Previous Page Next Page 
క్షమార్పణ పేజి 3


                                     5

    
    వసంత కమలాకరం తో స్నేహం లేనట్టు ప్రవర్తించ సాగింది. కమలాకరం మాత్రం అంత ఆశ వదులు కోలేదు. కింకర్తవ్యతా మూడుడి పరిస్థితి అతనిది.
    హటాత్తుగా ఒక ఉదయాన వసంత తాలుకూ శుభలేఖ చేతికి రావడంతో మతి చలించి పోయింది కమలాకరం కి. శరీరమంతా మొద్దు బారిపోయింది.
    చదువుతో బెడద ఈ యేడు తో తీరినట్టే కనుక యిక తీరిగ్గా అమ్మను ఒప్పించే ప్రయత్నాలు చేయాలను కుంటున్నాడు ఇంకా.
    "ఇంత త్వరగా పెండ్లి చేసుకోడాని కెనా వసంత ఇంత చదువు అందులోనూ "లా" చదువుకుంది. అనుకున్నాడు కమలాకరం స్థిమిత పడడానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తూ చూడలేక చూడలేక శుభలేఖ వైపు దృష్టి సారించాడు. వరుడు అడ్వకేట్ . గుండెల్లో ములుకులు గుచ్చినంత బాధపడుతూ "పోనీ వసంత నచ్చిన వాడినే ఎంచు కున్నదా?" అనుకున్నాడు.
    ఈ మధ్య మాటిమాటికి శారదమ్మ "ఏదోలాగ ఉంటున్నావేమిరా" అంటున్నది. ఇలాటి బాధలు ఏ తల్లి తండ్రులు తీర్చగలరు? అనుకున్నాడు కమలాకరం లోలోపలే ఆ వేగాన్ని తొక్కి పడుతూ.
    మాటిమాటికి ఆకాశం వైపు చూడడం కమలాకరం అలవాటు. ఆకాశం దూరంగా వుంది. సముద్రం దగ్గిరగా వుంది. ఆకాశాన్ని అందుకోలేక పోయినా అతను సముద్రం మీద తెలలేకనూ పోయాడు.
    సముద్రం లో పడిపోదాం అన్నంత జోరుగా వెళ్ళిన కమలాకరం ఆ పని చెయ్యలేక పోయాడు. దూరం నుంచి ఏదో ఓడ ఒడ్డుకి వస్తోంది. ఆ ఓడలో వెలిగే దీపం , తన తల్లి రోజూ వెలిగించే సంధ్యా దీపాన్ని తలపించింది. ప్రియంగా పాదాలు తాకుతున్న కెరటాలలో కాళ్ళు కడుక్కుని ఇవతల పడ్డాడు.
    ఈ సంబరం లో అతని కార్యక్రమాలు క్రమబద్దంగా సాగడం లేదు. మధ్యాహ్నం కనీసం టీ అయినా పుచ్చుకోలేదేమో కాళ్ళు ఇసుకలో తెలిపోతున్నాయి. అమ్మ కోసం బ్రతుకుతాను" అనుకుంది అంతరంగం తొంబై తొమ్మిది సామాన్య హృదయాల్లాగే.
    చకచకా నడుస్తున్న అతని పాదాలకు బంధాలు పడ్డాయి.
    "నమస్తే --" ఒక కంఠం మెత్తగా మృదువుగా మ్రోగడం తో తలెత్తాడు.
    ఇంద్ర ధనుస్సు లో ఏదో రంగు కళ్ళలో మెదిలింది ఊదారంగు చీరతో ప్రతిమ ప్రత్యక్షమైంది  కళ్ళేదుట. ఆమెలో ప్రత్యణువూ తనని పరిశీలిస్తున్నట్టు తోచింది కమలాకరం కి.
    తన వెనుక నున్న వదిన గార్ని ఆవిడ పిల్లల్ని పరిచయం చేసింది.
    ప్రతి నమస్కారాలు అనంతారం వాళ్ళని తోసుకు వెళ్ళిపోలేక ఇసుకలో కాస్త దూరంగా కూచున్నాడు సభ్యత అతని చేత విధిగా ఏవేవో మాట్లాడించింది.
    ఆ సంధ్య వేళ కమలాకరం తో ఏ ప్రత్యెక ముద్రా వేయలేదు.
    ప్రతిమ కాలేజీ లో తారస పడినప్పుడంతా , మందహాసం చేయడం, మందహాసం తో వదిలిపెట్టక పోవటం నచ్చలేదు.

                              *    *    *    *
    కమలాకరం అనుకోలేదు ప్రతిమ ఇలా అడుగుతుందని. ఊహతీతమైనవి అడగడం మానవ చరిత్రలో ఉన్నది . కమలాకరం భరించలేక పోయాడు.
    "నాలో ఏం చూశావు? నేను ఇలాంటి వాడిని. ప్రేమ విఫలుడ్ని " అంటూ సంజాయిషీ చెప్పుకోదలచలేదు. "నన్ను కోరడం నీకు తగదు" అని స్పష్టంగా చెప్పేశాడు.
    ఇంకా అన్నాడు. కందగడ్డ లా మారిపోయిన ప్రతిమ వైపు చూడకుండా "నేను పెళ్లి చేసుకున్నా నిన్ను ప్రేమించ లేను. చేజేతులా మెడకు ఉరితాడు బిగించుకోకు ప్రతిమా!"
    విసురుగా కాక బరువుగా అడుగులేస్తూ వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ప్రతిమ ప్రతిమే అయింది.
    వెళ్ళిపోతున్న కమలాకరం "ఒకసారి ప్రేమించి విఫలుడైనవాడు మళ్ళీ ప్రేమలో పడడం కన్నా ఏ చెరువులోనో పడడం శ్రేయస్కరం. తనకే కాదు ; తన వారికి కూడా." ఆనుకున్నాడని ప్రతిమ తెలియదు.
    అప్పటి నుంచి కాలేజీ పరిసరాలకు వెళ్ళడం మానివేశాడు. ఇన్నాళ్ళూ స్నేహితులిచ్చే మనశ్శాంతి కోసమన్నా వెళ్తుండే వాడు.
    కాలేజీ లు తెరిచి నేల అవుతున్నా కమలాకరం రిజల్స్ ఇంకా రాలేదు. అతని గుండె ఇప్పుడు ఖాళీగా ఉంది. అక్కడ వసంతా లేదు: ప్రతిమ అంతకంటే లేదు. తల్లి శారదమ్మ అతగాని హృదయ కవాటాలు మూసేసి కాపలా కాస్తున్నదనవచ్చు.
    కమలాకరం ఒక్క ఆ తల్లినే గుర్తు పెట్టుకోవాలి అనుకున్నాడు, నిశ్చయంగానే హెచ్చరించు కున్నాడు.

                                      6
    ఒక సంవత్సరం కాలగర్భం లో కలిసి పోయింది. ఇప్పుడు కమలాకరం ఒక పేరొందిన లాయరు వద్ద అప్రెంటిస్.
    ఒకరోజు శారదమ్మ పట్టుదలగా కలిసిపోయింది. ఇప్పుడు కమలాకరం ఒక పేరొందిన లాయరు వద్ద అప్రెంటిస్.
    ఒకరోజు శారదమ్మ పట్టుదలగా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి వసంత అంతర్నేత్రాలలో మెదిలింది. ఆమె పెళ్లి ముందు ఒక ఉత్తరం వ్రాశాడు.  కమలాకరం. అది చూచి వసంత ఏమనుకుని ఉంటుంది? -- అనుకున్నాడు ఈ నాటికి మళ్ళీ అందులో మరేమీ లేదు; వలచి కవ్వించి నందుకూ. ప్రేమించినా సాహసించలేక పోయినందు కూ క్షమాపణ కోరుకున్నాడు.
    అది అందక ముందే వసంత అత్తవారింటికి చేరుకున్నట్టు -- వసంత తండ్రి ఆ ఉత్తరాన్ని సాంతం చదవక మునుపే చింపి పోగులు పెట్టినట్టు యిప్పటికీ తెలీదు కమలాకరానికి.
    ప్రేమ లక్షణాలు మనుషు లందరికీ సమానమే. ఎటొచ్చీ జీవితాలు ప్రారంభమైన తర్వాతనే అసలు లక్షణాలు బయల్పడతాయి.
    వసంత కాకపోయాక, ఎవరైతేనేమిటి లే అన్నంత విరక్తి పెంచుకొని వెళ్ళాడు కమలాకరం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు. ఆమెను బాగా చూద్దాం అనే కుతూహలం అతనిలో పేరుకు కూడా లేదు.
    తీరా పెళ్లి అయిన తర్వాత స్పష్టంగా చూసినప్పుడు అనుకున్నాడు. "అమ్మ వెదికి వెదికి ఎలాంటి అందాన్ని తీసుకొచ్చింది? ఇదీ ఒక అందమేనా? బహుశా వసంత కాలి గోటికి సరిపోవచ్చు.
    పంకజం మేట్రిక్యూలేషన్ పాసయింది. శారదమ్మ ఆ పదిహేను రోజుల్లోనూ మా కోడలు ఎడ్యూకేటెడ్ అని మోజు తీరేవరకూ చెప్పుకొంది. ఆవిడ మాటల్లో చెప్పాలంటే -- "మా కోడలు చదువుకున్న పిల్ల అయినా ఇంతయినా టెక్కు లేదంటే నమ్మండి. ఈ కాలం పిల్లలు యిలా వుంటున్నాడుటమ్మా?-- కావలిస్తే లక్ష్మీ కళలా వున్న ఆ బొట్టు చూడండి. తీరుగా ఆ వాలుజడ చూడండి! నిండుగా పట్టుచీరే ఒళ్ళు కనపడనివ్వని జాకట్టు-- చాలా బుద్ది మంతురాలమ్మా-- నాకెంత తోడు పడుతుండనీ --" ఇదీ ఆవిడ ధోరణి. వినేవారికి ఓపిక తీరుబడి వుండాలి విసుగు లేకుండాలి.
    తన పెళ్ళాం చదువుకున్న అమ్మాయని. తల్లి తన యెదురుగా పొగుడుతున్నప్పుడు సాధారణంగా వుండకుండా వెళ్ళిపోతాడు. ఎప్పుడన్నా ఇరుకున పడిపోతే నవ్వాలో , ఏడవాలో తెలీక గింజుకుంటాడు కమలాకరం. నిజానికి అతని పొరపాటు కూడా లేదు ఇంతకూ ముందు కాలేజీ ల్లో ఎమ్మే లు, ఎమ్మెస్సీ లు. పి.హెచ్. డి లు అయిన అమ్మాయిల్ని కళ్ళారా చూశాడు. నోరారా  మాట్లాడాడు. అంతెందుకు తన సహాధ్యాయినిని ప్రేమించాడు. అది అందరికీ విదితమే ఒక పంకజానికి తప్ప.

                                       7
    కొడుకు కాపరం లో ముచ్చట. ముచ్చటగా మూడు వారాలు చూచిందేమో శారదమ్మ. అదైనా ఆవిడ కన్నులు నమ్మించి నంత వరకే. అటు పిమ్మట కధ విధాత నడిపించాడు. మానవ జీవితాలు వాస్తవాన్ని అధికమించి పొతే ఎలా అని విధాత ఆలోచన
    భర్త ఎవరినో ప్రేమించి ఉంటాడు అన్న ఊహ అయితే రాలేదు కాని, తన మీద అతనికి మోజు లేదు. బొత్తిగా లేదు అని పసి గట్టి వేయగలిగింది పంకజం. ఆ మాత్రం పోల్చలేని అమాయకురాలు కాదు, శారదమ్మ అన్నట్టు అంతో యింతో చదువుకున్న అమ్మాయి.
    అంచేత పౌరుషం దెబ్బతిన్నది. పౌరుషం , గర్వం, లోక జ్ఞానం కలగటానికి ఆమాత్రం చదువు చాలు.
    భార్యా భర్తల్లో ఏ ఒకరికి మనసు లేకపోయినా, ఆ సంగతి వారిలో వారు తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు. అటు పైన జీవితాలు సాగడమే కష్టాల మయం.
    ప్రాజెక్టుల, ఫ్యాక్టరీ ళ నిర్మాణాత్మక కృషి లో తమ తమ ప్రజ్ఞా చూపే మహా నాయకులు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటే గమ్మత్తుగా వుంటుందే మో. భార్యా భర్తల మధ్య సామరస్యం తీసుకురావడం బ్రహ్మతరం కూడా కాదు అనేస్తారు వాళ్ళు కూడా.
    పంకజం కొన్నాళ్ళ పాటు చాటుమాటుగా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అయినప్పటికీ అత్తగారి ముందు ఏమీ చెప్పలేదు! ఆవిడ అంటే మొదట్లోనే మంచి గురి ఏర్పడింది పంకజానికి.
    కోడలేక్కడ కంది పోతుందో అన్నట్టు చిన్నమెత్తు పనిచెప్పదు శారదమ్మ యింకా పల్లెత్తి కాసురు కొడం కూడానా? -- ఏమన్నా పని అందుకోబోతే -- "వెర్రి తల్లీ! నువ్వలా నట్టింట నడియాడి తే చాలునే" అంటుంది మురిపెంగా. అలాటి అత్తతో పంకజం ఎలా చెప్పుకుంటుంది. ఏమిటి చెప్పు కుంటుంది? గౌరవం క్షీణనిక నందు కున్నప్పుడే తేలిగ్గా మాట లోచ్చేస్తాయి.
    తండ్రినీ , భర్తనీ స్త్రీలు ఎక్కువగా గౌరవిస్తారు. కమలాకరం దుష్ట వర్గానికి చెందని వాడై నప్పటికీ పంకజం దృష్టి లో విలువ పోగొట్టు కున్నాడు.
    అడగవలిసిన మాటలు చూసి చూసి అడిగేసింది పంకజం.
    "నన్నింత నిరాదరణగా చూస్తారేం ?-- నేనేం పాపం చేశాను లాటి దీనా లాపాలతో ఆరంభించి "ఓ అయితే మీకు నవ్వే అలవాటు లేదని అనుకో మంటారా?' వంటి దెప్పి పొడుపుల వరకు చనువు పెంచుకుంది.
    ఏవేవో తగిన సమాధానా లిచ్చాడు కమలాకరం. అతను పంకజం అకస్మాత్తుగా ప్రశ్న వేస్తుందను కోలేదు జవాబులన్నీ అస్తవ్యస్తంగా వున్నాయి అందుచేత.
    పంకజం ధోరణి కమలాకరం కి మరింత విరక్తి కలిగించింది. గుండె బేజారెత్తి పోతుండగా రెండు రోజులు ఎవరికి చిక్కకుండా. పంకజం తో ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ వేసుకున్నాడు. రోడ్డు మీద ఆడవాళ్ళ ను చూస్తె అతని వళ్ళు రవరవ మందిపోతున్నది. అడ్డమైన ఆడవాళ్ళూ ఎంత పెట్రేగి పోతున్నారు. ఇదంతా మగవాడి అలుసు చూసుకునే కదా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS