Previous Page Next Page 
పంచభూతాలు పేజి 29

    పృద్వీరాజ్, "మన ఈ అపస్మారక స్థితిని మనం అధ్యాత్మిక దశ ప్రాప్తి అంటాం. అటువంటి అనుభవమును పొంది భక్తితో విహ్వలుల మవుతాం, ఈ ధారణవల్ల మనం బహుకొద్ది ఖ్యాతిని పొందుతాం" అని అన్నాడు.
     దానిమీద గగన్ అన్నాడు: "కఠిన నియమాన్ని అంగీకరించి పని యెందుకు చేయాలి? అందువల్ల మనం పని నియమపాలన చేసే సమయంలో అది అనేక మయిన చిన్న చిన్న పనులను అపేక్షిస్తుంది. అలా చేయడం సభ్యత.  కచేరికి గబగబా పరుగెత్తే మనుష్యుల నుంచి మనమేమీ ఆశించలేం. దోవలో సర్వులతో శిష్టతాపూర్వకంగా వ్యవహరిస్తారు. సర్వులకు ప్రత్యభివందనం చేస్తూ వెళతారు. ఇంగ్లీషు తోటమాలి శరీరం నుంచి చొక్కా  తీసివేసి తోటలో పనిచేస్తాడు. ఆ సమయంలో అతని యజమాని బార్య అతనిని చూసి సిగ్గుపడితే దోషమెవరిది? కాని మనం పని పాటలలో తక్క రోజంతా దోవకు ఒక వేపున మనయింటి గుమ్మంలో బొజ్జ కనిపించేటట్లు మోకాళ్లమీదకు ధోవతి ఎగకట్టి కూర్చుని సిగ్గు విడిచి హుక్కా దమ్ము కొడుతున్నప్పుడు మనం ప్రపంచం ముందు మహా వైరాగ్యానికి, మహా ఆధ్యాత్మికతకు శపధం తీసుకుని మనం బర్బరతా సభ్యతల మీద పరదా వేయగలుగుతున్నాం. వైరాగ్యంతోపాటు ఏదో మహాసచేష్టా ఉద్యోగం లబించదు. అది  అసభ్యతకాక మరేమిటి?"
     గగన్ దేవ్ మాటలువిని నిర్ఘరిణికి మహా ఆశ్చర్యం వేసింది. కొద్ది క్షణాలు మౌనం వహించి, "మన సబ్య సమాజం ఈ అభిప్రాయంతో వుండకుండా శిష్టతా పూర్వక వ్యవహారాలు చేస్తూ నాగరీకంగా వుండడం మన కర్తవ్యం. అంతవరకూ ఈ సిద్దాంతం పూర్ణ రూపంతో పాలించక పోతే మన ఆత్మ సమ్మానాన్ని ఆదరించలేక పోతాం. మనం మన విలువను తగ్గించి వేసుకుంటాం" అని అన్నది.
     పృద్వీరాజ్ అన్నాడు; "సరే, విలువను వృద్ది చేసుకోవడానికి వేతనం కూడా వృద్ది చెందాలి. కాని అది యజమాని చేతిలోని విషయము."
     అపుడు ప్రకాశవతి "వేతన వృద్ది అవసరం లేదు. మనదేశంలో బాగ్యవంతులు కూడా మాసిన దుస్తులు, చినిగిన దుస్తులు ధరిస్తుంటారు. వారు కూడా తమ దుస్తులవేపు దృష్టి నుంచరు. వారిలో చేతనా బుద్ది లేకపోవడం, అర్దభావం లేకపోవడం కారణం. ఎవరి పాదాలవద్ద ధనం దొర్లుతూంటుందో వారికి గుర్రపుబండి మినహా వారి ఐశ్వర్యానికి స్థిరత లేదని తెలుసు. కాని మనం వారి అంతఃపురంలో ప్రవేశించి చూస్తే వారి భవనం గోశాలకంటె చిన్నదిగా కనిపిస్తుంది.
     "మనం అనవసరం వస్తువులవేపు చూడకుండా కళ్లు మూసుకుంటాం. మన స్త్రీలు ఈ విషయ కల్పనను పరిశీలించరు. సౌందర్యం పెంపొందించుకోవడానికి ఎన్ని అలంకారాలు అవశ్యకమో అంతకంటే  అధికంగా ఆ భూషణాలు ధరించి ధన గర్వం ప్రదర్శించడం యితర  జనోచిత అనాగరీకత. ఈ అహంకార తృప్తికి వారి ధనాగారం కుబేరుని ఓడించి వేస్తుంది. కాని దొడ్డిలోని చెత్తా చెదారం పారవేయడానికి  వారిలో త్పతరత కనిపించదు. డబ్బుకేమీ కొదువలేదు. వస్తుతః మన దేశంలో యదార్ద నాగరీక ఆదర్శం యింకా నెలకొనలేదు" అని అన్నది.
     నిర్ఘరిణి, "మనం సోమరులం  కావడమే దీనికి  ముఖ్య కారణం. డబ్బుతోనే గొప్పతనం గోచరిస్తుంది. డబ్బు కొదవలో కూడా అపవ్యయం కూడా సాగుతోంటుంది. కాని నాగరికత పొందడానికి ఆలస్యం చేయకూడదు. ఎల్లప్పుడూ వున్నత సామాజిక ఆదర్శానికి  ఉపయుక్త మయినది రూపొందించడానికి యత్నించాలి. ఆపదను ఆమోదించి ఆత్మ విసర్జనం చేయాలి" అని అన్నది.
     దానిమీద పృద్వీరాజ్, "కాని మన స్వబావం చిన్నపిల్లల స్వభావం లాంటిది అందువల్ల బహుసరళమైనది. దోషారోపణ, కపటనమ్రత మొదలయిన నియమరహితకు కూడా మనం ఏ మాత్రం సిగ్గు చెందము. మన ఆచరణ అంతా ఆద్యాత్మికం, అకృత్రిమం"  అని అన్నాడు.

                          అపూర్వ రామాయణం

 ఇంటిలో శుభకార్యం. అందుకని సంధ్యవేళ సమీపిస్తున్నా మంచెమీది భైరవి రాగంలో సన్నాయి. మోగుతోంది. గగన్ దేవ్ చాలా  సేపటినుంచి కళ్లు మూసుకుని కూర్చున్నాడు. హఠాత్తుగా కళ్లు తెరిచి నాలుగువేపులా చూసి, "మన దేసీ రాగాలన్నింటిలోనూ పరివ్యాప్త మయిన మృత్యులోక బావం దాగి వుంటుంది. ప్రపంచంలో ఏదీ స్థిరం కాదని స్వరాలు రోదిస్తూ చెపుతున్నట్లుంటుంది. ప్రపంచంలోని సకల వస్తువులు అస్థిరాలని జీవధారులందరికీ తెలిసిన విషయమే. కాని ప్రియమయిన విషయం కాదు. దీనిని స్మరించితే ఎవరూ సంతసించరు. అయినా  దీనిని మురళీముఖంగా  వింటే మనం సమ్మోహితులమవుతామెందుకు? ప్రపంచంలో  అన్నింటికంటె అప్రియ, కఠోర సత్యరాగిణి లాగా శోబాయమానంగా పలకడమే దీనికి కారణం.  మృత్యువు ఈ రాగిణి లాగానే కరుణామయియని ప్రతీతి. దీనికి తోడు అది సరసమయినది, సుందర మయినది. ప్రపంచ వక్షఃస్థలం మీద అన్నింటికంటె భారంగా వున్న మృత్యుభయాన్ని మంత్ర ప్రబావంతో ఈ రాగిణి తేలిక పరుస్తుంది. ఇది సత్యం. కాని ఎవరి హృదయం నుంచి ఉచ్చస్వీత  మయి వేదనా రోజనం బయట పడుతుందో మురళి దానిని సమస్త ముఖంనుంచి ధ్వనియింపజేసి ఒక అగాధ కరుణాపూర్వ స్వాంతనపూర్ణ రాగిణిని సృష్టిస్తుంది" అని అన్నాడు.
     ప్రకాశవతి, నిర్ఘరిమి అతిధిసత్కారం పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చి కూర్చున్నారు. నేటి శుభకార్య సమయాన వారికి కోపం వస్తుందని గ్రహించక నిర్భయంగా మాట్లాడాడు. బాజాలు మృదుమధురంగా మోగుతున్నాయి. మేమా రోజున వాద వివాదాలు ఎక్కవసేపు జరపలేదు.
     గగన్, "నేను మురళీనాదం  విని నేనీ పరిణామం చెందాను. కవిత లన్నిటిలో ఒకే ఒక రసం వుంటుంది. అలంకార శాస్త్రంలో ఈ రసానికి  వేరువేరు పేర్లున్నాయి. నా ఉద్దేశ్యంలో ప్రపంచ రచనను కావ్యదృష్టి చూస్తే  మృత్యువే దానిలోని ప్రధాసరసమని చెప్పవలసివుంటుంది.
     మృత్యువు వున్నచోటనే ప్రపంచ అసీమత వుంటుంది. కాని మృత్యువు ఈ అనంతాన్ని తన చిర ప్రవాహంతో ఎడ తెగకుండా ప్రవహింప చేస్తుంది. అలా కాకపోతే ప్రపంచానికి ఈ బారం వహించడము ఎపుడూ సంభవం కాదు" అని అన్నాడు.
     దానిమీద పవన్, "మృత్యువే లేకపోతే జీవనానికి మూల్యమే వుండదు. సమస్త ప్రపంచం ఏవగింపుతో ఎవరిని చూస్తుందో వారు కూడా మృత్యువు ద్వారా తన జీవితాన్ని గౌరవమయంగా తెలుసుకుంటారు" అని అన్నాడు.
     "నాకు దీని చింత ఏ మాత్రం లేదు.  నా ఉద్దేశ్యంలో మృత్యువే లేకపోతే దేనికీ పూర్ణ విరామం గోచరించదు. నా అభిప్రాయంలో ఇదే అన్నింటికంటె అధికచింత కలిగించే విషయం. ఈ సమయంలో గగన్  అద్వైత తత్వం గురించి చర్చ లేవదీస్తే రెండు చేతులూ జోడించి,  'సోదరా! వ్యవధిలేదు. ఈ విషయం యిక యెత్తవద్దు" అని చెప్ప సాహసించరు'అని అన్నాడు.
     గగన్ ఈ మాటలమీద ధ్యాస పెట్టకుండా చింతనా సాగరంలో మునిగి తేలుతూ, "ప్రపంచంలో మృత్యువు ఒక్కటే శాశ్వత మయినది. అందువల్ల మనం మన సర్వ ఆశలను వాసనలము ఆ మృత్యువులో ప్రతిష్టించుకున్నాం. మన స్వర్గ నరకాలు  సమస్తమూ ఆ మృత్యువులోనే వున్నాయి.  మన అమరత్వం, అసీమత్వం అసత్య ప్రమాణాలుగా తయారయాయి. కాని ప్రపంచ సరిహద్దు మీద మృత్యురాజ్యం వున్నచోట సకల వస్తువుల అవసానం గోచరిస్తుంది. అక్కడే మన ప్రియతమవాసనలు,  సుందర తమ కల్పనలు ప్రతిబంధకాలు కావు. అక్కడే అవి అనాయాసంగా కరతలామలకమవుతాయి. మన శంకర భగవాన్ శ్మశానంలో నివశిస్తుంటాడు. మన సర్వేచ్చ మంగళ ఆదర్శం మృత్యు ముఖంలో వుంది" అని అన్నాడు.
     రాగాలాపన ముగిసింది. సాయం సంధ్యలో సన్నాయి మోగసాగింది.
     అపుడు పవన్, "మనం ఏయే ఆకాంక్షలను మృత్యు తీరాన నిర్వర్తిస్తామో వాటిని ఈ మురళి రాగాలాపనతో తిరిగి ప్రపంచంలో ప్రవర్తింపజేస్తున్నట్టుంది. దూరస్థ విరహ విచ్చేద అంశు ధారలను  తుడిచి వేస్తుంది. హృదయంలో తిరిగి నూతన ఆశలు సంభవిస్తాయి.  జీవితం చిగురిస్తుంది. ఏ మృత్యువు తీరం నుంచి మానవహృదయాలలో సమస్త చిరస్థాయీ పదార్దము జీవితంలో తిరిగి లభిస్తుంది. "భూమిని స్వర్గతుల్యంగా చేయడం, వాస్తవాన్ని సుందరం చేయడం, జీవితానికి అమరత్వం ప్రసాదించడం నా వుద్దేస్యం" అని చెపుతుంది.
     "మృత్యువు ప్రపంచ అసీమరూపమును వ్యక్తం చేస్తుంటుంది. దానిని రహస్య పరిణయపాశంలో బంధించి వుంచుంది. ఈ విధంగా సాహిత్యరసం, కళారసం మన అనుదిన వ్యాకుల జీవితంలో అనిత్యంతో నిత్యానికి, ప్రత్యక్షంతో అప్రత్యక్షానికి, తుచ్చతతో సౌందర్యానికి ,వ్యక్తి గత తుచ్చ సుఖదుఃఖాలతో సర్వవాపీరాగిణికి సంబంధం కల్పిస్తుంది. మనం మన సంపూర్ణ ప్రేమను సమకూర్చుకుని మృత్యుతీరానికి పంపకుండా ధరణీ తలంమీదనే అట్టే పెట్టుకుంటాం. ఈ క్రమంలో తర్కం తుఫానులాగా చెలరేగుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS