ఆ తర్వాత సుకృతి మాట్లాడలేదు. విభ్రమంగా నిలబడిపోయింది అలివేలు సమక్షం నుంచి బయటికి నడిచి శెట్టిగారు పంపిన మారుతీ అతడి ఫ్లాట్ కి వెళ్ళింది.
ఇంకా రాత్రి స్మృతుల నుంచి తేరుకోలేదేమో ఒంటరిగా కూడా ఏదో ఆలోచిస్తున్న శెట్టి సుకృతిని చూడగానే సాదరంగా నవ్వేడు.
ఆమె కూర్చోలేదు. "నేను వచ్చింది మీకు కృతజ్ఞతలు చెప్పటానికి కాదు. చెప్పినా అది తీరనిది. అందుకే చేతలతో మీకు బదులు తీర్చుకుంటున్నాను."
శెట్టికి అర్ధం కాలేదు ఆమె చెబుతున్నదేమిటో.....
"ఓడిపోయాననుకున్న నన్ను ఒక్క రాత్రితో ఉన్నదాన్ని మార్చేశారు. అందుకే మీరు కొన్న ఫ్లాట్ లోకి యీ రోజే అడుగుపెడుతున్నా. నేను ఈ రాత్రికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రి మీ జీవితం మరిచిపోలేని మరో రాత్రిగా గుర్తుండేట్టు చేయాలనుకుంటున్నాను. వస్తారుగా" ఓ ఆదేశంలా అని వెళ్ళిపోయింది.
ఆమె కోసం యింకా ఏదో చేయాలీ అని శెట్టి అనుకుంటే అతని తప్పు కాదు. సుకృతి సమర్ధతే అది. అంతగా ఆకట్టుకుందామె.
సరిగ్గా ఇదే సమయంలో.....
ఓ స్టూడియో గ్రీన్ రూంలోకి ప్రవేశించాడు డైరెక్టరు సుందరరావు. ఓ అయిదు నిమిషాల క్రితమే షూటింగ్ కి లంచ్ బ్రేక్ చెప్పి సుదర్శనరావు అలా రమ్యశ్రీ మేకప్ చేసుకునే గ్రీన్ రూంలోకి వచ్చింది ఊరికినే కాదు. సెట్ లో నుంచి వెళ్తూ ఓసారి అర్జెంటుగా కలవమని హాస్యంగా అంది.
కొన్ని రోజుల క్రితందాకా నెంబర్ వన్ హీరోయిన్ లా తనముందు డాంబికాన్ని ప్రదర్శించిన రమ్యశ్రీ యీ మధ్య అతడితో కలుపుగోలుగా వుండటం ప్రారంభించింది. దానికి కారణం సుకృతి విషయంలోగాని, శివని యూనిట్ లో నుంచి తప్పించడంలోగాని డైరెక్టరుగా అతడిచ్చిన సహకారమేనని అతడికీ తెలుసు.
"చెప్పండి" అన్నాడు గ్రీన్ రూంలో ఓ చైర్లో కూర్చుంటూ.
పర్సనల్ మేకప్ మేన్ని చూస్తూ బయటికి వెళ్ళమని చెప్పడం మాత్రమేకాక ఓ గంటదాకా డిస్టర్బ్ చేయొద్దని ఆదేశించింది. మేకప్ మేన్ వెళ్ళిపోగానే గది ద్వారాన్ని మూసి గడియపెట్టింది.
సుదర్శనరావుకి కొంత అర్ధమైంది.
"ఉక్కగా వుంది కదూ" ఓ కారణం వెతుక్కుంటున్నత్తుగా బ్లౌజ్ తీసేసింది. "గ్రీన్ రూం కూడా ఎ.సి. చేయిస్తే మనకింత యిబ్బందిగా వుండేది కాదు."
"మరేం" అన్నాడు రమ్యశ్రీ గుండెలపై ఉబికిన బ్రాని చూస్తూ.
"ఇబ్బందిగా వుందా" గోముగా నవ్వింది అతడి పక్కన కూర్చుంటూ. "ఉండే వుంటుంది."
"దేనికి?"
"ఇంత ఉక్కలో మీరు పేంటుతో కూర్చోటానికి."
బిడియాన్ని ప్రదర్శిస్తూనో లేక ముకిళించుకున్న మొగ్గలా తల వందుకుని కూర్చోడాన్నో చేయటానికి ఆమె ముగ్ధ కాదు. అనుభవం తొలి సారి కాదు. మొదట తనను వుంచుకున్న స్టిల్ ఫోటో గ్రాఫర్ తో వందల సార్లు గడిపింది. పంటల పుస్తకం పక్కన పెట్టుకుని వంటచేస్తున్నట్టు కొక్కోక శాస్త్రం పుస్తకం పక్క నుంచుకుని అతడు ఒక్కోకోణాన్ని తనమీద ప్రయోగిస్తుంటే పులకరింతగా సహకరించేది. అందుకే సూటిగా కాకపోయినా చాలా తక్కువ వ్యవధిలో వ్యవహారానికి వచ్చేయగలిగింది.
"థాంక్స్" అంది పాంట్ తీసేసి ఆమె నడుంపై చెయ్యి వేసిన సుదర్శనరావుతో అంతేకాదు పెదవులతో అతడి చెంపల్ని స్పృశిస్తూ "మీరు మంచి శృంగార పురుషులని విన్నాను."
"గంట వ్యవధిలో నేనేమిటీ అన్నది నిరూపించుకోవడం కష్టంగా?"
"పిలవాల్సింది మీ గెస్ట్ హౌస్ కి."
"మీరు చాలా బిజీగా!"
"బిజీ అయినా యిప్పుడు టైం చూసుకోలేదూ."
సోఫాలో వాలిపోయింది. అతడ్ని మీదికి లాక్కుంటూ.
రెండు నిమిషాలపాటు యిద్దరూ మూగవాళ్ళయిపోయారు. ఆమె నిట్టూర్పులు సోఫా చప్పుడులో విలీనమైపోతూంటే బడలికగా కళ్ళు తెరిచి చూసింది.
చాలా ఏకాగ్రతగా నిమగ్నమై వున్నాడు సుదర్శనరావు.
చేతుల్తో అతడ్ని మరింత బలంగా హత్తుకుపోతూ "ఇంతకాలం మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నాను" అంది పశ్చాత్తాపాన్ని అభినయిస్తూ.
నిస్త్రాణగా ఆమెపై వాలిపోయాడు. "ఇక కాల్ షీట్సు యివ్వటానికి అభ్యంతరం వుండదనుకుంటాను."
"సినిమాకే కాదు.....మీతో బెడ్ షేర్ చేసుకోవటానికి కాల్ షీట్స్ యిస్తుంటాను."