సజ్జనతా ఆదర్శం
నిర్ఘరిణి అన్నది, " చూడండి, ఇంటిలో గొడవగా వుంది. గగన్ దేవ్ ని నాగరీక దుస్తులలో రమ్మని చెప్పండి"
ఈ మాటలు విని మేము కిలకిలా నవ్వాము. ప్రకాశవతి కళ్లు ఎర్ర చేసుకుని, "యిందులో నవ్వడానికేమీ లేదు. సబ్యసమాజంలో పిచ్చివాని రూపంలో రావద్దని గగన్ కి తెలియజెప్పండి. ఈ విషయాలన్నింటిలో సామాజిక నియమం, నీతి ధ్యానంలో చక్కగా వుంటుంది" అని అన్నది.
పవన్ గద్దిస్తూ "ఎందుకు?" అని ప్రశ్నించాడు.
దానిమీద ప్రకాశవతి, "కావ్యరాజ్యంలో కవిశాసనం కఠోర మయినది. కవి ఛందస్సును శాసించడంలో, సౌష్టవంలో శబ్దరూఢతలో పొరపాటు క్షమించరానిది! అలాగుననే మన రీతి నీతి సంబంధంలో సమాజ శాసన సౌష్టవం హీనత ఎక్కడయినా ప్రకటించవచ్చు. కాని అలా ప్రకటించకపోతే సమాజమంతటి రీతి, సౌందర్య మందిరం క్షణం లోనే కూలిపోతుంది" అని అన్నది.
పృధ్వీరాజ్ "సమాజానికి సౌందర్యం, పరిమార్జితం. శృంఖలత రూపొందించడం మనందరి కర్తవ్యం. ఇందులో గౌరవం వుంది. కాని అన్యమనస్కుడయిన గగన్ కర్తవ్యం విస్మరించి ముందడుగువేస్తూ దడదడా రావడం తప్పేమీ కాదు" అని అన్నాడు.
దానిమీద ప్రకాశవతి, "కాని మంచి వస్త్రాలు ధరిస్తే చూడటానికి యింకా యింపుగా వుంటుంది" అని అన్నది.
పృధ్వీరాజ్, "మంచి వస్త్రాలు ధరిస్తే నిజానికి గగన్ యింపుగా వుంటాడా? ఏనుగుకు నెమలిలాగా ఫించం వుంటే దాని అందం యెక్కువ అవుతుందా? ఏనుగు తోక వుంటే బాగుండును. అలాగే గగన్ కి పవన్ దుస్తులు ధరింపజేస్తే బాగుండును. పవన్, గగన్ దుస్తులు ధరించి వస్తే అతని ఇంటిలో ప్రవేశించడానికి వీలులేదు" అని అన్నాడు.
దానిమీద పృద్వీరాజ్ అన్నాడు: "దుస్తులు ఆచార వ్యవహారాల హీనతవల్ల అసౌష్టవం, అజ్ఞానత, జడత ప్రకటితమయినపుడు చూడడానికి అసహ్యంగా వుంటుంది.
"ఈ కారణాన మన సమాజం యింత నీరసంగా తయారైంది. బెంగాలీ సమాజం దౌర్బాగ్యమయినది, సమాజ హీనమయినది అంటే దానిలో ఉత్తమ సమాజ లక్షణాలు లేవన్నమాట. హిందూస్తానీ 'సలాం' శబ్ద అభివాదన సూచన పర్యాయవాచక శబ్దం బెంగాలీ సాహిత్యంలో లేదు. దీనికి ముఖ్యం కారణం బెంగాలీ సమాజ వ్యవహారిక సంబంధం పరిమితం కావడమే. సాధారణ ప్రపంచంతో దానికేమీ సంబంధం లేదు. అందువల్ల అపరిచిత సమాజంతో కలిసిన సమయంలో శిష్టాచారాలలో పొరపాట్లు జరుగుతాయి. హిందూస్థానీ సభ్యతమీది అభిమానంవల్ల యిష్టమయినంత యింగ్లీషు మాత్రమే అవసరమవుతుంది. సర్వులకు సలాం చేయవచ్చు. బెంగాలీవారు నమస్కారం కూడా చేయరు. సలాం కూడా చేయలేరు. వారు బొత్తిగా అడవి మనుషులుగా తయారవుతారు. బెంగాలీ స్త్రీలు చాలినంత వస్త్రంతో ఆచ్చాదితులు కారు, ఎల్లప్పుడూ బెంగాలీ స్త్రీలు చాలినంత వస్త్రంతో ఆచ్చాదితులు కారు. ఎల్లప్పుడూ అసంవృతంగా వుంటారు. ఈ కారణంగా మామ, బావ ఇత్యాది యింటి లోని సుపరిచిత బాంధవుల సమీపంలో యధేష్టంగా సిగ్గుపడతారు. కాని సాధారణ నాగరీక సమాజ ఉపయుక్తలజ్జను ప్రకటించడంలో వారు ఉదాసీనంగా వుంటారు. ఇది అసౌష్టవ సామాజిక పురాతన ఫలితం. తగినంత వస్త్రం వ్యవహరించడం, వ్యవహరించక పోవడం సంబంధంలో కూడా బెంగాలీ పురుషులు ఎక్కువ ఉదాసీనంగా వుంటారు. ఎల్లప్పుడూ అధిక సమయం తమ పిల్లా మేకతో, ఆత్మీయులతో గడుపుతున్నందున ఉదాసీన భావం వారి హృదయాలలో పాదుకున్నది. అందువల్ల బెంగాలీ వాగి దుస్తులు, నివాసం, అశిష్టత కారణంగా వారిలో అపరిచితమయిన సోమరితనం, అసౌష్టవం, స్వేచ్చాచారం, ఆత్మసమ్మానం తక్కువగా కనిపిస్తాయి. అందువల్ల యిది బెంగాలీవారి విశుద్ద, నికృష్టత. ఇందులో సందేహం లేదు."
నేను అన్నాను: "కాని అందువల్లనే నేను సిగ్గుపడడం లేదు. కొన్ని కొన్ని రోగాలలో మనం యేది తినినా పంచదారలాగా తియ్యగా వుంటుంది. అలానే మన మంచీ చెడ్డా ఆచరణ అంతా విచిత్ర మానసిక దోషంవల్ల కేవలం అతి మధుర అలంకార రూపంలో పరిణత చెందుతుంది. మనది ఆధ్యాత్మిక సభ్యత అని చెప్పుకుంటాం. మన సభ్యత పరమ లక్ష్యం - 'బాగా తిని, తాగి ఆనందంగా వుండు' అనేది కాదు. అందువల్ల సర్వమూ మూర్ఖ బాంధవ్యంలోనే మన అనాసక్తత వుంది."
అపుడు పవన్, "ఉన్నత విషయలక్ష్యం కారణంగా చాలామంది మామూలు విషయాలలో పూర్తిగా పొరబడుతుంటారు. పొరబడలేకపోతే అనాసక్తి తప్పకుండా గోచరిస్తుంది. అటువంటి వారిని నిందించడానికి ఎవరూసాహసించరు. సకలసభ్య సమాజాలలోనూ ఈ విధమయిన సంప్రదాయక సమాజం అన్నిటి కంటే ఉన్నతస్థానంలో విరాజిల్లుతుంది. పురాతన కాలంలో అధ్యయన పరుడయిన బ్రాహ్మణుడు కూడా సంప్రదాయ అంతర్గతుడే. క్షత్రియ వైశ్యుల లాగా కృత్రిమాలంకారంయెడ ఎవరయినా ఉదాసీనంగా వుంటారనే ఆశ లేదు. ఐరోపాలో కూడా యిట్టి సంప్రదాయక జనులు పూర్వం కూడా వుండేవారు, ఇప్పుడు వున్నారు" అని అన్నాడు.
"మధ్యయుగ ఆచార్యుల విషయం విస్మరించినప్పటికీ ఆధునిక యుగ ఐరోపాలో కూడా న్యూటన్ లాంటి గొప్పగొప్పవారు నవీన పద్దతిలో పెద్ద మనుషులుగా విందులలో కలిసి సామాజిక రీతి నీతి విషయాలలో ఏ మాత్రం ధ్యానం వుంచకపోయినా వారు హాస్యాలాడేవారు కాదు. అందువల్ల వారు ఎవరినీ అనాదరించేవారు కాలేదు. సర్వకాలాలలో, సర్వదేశాలలో అటువంటి మహాపురుషులు జనియించినప్పుడు ఆ సమాజంలో నివసిస్తూ కూడా సమాజమంటే విరక్తితో వుంటారు. కొందరు రీతిని నీతిని పాటించరు. కాని వారు అలా పాటిస్తే వారి పనులు సాగవు. సమాజం కూడా వారిమీద విరక్తి కాదు. బెంగాలులో అత్యున్నత తరగతికి చెందిన మహాపురుషులెవరూ లేరు. అదీగాక సకలదేశ ఆధ్యాత్మిక శిఖరం మీద సుగమంగా ఆసీనమయిందనే విషయం ఆశ్చర్యము గొలుపుతుంది. మనం ఢిల్లీ దుస్తులు, మర్యాదలు మాత్రం తీసుకుని మహా విశ్రాంతితో జీవితం గడుపుతున్నాం. మనం అభిలషించినట్లు నివసిస్తాం. దీనికి భాష్యం ఎవరూ చెప్పనక్కరలేదు. చెప్పే అధికారం కూడా ఎవరికీ లేదు. మననుంచి అన్ని రకాల జనులు మాసిన దుప్పటి తీసుకుని నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడానికి సాధన చేస్తూంటారు."
ఈ సమయంలో గగన్ తన మోటు లాఠీ తీసుకుని కూర్చున్నాడు. నేను అతను ధరించిన దుస్తులు కూడా అధ్బుతంగా వున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. అతని ఇంటిలో నేను మహోత్సవం. అందువల్ల అతను రోజువారీ దుస్తులు మీద బనీనులాంటి విచిత్రమయిన చొక్కా ధరించాడు. బనీను లోపల నుంచి అసహ్యంగా చినిగిన వస్త్రం కనిపిస్తోంది. దానిని చూచి అందరూ పకపకా నవ్వారు. ఇక ప్రకాశవతి మనసులో, నిర్ఘరిణి మనసులో ఏవగింపు జనించింది.
అపుడు గగన్, "మీలో ఏ విషయం మీద తర్క వితర్కాలు ప్రారంభమయాయి?" అని అడిగాడు.
పవన్ మా ఆలోచనా అంశాలను కొన్ని గగన్ కి వినిపించి అన్నాడు: " నా సంపూర్ణ దేశంలోకూడా బైరాగి లేషం ధరిస్తుంటారు" అని అన్నాడు.
గగన్ అన్నాడు: "బైరాగితో సమానంగా యింకెవరయినా అలా పెద్ద పెద్ద కార్యాలు చేయలేరు. సకలదేశాల ఆశ్రయస్థానం సృష్టిస్తారు. వెలుగు వెంట నీడ వుంటుంది. అలాగుననే కర్మవెంట వైరాగ్య నిరంతర సంబంధం వుంటుంది. వైరాగ్యానికి పైన అధికారం గలవారే ఎక్కువగా పనిచేయగలుగుతారు"
దానిమీద పృద్వీరాజ్; "సర్వ ప్రపంచమూ ఆరామ ఆశతో లక్ష ఉపాయాలు పన్నుతుంది. ఆ సమయంలో వైరాగి డార్విన్ సకల కార్యకలాపాలను విడిచిపెట్టి కేవలం కింది విషయం రుజువు చేయడానికి తన మెదడునంతా వినియోగించాడు. రుజువు చేశాడు - "మానవుని ఆదిపురుషుడు వానరం" అని అందువల్ల డార్విన్ మహాత్యాగం చేశాడు."
ఇక గగన్, "కాని గారిబాల్డీ అమిత ఆసక్తితో స్వాతంత్ర్యం తనకు తెచ్చుకోలేకపోతే ఇటలీకి తెచ్చిపెట్టగలిగేవాడేకాదు. కర్మ నిష్ట జాతులే వాస్తవానికి వైరాగ్యం కలవి. జ్ఞాన సంపాదనకు జీవితాన్ని జీవిత సర్వ సుఖాలను తృణప్రాయంగా విడిచిపుచ్చి హిమాచ్చాదిత హిమాలయ పర్వతాల అగ్రశిఖరం మీదకు చేరుకోవాలని వాంచిస్తారు.కాని మాటిమాటికీ వ్యర్దంగా ప్రయాసపడి కూడా అలసి సొలసిపోరు. వారే వాస్తవానికి వైరాగులు. దేశమాత పిలుపు మీద తమ సర్వస్వం త్యాగం చేసి పూలసెజ్జను విడనాడి కటిక సెజ్జమీద పరుండడానికి తయారవుతారు. మృత్యువుకు భయపడనివారే దార్ద వైరాగులు. మన కర్మహీన, నిర్జీవ వైరాగ్యం కేవలం అధఃపతితజాతికి అపస్మారక స్థితి తప్పమరేమీ కాదు. అది జడత, దాని గర్వకారణం మహా మూర్ఖత"
