Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 28

    తా: ఈ ఇరువది ఏడు అసంయుత హస్తములు  పూర్వ నాట్యాచార్యులు చెప్పియున్నారు.

   శ్లో!!    రేఖాచంద్రః ఖండసర్ప చతురౌచల  సర్పకః !
    అర్ధసూచ్యూర్ణ నాఖౌచమణీహస్తశ్చకీర్తితః !
    _ఇతి అభినవాః అసంయుతాః కరాః సప్త ఏతేషాం
    లక్షణ వినియోగౌకధ్యతే !!

    తా: రేఖాచంద్ర, ఖండసర్ప, సర్పచతుర, చలసర్ప, అర్ధశూచి, ఊర్ణ నాభ. మణియని ఏడు అసంయుత హస్తములు అభినవ నాట్యాచార్యుల చేత చెప్పబడినవి. వీటి లక్షణ వినియోగములు చెప్పుచుంటిని.      

                            -: రేఖాచంద్రహస్త లక్షణము :-

   శ్లో!!    మధ్యమాధ్యాస్త్రయోంగుళ్య. శ్లిష్టాః కించిచ్ఛకుంచితాః !
    అంగుష్ట తర్జనీరేఖాచంద్రస్యా. త్సంప్రసారితే !
    వియయన్యాయ విఖ్యాతి, శ్లాఘనేషు విభక్తిషు !
    ప్రేమవాగురసోరేఖాచంద్రహస్తః ప్రయుజ్యతే !!

    తా: మధ్యమ_అనామిక_కనిష్టికలు కలిపి కొంచెమువంచి అంగుష్ట తర్జనులు చాచిపట్టిన రేఖాచంద్రహస్తమగును.

    వినియోగములు :-
   
    వినయము, న్యాయము, కీర్తి, పొగడుట, విభక్తులు, ప్రేమ వాక్కులు, విశాలమగు వక్షము వీనియందు  ఈ రేఖాచంద్ర హస్తము వినియోగించును.

                            -: ఖండ చతుర హస్త లక్షణము :-
   
   శ్లో!!    చతురేఖండ చతుర స్తర్జవీప్రోన్నతాయది !
    ఖండేవిభూత్యామమృతేర క్తేవిధురయత్నయోః !
    గోధూహనేచారకూటేహస్త్కోయం సంప్రయుజ్యతే !!

    తా: చతుర హస్తమందలి  చూపుడువ్రేలు  కొంచెము ఎత్తి వంచిన ఖండచతుర హస్తమగును.

    వినియోగములు :-

    తునుక (వస్తువుసందలి భాగము), ఐశ్వర్యము, అమృతము, రక్తము, ఎడబాటు, ప్రయత్నము, ఆవును పాలుపితుకుట, ఇత్తడి వీనియందు ఈ ఖండచతుర హస్తము వినియోగించును.

                            -: సర్పచతుర హస్తలక్షణము :-

   శ్లో!!    సర్పశీర్ష్కేనామికాయాః మూలేంగుష్టేనివేళితే !
    స సర్పచతురః ప్రోక్తః మధురేగణితేరసే !
    ఘనసారేకించిదర్దేభావజ్ఞైనంప్రయజ్యతే !!

    తా: సర్పశీర్ష హస్తము యొక్క  అనామికవ్రేలు మొదట బొటనవ్రేలునువంచిన, సర్పచతుర హస్తమగును.

    వినియోగములు :-

    తియ్యదనము, గణితశాస్త్రము, కర్పూరము, రసము కొంచెమను అర్ధము. వీనియందు ఈ సర్పచతుర హస్తము వినియోగించుచున్నది.

                                           -: చలసర్ప హస్తలక్షణము :-

   శ్లో!!     తస్మిన్నంగుష్టచలనాచ్ఛలసర్పః కలాసుచ !
    శోధనేచ, మధూచ్చిష్టేలాక్షియాం సంప్రయుజ్యతే !

    తా: సర్పశీర్ష హస్తమందలి బొటనవ్రేలు  కదిలించుచు  పట్టిన చలసర్ప హస్తమగును.
   
    వినియోగములు :-
     లలితకళలు, శోధించుట, మైనము మొదలైనవి  యీ  చలసర్ప హస్తము వినియోగించును.
                  

                             -: అర్ధసూచి ముఖహస్త లక్షణము :-

   శ్లో!!    అంగుష్టసారణాత్సూచ్యామర్ధసూచీముఖో భవేత్ !
    యావాన్ సూచీముఖాఖ్యశ్చ వినియోగ్కోస్యకధ్యతే !!

    తా: సూచిముఖ హస్తమందలి బొటనవ్రేలు ఎడముగా చాచిపట్టిన అర్ధసూచిముఖ హస్తమగును. సూచిముఖ హస్త  వినియోగములన్నియు అర్ధసూచిముఖముకు వినియోగించును.

                                            -: ఊర్ణ నాభ హస్త లక్షణము :-

   శ్లో!!    అంగుళ్యగ్రాణ్యబ్జకోశేకుంచితానిభవంతిచేత్ !
    ఉర్ణ నాభస్సకధితో నృసింహజ్జనిరీశ్వరః !
    కూర్మరాజ్కోరుణోవర్ణో నృపజాతి స్తధామునిః శార్దూలో !!

    తా: పద్మకోశమందలి  వ్రేళ్ళు చివరి భాగములన్నియు  వంచిపట్టిన ఊర్ణ నాభ హస్తము వచ్చును. ఇది నృసింహమూర్తివల్ల వచ్చినది. ఆదికూర్మము అధిదేవత. ఎరుపు వర్ణము. క్షత్రియజాతి.

    వినియోగములు :-

    కోతి, సింహము, పెద్దపులి ,తాబేలు, రాక్షసి, కొండగోగు, స్తనములు, దిట్టతనము, లేమి, వారము, గడ్డము పట్టుకొనుట, తలగోకుకొనుట, భయము వీనియందు ఈ హస్తము వినియోగించును.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS