ఆ మాట చెప్పగానే కిళ్ళిషాపువాడు గబుక్కున లేచి నిలబడ్డాడు. మనిషి చాలా కంగారు పడిపోయాడు.
"అర్రే సార్!... ఆ విషయం ముంద్గాలనే చెప్పరాదూ? నాకేం పాపం తెల్వదుసాబ్ ..." ఆన్నాడు భయపడ్తూ.
"ఊ...ఊ... కాస్త మెల్లగా మాట్లాడు. ఎవరైనా వింటే మంచిది కాదు. మేము అడిగిన ప్రశ్నలకి జగ్రత్తాగా ఆలోచించి జవాబు చెప్పు" అన్నాడు బంగార్రాజు.
కిళ్ళి షాపువాడు బుద్దిగా తల ఊపాడు.
బంగార్రాజు పండు కిడ్నాప్ గురించి చెప్పి ఆ రోజుగాని అంతకు ముందు గాని ఒకటి రెండు రోజులు ముందుగాని ఎద్తేనా ఏమ్తెనా అనుమానాస్పదమైన సంఘటనలు జరిగాయా అని అడిగాడు.
కిళ్ళి షాపువాడు కొన్ని క్షాణాలపాటు ఆలోచించాడు. వాడికి చటుక్కున గుర్తుకు వచ్చింది. కన్నారావు వాడి దగ్గరికి రావడం, ఎదురింటి గురించి అంతా ఇన్పర్మేషన్ అడగడం - అంతా గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్నే బంగార్రాజుకి చెప్పాడు.
"వాడేలా ఉంటాడో చెప్తావా?" బంగార్రాజు అడిగాడు.
కిళ్ళి షాపువాడు కన్నారావుని వర్ణించి చెప్పాడు.
"అంతేకాదు సాబ్, ఈ దినం పొద్గాల ఒకడు ఈడ అటూ ఇటూ తిరిగిండు... అటు నల్ల కండ్లద్దాల్ పెట్టుకుండు... ఆడ్ని జూస్తే నిన్నోచ్చి నిడికి మల్లె ఉన్నాడు. కాని నిన్నటోన్కి మిసాల్లేవు. ఈనికి మిసాలున్నాయ్" చెప్పాడు కిళ్ళి షాపువాడు.
"బహుశా అవి పెట్టుడు మీసాలు అయి ఉంటాయ్.మారువేషవేస్కున్నాడెమో!... వాడుగాని పండుని బయటికి తిస్కెళ్ళడం చూశావా" అడిగాడు బంగార్రాజు.
"లేద్సాబ్. వేరే రిక్షావాడు తిస్కేల్లిండు"
"వాడేలా ఉన్నాడు?"
మారువేషం వేస్కున్న చిట్టబ్బాయిని వర్ణించి చెప్పాడు కిళ్ళి షాపువాడు.
బంగార్రాజు ఇందాక పోలిస్ స్టేషన్ లో రామయ్యను ప్రశ్నించినపుడు అతను చెప్పిన మనిషి. విదూ ఒకడే అని తేలింది. అలానే చిన్నమ్మాయ్ వర్ణించిన రిక్షావాడు, కిళ్ళి షాపువాడు వర్ణించిన రిక్షావాడూ ఒకడే అని తేలింది.
దిన్ని బట్టి పండుని కిడ్నాప్ చేసింది ఇద్దరు వ్యక్తులని స్పష్టంగా తేలిపోతుంది.
"ఊ ...సర్లె....ఇంక వస్తాం... ని అవసరం కలిగితే మళ్ళి వస్తాం" అని చేప్పి రంగనాయకులు ఇంటివ్తెపు అడుగులు వేశాడు ఇనస్పెక్టర్ బంగార్రాజు.
సరిగ్గా అప్పడే రంగనాయకులు హడావిడిగా ఇంట్లోంచి బయటికి వచ్చాడు.
"ఎక్కడికి అలా కంగారుగా పరిగెత్తుతున్నారు? కుర్రవాడి జాడ ఏమ్తెనా తెలిసిందా?"
ఆయనకీ ఎదురెళ్తూ బంగార్రాజు ప్రశ్నించాడు.
రంగనాయకులు తనకొచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ గురించి చెప్పాడు.
"రెండు లక్షలు ఇవ్వకపోతే పండుని సఫా చేసేస్తామని అన్నాడు. నేను రెండు లక్షలు తేడానికి బ్యాంకుకి వెళ్తున్నా..." రంగనాయకులు వాచ్ వంక చూశాడు. "బ్యాంక్ క్లోజ్ చేసే టైమ్తెంది..." అన్నాడు.
"రెండు లక్షలు ఎక్కడ అందజేయాలో మళ్ళి ఫోన్ చేసి చెప్తానన్నాడు."
బంగార్రాజు కొన్ని క్షణాలు ఆలోచించాడు. తరువాత ఇలా అన్నాడు.
"మీరో పనిచెయ్యండి... ఆ డబ్బు ఎక్కడ అందజేయ్యాలో వాళ్ళు మీకు చెప్తారుగా.. అప్పుడు మీరు మాకు ఫోన్ చేసి ఆ ప్రదేశం గురించి చెప్పండి. మేము మీ వెనకాలే ఫాలో అవుతాం... మీరు వాళ్లు చెప్పిన స్ధలానికి వెళ్ళి డబ్బు వాళ్ళకి ఇచ్చి మీ పండుని మీరు తెచ్చుకోండి... మేము వాళ్ళ వెంటబడి వాళ్ళ స్ధావరం కనుక్కుని వాళ్ళ గ్యంగు మొత్తాన్ని పట్టేసి అందర్నీ మర్డరు చేసేసి మీ డబ్బు మీకు తేచ్చిస్తాం"
రంగనాయకులు తల ఊపాడు.
"నేనిక వస్తాను...టైమ్తేపోతుంది. మాయదారి సంత... బ్యాంక్ మూసేస్తారో ఏంటో?..." అన్నాడు.
అలాగే వాళ్ళ దగ్గర్నుండి ఫోన్ రాగానే నాకు చెప్పండి... ఈలోగా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను..."
"ఇందాక మాయదారి సంత దొంగతనం కేసేదో మీకు తగిలిందటగా?"
"అది మా సబ్- ఇన్ స్పెక్టర్ కి అప్పజెప్పాను. ప్రస్తుతం మీ కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉన్నాను. పసివాడిని కాపాడ్డం ముఖ్యం కదా? అన్నాడు బంగార్రాజు.
"థ్యాంక్యూ ఇన్ స్పెక్టర్ ! నేనిక వస్తాను.
"మంచిది" చెయ్యి ఊపుతూ అన్నాడు బంగార్రాజు.
6
చిట్టబ్బాయ్ , కన్నరావులు పండునే గమనిస్తూ నిల్చున్నారు. పండు కళ్ళు బరువుగా మూతలు పడ్తూ ఉన్నాయ్. వాడు బలవంతగాకళ్ళుతెరవాలనిప్రయత్నిస్తున్నాడుగాని అవి మూతలు పడిపోతున్నాయ్.
మరో రెండు నిమిషాలపాటు ఎదురు చూశారు చిట్టబ్బాయ్, కన్నరావులు.
పండు నేలమీదికి ఒరిగిపోయాడు. వాడి కళ్ళు పూర్తిగా మూతలు పడిపోయాయ్.
చిట్టబ్బాయి కిందిగి వంగి పండునిపట్టి కుదిపి చూశాడు. వాడిలో చలనం లేదు.
"నిద్రమాత్రలు పనిచేశాయ్... పండు నిద్రపోయాడు..." ప్తేకి లేస్తూ అన్నాడు చిట్టబ్బాయి.
"ఇంక మనం మారువేషాలు తీసేసి పండుని వాళ్ళింట్లో అప్పజెప్పి వీడిని మనం దుండగుల బారి నుండి కాపాడమని చెప్పాలి!" అన్నాడు కన్నారావు. "మన బ్యాగ్ లోంచి బట్టలు తియ్... మార్చుకుందాం..."
"కాని అంత నిట గా వెళ్తే ఏం బాగుంటుంది? దుండగులతో మనం ప్తేటింగ్ చేసినట్టు ఉండొద్దూ? బట్టలు కాస్త చింపుకుందాం. ఒంటి మీద కాస్త గోళ్ళతో రక్కుకుందాం" అన్నాడు చిట్టబ్బాయి.
"బాగానే వుంది. ని ప్రేయసి కోసం బంగారంలాంటి నా బట్టలు నేనెందుకు చింపుకుంటాను? కావాలంటే ని బట్టలు చింపుకో, ని మొహం ఇలాతే దాన్ని కూడా నా గోళ్ళతో రక్కుతాను" అన్నాడు కన్నారావు.
"స్నేహితుడి కోసం ఆ మాత్రం బట్టలు చింపుకోలేవురా?"
"కోలేనురా"
"కావాలంటే నా పెళ్ళి చిన్నమ్మాయితో అయిన తర్వాత నీకు ఓ జత కొత్త బట్టలు మంచివి కొనిపెడ్తాను.
"అయితే సరే. ప్రస్తుతం నా బట్టలు చింపుకోను. అసలు ని బట్టలు చింపుకుని, ఒంటిమీద గిరుకొని నువ్వొక్కడివే రౌడిలతో హొరా హొరి పోరాడావని అంటే చిన్నమ్మాయికి ని మీద ప్రేమ కలుగుతుంది. కాని ఇద్దరం ప్తేటింగ్ చేసి పండుని రక్షించాం అని చెప్తే ఇద్దరినీ ల్తెక్ చేస్తుంది. ఇకపోతే ప్రేమించడం అంటావా? ఇద్దరినీ ప్రేమించలేదు ఆఆఆటీఈ మనల్లో ఒకర్ని మాత్రం ప్రేమిస్తుంది. ఒకవేళ ఆ ప్రేమించలేదు నిన్ను కాకుండా నన్ను ప్రేమిస్తేనో.... అందుకనే ని చొక్కా చింపుకుని ఒళ్ళు ఎక్కుకుంటేనే మంచిది. అప్పుడు చిన్నమ్మాయి నిన్నోక్కదినే ల్తెక్ చేస్తుంది."
"నువ్వు చెప్పింది నిజమేరోయ్" అన్నాడు చిట్టబ్బాయి. "మరి అలాగ్తేతే నా చొక్కా చింపేయి, నామొహం మీద చిన్న చిన్న దెబ్బలు తగిలించు"
"చిన్న చిన్న దేబ్బలేం ఖర్మ పెద్దవే తగిలిస్తాం."
ఓ గొంతు కార్కశంగా పలికింది. చిట్టబ్బాయి కాన్నారావులు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు.
ఇందాక చిట్టబ్బాయి కన్నారావులు షాపులోంచి రంగానాయకులుకి ఫోన్ చేస్తున్నప్పుడు అదే షాపుకి అంబాసిడర్ కారులో వచ్చిన ఇద్దరే ఇప్పుడు గుమ్మంలో భీకరంగా నిల్చుని ఉన్నారు.
"ఎ-ఎ-ఎవరు మీరు? అన్నాడు చిట్టబ్బాయి.
"ఏ-ఏ-ఏం కావాలి మీకు" అన్నాడు కన్నారావు.
"వాడు కావాలి!"
ఇద్దరిలో ఒకడు చూపిస్తూ అన్నాడు. వాడు నల్లగా తుమ్మమొద్దులా ఉన్నాడు. కళ్ళు ఎర్రగా చింతనిప్పల్లా ఉన్నాయి.
