏడుకొండలు.

    బంగార్రాజు, ఏడుకొండలు ఇద్దరి మీదా చేత్తపడపడంతో వేత్తి మిదంతా బూడిద, ఒళ్లంతా దుమ్ముతో అతనికి కూలివాళ్ళలా  కనిపించారు ఇద్దరూ.

    "రోజుకి ఇరవ్తే రూపయలిస్తానయ్య... రండి!" అన్నాడతను వెనుదిరిగిన ఏడుకొండలతో.

    "నేను చెప్పలేదా  మేస్త్రి వాళ్లు కూలిపని చేసే వాళ్లు కాదని, అడుక్కునేవాళ్ళే  అయి వుంటారని...." మేస్త్రితో అని ఏడుకొండలు వ్తెపు తిరిగి "ఏయ్ అబ్బాయ్ ని దగ్గర గిన్నెమ్తెనా ఉందా? మిగిలిన అన్నం, కూరలూ ఉన్నాయి.... వేస్తాను" అంది.

    ఏడుకొండలుకి ఆమె అన్నది వింటూనే తిక్కరేగిపోయింది. జుట్టు పిక్కుని బాధగా "ఈ." అన్నాడు.

    ఇంటావిడ ఏడుకొండలువ్తెపు జాలిగా చూసింది.

    "పాపం కాస్త పిచ్చికూడా వున్నట్టు వుంది. త్వరగా గిన్నేతే బాబూ అన్నం వేస్తాను" అంది.

    "మాకేంవద్దు...." కోపంగా అని విసురుగా వెనక్కి  తిరగాడు ఏడుకొండలకి.


    "ఈ..."  బాధగా మళ్ళి జుట్టు పిక్కున్నాడు.

    "ఏంటి ఊర్కూర్కే అలా జుట్టు పిక్కుంటున్నావ్ ? మనం ఎవరిమో తెలిసిపోయిందా" దగ్గరగా వచ్చిన ఎదుకోండల్ని అడిగాడు బంగార్రాజు.

    "ఎలా తెలుస్తుంది? వాళ్ళు  మనల్ని ఏ కూలివాళ్ళమో , అడుక్కునే వాళ్ళమో అని అనుకుంటూన్నారు" పళ్ళు బిగాబెట్టి అన్నాడు ఏడుకొండలు.

    "వెరీగుడ్... వాళ్లు అలా అనుకోడమే మంచిది పద!" అన్నాడు బంగార్రాజు గోడవారగా నక్కి నక్కి నడుస్తూ.

    ఏడుకొండలు అతన్ని ఫాలో అయ్యాడు.

    అలా ఒక ఐదు నిమిషాలపాటు నడిచాక వాళ్ళకి ఒక కిళ్ళిషాపు కనిపించింది. ఆ షాపు ఎదురుగానే  రంగనాయకులు ఇల్లు ఉన్నది.

    "పండుని ఇక్కడినుండే కిద్నీప్ చేశారు కాబట్టి ఈ కిళ్ళి  కొట్టువాడు వాళ్ళని చూసే అవకాశం ఉంది. వీడిని కొన్ని ప్రశ్నలు అడుగద్దం పద..." అన్నాడు బంగార్రాజు.


    ఇద్దారూ మెల్లగా కిళ్ళిషాపు  దగ్గరికి వెళ్ళారు.

    కిళ్ళి షాపువాడు తమలపాకులు తొడిమలు కత్తిరించుకుంటూ బిజీగా ఉన్నాడు. వీళ్ళ వంక చూడన్తేనా చూడలేదు.

    బంగార్రాజు తమని ఎవర్తెనా గమనిస్తున్నారేమోనని అటూ ఇటూ చూశాడు. ఉహు...  ఎవరూ లేరు.

    "ఏయ్... ని పేరేంటి?"

    అటు ఏటో చూస్తూ కిళ్ళి షాపు వాడిని ప్రశ్నించాడు ఇన్ స్పెక్టర్ బంగార్రాజు. ఎవర్తెనా చూస్తే తను కిళ్ళి షాపువాడితో మాట్లాడుతున్నట్లు ఉండకూడదు. అది అతని అవస్ధ.


     షాపువాడు ఒకసారి తలెత్తి చూశాడు. బంగ్రారాజు,ఏడుకొండలు ఇద్దరు ఏటో చూస్తున్నారు. తనని కాదనుకుని కిళ్ళి షాపు వాడు  తన పనిలో నిమగ్నమ్తే పోయాడు.

    "నిన్నే, ని పేరంటాని అడుగుతున్నాను.." ఇంకా ఏటో చూస్తూనే చికాకుగా అడిగాడు  బంగ్రారాజు.

    కిళ్ళికొట్టువాడు చటుక్కున తలెత్తి చురుకుగా వాళ్ళవంక చూశాడు.  వాడికి అర్ధమయ్యింది అతనే అడుగుతున్నారని.

    "ఏంది బె! మాస్తి ఎక్కిందా?... అట్లాడుగుతున్నరేంది? ఆ? అన్నాడు కోపంగా.


    "ఏయ్... తిన్నగా మాట్లాడు... మేమెవరని అనుకున్నావ్?  మర్డరు చేస్తా జాగ్రత్త!"

    తల అటు తిప్పకునే పళ్ళు  బిగించి అన్నాడు బంగ్రారాజు ఏడుకొండలు కూడా తల అటు తిప్పకునే పళ్ళు కొరికాడు.

    "ని యవ్వ.... బిచ్చగాండ్లకు కూడా ఈ పోగారేంది బె!... ఆ! మర్డరు చేస్తావ్?.... కత్తెర తీస్కుని ఒక్కటి పొడుస్తా..." కత్తెర  ఎత్తి అన్నాడు కిళ్ళి షాపువాడు.

    క్రిగంట కత్తేరెత్తిన  కిళ్ళి షాపువాడిని చూసి  ఏడుకొండలు  కంగారుపడ్డాడు.

    "లాభం లేద్సార్... మీ ఐడేంటిటి కాస్త చూపించండి.... లేకపోతే కత్తెరతో పొడిచేలా ఉన్నాడు" అన్నాడు ఏడుకొండలు.

    బంగ్రారాజు కిళ్ళి షాపువాడివంక కొరకొర చూస్తూ జేబులోంచి ఐడేంటిటి  కార్డు తిసి చూపించాడు.

    "ఏందిది?.. కార్డులు  సూపి అడుక్కుంటూన్నార్. చల్.. పొండి" అంటూ పది ప్తెసలు తిసి వాళ్ళకి  ఇస్తూ అన్నాడు కిళ్ళి షాపువాడు.

    "నీకు చదవడం రాదా?" ఆడిగాడు ఏడుకొండలు.

    "వస్తే మంచిగా ఉద్యోగం చేస్కుంటా... గిట్ల పాన్ దుక్నం ఎందుకు  పెట్టుకుంట?" అన్నాడు చికకుగా వాళ్ళవంక చూస్తూ.

    "ఈయన ఇన్ స్పెక్టర్... నేను కానిస్టేబుల్ ని. ఒక కేసు గురించి ఆరా తియ్యడానికి వచ్చాం..." అన్నాడు ఏడుకొండలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS