Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 29

   

                                            -: మణిహస్త లక్షణము :-

   శ్లో!!    కించిత్పతాంకేగుళీనాంకుంచనాన్మణిరుచ్యతే !!
   
    తా: పతాక హస్తమందలి వ్రేళ్ళు  చివరలు  కొంచెమువంచిన మణి హస్తమగును.
   
    వినియోగములు :-

    సామవేదము, జపము, స్వప్నము, దుఃఖము, చిత్రపటము, ఘనము, కిరాతుడు, మరణము, వీణ, తాళము (తాళఫలము), నిషేదము, చీకటి, నీడ, చేప, రంగస్థలము, అంబులపోది, పుణ్యతీర్ధము, పాము, ప్రయాణము, అపరాధము, వసంతము, దున్నుట, మలయానిలము, సంకల్పము, ధూపము, పట్టువస్త్రము, భూగోళము, పరాగము, మధ్యాన్నము, అస్తమయము, (మద్దిల వాయించుట, మార్గనృత్యము, ఆజ్ఞాపించుట, తాపము, ఆలింగనము, వియోగము వీటిని హస్తద్వయముతో అభినయించవలెను) ఉద్యానము (బలాహకమను మేఘము), (అధోముఖహస్త ద్వయముతో  చూపవలెను), పిండుట, ఉన్నతము, గరుడుడు, క్రూరజంతువు, పుట్ట, పంజరము, కాకి, గద్ద, వీది, యమపురి, ఊరుద్వయము, సభ, తాబేలు వీనికి ఈ మణిహస్తము చెల్లును.

         అసంయుత హస్తములు సమాప్తము.


                          సంయుత హస్తములు :-

                                          -: అంజలి హస్త లక్షణము :-

   శ్లో!!    పతాక తలయోర్యోగాదంజలిః కరఈరితః !!

    తా: రెండు పతాక హస్తముల అరచేతుల చేర్చిన యధి అంజలి హస్తమగును.

    వినియోగములు :-

    దేవతలకు, గురువులకు, బ్రాహ్మణులకును నమస్కారము చేయుటకు ఈ హస్తము చెల్లును, దేవతలకు నమస్కరించు వేళ్ళ శిరస్సు నందును, గురువులకు నమస్కరించు వేళ్ళ ముఖమునందును, బ్రాహ్మణులకు  నమస్కరించు వేళ్ళ వక్షస్థలమందును క్రమముగా  ఈ హస్తము ఉపయోగించును. దీని కధిదేవత క్షేత్రపాలుడు.

                                        -: కపోతహస్త లక్షణము :-

   శ్లో!!    కపోతస్స కరోజ్ఞేయ. శ్శ్లిష్టమూలాగ్రపార్శ్వతః !!

    తా: ముందుచెప్పిన అంజలి హస్తమందు మొదలు, తుదలు పార్శ్వభాగములు చేర్చిపట్టిన యెడల కపోతహస్తమగును. దీని కధిదేవత చిత్రశేనుడు.

    వినియోగములు :-

    ప్రమాణము, పెద్దలతో మాటలాడుట, వినయము, ఒప్పుకొనుట, వీనియందు ఈ హస్తము వినియోగించును.

                           -: కర్కట హస్త లక్షణము :-

   శ్లో!!    అన్యోన్యస్య్కాన్తరేత్రాఅజ్గుళ్యోనిసృతహస్తయోః !
    ఆంతర్  బహిర్వావర్తంతే కర్కటస్క్యోభిధీయతే !!

    తా: ముందు చెప్పిన  కపోతహస్తమందు  వ్రేలి వ్రేలి సందులలో వ్రేళ్ళు  చొప్పించి వెలికిగాని, లోపలికిగాని పట్టినయెడల  కర్కట హస్తమగును. విష్ణువు అధిదేవత.
    వినియోగములు :-

    గుంపును చూపుట, లావైనదానిని చూపుట, శంఖనాదము చేయుట, ఒడలు విరచుకొనుట, చెట్టుకొమ్మను  వంచుట  వీనియందు  ఈ హస్తము వినియోగింపబడును.

                                          -: స్వస్తికహస్త లక్షణము :-

   శ్లో!!    పతాకయోస్యన్నియుక్త కరయోర్మణిబన్ధయోః !
    సంయోగే నస్వ స్తికాభ్యో మకరార్దేనియుజ్యతే !!

    తా: రెండు పతాకహస్తమందలి  మణికట్టులను చేర్చి  పట్టినయెడల స్వస్తిక హస్తమగును.

    వినియోగములు :-

    మొసలిని తెల్పుట, భయముతో మాటాడుట, వాదాడుట, పొగడుట వీనియందు చెల్లును.

                                          -: డోలాహస్త లక్షణము :-

   శ్లో!!    పతాకఊరుదేశస్థౌ డోలాహస్త్కోయయుజ్యతే !
    నాట్యారంభే ప్రయోక్తవ్యఇతినాట్యవిధోవిధుః !!

    తా: రెండు పతాక హస్తములను  తొడలమీదికి  వ్రేలాడునట్లు  పట్టిన డోలాహస్త మగును, అధిదేవత సరస్వతి.
   
    వినియోగములు :-

    మోహము, మూర్ఛ, మదము, ఆలశ్యము, విలాసము, నాట్యారంభము మొదలగు వానియందు వినియోగము.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS