"మీ దగ్గరున్నాడా? అయితే వెంటనే మా ఇంటికి తిసుకోచ్చేయ్యండి మా ఇల్లు శాంతినగర్ లో వుంది. నెంబరూ."
రంగనాయకులు చెప్పబోతుంటే అడ్డుపడ్డాడు చిట్టబ్బాయి "మీ ఇల్లు ఎక్కడుందో నాకు తెలుసు. అయినా సరే పండుని మీకు అప్పగించను"
"ఇదెక్కడి వెధవ సంతయ్య! మా పండుని ని దగ్గర ఉంచుకోవడం ఏమిటి? అసలు ఎవరు నువ్వూ?" విసుక్కుంటూ అడిగాడు రంగాయకులు.
"నేనెవరో నీకు తరువాత తెలుస్తుందిలే. కష్టపడి పండుని కిడ్నాప్ చేసింది అంత సులభంగా మీకు అప్పగించడానికా?"
"కిడ్నాపా? మా పండూనా? వాడినెందుకు కిడ్నాప్ చేశారయ్య దారిద్రం సంత?..." కంగారుపద్తూ అన్నాడు రంగనాయకులు.
"డబ్బుకోసం."
"డబ్బా? వాడ్ని అమ్మితే ఎవరు. కొనుక్కుంటారు?"
"నువ్వే కొనుక్కుంటావ్...రెండు లక్షలకి..."
"రెండు లక్షలా?"
"అవును రెండు లక్షలు!....నువ్వు రెండు లక్షలు ఇవ్వకపోతే మీ పండుని సపా చేస్తాం...."
"వద్దు వద్దు. అంత పని చేయకండి" కంగారుగా అన్నాడు రంగనాయకులు.
"కాని రెండు లక్షలు చాలా ఎక్కువకదా? ఒక లష్క ఇస్తాను"
రెండు లక్షలకి ఒక్కప్తెసా తగ్గేది లేదు. ఆలోచించు"
"ఊర్కే అలా మాట్లడ్తావేం నువ్వు!" చిట్టబ్బాయ్ చెవిలో విసుక్కున్నాడు కన్నారావు.
"పోనీ ఒకటిన్నర లక్ష చేసుకోకూడదూ?" బ్రతిమాలాడ్తూ అన్నాడు రంగనాయకులు.
"ఒక్క ప్తెసా తగ్గనని చెప్పాక యబ్తే వేలు ఎలా తగ్గుతాను? రెండు లక్షలు ఇవ్వకపోతే పండుని సఫా చేసేస్తాం" చిరునవ్వు నవ్వాడు చిట్టబ్బాయి.
"నీ బొంద. నవ్వమంటే అలా చిరునవ్వా నవ్వమని కాదు. గట్టిగా నవ్వు" మెల్లగా కసిరాడు కన్నారావు.
"హిహిహి" గట్టిగానే నవ్వాడు చిట్టబ్బాయ్.
కన్నారావు విసురుగా చిట్టబ్బాయ్ చేతిలోంచి ఫోన్ లాక్కుని గట్టిగా నవ్వాడు "హూహూహూ హొహ్హొ హ్హొ "
"అలా నవ్వొద్దు. మాయదారి సంత! నాకు భయం వేస్తుంది. రెండు లక్షలు ఇవ్వాడానికి సిద్దమే కాని పండుగాడు నిజంగా మీ దగ్గర ఉన్నాడని గ్యారంటి ఏమిటి?"
"హుహుహొహొహొహ్హొహ్హొహ్హొ" మరోసారి గట్టిగా నవ్వి చిట్టబ్బాయ్ చేతికి రిసీవర్ ఇచ్చి "పండుగాడు మీ దగ్గర ఉన్నాడని ఏమిటి నమ్మకం అని అంటున్నాడు" చెప్పాడు కన్నారావు.
"ఒక్కక్షణం ఆగండి. పండుగాడి చేత మాట్లడిస్తాను" అన్నాడు చిట్టబ్బాయి.
కన్నారావు షాపువాడి ఎదురుగా నిల్చుని క్రిం బిస్కట్లు తింటున్న పండు గాడిని ఎత్తుకుని చిట్టబ్బాయి దగ్గరకు వచ్చాడు.
చిట్టబ్బాయి రిసీవర్ పండు చేతికి ఇచ్చి "మీ నాన్నగారితో మాట్లాడు" అన్నాడు.
"హలో" అన్నాడు పండు.
"హలో పండూ ఎలావున్నావు బాబూ?" కంగారుగా అడిగాడు రంగ నాయకులు.
"బాగానే వున్నాను నాన్నా. వీళ్ళిద్దరూ ఎవరో చాలా మంచివాళ్ళలా వున్నారు. నాకు అవి ఇవి కొనిపెడ్తున్నారు. నేను వీళ్ళ దగ్గర రెండ్రో జులుండి తరువాత ఇంటికి వస్తాను...ఏం?" అన్నాడు పండు.
"రెండు రోజులు వుందుగాని మా ప్రాణాలు తియ్యడానికి!" పళ్ళు కొరుకుతూ అనుకున్నాడు చిట్టబ్బాయ్.
"మరేమో ఇప్పుడు నేను క్రిం బిస్కెట్లు తింటున్నా. దిని తరువాత వీళ్ళని ఐస్ క్రీమ్ కొనిపెట్టమంటాను" ఏమిటేమిటో చెప్తున్నాడు పండుగాడు.
చిట్టబ్బాయ్ పండు చేతిలోంచి రిసీవర్ లాక్కున్నాడు.
"ఇప్పుడు నమ్మకం కుదిరిందిగా పండుగాడు మా దగ్గర వున్నడని? మీ వాడు ఇప్పటికే మా దగ్గర ఇరవ్తే ముప్ప్తే రూపాయలు తిండి తిన్నాడు. ఈ ఖర్చు కూడా ఆరెండు లక్షలతో కలిపి ఇవ్వాలి!" అన్నాడు చిట్టబ్బాయ్.
"ఇది అన్యాయం. ఇందాక రేండు లక్షలు అని ఇప్పుడు రెండు లక్షల మీద ముప్ప్తే రూపాయలు కూడా ఇవ్వాలని అంటారా" అట్నుండి అరిచాడు రంగనాయకులు.
"అలాగయితే పండుని సఫా చేస్తాం" అన్నాడు చిట్టబ్బాయ్.
వెంటనే కన్నారావు చిట్టబ్బాయి చేతిలోంచి రిసీవర్ లాక్కుని "హుహు హొహొహ్హ హ్హ హ్హ " అని నవ్వి మళ్ళి సిరివర్ చిట్టబ్బాయ్ చేతికి అందించేశాడు.
"సరే... సరే... అలాగే రెండు లక్షల ముప్ప్తే రూపాయలిస్తాను. వాడిని ఏమి చెయ్యకండి... ఇంతకి మీకు డబ్బు ఎక్కడ ఎప్పుడు అందజెయ్యాలి?"
"ఆ వివరాలన్నీ నీకు తరువాత ఫోన్ చేసి చెప్తాం" చిట్టబ్బాయి రిసీవర్ కన్నరావుకి ఇచ్చాడు.
కన్నారావు భయంకరంగా నవ్వి ఫోన్ డిస్కనక్ట్ చేశాడు.
చిట్టబ్బాయ్ షాపువాడికి డబ్బులు చెల్లించాడు. ముగ్గురూ షాపులోంచి బయటపడ్డారు. ఇందాక అంబాసిడర్ కార్లో షాపు కి వచ్చిన ఇద్దరు వ్యక్తులూ మొహమొహాలు చూస్కుని కళ్ళతోనే స్తెగా చేస్కున్నారు.
తాము తాగిన కూల్ డ్రింక్స్ కి డబ్బులిచ్చి వాళ్లు కూడా షాపులోంచి బయట పడ్డారు.
* * *
ఇన్ స్పెక్టర్ బంగార్రాజు అటూ ఇటూ చూశాడు. ఆ వీధిలోజనసంచారంఏమిలేదు. ఒక్కసారి చటుక్కున రోడ్డు క్రాస్ చేసి అకడ సున్న చెట్టు వెనకాల నాక్కాదు. రోడ్డుకి అవతలవ్తెపు చూస్తే కానిస్టేబుల్ ఏడుకొండలు కనిపించలేదు బంగార్రాజుకి.
"నా వెనకాలే ఫాలో కారా అంటే ఎక్కడ చచ్చాడు వీడు....విడని మర్డరు చేస్తేగాని బుద్ది రాదు...." గొణుక్కున్నాడు బంగార్రాజు.
"నేను మీ వెనకాలే ఉన్నాను. అలా తిట్టూకుంటారెం సార్?"
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు బంగార్రాజు. ఏడుకొండలు తనకి ఆనుకున్నంత దగ్గర్లో తన వెనకాల నిలుచుని వున్నాడు.
"నువ్వు నా వెనక్కి వచ్చి ఎప్పుడు చేరావ్?" ఆశ్చర్యంగా ఏడుకొండల్ని చూస్తూ అడిగాడు బంగార్రాజు.
"మీరేగా సార్ మిమ్మల్ని నీడలా ఫాలోకమ్మని అన్నారు! మీరు చెంగున రోడ్డు దాటగానే మీ వెనకాలే చెంగు చెంగున నేను కూడా రోడ్డు దాటేశాను" చెప్పాడు ఏడుకొండలు.
"వెరీగుడ్... వెరీగుడ్... కాస్త చెట్టు వెనక్కి నక్కు... ఎవడో స్తేకిల్ మీద ఇటే వస్తున్నాడు" అన్నాడు బంగార్రాజు తను చెట్టు వెనకాల నక్కుతూ, ఏడుకొండలు బంగార్రాజు వెనకాల నక్కి నిల్చున్నాడు.
ప్రస్తుతం బంగార్రాజు, ఏడుకొండలు మాప్టిలో ఉన్నారు. వాళ్లు పండు కేసుకి సంబందించి అప్పడే ఇన్వెస్టిగేషన్ ను మొదలు పెట్టేశారు. యూనిఫాంలో ఉంటే అందరికి తాము ఎదో కేసుకు సంబందించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుందని బంగార్రాజు అభిప్రాయం.
ఆ స్తేకిలువాలా మెల్లగా తొక్కుకుంటూ వీళ్ళని దాటుకుంటూ పోయాడు.
"ఊ... ఇప్పుడు ఈ చేట్టుచాటు నుండి ఇవతలికి వచ్చి ఈ గోడ వారగా మెల్లగా ఒంగి నడుద్దాం" అన్నాడు బంగార్రాజు.
ఇద్దరూ గోడ పక్క నుండి ఒంగి మెల్లగా నడుస్తున్నారు.
"ఎందుకుసార్ మరి ఇలా మనమే దొంగల్లా నక్కి నక్కి నడవడం? మామూలుగానే నడుస్తూ ఇన్వెస్టిగేషన్ చేయోచ్చుకదా!" సందేహంగా అడిగాడు ఏడుకొండలు.
నువ్వు అతిగా వాగకు మర్డరు చేస్తా! అందరికి తెలిసేలాగా ఓపెన్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అందర్తో బాతుఇ పండుని కిడ్నాప్ చేసిన వాళ్ళకు కూడా మనం రంగంలో దిగినట్టు తెలిసి వాళ్ళ ఉనికి తెలియకుండా జాగ్రత్త పడ్తారు...." అన్నాడు బంగార్రాజు.
"అవున్సార్... మీరు చెప్పింది నిజమే!... " అన్నాడు ఏడుకొండలు బుర్ర గోక్కుంటూ.
