మలుపుకీ మలుపుకీ మధ్య తెరుచుకోని ద్వారం కోసం రక్తిగా, యుక్తిగా సాగించిన సంగ్రామం. ఆమె గెలిచింది. అతడు ఓడిపోతూనే గెలిచాడు.
ఎన్ని నిమిషాలు గడిచిందో అతడికీ గుర్తులేదు.
తేరుకునేసరికి ముందు కనిపించింది సుకృతి. ఆమె నగ్న ఆకృతి నింకా చూడాలనుకుంటూండగానే టాయిలెట్ వైపు నడిచింది.
నీరసం కాదది. తీయని నిస్త్రాణ....
అనుభవమూ కాదది. ప్రశాంత చంద్రికా థౌతి కిరాణాలపై ప్రియా సంగమ వినీలవిలోకనం.....
వినిపించింది కాలింగ్ బెల్ బజర్ మరో మారు.
నేలమీద పడివున్న బట్టల్ని అందుకున్నాడు. బిడియంగా అనిపించింది ఎదురుగా నిలబడ్డ సుకృతిని చూడగానే.
"యూ ఆర్ వండర్ ఫుల్" మగతగా అభినందించింది. "మీరు వెళ్ళండి."
టాయిలెట్ వైపు చూపించింది.
ఆ తర్వాత అతను వచ్చేదాకా ఆమె ఆగుతుందనుకున్నాడు. కానీ సుకృతి అతడికోసం ఎదురుచూడలేదు.
నేలమీద శారీని ఒంటికి చుట్టుకుంది. తను నగ్నంగా కాకపోయినా అర్ధనగ్నంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు నెమ్మదిగా నడిచి ద్వారం తెరిచింది.
అంతే.....
షాక్ తిన్నట్టుగా చూశాడు రామన్. సుకృతి తండ్రి.... "నువ్వా?"
"ఏం.....ఆశ్చర్యంగా వుందా?" నిర్వేదంగా కాదు విషపూరితంగా నవ్వింది.
"ఏం చేస్తున్నావిక్కడ?"
"ఎవర్నువ్వు? ఈ ప్రశ్న అడగటానికి నేను నీకేమౌతాను?"
రామన్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "ఇంతసేపూ ఏం చేశావని అడుగుతున్నాను?"
"ఒకప్పుడు డబ్బుకోసం నా తల్లితో నువ్వేం చేసేవాడివో అదే."
"యూ బిచ్" ఆవేశంగా చేతిని పైకెత్తాడు.
"ఆగు" ఓ ఆదేశంలా అందామె. "ముష్టికి వచ్చినవాడు భిక్ష గాడిలా మాట్లాడాలి తప్ప బాస్టర్డ్ లా కాదు."
ఆమె చెంప చెళ్ మంది.
మరోసారి రామన్ చేయి ఆమెను తాకేదే.
"మిస్టర్ రామన్" నారాయణశెట్టి ముందుకు దూసుకొచ్చాడు. రామన్ స్తబ్దుడై చూస్తుండగానే అరిచాడు. వెళ్ళిపో యిక్కడ్నుంచి.....నిన్నే."
"సర్...." ఏదో చెప్పబోయాడు రామన్.
"ఇక సంజాయిషీ అవసరం లేదు మిస్టర్ రామన్" రామన్ పై సాధించబోయే తొలి గెలుపుకి సంధిస్తున్న అస్త్రంలా అంది సుకృతి. "మీరిక వెళ్ళొచ్చు."
"అంతే...." జోక్యం చేసుకున్నాడు శెట్టి. "నా నుంచి ఒక్క పైసా అయినా మీకు దక్కదు. వెళ్ళండి....."
తన స్థాయి మనిషి యిలాంటి అవమానాన్ని యింతవరకూ చూడనందుకేమో రామన్ వెళ్ళిపోయాడు.
"థాంక్స్" గడియపెడుతూ అంది సుకృతి. ఆమె ఒంటిపై బట్టలు జారిపడ్డాయి మరోసారి నగ్నంగా మారుతూ.
"జరిగిందానికి బాధపడకు" సంజాయిషీగా అన్నాడు శెట్టి ఆమె నగ్న దేహాన్ని తదేకంగా చూస్తూ.
నిరాసక్తంగా నవ్వింది సుకృతి. నవ్వడమే కాదు. ఇంక జరగాల్సింది చాలా వుందనేట్టుగా అతడ్ని చుట్టేసింది. "ఇప్పుడేం జరిగిందని.....అయినా అవమానించింది నన్నుగా."
అతడు తనపై ఏ పాటి ఆసక్తి చూపిస్తున్నదీ తెలుసుకోటానికి ఉపయోగించిన వాక్యమది.
"నా మనిషికి అవమానం జరిగితే నాకు జరిగినట్టే సుకృతీ" అని అనాచ్చాదిత శరీరం అతడ్ని మరోసారి ఉన్మాదంలోకి నెడుతూంది.
ఆమె పట్టు బిగించింది. ఫర్వాలేదు.....ఇంతకాలమూ అతడెంతమంది అమ్మాయిల్తో అనుభవాన్ని పంచుకున్నాగాని తనమీద కాస్త శ్రద్ద చూపిస్తున్నాడు. ఈ సినీ మాయారంగంలో ఎందరి ఆడపిల్లలపై అవకాశం తీసుకున్నాగాని, తనను అందరిలో ఒకరిగా భావించకుండా తనకూ ఓ బాధ్యత వుందని తెలియచేస్తున్నాడు.
ఈ మాత్రం చాలు మిగతాది సాధించే ప్రయయత్నంలో తనింక చొచ్చుకుపోగలదు.
"కమాన్" ఉక్రోషంగా నేలపైకి జారింది. మరోసారికి ఆవనంలా.