రాధకి తనవరకూ ఈ ప్రయాణం తన భవిష్యత్తు అనుకున్నట్టుగా జరిగేందు కిదొక శుభ సూచనా, మంచి అవకాశం గా అనిపిస్తున్నందున చాలా హుషారుగా సంతోషం గానూ ఉంది.
బందువుల్తోటీ , స్నేహితుల్తోటి ప్లాట్ ఫారమంతా కిటకిట లాడుతుంటే , రఘూ రాధా రైలెక్కారు . సుధ మాత్రం అక్కడ పేర్చబడిన బస్తాలకి వార సరిగా నిలబడి అన్నీ గమనిస్తుంది అంతే.
అరే? మన సిన బాబుగారు దేశ వెళ్లి పోతున్నట్టున్నారే అమ్మీ' అన్నాడు. పెళ్లి మొక్కుబడి పేర, సింహాచలం లో గుండు కొట్టించు కుని, భార్యా సమేతంగా అట్నుంచోచ్చిన బండీ లో దిగిన చాకలి గవరయ్య , గుండు నిండా గంధం పట్టించుకుని పసుపు బట్టల్తో పక్కన నిలబడున్న భార్యతో మెల్లగా.
'ఏటీ? నువ్వు నౌకరీ సేసే కావందు లే నేటి ఈరూ? సిలకా, గోరింకలల్లే ఎంచక్కుంది మావా, జంటా?' నోరంతా పళ్ళు చేసుకుంటూ అటు చూసి మురిసి పోతుంది పెళ్లి కూతురు.
'ఏసే , అరికింకా పెళ్లి కాలేదేసే' ఆ పక్క నుండేటావిడ అరిసుట్ట వనుకుంటా అరి వలలోనే సదూతూంది లే'
'మరింకేం?'
'ఏటే? ఆ ఇంకేం?' నవ్వాడు గవరయ్య.
'అదే మావా, అంత సక్కని సిన్నది పక్కనుంటే మరి పెల్లెందుకులే ఆ బాబుకి.'
'ఏ ఊరు కోవోసె' అరి సెవుల్లో బడ్డదంటే సేవటా లోలిపించేత్తారు కావందు'
ల్తో పని..' మందలించాడు పైడయ్య.
'అన్నట్టసలూ ఆరికి మావ కూతురుందమ్మీ, మనువు కొవ్?' రహస్యంగా చెప్పాడు కళ్ళేగరేస్తూ.
'ఎవరూ మొన్న నే మొక్కడాని కారింటి కెళ్లినప్పుడు సిలుక్కొక నాకిచ్చిందే ఆ అమ్మాయా'
'ఆ మరే? పెళ్ళయితే మనకు సిలుకు జుబ్బా, పట్టు వోణీ బాగుమానం ఒత్తదోసే' చంకలు గుద్దుకుంటూ పళ్ళికిలిచ్చాడు గవరయ్య.
'నీ కట్టాల అసె సంత కెళ్లా? అదేం పిల్ల మావా, ఇలా కాలేగరేసుకుంటూనూ?' కుంటి చూపిస్తూ ఏవగించు కుంది పిల్ల.
'అనుకుంటున్నావ్ పిల్లా, అరి మనసు బంగారమే అనుకో, బంగారం' గొప్పగా కనుబొమ లెగరేస్తూ అన్నాడు గవరయ్య. ఇంతలో పార్వతమ్మ గారు వాళ్ళన్చూడ్డం తో దబ్బున అటు పరుగెత్తు కెళ్లి,
'కొండ కెళ్లి అప్పడికి మొక్కు చెల్లించు కొచ్చినావమ్మ గారూ' అన్నాడు దండం పెడుతూ.
;నీ మొక్కు బంగారం గానూ, కొత్త పెళ్ళి కూతుర్ని తీసుకెళ్లి ఇదేం పనిరా?' అన్నారు పిల్ల వేపు చూసి నవ్వుతూ. రఘూ, రాధా కూడా వాళ్ళన్చూసి నవ్వారు. ఇంతలో రైలు బయల్దేరే సమయం అవడంతో కూతురి కేవేవో బుద్దు ల్చేప్పి గుడ్ల నీళ్ళు కుక్కుకున్నారు రాజమ్మ గారు. 'ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ వుండెం బాబూ' అని ఒక్క మాట చెప్పి నమస్కరిస్తున్న కొడుకుని మనసారా ఆశీర్వదించారు పార్వతమ్మ గారు. వీడ్కోలిస్తూన్న అందరి మధ్యా దేని కోసరమో వెతుక్కున్న రఘు కళ్ళు కనిపించీ కనుపించ కుండా బస్తాల్చాటు నున్న సుధని చూడగానే, ఆరోగ్యం జాగ్రత్తన్నట్టుగా సంజ్ఞ చేసి వెళ్తానన్నట్టు తలాడిస్తూ, రుమాలేగరేశాడు రఘు. ఆనందంతో పొంగిపోతూ, తనూ టాటా చెపుతూ రుమాలూపింది సుధ. రైలు చూపు దాటి పోయే వరకూ అలాగే గుమ్మం వద్దే నిలబడి రఘు రుమాలేగరేస్తుంటే , అందరూ ఆనందంతో ఆటే చూస్తూ నిలబడి పోయి, ఆ తరవాత తిరుగు ముఖం పట్టారు. మౌనంగా నడుస్తూ వెళ్ళి కార్లో కూర్చుంది సుధ.
'అయ్యో పాపం ఈ అమ్మాయి కూడా ఒచ్చిందా?' అన్నారు అదోలా సుధ వేపు చూస్తూ రాజమ్మ గారు.
'సుధ రైలు వరకూ ఒచ్చి సాగానంపితేనే తప్ప తను వెళ్ళనని పంతంపట్టుక్కూర్చున్నాడు మా మరిది' అంది కసిదీరా ఆవిడ వేపు చూస్తూ శాంత.
'అలాగా మేనత్త మేనమావ పిల్లలంటే నిజంగా అలా వుండాలి' అంది. శాంత మాటని బలపరుస్తూ నళిని.
'అయినా, ఏ పూర్వ జన్మ ప్రారబ్ధవో ఆ వంకరోచ్చింది గానీ, నిజంగా ఆ పిల్ల తెలివి తేటలూ, నమ్రతా అన్నింట్ల కన్నా నిజంగా ఆ పిల్ల స్వయం బుందే..?' అంటూ తనూ వారితో ఏకీభవించింది నిర్మల.
'అయినా , ఆ లోపం ఒక్కటే చాలదూ, ఇన్నింట్లకీ బలాదూర్ అన్నట్టు గానూ' అంది మళ్లీ వుండబట్టక రాజమ్మ గారు.
'అదెలాగౌతుందండీ మనుషులకొక్క విగ్రహం బాగుంటే సరిపోతుందిటండీ మిగతా దేని విలువ దానికే వుంటుంది. ఎప్పుడూను.' అంది తనూ ఊర్కోకుండా నళిని. దాంతో రాజమ్మ గారి కెక్కడ లేని రోషమూ వచ్చి, దుమదుమ లాడుకుంటూ వెళ్లి కార్లో కూర్చుంది. కాకపోయినా, ఇంటి కెళ్లాక కోడలు మీది కసి మరో విధంగా తీర్చుకుందామనుకునేందుకూ , పడేందు కూ నిర్మల కాదుగా! అందుకే ఆవిడ కొపాన్నంతా విసవిసా నడవడం లోనూ, ఫెడీ మంటూ కారు తలుపు ముయ్యడం లోనూ చూప వలసోచ్చింది పాపం. ఆవిడ స్వభావాన్ని కను సౌజ్ఞా ల్తోనే చెప్పుకుని నవ్వుకున్నారు కోడళ్ళు ఇద్దరూనూ.
ఇంటి కెళ్ళగానే బట్టలు మార్చుకోవడం కోసరమని గదిలో కెళ్లి తలుపేసుకున్న సుధ గవరయ్య అన్న మాటల్ని పిల్ల ఇచ్చిన సమాధానాల్నీ మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోసాగింది.
'నిజం! చదువుకున్న వాడికన్నా చాకలి మేలన్నట్లు వాళ్ళ సంభాషణ లొ ఎంత సత్యం వుంది?' నిజం. అంత అందంగా వుండే బావ పక్కన వుండే అదృష్టం రాధ వంటి వారికే తగును కాని కర్ర ఊసుకుంటున్న తనందుకెంత మాత్రమూ అర్హురాలు కాలేదు.
ఒకవేళ తనమీది జాలి కొద్దీ, బావ తనని చేసుకుంటే అది చూసేవారికి చంద్రుడి కి గ్రహణం పట్టినట్లుగానే అనిపిస్తుంది గాని ఏ మాత్రమూ ఆనందం గానూ అందంగా నూ వుండదు. అందుకే తనని కాదని బావ మరెవర్నన్న చేసుకునేందు కు తగిన గట్టి ప్రయత్నం తను చేయాలి. అలా ప్రయత్నించి బావకి జీవితానందం చేకూర్చ గల్గినప్పుడే తనకి బావ మీడునున్న అపార అనురాగాన్ని సార్ధకం చేసుకున్నట్టవుతుంది. అయితే ఆ చేసుకున్న వాళ్ళు ఒకవేళ బావ సాన్నిధ్యం లో వుండి బావని చూసుకుంటూ వుండేందు క్కూడా తనకి చోటివ్వ కపోతెనో? అమ్మో తల్చుకుంటే నే గుండె పగిలేటంత బాధగా వుంటుంది. ఒళ్ళు జలదరించు కుంటూ మంచం మీద చతికిల బడ్డ సుధ కళ్ళు ధారలు ధారలుగా నీరు కార్చాయి.
'అమ్మాయి సుధా' పార్వతమ్మ గారి పిలుపుతో మళ్ళీ యధాస్థితి కొచ్చిన సుధ 'ఇదుగో ?వస్తున్నానత్తయ్యా' అంటూ దబ్బున బట్టలు మార్చుకుని ఇవతలి కొచ్చింది సుధ. ఎడ్చినట్టున్న సుధ మొహం చూసి రఘు వెళ్లి పోయినందుకే సుధ అలా బాధపడుతుందని అనుకున్న పార్వతమ్మ గారు 'వోసి పిచ్చి పిల్లా' అనుకుంటూ ప్రేమతో సుధని దగ్గరగా తీసుకున్నారావిడ.
* * * *
అక్కడ రఘుకీ యాంత్రికంగా దొర్లుకుపోతుంది కాలం. అతను పని చెయ్యవలసున్న లాబరేటరీ దానికి సంబంధించిన హాస్పిటల్ కూడా రద్దీ లేని ఒక మారు మూల్న పెద్ద తోటలో నిర్మించబడుండడం వల్ల అందులో పని చేసే ముఖ్య ఉద్యోగస్తులందరికీ ఆ ఆవరణ లోనే బంగ్లా లు ఏర్పాటు చేశారు.
రఘుకీ రాధకీ ఇచ్చింది ఒకే బంగ్లా, స్నానపు గదిలో సహా. పడగ్గదులు మాత్రం ఇద్దరికీ విడివిడిగా వున్నా, వారి వైద్య విషయాలకు సంబంధించిన గ్రంధాలూ వగైరా హల్లో అలమార్ల లోనే వుంచబడ్డం వల్లా, పనివారూ భోజనాల హాలు వగైరాలన్నీ కూడా ఉమ్మడి వె అయినందునా, తరచూ ఇద్దరూ, ఒకేచోట తటస్థ పడక తప్పేది కాదు పాపం.
ఏ కారణం వల్లా ఎటువంటి పరిస్థితుల్లోనూ , తన మనో నిగ్రహాన్ని సడల నివ్వకూడదన్న కారణంగా, వీలున్నంత వరకూ రాధతో ఏ విధమైన పరిచయమూ పెట్టుకోకూడదని అతను నిశ్చయించు కుంటే అక్కడి పరిస్థితులన్నీ అతడికి వ్యతిరేకంగానే వున్నాయి.
బొంబాయి వెళ్ళినప్పటి నుంచీ అక్కడి వారంతా వారంతట వారే వచ్చి రఘూ రాధల్ను పరిచయం చేసుకోవడం వార్ని ఏదో ఒక నిమిత్తంగా తమ ఇళ్ళకి విందులూ వినోదాలకి ఆహ్వానిస్తుండడం వారి బంగ్లా ఊరికి దూరంగా వున్నందున సభ్యత కోసరం రాదనీ తన టాక్సీ లోనే రఘు తీసు కెళ్ళడం ఇటువంటప్పుడు చక్కగా శృంగారించుకుని తన పక్కని కూర్చుని వచ్చే రాధని చూసి రఘు ఎంతో ప్రయత్నం మీద మనసును స్వాధీన పరుచుకుంటుండడం ఇలా తరచూ జరుగుతూనే వుండేది. మరి ఎంత యోగ్యుడైనా రఘూ అందరి వంటి మనిషే. అతనికీ, అందరికీ అ వయసులో వుండే కాంక్షలు కల్గుతుండడం సహజం. అయితే అతని ఆశయాలకు ఇది విరుద్దమైనదవడం వల్ల అటువంటి ప్రతి సమయం లోనూ అతని మనసుని బలవంతంగా కళ్ళేల్లాగి పట్టుకోవడం మహా అవస్టగా వుంటుండేది అతనికి. మరి కష్టమైనా , నిష్టూర మైనా అంతకన్నా మరో మార్గం? ఒక్కొక్క సారి 'ఆ సుదకి చిన్నతనం లోనే ఆ అవిటి తనం ఎందు కల్గాలి, వారు శాశ్వతంగా తమ ఇంటి కెందుకు చేరాలి, అయినా అందర్లాగా తను వుండకుండా ఇంత ఆదరం ఎందుకు చూపాలి? అందరి కళ్ళకీ సర్వ సాధారణంగా కనిపించే సుధ తనని మాత్రం ఇంత ఎక్కువగా ఎందుకాకర్శించాలి?పోనీ ఇన్నీ ఎలా వున్నా, ఈ రాధ కూడా తన జీవితంలో ఈ విధంగా తటస్థ పడ్డం దేనికి? ప్రపంచం లో ఇంతమందీ వుండగా ఏదో కాస్త లక్ష్య జీవనం సాగించాలను కునే తనకే ఇన్ని ఇబ్బందులూ ఎందుక్కుల్గాలి? కల్గినా అవన్నీ ఎదిరించేసుకుని అందర్లాగా తన స్వార్ధం తనెందుకు చూసుకోకూడదు?'
ఇలాంటి ఆలోచనల్తో తల వేడెక్కి పోతూ వుండేది. అందుకనే రోజులో చాలా సమయాన్ని హాస్పిటల్లో ని రోగుల చికిత్స తోటీ, పరిశోధనల తోటే కాలక్షేపం చేసేసి ఆలశ్యంగా ఇల్లు చేరుతుండేవాడు రఘు.
అయినా, ఇద్దరికీ ఏక వంటమనిషి, ఏక భోజనం అవటాన్న ఒద్దన్నా వినక రాధ తనోచ్చే వరకూ కనిపెట్టు కుంటుండడం వల్లా, అదీ ఇబ్బందిగానే వుండేది.
