Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 29


    శెట్టికీ తెలీదు. తను అంత వేగంగా స్పందించగలదని. అక్షరాలు సరిగా కనిపించని వృద్దుడిలా ఆమెపై బడి అగాధాల లోతుల్ని స్పృశిస్తూ "నాతో వుండిపోతావా" అన్నాడు కలలోలా.
    గెలుపువైపు ప్రయాణిస్తుంది తను. అది కాదు. బహుశా ఏ అమ్మాయీ అందించని రక్తికి తను కారణమై అతడ్ని వివశుడ్ని చేయగలుగుతూంది.
    "ఉండిపోవడమూ అంటే?"
    "ఇలా ప్రతిరాత్రీ....." అనలేదు శెట్టి. "నీకే కష్టమొచ్చినా నేనున్నానని మరిచిపోకుండా నేను నీ మనిషిననుకుంటూ వుండడం" అన్నాడు. ఇంకా వివరంగా చెప్పే సహనం లేదు. మరోసారి ఆమెను ఆక్రమించే తొందరపాటులో వున్నాడు.
    సహకరించింది పూర్తిగా.....అతడు రొప్పుతూంటే ఆత్మీయంగా నుదుటపట్టిన స్వేదాన్ని చీర చెరగుతో తుడుస్తూ అంది. "మీ అభిమానానికి కృతజ్ఞురాల్ని కానీ నాలాంటి వాళ్ళనెందర్నో చూసిన మీకు రేపు నేను గుర్తుంటానని గ్యారంటీ ఏమిటి?"
    "సు....కృ.....తీ" అలసిపోతున్నాడు "నన్ను నమ్ము."
    "నమ్మబట్టే మీ దగ్గరకు వచ్చాను. శెట్టిగారూ..... నమ్మకం వుండబట్టే నా యవ్వనాన్ని మీకు అర్పిస్తున్నాను. అయితే మీ మీద యిష్టంతో వచ్చిన నేను మీ ద్గాగారకు వచ్చే అందరు ఆడపిల్లల్లా మీ నుంచి డబ్బుని ఆశించలేదు. నిజానికి నేను కోరింది మీ ఆసరా....." తన మాటలు తనకే కృతకంగా వున్నా అతడ్ని రెచ్చగొడుతున్నట్టుగా అంది.
    "అవును శెట్టిగారూ. ఈ సినీ ప్రపంచంలో నిలబడాలన్నా, పైకి రావాలీ అన్నా ఓ గాడ్ ఫాదర్ కావాలిగా...... అందుకే కన్నతండ్రి చేత తిరస్కరించబడ్డ నేను మీ అండ కోరుకున్నాను."
    "నేనున్నాను" చల్లబడిపోతూ ఆమెపై ఒరిగిపోయాడు.
    "నీకు పర్మనెంట్ గా నేను ఆసరానౌతాను. నీకు తెలీదు సుకృతి వయసు మళ్ళిన నేను నిన్ను తొలిరోజు చూపిందగ్గర్నుంచే కావాలనుకుంటున్నాను. నీ మీద రమ్యశ్రీ దాడి ప్రారంభించిన దగ్గర్నుంచి సపోర్టుగా నిలబడాలనుకున్నాను. అది యిప్పటికి సాధ్యమైంది. అయినా నీకేం తక్కువని?"
    తెల్లవార్లూ ఓ కొత్త స్వర్గాన్ని దర్శించిన శెట్టి సుకృతి విషయం ఏం ఆలోచించింది ఆమె వూహకి సైతం అందనిది.
    ఆ మరుసటి రోజే టి. నగర్ లో ఓ ఫ్లాట్ కొన్నాడు తన కోసం. ఫ్లాట్ తోబాటు ఓ మారుతీ కారునీ కొని డ్రైవరు ద్వారా అవి పంపించాడు.
    ఫ్లాట్ డాక్యుమెంట్సుని, కారు తాళాల్నీ అందుకున్న సుకృతి నిర్లిప్తంగా నిలబడిపోయిందే తప్ప పులకించిపోలేదు. ఆనందించటానికి ఆ సుఖాలు ఆమెకు కొత్త కాదుగా ఇప్పుడామె కళ్ళు చెమ్మగిల్లటానికి కారణం ఏమిటో ఆమెకీ తెలీదు.
    "సుకృతీ" విస్మయంగా ఆమె భుజంపై చెయ్యి వేసింది అని అందమైన ప్రతి ఆడపిల్లకీ ఆనందంగా బ్రతికే అదృష్టం వున్నాపోయినా అందానికి మాత్రం ఓ ఖరీదు వుంటుందని తెలుసు. కానీ ఎక్కువ ఖరీదు వుంటుందని యిప్పుడిప్పుడే తెలుస్తున్నత్తుగా "ఏమిటది?"
    "నాతో వ్యభిచారానికి నారాయణశెట్టి చెల్లించిన ఖరీదు" విల్లా అంది.
    "కానీ నువ్వెళ్ళింది మరొకకందుకు."
    "అవును ఆంటీ.....శివకి సహాయపడాలని వెళ్ళాను. అయితే అక్కడ మా నాన్న ప్రత్యక్షమయ్యాడు. దానితో నేను వెళ్ళిన విషయాన్ని పక్కకు పెట్టి ముందు అతడ్ని సాధించాలని ఆలోచించాను. ఓ చిన్న గెలుపుతో రామన్ కి బుద్ది చెప్పిన నేను యీ రంగంలో నాకంటూ ఓ గాడ్ ఫాదర్ అవసరమని తెలుసుకుని రాత్రంతా సిగ్గువదిలి శెట్టిని మరో లోకం అంచులదాకా తీసుకువెళ్ళాను.....ఆంటీ" అది ఉక్రోషమో, తనమీద తనకే కలుగుతున్న ద్వేషమో ఆమెకీ తెలీదు. కానీ ఉద్విగ్నంగా నవ్వింది.
    "ఇది అభినందించదగ్గ విషయం కాకపోయినా యీ సినీ వ్యవస్థలో నాకంటూ ముందు ఓ అండ కావాలి.....బలవంతుడైన తండ్రి కాదన్న తర్వాత నేను బలవంతురాలిగా కనీసం కొన్ని నెలలైనా నిలబడాలీ అంటే నారాయణశెట్టిలాంటి వ్యక్తి ఆసరా కావాలిగా..... అందుకే యిలా తొలి రాత్రితో అతడ్ని నా మనిషిగా మార్చుకున్నాను. మలిరాత్రితో మరింత సాధించబోతున్నాను."
    సుకృతి కనురెప్పలు భారంగా వాలిపోయాయి. "ఈ జీవితం నేను కోరనిదైనా కనీసం నేను కోరిన మనుషులకంటూ కొంత చేయాలి అదీ నేను బ్రతికుండగానే."
    బ్రతికుండటమన్నది మానసికంగా అయితే సుకృతి ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు బ్రతుకుతున్నది శారీరకంగా కాబట్టి ఈ శరీరాన్నే పెట్టుబడిగా పెట్టాలనుకుంటూంది.
    "సో" నిర్లిప్తంగా అంది సుకృతి..... "నువ్వు కూడా నాతోబాటు ఆ ఫ్లాట్ కి వచ్చేస్తున్నావ్ ఆంటీ..... నాతోనే వుంటావు.....ఎందుకంటే ఎలా జరిగినాకాని మన యిద్దరం ప్రయాణం చేస్తున్నది ఒకే నావలో కాబట్టి. అంతేకాదు. ఎప్పుడైనా మానసికంగా అలసిపోయిన నేను ఏమిటీ జీవితం అనుకుని మధనపడే క్షణాలంటూ వస్తే అప్పుడు నువ్వు నన్ను ఓదార్చాలిగా. తప్పదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS