Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 30

           
            
                            సంఘాన్ని మార్చగలనా?

 

                                                                  రచన: శీ హర్షవర్దన్.
     అర్దరాత్రి ఒంటి గంట అవుతూంది. అప్పుడే షో వదిలేరు. మెయిన్ రోడ్డు జనంతో నానా ఇరుకుగా వుంది. చూస్తుంటే అది రాత్రిలాగా లేదు. వెన్నెల రోజు కావటాన వీధిలైట్స్  లేకపోయినా  పట్టపగలులాగావుంది.  కాలం దొర్లుతున్నకొద్ది జనం  పలచబడుతున్నారు. అలసి గూటికి  గువ్వలు చేరుకుంటున్నట్లు జనం నిద్రమత్తులో వాళ్ల వాళ్ల ఇండ్లకు చేరుకుంటున్నారు. అంతా నిర్మానుష్యం అయ్యింది. ఇక ఆరోడ్డు మీద నేనే మిగిలేను.
     'సార్'......... అన్న పిలుపుకి తల త్రిప్పి చూసేను. రోడ్డుకు మధ్యగా ఒక ఖాళీ రిక్షా ఆగి వుంది. రిక్షావాడు నా దగ్గరకు వచ్చి 'పిట్ట కావాలాసార్?'అని అడిగాడు.
     అతని ప్రశ్న అర్దంకాక అయోమయంగా చూసేను.
     'మంచి సంసారి వుంది కావాలాసార్?' అతను రెట్టించి అడిగేడు.
     వాడిభాష కొద్దిగా అర్దమయ్యింది. పూర్తిగా అర్దం చేసుకోవటానికి ప్రయత్నించాను.
     'డబ్బుగుఱించి  తమరేమీ ఆలోచించకండి. అసలు డబ్బు కోసమే కాదు, ఏదో ఆమె సర్దాకోసం. తమరు ఎంత యిచ్చినా అడగదు' ఆమె కేవలం తన తృప్తి కోసమే ఆపని చేస్తున్నట్లు ధ్వనించేయి అతని మాటలు.
    'నాసరదా, ఆవిడి సరదాకైతే ఈతని కెందుకు ఈసర్దా' అన్న సంశయంతో నా తలలో ఏదో మెరుపు మెరిసినట్లయింది. అతను తొందర పెట్టటం వలన అంగీకారం తెలిపి రిక్షా యెక్కాను.
     ఆవీధి నిర్మానుష్యంగా వుంది. అందరూ గాఢనిద్రలో వున్నట్లు తెలియజేస్తూ పరిసరాలన్నీ నిశ్శబ్దంగా వున్నాయి. పరిసరాలను గమనించిన నాకు క్షణం భయం ఆవహించింది.
     'తమరు లోపలికి దయచేయండి.' అంటూ రిక్షా వాడు యింట్లోకి వెళ్లేడు. కొన్ని క్షణాలు లోపలనుంచి గుసగుసలు వినబడ్డాయి. తిరిగి వస్తున్న రిక్షావాడి వెనకే వచ్చిన స్త్రీ 'రండి!' అనగానే లోపలికి బయలుదేరాను.
     'నాకు ఐదు ఇవ్వండి సార్' రిక్షా అతను ధీమాగా అడిగేడు. ఇదివరకులేని కరుకుతనం ఇప్పుడు వాడి మాటల్లో కనిపించింది.
     వాడికి నోటు అందించి మెట్లని సమీపించాను. చేస్తుంది తప్పేమో ననిపించింది. కాని పట్టుదల, ఎనలేని తెగింపు కలగజేసింది. ఆమె వెంటే లోపలికి వెళ్లాను.
     బెడ్ లైట్ వెలుతురులో అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగదిలో సింగిల్ కాట్, టీపాయి, ఒక గాడ్రేజ్ ఛైర్ వున్నాయి. బెడ్ లైట్ కాంతిలో గోడలన్నీ నీలంగా కనిపిస్తున్నాయి.
     ఆమె కూర్చో మనటంత పరిసరాలను పరీక్షించటం ఆపి టీపాయి దగ్గరున్న కుర్చీలో కూర్చున్నాడు. ఆమె మంచం మీద ఒక మూలగా కూర్చుంది. తెల్లచీర కట్టుకుందేమో బెడ్ లైట్ కాంతిలో, లేత నీలం చీరలాగా కనిపించింది.
     కధల్లో వ్రాసినట్లు, సినిమాల్లో చూపినట్లుగా ఖిళ్లీ నములుతూ ఏమీలేదు ఎదుటి వారిని మత్తెకిస్తానని వాలు జడనిండా మల్లెపూవులేమీ పెట్టుకోలేదు. నన్ను చూసి పనేమీ చెయ్యలేదు. ఆమెలో వున్న ఏ అలంకరణా కావాలని చేసుకున్నట్లు లేదు. అసలామెను వేశ్యగా ఊహించటమే కష్టం.
     'మీకు పెళ్లి ఎప్పుడయ్యింది?'
    ఊహించని నా ప్రశ్నకి క్షణం అవాక్కయింది. వెంటనే నిర్లిప్తంగా నవ్వింది. నేను మరలా అదే ప్రశ్న అడగటం వల్లనేమో ఆమె జవాబు చెప్పక తప్పలేదు.
     ఆమె మాటల్లో ఎలా అవుతాయి బాబు....."
    ఆమె మాటల్లో విషాదం  గూడుకట్టుకు నుంది.
     ఆమె పలికిన నిప్పులాంటి సత్యానికి మనసంతా భారమయ్యింది. కూటి కొఱకు కోటివిద్యలన్న సామెత గుర్తు వచ్చింది. బ్రతుకు తెరువుకోసం  రిక్షావాడు ఓసంసారి పరపతిని అడ్డం పెట్టుకోవటం కేవలం వాడు తన సంసారాన్ని పోషించుకోటానికి కాకపోతే ఇంక దేనికి? వేశ్యని ఓ సంసారిగా చెప్పిపొట్ట పోసుకుంటున్నవాడి పరిస్థితికి జాలి, వాడికపటానికి ద్వేషం, కలిగేయి. అప్పటికి వచ్చిన విటులలో ఎంత మంది ఆమెను సంసారి చాటుగా చేస్తున్న రంకు అనుకున్నారో!
    తలుపు కొడుతున్న శబ్దంతో పరిస్థితి గుర్తు  వచ్చింది ఆమె తలుపు తియ్యటానికి వెలుతుంటే ఆవచ్చిం దెవరో ఊహించటానికే వణుకు పుట్టింది.
     ఆమె తలుపు తీసింది. ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తిని చూస్తూనే హడలి పోయాను ఏపరిస్థితిలో చిక్కుకున్నానో అర్దమయ్యింది. అతన్ని చూడలేక తల తిప్పుకున్నాను.
     'ఏయ్... ఇటుతిరుగు' అతని గొంత ఖంగుమంది ఇక తప్పదని వెనక్కి తిరిగేను.
     అప్పటికే ఆమె, పదినోటు అతని చేతిలో పెట్టింది.
     వొట్టి పిరికిగొడ్డు... విషపు నవ్వు ఒకటి నవ్వి అతను వచ్చినదారే పట్టేడు.
     వానకురిసి వెలసినట్లయ్యింది. నాగుండె యధాప్రకారం కొట్టు కోవటం  మొదలు పెట్టింది. కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని స్టేషన్ కి తీసుకువెళ్ళేసీన్, నా వూహనుండి దూరం అవ్వగానే, పెద్ద గండం గడిచిందని శ్వాస తీసేను. ఒక్కక్షణం కూడా అక్కడ వుండటం మంచిదికాదని జేబులోంచి  ఇరవై నోటు తీసి ఆమె చేతిలో పెట్టి లేచాడు.
     'క్షమించండి' - అంటూ,
     ఆమె నోటు తిరిగి నా చేతిలో పెట్టింది. ఆమె నోటెందుకు తిరిగిచ్చిందో నాకర్ద మవ్వలేదు. ఒకవేళ తక్కువయ్యిందేమోననుకుని 'ఎంతో చెప్పండి' అన్నాను.
     'వేశ్యలతో కాసేపు మంచి చెడు మాట్లాడి దానికే గేటు కడితే  ఇక వేశ్యలంతా పతివ్రత లయ్యే   వారేమో! వూరికే తీసుకుని జాతినీతిని పోగొట్టలేను. దయచేసి మీ డబ్బు తీసుకు వెళ్లండి' అంది.
     ఆమె మాటలు విన్న తరువాత మాటలే కరువైనట్లు 'మరికానిస్టేబుల్ కి. ... నా గురించి... పది' అస్పష్టంగా నాపెదాలు కదిలేయి.
     'కానిస్టేబుల్ కి మీ గురించి యివ్వలేదు. అది వాళ్లకి రోజూ ఇచ్చే మామూలే. కానిస్టేబుల్  రాక, మీకు చాలా ఆందోళన కలిగించినట్టుంది' అని ఆమె ప్రక్కనే వున్న మంచి నీళ్ల గ్లాసు అందించటంతో నానాలుక ఎండిపోయిందని గుర్తు వచ్చిన వెంటనే త్రాగి బయటపడ్డాను.
     బరువైన  జేబులకన్నా మరింత బరువైన హృదయవేదనతో రూమ్ లో అడుగు పెట్టిననాకు, టేబిల్ మీద పెట్టివెళ్లిన వైట్ పేపర్స్ గాలిగి రెపరెపలాడుతూ కనిపించాయి. నేనో  రచయితనని అవి గుర్తు చేసాయి.
     దైన్యంతో కూడి వున్న ఆమె కళ్లలోని నిజాయితీ, నిశ్చలత ఇంకా కనిపిస్తూనే వున్నాయి. వేశ్యలకు నీతినిజాయితీ వుంటుందని అప్పుడే తెలుసుకోగలిగేను. నాకు సహజంగా వేశ్యలంటే ఏహ్యభావం ముండేది. కాన దానిచోట జాలి చోటు చేసుకుంది ఇప్పుడు వాళ్ల స్థితికి నాలో రచయిత ఆవేశం చెందాడు కానీ!!!!
     "వేశ్యలమీద  కథలు రాసి రచయితగా పేరు ప్రతిష్టలు సంపాదించగలవు, వాళ్ల ధైన్యస్థితికి జాలికురిపించి, పాఠకులకు వేదనని పంచిపెట్టి డబ్బు సంపాదించ గలవు కానీ... కానీ... నువ్వు
     సంఘ సంస్కర్తవి కాలేవు!"
    వెంటనే ఏదో చెయ్యాలనే తపనతో లేచి ఆమెను వివాహ మాడితే!నేను బ్రహ్మచారిని, యువరచయితను, అభ్యుదయ భావాలు కలవాడిని!!!!  ఏం వివాహ మాడితే!? అంతలో అంతరాత్మ.
     "నువ్వేమీ చెయ్యలేవు. అడుగు ముందుకు వేసేవో నీకీ సమాజంలో స్థానముండదు" అని సమాజం హెచ్చరించినట్లు అనిపించి కుర్చీలో కూలబడ్డాను నిస్సహాయంగా.
     ఆరోజునుండి నేను రచయితనని చెప్పుకొనడానికి సిగ్గుపడ్డాను. పడుతున్నాను.

                                           *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS