Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 28

 

    ఈ స్థితిలో కొన్ని క్షణములో నిమిషము లొకటి రెండో కడచి యుండఁ బోలును!'  చండాలుడా ! లక్షరూపాయల విలువ  చేసే మనిషిని చంపి వేస్తివిరా! చండాలుడా!' అన్న యవధాను కుగారి యేడ్పుటఱపుతో ప్రజ్ఞగాంచితిని.' బ్రతికిఉన్నానండీబాబూ! యేడ్వకండీ' అంటిని. అప్పావ ధానులుగారు  నాయెదుట  నిరపాయముగా  నిలిచియుండిరి. నా కైహికప్రజ్ఞ కలిగినందుకు, అప్పావధానులుగారు నిరపాయులుగా నున్నందుకు తనిసి ' సోమి దేవమ్మగా (వారి యత్తగారు) రేమైరండీ' అంటిని.' బ్రతికున్నవా నాయనా' అనుచు నామె పర్వెత్తి వచ్చెను.' మా కిద్దఱికీ మొండి ఘటాలకి ఏమి దెబ్బ తగుల లేదు. నాయనా! నీ చెయ్యియి దేమిటి?' అని ఆమె యేడ్వసాగెను.అప్పుడు నేను నా చేతులను జూచుకొంటిని. కానీ అందాఁక నేను బాధ నెఱుఁగను. నా దక్షిణ బాహుమూలము నా కడుపు మిఁ ద  వ్రేలాడుచుండెను. ఆ వికృతి చూడఁ గా నాకు వాంతి, మైకము, కంపము కలుగఁ జొచ్చెను. ఇంకేమేమి యంగ వికృతి కలిగెనో, ముం దేమగునో అన్న కంగారుతో అవధానులు గారి నిట్లు ప్రార్దించితిని.' నా పూర్వకర్మానుభవమేదో నేన నుభవించుచున్నాను. నాస్థితి యేమగునో! మా తల్లిదండ్రులకు నెమ్మదిగా నా స్థితి తెలుపండి. ఈ ప్రాణమున్నా, పోయినా వీనిని నన్నుగా భావించి కాపాడండి! కానీ నిందాదులు చేయకండి. దప్పి, దప్పి' యనుచు మైమఱుపాటు చెందితిని.

    కొంత సేపటికి చల్లని మంచినీరు, మజ్జిగ దగ్గఱి క్రొత్తపేట బ్రాహ్మలు తెచ్చి యీయఁ గా, చన్నీటి గుడ్డతో మొగము తుడిచి, ప్రజ్ఞ రప్పించి యిచ్చిరి. మాయూరి కారణముగారు, మానాయనగారి బాల్యమిత్రము శ్రీ కొడాలి వెంకయ్యగా రింతలో నక్కడికి బండి మిఁద నెక్కించి నన్ను వెనుకకు అవనిగడ్డ కే- ఆస్పత్రి కలదు గాన, మా యన్నగారు కలరు గాన- త్రిప్పిపంపి నాకొక మిత్రుని తోడిచ్చి, బోల్తాకొట్టిన బండిని లేవనెత్తి, దాని మిఁద ణ బండిలోని వారిని గూడ జేర్చుకొని కళ్ళేపల్లికి వెళ్ళిరి. బండి నెమ్మదిగా నడచినను జాఱిపోయి వ్రేలాడుచేతితో వికార గ్రస్తుఁ డ నయి యున్నన న్నవనిగడ్డ చేర్చిరి.

    నాటిఁరాత్రి - ఆస్పత్రి అసిస్టెంటు ఊర లేఁ డు  గాన కంఫౌండరే ఒక సాహెబు నా చేతిని సరిదిద్దఁ జొచ్చెను. క్లోరోఫారం ఇయ్య లేదు. చంకక్రింద గుడ్డ మడత బెట్టి దిండుగానుంచి ఇంకొక తుండుగుడ్డ చంకక్రింద దూర్చి యొకరు తల దగ్గఱ  నుండి లాగుట, ఇంకొక నా చేతిని కాళ్ళ దిగువనుండి లాగుట సాగించిరి. జబ్బు మజుల్సు చిఱుగుచున్న ట్ల  గట్టి పెట్టితిని. అయినను విడువక లాగిరి.డమ్మని మ్రోఁత మ్రోగెను. చేయి స్వస్థానము చేరే నని చెప్పి కంఫౌండరు కట్టుకట్టెను. మార్నాడు ఆస్పత్రి అసిస్టెంటు వచ్చెను. నాకు చేయి రుబ్బురోలువలె వాచెను. తీవ్రజ్వరము వచ్చెను. నాల్గయిదు రోజు లుంటిని. వాపు తీసినదిగాని చేయి లేవదు. ఆస్పత్రి అసిస్టెంటు ఉద్యోగమునకు, జీవితమునకుఁ  గూడ  తుది  దశలోనున్నవాఁడు (కొలది రోజులకే రిటైరగుట,స్వర్గస్థుడగుట   జరగెను. అతిమూత్ర వ్యాధిగ్రస్తుడు) నన్ను బాధించుట తప్ప సరిదిద్ద లేక పోయెను.

    ఇంటికి వచ్చి, అక్కడ నుండి బందరు వచ్చి శ్రీవల్లూరి సూర్యనారాయణరావుగారిని తోడఁ బిలుచుకొని ఆస్పత్రికి వెళ్ళితిని. సుబ్బయ్యర్ అను సర్జన్ ఉండెను, సూర్యనారాయణరావుగారి  మాట విని వెంటనే క్లోరోఫారం ఇచ్చి చేయి సరిదిద్ది కట్టుకట్టెను. మర్నాడట నుండి ధన తృష్ణతో నన్ను పీడింప సాగెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS