Previous Page Next Page 
తామరకొలను పేజి 3

 

                                        3

    
    శాంత అతడి ఊహలను చూసి, లోలోపలే నవ్వుకునేది.
    "ఈ వయస్సే అంత; పిచ్చికుర్రాడు" అని ఊరుకునేది. శాంత పుట్టింటికి వెడితే, కృష్ణ మూర్తికన్నా ఎక్కువగా విసుక్కునేవాడు  రమేష్.
    గాలి- మార్పువల్లనైనా కోడలి ఆరోగ్యం బాగుపడుతుందేమోనని పుట్టింటికి పంపుదా మనుకున్నారు సుశీలమ్మగారు. శాంత పుట్టింటికి వెడితే, కృష్ణ మూర్తి కన్నా ఎక్కువగా విసుక్కునేవాడు రమేశ్.
    గాలి- మార్పువల్లనైనా కోడలి ఆరోగ్యం బాగుపడుతుందేమోనని పుట్టింటికి పంపుదామనుకున్నారు సుశీలమ్మగారు.  శాంత పుట్టింటికి వెళ్ళి చాలా రోజు లయింది కూడా.
    ఉత్తరం చూసిన వెంటనే శాంత-నాన్నగారు బయలుదేరి వచ్చేశారు.
    కూతురి మొహం చూసి ఏమనాలో ఆయనకు తోచలేదు.
    చాలాకాలానికి వచ్చిన తండ్రిని చూసి, సంతోషంతో "రా నాన్నా" అంది శాంత.
    పాలిపోయిన మొహం, లోతుకు పోయిన కళ్ళు ఎత్తి కనిపించే పళ్ళు, ముక్కు-వీటిని చూసి 'తమ కూతురు ఇంతేనా' అనిపించింది.
    "ఎందుకమ్మా ఇలా చిక్కిపోయావు" అని అడిగారు ఆయన.
    "ఏంలేదు, ఈమధ్య మూడు నెలలుగా తలనొప్పిగా ఉంటోంది; అంతే మరేం కంగారుపడకు నాన్నా" అంది శాంత.
    శాంత-మామగారు "అమ్మాయి అనారోగ్యం మాకంతా పెద్ద సమస్యయిపోయింది. ఎంతమంది డాక్టర్లకో చూపించాం గాని ఎందుకో, ఏమిటో కూడా తెలియలేదు. అందరికీ అదే బెంగగా ఉంది" అన్నారు.
    "అందుకే మీకు ఉత్తరం వ్రాశాం. పుట్టింట్లో ఉంటే, ఏమైనా తగ్గుతుందేమోనని. ఎంతయినా ఇది అత్తవారిల్లు; తనూ ఊరికే కూర్చోదు. కొద్ది కొద్దిగా నయినా బాధ్యత ఉండనే ఉంటుంది. అక్కడైనా, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనీ" అన్నారు సుశీలమ్మగారు.
    "ఎక్కడైతే ఏమిటమ్మా? నా కేమో రెండిళ్ళకు ఏమీ తేడా కనిపించదు" అంది శాంత.
    కోడలి మాటతో పొంగిపోయారు సుశీలమ్మ గారు.
    కని, సంత మాటలు ఉత్పేక్ష కాదు.    
    ఇంట్లో భర్త, అత్తగారు, మామగారు, మరిది అందరికీ శాంతంటే ఎంతో ప్రేమా, విశ్వాస మూనూ. ఆడపిల్లలులేని సుశీలమ్మగారు కోడల్ని కూతురిలాగే చూసుకునేవారు. పెళ్ళయిన కొత్తలో శాంతను పండగలకు కూడా పుట్టింటికి పంపే వారే కాదు. పండగకు పిలవటానికి వచ్చన శాంత తండ్రితో:
    "మీ కయితే ఇంకా ఇద్దరు ఆడపిల్ల లున్నారు. మాకు శాంత ఒక్కతే. తను వెళ్ళిపోతే మాకు పండగేమిటి చెప్పండి" అన్నప్పుడు శాంత-నాన్న గాఉర్ ఏమీ బదులు చెప్పలేక పోయేవారు.
    శాంత-తల్లి, కూతురు రాలేదని చిన్నబుచ్చుకున్నా, వియ్యపురాలు అన్న మాటలు ఆమె మనసుకు హాయి నిచ్చేవి.
    గాలి మార్పువల్ల నైనా తన ఆరోగ్యం ఓ దారికి రావచ్చునన్న ఆశతో ఈమారు శాంత పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకుంది.
    శాంత-నాన్నగారు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారు. సుశీలమ్మగారు శాంత-చెల్లెళ్ళూ, తమ్ముళ్ళకోసం రకరకాల ఫలహారాలు చేసిపెట్టారు.    
    ఊరికి వెళ్లేందుకు ముందురోజు సాయం కాలం, శాంత-నాన్నగారు శేషగిరిరావుగారితో కలిసి బజారుకు వెళ్ళారు. శాంత తన బట్టలు సర్దుకుంటోంది.
    రమేశ్ ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో:
    "వదినా" అని గట్టిగా కేకవేశాడు.
    "ఏం కావాలి రమేశ్" అని తన గదిలోనుండే అడిగింది.
    "నాకు టిఫిన్ ఇద్దురుగాని రండి."
    "అలమరాలో మూత-పెట్టాను తీసుకో."
    "సరే; అయితే, నా కక్క్రర్కేదు" అన్నాడు దురుసుగా.
    "ఇలా చేస్తే ఎలా చెప్పు రమేశ్! రేపటినుండి టిఫిన్ పెట్టటానికి నేనుండను కదా. మరి అమ్మను కష్టపెట్టకు. వీలయినంతవరకూ నీ పనులు నువ్వే చేసుకోవాలి."
    "రేపు పుట్టింటికి వెడతా ననగానే ఎంత గర్వం వచ్చేసిందో చూశారా? ఇక మేమంతా కనిపిస్తామా?"
    శాంత జవాబు చెప్పకుండా అలమరానుండి టిఫిన్ తీసి ప్లేటులో పెడ్తోంది. రమేష్ ఎందుకలా తున్నాడో శాంతకు తెలుసు.
    తను పుట్టింటికి వెళ్ళినపుడల్లా రమేష్ ఇలాగే తన అసంతృప్తి వ్యక్తపరిచేవాడు. కాని, ఆ ఆనంతృప్తి తెర-వెనుక ఉన్నది. నిర్మల-స్నేహమన్న విషయం ఆమెకు తెలియనిదా.
    శాంత టిఫిన్ ప్లేటు రమేశుడి ముందుంచింది.
    "నేనేం రాక్షసుడిని కాను, ఇవన్నీ తినడానికి. తీసెయ్యండి."
    "ఎక్కువగా నెయ్యి వేస్తాను; తిను రమేష్!"
    "మీరు వేసే నెయ్యికోసం మొహం వాచిలేను నేను. ముందు తీసెయ్యండి."
    శాంత సగం తీసి వేరే ప్లేటులో పెట్టింది. రమేష్ మౌనంగా తింటున్నాడు.
    "పింగ్ పాంగ్ లేదా ఈరోజు?"
    "ఉంది."
    "రేపటినుండి త్వరగా లేవడానికి అలారం పెట్టుకో. ఆలస్యంగా లేస్తే కాలేజీకి టైమవుతుంది."
    "ఒక ముసలమ్మ ఉండేదిట. ఆమె దగ్గర ఓ కోడి ఉండేదిట. తన కోడి కూయకపోతే, తెల్లవారదనుకుందిట ఆ ముసల్ది" అని ఆగాడు రమేశ్.
    శాంత నవ్వి, "తరువాత?"
    "ఇహ ఇక్కడి విషయాలు మీ కెందుకు? పుట్టింట్లో హాయిగా ఓ సంవత్సరంపాటు ఉండిరండి. అత్తగారు, మామగారు, భర్త, మరిది-వీళ్ళ గొడవలేం లేకుండా."
    "సంవత్సరం ఎందుకుంటామా? తొందరగానే వచ్చేస్తాను."
    "ఏమక్కరలేదు; మీరు లేకపోతే మాకు గడవదనుకున్నారా ఏం? మీరు లేరని మే మెవ్వరం చచ్సిపోం."
    "ఛ, అవేం మాటలు. రాక రాక నాన్నగారు వచ్చారు. వెళ్ళకపోతే బావుండదు."
    "మహరాజులా వెళ్ళండి. ఎవరొద్ధన్నారు?"
    "అయితే ఈ కోపం ఎందుకు మరి?"
    "మీ రిప్పుడు పుట్టింటి కెందుకు వెళ్ళలసలు? ఆడపిల్లలు ఓ కారణానికి పుట్టింటికి వెడతారు. ఇపుడు మీకు అలాంటిదేమీలేదు. మీరెందుకు వెళ్ళాలి?"
    "రేపు నీ భార్య వస్తే, ఇలాగే అడ్డపడతా నన్న మాట; పుట్టింటికి వెళ్ళొద్దని."
    "రేపటి సంగతి అలా ఉంచండి. ఇప్పటి మాట చెప్పండి ముందు. నాకు పరీక్షలు దగ్గర కొచ్చాయి కదా. మీరు వెళ్ళిపోతే ఎలా?" ఎంతో గొప్ప కారణం ముందుంచాడు రమేశ్.
    శాంత నవ్వాపుకోలేకపోయింది.
    "నే నేం చదువుకున్నానో తెలుసా రమేశ్?"
    "ఆఁ తెలుసు."
    "అయితే చెప్పు"    "మెట్రిక్ పాసయ్యారు."
    "ఇప్పుడు చెప్పు. మెట్రిక్ పాసయినవాళ్ళు ఫైనల్ ఎం.బి. స్టూడంటుకి పాఠం చెప్పగలరా?"
    దానికి జవాబు చెప్పలేక తికమక - పడ్డాడు. రమేష్; ఏమీ తోచకపోయేసరికి కోపంతో మండిపడుతూ:
    "ఇలా మాట్లాడడం ఒకటి బాగా వచ్చు మీకు. ఎక్కడన్నా ఏడవండి. నాకేం? పుట్టింట్లోనే ఉండండి. ఇక్కడికి రానే రాకండి" అంటూ కాఫీ ఓ గుక్కలో తాగేసి చరచరా వెళ్ళిపోయాడు.
    శాంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.
    శాంత-మనసు కలుక్కుమంది. వెళ్ళేముందు మరిదితో దెబ్బలాడి వెళ్ళాల్సి రావటం చాలా కష్టమనిపించింది. ఏం? తనకు ఆ మాత్రం స్వాతంత్ర్యం లేదూ?
    "హు ఏమైనా అనుకోనీ నాకేం" అనుకుంది.
    తన ప్రయాణాన్ని గురించి ఇంట్లో ఎవరూ ఏమీ అభ్యంతరం పెట్టనపుడు, మరిది చేసే గొడవ చూసి ఆమెకు నవ్వు వచ్చింది.
    రాత్రి అందరి భోజనాలూ అయ్యాయి. తెల్లవారు ఝామునే ప్రయాణం గనుక మరిదితో అప్పుడే చెప్పి వద్ధామని అతడి గదిలోకి వెళ్ళింది శాంత.
    "పాలు తీసుకో రమేశ్!"
    "అలా ఉంచండి."
    "చల్లారిపోతుంది మరి."
    "అబ్బా, మీ గొడవొకటి........ఊఁ ఇలా తెండి" అంటూ, గ్లాసు అందుకుని ఆముదం తాగేవాడిలా మొహంపెట్టి గడగడా త్రాగేశాడు.
    "రేపు ఉదయం నువ్వు లేచి ఉంటావో, లేదో" అంటూ, తను చెప్పబోయేదానికి నాంది వేసింది శాంత.
    "లేచి ఉండను" అన్నాడు రమేశ్ చటుక్కున
    "లేవక్కర్లా. ఇపుడే చెపుదామని వచ్చాను రేపు వెళ్ళొస్తాను."
    "మంచిది" అన్నాడు రమేశ్ ముభావంగా.
    "అమ్మను కష్టపెట్టకుండా చూడు. వీలయినంత వరకూ నీ పనులు నువ్వే చేసుకో. కూర్చున్న చోటికే కాఫీ, టిఫిన్ తెచ్చివ్వాలని మొండి పట్టు పట్టకు. ఆమె కసలే ఏమీ చేతకాదు. వంటింట్లోకి వెళ్ళి, ఏం కావాలో అడిగి తీసుకో. పరీక్షకు బాగా చదువు."
    "నేనేం పసిపిల్లాడి ననుకున్నారా ఏం? నాకూ ఇరవై మూడేళ్లొచ్చాయి. ఈ సంవత్సరం దాటితే డాక్టర్ రమేష్, ఎం. బి. బి. ఎస్ అని బోరవేసుకుంటాను. గుర్తుంచుకోండి" అన్నాడు రమేష్.
    "నువ్వు డాక్టరయితేమాత్రమేం? ఇంట్లో స్వభావం మారుతుందా?"
    "మారకపోతే పోయింది. ఉదయం మీరు తొందరగా లేవాలనుకుంటాను. వెళ్ళి పడుకోండి" అన్నాడు రమేశ్.
    "సరే" అంది శాంత.
    ఊరికి వెళ్ళేముందు మరిదితో కాస్సేపు కబుర్లు చెప్పాలనే ఉందామెకు. కాని, మరిది ముభావపు మాటలతో మెదలకుండా బయటికి వచ్చేసింది.
    గదిలోకి వెళ్ళిన శాంత, మడత పెట్టిన చీరలను పెట్టెలో సర్దుకుంటోంది.
    ఎవరో దబదబా తలుపు బాదటంతో!
    "ఎవరో చూడండి" అంది భర్తతో.
    "ఈ సమయంలో ఇలా తలుపు కొట్టేవార మరెవరు? మీ ముద్దుల మరిదే అయ్యుంటాడు అంటూ లేచి తలుపు తీశాడు.
    "కొంచెం పనుండి వచ్చాను" అంటూ లోపలికి అడుగుపెట్టాడు రమేశ్.
    "ఏమిటి సంగతి?" అంది శాంత.
    "అదే, మీరు ఊరినుండి ఎప్పుడొస్తారు?" అంది ముఖ్యమయిన ప్రశ్న వేశాడు రమేశ్.
    "పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండనీరా బాబూ ఆ నలుగు రోజులైనా హాయిగా ఉందాం" అన్నాడు కృష్ణమూర్తి.
    "పదిహేను రోజులుంటాను" అంది శాంత.
    "ఆర్నెల్లు ఉండిరా శాంతా! ఇక్కడేం మునిగి పోతుంది" అంటూ రమేశుడిని విడిపించాడు కృష్ణమూర్తి.
    శాంత నవ్వుతున్నా, రమేశ్ కు కోపం వచ్చింది.
    "మీకేం నవ్వులాటగా ఉంది. వదిన అక్కడుంటే నా చదువు ఎలా సాగుతుంది? ఉదయం నన్ను లేపే వాళ్ళెవరూ?" అన్నాడు కోపంగా.
    "అలారం గడియారం" అన్నాడు కృష్ణమూర్తి.
    "అది చెడిపోతేనో? ఇక అమ్మకు కాలేజీకి భోజనం పంపటం తెలుస్తుందా? క్యారియర్ ఎలా సర్దాలో కూడా తెలీదాయె. ఇక నేను అన్నంలేక మాడాలి."
    "అంత ఖర్మే మొచ్చిందిరా తమ్ముడూ. ఎక్కడ బడితే అక్కడ హోటళ్ళున్నాయి."
    "హోటల్ భోజనం ఏం బావుంటుంది? వంటికి మంచిదికాదు. మీరు చెప్పండి వదినా! నే హోటల్ భోజనం చెయ్యాలనేనా మీ కోరిక?" అన్నాడు రమేష్ శాంతతో.
    "అమ్మకు క్యారియర్ ఎలా సర్ధాలో చెప్పి వెడతాను" అంది శాంత మృదువుగా.
    "నన్ను చూస్తే మీ కందరికీ కచ్చ-అందుకనే మీరందరూ కలిసి నామీద కుట్రపన్నుతున్నారు. కాని, ఇప్పుడే చెపుతున్నా-నేను ఈ మారు పరీక్ష తప్పితే మాత్రం అది నా తప్పుకాదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS