రంగనాయకులు, చిన్నమ్మాయి కూడా లేచి నిలబడ్డారు.
"మీకేం భయం లేదు.... పండుని వెతికి మీకు అప్పగించే బాధ్యత నాది" అన్నాడు బంగార్రాజు.
* * *
చిట్టబ్బాయి పండుని, కన్నారావుని రిక్షాలో కూర్చోబెట్టుకుని చెమటలు కక్కుకుంటూ తొక్కుతున్నాడు.
"తర్వగా తొక్కరా సన్నాసి... నేను క్రిం బిస్కెట్లు తినాలి!!" అన్నాడు పండు విసుగ్గా.
చిట్టబ్బాయ్ కి రిక్షా ఆపి పండుగాడి నేత్తిమిద రెండు అంటించాలని అనిపించింది... కన్నారావుకి కూడా పండుమీద కోపం వచ్చింది.
ఇందాక వాడిమీద ఉన్న జాలి, ముద్దు ఇప్పుడు వాళ్ళకి లేదు... ఎందుకంటే వాడిని సఫా చేయమన్నది అసల్తెన రంగనాయకులు కాదు అని వాళ్లు భావిస్తున్నారు కాబట్టి.
"నువ్వు నోర్మూసుకో....అనవసరంగా వాగితే నిన్ను ఇక్కడే ఎండలో రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోతాం" చేత్తో నొసలు మీద చెమటని తిసి కిందికి దలుపుతూ పండుని బెదిరించాలని అన్నాడు చిట్టబ్బాయి.
కాని పండు అంత సులభంగా బెదిరిపోయే రకమా?
చిట్టబ్బాయి వంక కోపంగా చూశాడు పండు.
"అలా చెయ్ చూద్దాం... మా నాన్నగార్తో చెప్పి ని పెళ్ళి చేయిస్తాను... తెప్ తెల్సా?" అన్నాడు.
చిట్టబ్బాయి విసుగ్గా అరిచేత్తో నొసలు మీద కొట్టుకున్నాడు.
"చిన్నపిల్లాడు.. వాడితో నీకు ఆర్గ్యుమెంట్ దేనికి చెప్పు...." కన్నారావు కూడా చిట్టబ్బాయి మీదే విసుక్కున్నాడు.
"నువ్వు ఈ ఎండలో రిక్షా తొక్కుతూ వాడు వాగే పిచ్చివాగుడు విను... అప్పుడు ఎంత్ తిక్కరేగుతుందో నీకు తెలుస్తుంది...." అన్నాడు చిట్టబ్బాయి.
రిక్షా జనరల్ స్టోర్సు ముందు ఆగింది. ముగ్గురూ రిక్షా దిగి షాపులోకి వెళ్లారు. షాపు యజమాని వీళ్ళని ఆదరంగా ఆహ్వానించాడు.
పండుగాడి గురించి వాళ్లు రావడం, అవి ఇవి కోంటూండడంతో వాడికి వీళ్ళు చాలామంచి కష్టమర్లులా అనిపించారు. మూడు నాలుగు గంటల వ్యవదిలో అన్నిసార్లు షాపుకి వస్తే మంచి కష్టమర్లె కదా మరి?
"ఏం కావాలి సార్?" కన్నరావుని మర్యాదగా అడిగాడు షాపువాడు.
"ఫోన్ చేసుకోవాలి!" చెప్పాడు కన్నారావు.
"అలాగే చేస్కొండి సార్!" అన్నాడు షాపువాడు.
"నాకు క్రిం బిస్కట్ల పాకెట్ ఒకటివ్వు.... కూల్ డింక్ కూడా కావాలి!...." షాపువాడిని అడిగాడు పండు.
"ఒరేయ్...నాక్కూడా దాహంగా వుంది...కుల్ డ్రింక్స్ తెప్పించు.." చిత్తబ్బయితో అన్నాడు కన్నారావు.
"దాహం... దాహం అని చస్తున్నావ్.. రిక్షా తిక్కింది నువ్వా నేనా?" కన్నారావు మీద మండిపడ్డాడు చిట్టబ్బాయి.
చిట్టబ్బాయి కన్నారావు మీద అలా ఎగరడం షాపువాడికి చాలా ఆశ్చర్యం కలిగింది.
ఒక రిక్షా తిక్కేవాడు అంతలా మాట్లాడడం ఏమిటి? అనుకున్నాడు.
"రిక్షా తొక్కేవాడికి అంత పోగారేంటిసార్? వాడు అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేం నాలుగు తగిల్నివ్వక?" అన్నాడు షాపువాడు కన్నారావుతో.
చిట్టబ్బాయి నాలుక కొరుక్కున్నాడు.
అన్నట్టు నేను రిక్షావాడిని కాదూ? కన్నిగాడిమీద అలా ఎగరకూడదూ...అనుకున్నాడు.
షాపువాడి మాటలకి కన్నారావు తేలిగ్గా నవ్వేశాడు.
"వాడు రిక్షావాడేగాని నాకు ప్రాణస్నేహితుడు...మేము ఒకటో తరగతి నుండి ఆరో తరగతి దాకా క్లాస్ మేట్స్ ని ....విడి నాన్న వీడిని ఆరో తరగతి కాగానే స్కూలు మాన్పించేశాడు... మాకు చాడులేందుకు బాబుగారూ అంటాడు వీళ్ళనాన్న...వీడు స్కూల్ మానేసినా రోజూ మేం కలుస్తూనే ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి దాకా... అందుకే విడికింత చనువు... కదరా?' చిట్టబ్బాయి వంక చూస్తూ అన్నారు కన్నారావు.
"అవున్రా..." అంటూ సమాధానం ఇచ్చాడు చిట్టబ్బాయి.
షాపువాడు ఇద్దరివంకా ఆరాధనగా చూస్తూ "ఆహ! అంతస్దుల అడ్డుగోడలు లేని మీ స్నేహం...." అన్నాడు.
"నేను ఎంతసేపు ఎదురుచూడాలి? నాకు కూల్ డ్రింక్ ఇవ్వవా?...." షాపువాడివంక విసుగ్గా చూస్తూ అన్నాడు పండు.
"నాక్కూడా కుల్ డ్రింక్ కావాలి!..." అన్నాడు కన్నారావు.
"నేనోక్కడినేనా తాగంది?... నాక్కూడా కావాలి!!" అన్నాడు చిట్టబ్బాయి.
ముగ్గురూ కుల్ డ్రింక్స్ తాగారు.
"ఇప్పటిక్తెనా ఫోన్ చేద్దామ?" అన్నాడు చిట్టబ్బాయి.
"టెలిఫోన్ డ్తెరెక్టరి ఇస్తారా?" షాపువాడిని అడిగాడు కన్నారావు.
షాపువాడు కన్నారావుకి టెలిఫోన్ డ్తెరెక్టరి ఇస్తుండగా షాలు ముందు ఒక అంబాసిడర్ కారు ఆగింది. దాంట్లోంచి ఇద్దరు వ్యక్తులు దిగి షాపులోకి అడుగు పెట్టారు.
"నాకు కష్టమర్లు వచ్చారు... మీరు ఫోన్ చేస్కొండి సార్...." అని కన్నారావుకి చెప్పి షాపువాడు కష్టమర్ల దగ్గరకు హడావిడిగా వెళ్లాడు. కన్నారావు, చిట్టబ్బాయ్ టెలిపోన్ డ్తెరెక్టరి పేజీలు గబగబా తిప్పసాగారు.
ఎమ్... ఎమ్... ఏమ్... ఎన్... ఎన్...ఓ... పి...క్యూ... ఆర్... ఆర్.. ఆ.... రంగనాయకులు.
మొదటి పేరు రంగనాయకులు.బి.
"ఇందాక విడికే చేశాం..." చెప్పాడు కన్నారావు.
"వెధవ... ఇక్కడ పండు అని ఎవరూ లేరు... రాంగ్ నంబరని చెప్పి వుండవచ్చుగా, అనవసరంగా మనల్ని కంగారు పెట్టేశాడు" అన్నాడు చిట్టబ్బాయి.
"ఇదిగో ... రంగనాయకులు కె...ఇక్కడ వుంది" ఉత్సాహంగా అన్నాడు కన్నారావు.
"శాంతినగరేనా... సరిగ్గా చూడు...." అడిగాడు చిట్టబ్బాయ్.
"శాంతినగరే...." డ్తెరెక్టరిలోకి తొంగి చూస్తూ చెప్పాడు కన్నారావు.
"నెంబర్ చెప్పు..."
కన్నారావు డ్తెరెక్టరిలోకి చూస్తూ రంగనాయకులు నెంబరు చెప్పాడు.
చిట్టబ్బాయి కన్నారావు చెప్పిన నెంబర్ డయల్ చేశాడు. అవతల ఫోన్ రింగవడం చిట్టబ్బాయ్ కి వినిపిస్తూంది.
"ఎత్తాడా?" కుతూహలంగా అడిగాడు కన్నారావు.
"ఇంకా లేదు" చెప్పాడు చిట్టబ్బాయి.
మరో నాలుగు క్షణాల తరువాత అవతల నుండి "హలో ..." వినిపించింది
"హలో ...రంగనాయకులుగారెనా?" అడిగాడు చిట్టబ్బాయి.
"పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించేవాడు గారూ, ఆండి అంటూ అంత మర్యాదగా మాట్లాడతాడా ఎక్కడ్తేనా" విసుక్కుంటూ చిట్టబ్బాయ్ చెవిలో అన్నాడు కన్నారావు.
"అవునండి రంగానాయకుల్నే... ఎవరూ మాట్లాడుతుంది.. హలో ఎవరింటే పలకరిం పాడు సంత" అవతల నుండి అతను అరుస్తున్నాడు.
"హలో! రంగనాయకులుగారు, కాదు...
రంగనాయకులు ఉన్నాడా?" కాస్త కరుకుగా అడిగాడు చిట్టబ్బాయ్.
కన్నారావు చిట్టబ్బాయ్ ని కళ్ళతోనే మెచ్చుకున్నాడు.
"హాలో! రంగానాయకుల్ని అని చెప్తూనే వున్నానుగా. మళ్ళి అడుగుతారేం మాయదారి సంత! ఇంతకి ఎవరు మాట్లాడుతున్నారు?"
"మీకు పండు అనే కొడుకు ఉన్నాడా? ప్రశాంత్ అనే కొడుకు?" ఎందుక్తేనా మంచిది తను ఫోన్ చేసింది తనకి కావాల్సిన రంగానయకులుతో కాదో కన్ ఫార్మ్ చేసుకుందామని అడిగాడు చిట్టాబ్బాయ్.
ఆ ప్రశ్న వింటూనే అవతలి గొంతు లో కంగారు స్పష్టంగా తెలిసింది చిట్టబ్బయికి.
"పండా... అవును, వాడు నా కొడుకే. మికేమ్తెనా కనింపించాడా?" ఆతృతగా అడిగాడు రంగనాయకులు.
"కనిపించడం ఏంఖర్మ? మీ పండు ప్రస్తుతం మా దగ్గరే వున్నాడు"
